ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు | oppositions | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు

Published Wed, Jul 27 2016 6:26 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు - Sakshi

ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దు

బాన్సువాడ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల ముంపు బాధితులతో కలిసి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, దీనికి నిరసనగా అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బాన్సువాడతో పాటు బీర్కూర్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కలిసి నిరసనలకు దిగారు. కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రొఫెసర్‌ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఈ నిరసనలు చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్‌ నార్ల సురేష్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌ మాట్లాడారు. ఉత్తర తెలంగాణాలోని ఐదు జిల్లాలను సస్యశ్యామలం చేసే మల్లన్నసాగర్‌ను నిర్మించడకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని రెచ్చగొట్టే ధోరణిని ప్రతిపక్షాలు మానుకోవాలని హితువు పలికారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మహ్మద్‌ ఎజాస్, కొత్తకొండ భాస్కర్, ఎర్వల కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ముఖీద్, ముదిరెడ్డి విఠల్‌రెడ్డి ఉన్నారు.
ప్రతిపక్షాలకు పుట్టగతులుండవు..
వర్ని : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పనులు పూర్తయి సాగు నీటి వనరులు పెంపొందితే తమకు పుట్టగతులుండవని ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని జెడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కులకర్ణి ఆరోపించారు. మండల కేంద్రంలో మంగళవారం టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రొఫెసర్‌ కోదండరాం దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మల్లన్న సాగర్‌ బాధిత రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టుకు సాగు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడారి చేయడానికే ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఎంపీపీ చింగ్లీబాయి, వైస్‌ ఎంపీపీ సంజీవ రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మేక వీర్రాజు, విండో చైర్మన్లు పత్తిరాము, హన్మంత్‌ రెడ్డి, పిట్ల శ్రీరాములు, ఎంపీటీసీ కలాల్‌ గిరి,  టీఆర్‌ఎస్‌ నాయకులు ఇందూర్‌ సాయిలు, బజ్యానాయక్, చింతం సంజీవ్, కుంకుమ దత్తు, శ్రీనగర్‌ రాజు, రాంచందర్, బొట్టె గజేందర్, నామాల సాయిబాబా, వి. గోపాల్, సత్యనారాయణ, మైనారిటీ నాయకులు మహ్మద్‌ బారీ, కరీం ఉన్నారు. 
కోటగిరిలో..
వర్ని : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకులు కోటగిరి మండల కేంద్రంలో ప్రతిపక్షాల (టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు) దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారు మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక రైతులను ప్రతి పక్ష పార్టీలు రె^è ్చగొడుతున్నాయన్నారు. ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ తహసీల్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నీరడి గంగాధర్, ఎంపీపీ సులోచన, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రావ్, ఏఎంసీ చైర్మన్‌ శంకర్‌ పటేల్, నాయకులు గంగాధర్‌ దేశాయ్, బర్ల గంగారాం, బీర్కూర్‌ గంగాధర్,  హంగర్గ స్వరూప, బి.రాములు, సైదయ్య, కిశోర్‌ ఉన్నారు. 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement