
మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు మల్లన్న సాగర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఎత్తై ప్రాంతం కావడం వల్ల, ఎత్తిపోతల అవసరం లేకుండా కాల్వల (గ్రావిటీ) ద్వారా నీరిచ్చే అవకాశం ఉండటం వల్ల మల్లన్న సాగర్‌ను చేపట్టామన్నారు.
తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. విపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వాసితులను రె చ్చగొడుతున్నాయని, ఏ ప్రాజెక్టు నిర్మించినా ముంపు ఉంటుందని అన్నారు.