దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
-
మల్లన్నసాగర్ ద్వారా కామారెడ్డికి తాగునీరు
-
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి : పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారన్నారు. మంగళవారం స్థానిక వరలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తున్నారని, కరువు నివారణ కోసం హరితహారం కింద కోట్లాది మొక్కలు నాటించారన్నారు.
అడ్రస్ గల్లంతవుతుందనే..
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయి సాగునీటి కష్టాలు తీరితే తమకు స్థానం ఉండదనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని గోవర్ధన్ విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డికి తాగునీటిని అందించేందుకే అష్టకష్టాలు ఎదురయ్యాయని, ప్రాణహిత–చేవెళ్ల 22వ ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంతానికి నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు. మల్లన్నసాగర్ గేటు తెరిస్తే కూడవెళ్లి వాగు నుంచి ఎగువ మానేరులోకి నీరు చేరుతుందన్నారు. ఇసాయిపేటలోని సముద్రం చెరువును 3 టీఎంసీల రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి ఎగువమానేరు నుంచి పంపింగ్ చేయనున్నట్లు వివరించారు. అక్కడి నుంచి అమర్లబండ గుట్ట మీదికి తీసుకెళితే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వవచ్చని నిపుణులు సూచించారన్నారు. కామారెడ్డి ప్రాంతానికి నీళ్లివ్వలేని కాంగ్రెస్ నేతలకు తమను విమర్శించే హక్కులేదన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఏఎంసీ చైర్మన్లు రాజమణి, అమృత్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మధుసూధన్‌రావు, రమేశ్, లక్ష్మి, ఎంపీపీ మంగమ్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, నేతలు నిట్టు వేణు, ముస్తాక్‌హుస్సేన్, రాజేశ్వర్, ఆంజనేయులు, కృష్ణ, లక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డిæతదితరులు పాల్గొన్నారు.