తెలంగాణ ప్రభుత్వం భూ నిర్వాసితులపై పెట్టిన కేసులు, 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటి రాష్ట్ర నాయకులు బి.వెంకట్, టి.సాగర్‌లు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని, ఐతే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం 123 జీవోను అమలు చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.ఇది చట్ట విర్దుమని వారు అన్నారు. హైకోర్టు కూడ 2013 చట్టాన్ని అమలు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించటంతో పాటు దాన్ని వ్యతిరేకించిన రైతులపై అక్రమ కేసులను పెడుతున్నారని, మల్లన్నసాగర్, ముచ్చర్ల ప్రాంతాల్లో జైలుకు కూడ పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేములఘాటు గ్రామంలో 144 సెక్షన్ విధించారని వారు అన్నారు. భూ నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను , 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనునన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పి.జంగారెడ్డి, వెంకటేశ్వర్లు, బి.ప్రసాద్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
భూనిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
Published Tue, Aug 30 2016 8:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement