దిష్టిబొమ్మ దహనం చేస్తున్ననాయకులు
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
Published Mon, Jul 25 2016 10:52 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
ఆదిలాబాద్ రిమ్స్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ భూ నిర్వసితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ నిర్వసితులపై దాడి చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.
ప్రభుత్వ తీరను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు కక్షపూరితంగానే నిర్వసితులపై దాడి చేయించారని ఆరోపించారు. నిర్వాసితులకు మంత్రి క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జికి కారణమైన డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యుడు డి.మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు బొమ్మెన సురేష్, కె.అశోక్, మయూరిఖాన్, అగ్గిమల్ల స్వామి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జమున, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పూసం సచిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు కనక గణపతి పాల్గొన్నారు.
Advertisement