కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా
- కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
సంగారెడ్డి టౌన్: మల్లన్న సాగర్ కోసం బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ముంపు గ్రామాల్లో 144 సెక‌్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం సీపీఎం నాయకులు జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, జయరాజు, సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్, మల్లేశ్వరీ, నర్సమ్మ, అశోక్, యాదగిరి, కృష్ణ, దశరత్ తదితరులు పాల్గొన్నారు.