హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మల్లన్న సాగర్ ముంపు వల్ల వ్యవసాయ భూమితో పాటు ఇళ్లు కూడా కోల్పోతున్నాననె బెంగతో గ్రామానికి చెందిన బచ్చల్లి నర్సయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. ప్రభుత్వం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పల్లెపహాడ్‌లో జరిగే నర్సయ్య అంత్యక్రియల్లో ముంపు బాధితులంతా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు.
భూమి కోల్పోతున్నానని.. రైతు ఆత్మహత్య
Published Thu, Jul 21 2016 12:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement