కేసీఆర్ సర్కారుకు పోయే కాలం: తమ్మినేని | Tammineni veerabadram slams kcr govt | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సర్కారుకు పోయే కాలం: తమ్మినేని

Published Mon, Jul 25 2016 4:00 AM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM

Tammineni veerabadram slams kcr govt

నారాయణపేట: అన్నం పెట్టే రైతులపై దాడి చేసిన ఏ ప్రభుత్వం నిలబడలేదని, మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జి జరిపించిన కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నిర్వాసితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా, సోమవారం తలపెట్టిన మెదక్ జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement