
తొగుటలో రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్ష
ముంపు బాధితులకు బాసటగా మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 48 గంటల పాటు దీక్ష చేపడుతున్నారు.
-ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఏర్పాట్లు
తొగుట(మెదక్ జిల్లా): ముంపు బాధితులకు బాసటగా మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 48 గంటల పాటు దీక్ష చేపడుతున్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న సాగర్ సామర్థ్యాన్ని తగ్గించి, ముంపు నుంచి గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ముంపు గ్రామాల పొట్టకొట్టే 123 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. పార్లమెంట్ ఆమోదించిన 2013 చట్టం ప్రకారం ముంపు భాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. రేవంత్‌రెడ్డి దీక్షకు ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు పలికి ప్రభుత్వ కళ్లు తెరిపించాలని ఆమె పిలుపునిచ్చారు.