హోరెత్తిన ‘మల్లన్న సాగర్‌’ | Blustery Mallanna Sagar | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ‘మల్లన్న సాగర్‌’

Published Tue, Jul 26 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ప్రతిపక్షాల చిత్రపటాలను దహనం చేస్తున్న రైతులు...

ప్రతిపక్షాల చిత్రపటాలను దహనం చేస్తున్న రైతులు...

  • అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు
  • మద్దతుగా రైతు సంఘాల ర్యాలీ
  • వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన

  • దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కొమురవెల్లి మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌కు అనుకూలంగా ఓ వర్గం, వ్యతి రేక ప్రదర్శనలకు నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక మంగళవారం వేదికైంది. మల్లన్న సాగర్‌ నిర్మించాల్సిందేనని రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దుబ్బాక ప్రధాన వీధు ల్లో వందలాది మంది రైతులు ర్యాలీ నిర్వహిం చారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి లాల్‌ బహదూర్‌ శాస్త్రీ, అంబేద్కర్‌ విగ్రహం, నగర పంచాయతీ, బస్టాండ్‌ మీదుగా ర్యాలీ చేపట్టారు.

    తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రతిపక్షాలకు సంబంధించిన దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునంద¯ŒSరావు సమక్షంలో బీజేపీ కార్యకర్తలు మల్లన్న సాగర్‌ బాధితులకు మెరుగైన పరిహారం చెల్లించాలని, బాధితులపై అకారణంగా పోలీసుల దాడిని నిరసిస్తూ తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు వడ్ల రాజు, అంబటి బాలేష్‌ గౌడ్, శెట్టి భూపతి, పల్లె వంశీకృష్ణ గౌడ్, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తునికి లింగం, సత్తు తిరుమల్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆస రాజశేఖర్, రైతు సంఘాల సమాఖ్య నాయకులు టేకులపల్లి మల్లారెడ్డి, జీడిపల్లి రవి, తౌడ శ్రీనివాస్, ర్యాకం పద్మశ్రీరాములు, పోతనక రాజయ్య, మాధవనేని రాంచందర్‌రావు, పోలబోయిన నారాగౌడ్, బండి రాజు, అమ్మన మహిపాల్‌రెడ్డి, జీడిపల్లి కిష¯ŒS, పూజారి మల్లేశం, శేర్ల కైలాస్, అక్కల వినోద, అస్క రవి, కొంగరి ముత్తారెడ్డి, దొంతగౌని విజయ శ్రీనివాస్‌ గౌడ్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
    కృత్రిమ ఉద్యమం పేరుతో మోసం
    తెలంగాణ ఉద్యమ కాలంలో సీమాంధ్రులు చేసినట్లుగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొంతమందితో కలిసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తోందని బీజేపీ నాయకుడు ఎం. రఘునంద¯ŒSరావు ఆరోపించారు. సర్వం కోల్పోతున్న ముంపు బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ప్రభుత్వమే ప్రజలను రెచ్చగొడుతోం దని విమర్శించారు. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులపై పోలీసుల అమానుష దాడిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ముంపు బాధితులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించడం బాధాకరమన్నారు.  పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రాజెక్టులను అక్రమ మార్గాల ద్వారా నిర్మించాలనుకోవడం ప్రభు త్వ దమనీతికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇంజి నీర్లు చూపిస్తుంటే ఇంజినీర్ల సలహాలు, సూచనలను బేఖాతర్‌ చేస్తోందన్నారు.

    ఇమామ్‌బాద్‌ 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీలకు, పాములపర్తి 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు ఎలా తగ్గిం దని?, కొమురవెల్లి మల్లన్న సాగర్‌ 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు ఎలా పెరిగిందో  ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం.. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీచార్జి, కాల్పులు జరి పిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు.
    మల్లన్న సాగర్‌ నిర్మించాల్సిందే...
    మెదక్‌తోపాటు మరో నాలుగు జిల్లాల రైతాంగానికి లబ్ధి చేకూరే కొమురవెల్లి మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను కట్టి తీరాల్సిందేనని రైతు సంఘాల సమాఖ్య సమన్వయకర్త రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాగు, సాగు నీరులేక జనం అల్లాడిపోతుంటే అవేమి పట్టనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సీమాంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగిన ప్రతిపక్షాలు స్వరాష్ట్రంలో ప్రజల ప్రయోజనార్థం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

    ముంపు బాధితులను తాము గుండెల్లో పెట్టుకుని చూస్తామన్నారు. ముంపు బాధితులకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇది ప్రతిపక్షాలకు మంచిది కాదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు లేకనే తెలంగాణ తెచ్చుకున్నామని, అటువంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తామంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆరోపించారు. మల్లన్న సాగర్‌ నిర్మించే వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతాంగమంతా అండగా ఉంటుందని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement