
దుబ్బాక టౌన్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 5వ తేదీన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది. సీఎం పర్యటన నేపథ్యంలోనే దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శుక్రవారం పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ ప్రజలను కలెక్టర్ కృష్ణభాస్కర్ కలుస్తారని సమాచారం. దీంతోపాటు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకుగాను కలెక్టర్, అధికారులతో చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment