‘లాఠీచార్జ్ నియంతృత్వానికి నిదర్శనం’
Published Mon, Jul 25 2016 11:49 PM | Last Updated on Tue, Aug 21 2018 6:10 PM
మహబూబ్‌నగర్ అర్బన్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులపై లాఠీచార్జి చేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ విమర్శించారు. సోమవారం న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడని అన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణలో 2013 చ ట్టాన్ని అమలు చేయకుండా తమను మోసం చేస్తున్నారని ప్ర శ్నించిన రైతులపై పోలీసులచే లాఠీచార్జి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ సంఘట నను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. సమావేశంలో పార్టీ మైనార్టీ, దళిత విభాగాల జిల్లా అధ్యక్షులు మ హ్మద్ హైదర్‌అలీ, మిట్టమీది నాగరాజు, నేతలు షేక్ అబ్దుల్లా, మహ్మద్ సర్దార్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement