ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి : హరీశ్
మెదక్: రాష్ట్రానికి ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో శనివారం ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాక్షితో హరీశ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు మోదీకి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలన్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తమకు గర్వకారణమని హరీశ్ అన్నారు. ప్రధాని పర్యటనపై ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకతమని కొట్టిపరేశారు. 123 జీవోపై ప్రతిపక్షాలు స్వీట్లు పంచుకోవడం అనాగరికమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, కూలీలు చేతి వృత్తుల వారందరిని ఆదుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కోర్టుకు ఇదే విషయాలను వివరించి విజయం సాధిస్తామని హరీశ్ చెప్పారు.