మల్లన్నసాగర్‌కు సింగారం ఓకే
* గజ్వేల్ కేంద్రంగా మంత్రి హరీశ్‌రావు మంత్రాంగం
గజ్వేల్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూములిచ్చేందుకు మెదక్ జిల్లా కొండపాక మండలం తిప్పారం పంచాయతీ పరిధిలోని సింగారం గ్రామం కూడా ముందుకొచ్చింది. ఆదివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో మూడు గంటలపాటు గ్రామస్తులతో జరిపిన చర్చలు ఫలించారుు. మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాలకు చెందిన నిర్వాతులను ఒప్పించిన హరీశ్‌రావు.. తాజాగా ఆదివారం సింగారం గ్రామస్తులతో చర్చలు జరిపారు.
ఈ గ్రామంలో 300 మంది రైతుల నుంచి 980 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మల్లన్నసాగర్‌లో చేపల పెంపకంపై హక్కులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమకు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోనే డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భూ నిర్వాసితులు కోరగా.. హరీశ్ అంగీకరించారు. గ్రామాన్ని సీఎం దత్తత తీసుకునే విషయం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మంత్రి హామీలతో సంతృప్తి చెందిన నిర్వాసితులు రిజర్వాయర్ నిర్మాణానికి తాము సహకరిస్తామని ప్రకటించారు.
ఒక్క ఎకరానికై నా నీరిచ్చారా?
అరవై ఏళ్లలో జిల్లాలో ఒక ఎకరానికైనా నీరి చ్చారా అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 71 ఊర్లను ముంచి సిం గూరు ప్రాజెక్టును నిర్మించి ఇక్కడ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ైెహదరాబాద్‌కు పం పించింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు నిర్వాసితులు ఇంకా ఎంతో మంది నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇలాంటి దుస్థితిని నివారించేందుకు ప్రస్తుతం
మల్లన్నసాగర్‌లో తక్షణమే నష్ట పరిహారం అందించేందుకు మాత్రమే 123 జీఓ తీసుకొచ్చామని,, ఇందులో వేరే ఉద్దేశం లేదన్నారు. టీడీపీ నేతల మాటలను నమ్మవద్ధంటూ సూచించారు. ఆకుపచ్చ తెలంగాణను సాధించడంలో సింగారం గ్రామస్తులు సైతం ముందుకొచ్చి తమ భూములిస్తామని ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాన్ని సైతం ఒకేసారి వేగవంతంగా చేపడతామని వెల్లడించారు.