'లంకలో సీతమ్మలా నిర్బంధించారు'
హైదరాబాద్: లంకలో సీతమ్మలా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులను నిర్బంధించారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను రైతులను ప్రభుత్వం బెదిరిస్తూ, భయపెడుతునారన్నారు. 123 జీవోను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం అప్పీల్‌కి వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుంచి సంగారెడ్డిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం 123 జీవోను రద్దు చేయాలని అన్నారు. 2013 కేంద్ర చట్టం ప్రకారమే ప్రభుత్వమే భూసేకరణ జరపాలన్నారు. ప్రాజెక్టులు కట్టండి కానీ రైతుల పొట్ట కొట్టవద్దని హితవు పలికారు.