మల్లన్న ‘సాగర’ వెతలు | leaders write letter to kcr on Mallanna Sagar | Sakshi
Sakshi News home page

మల్లన్న ‘సాగర’ వెతలు

Published Thu, Sep 8 2016 1:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

మల్లన్న ‘సాగర’ వెతలు - Sakshi

మల్లన్న ‘సాగర’ వెతలు

తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమే. తెలంగాణ ప్రజలకు నీటిని అందించటానికి ఇలాంటి భూసేకరణే మార్గమా? బాధిత ప్రజల పునరావాసం, పునఃస్థాపనను మీరు ఏ విధంగా విస్మరించగలరు?
 
గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,
బాధ్యతగల పౌరులుగా, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న మేము కొన్ని విషయాలను మీ దష్టికి తీసుకురాదలిచాము. తెలంగాణ రాష్ట్రం చిత్తశుద్ధితో పెద్ద పెట్టుబడులతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి  ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలతో, మల్లన్న సాగర్ వంటి సాగు నీటి ప్రాజెక్టులతో నీటి సమస్యను పరిష్కరించటానికి పూనుకుంది. అయితే భారీ సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద విస్తీర్ణంలో అవసరమైన భూమిని మీ ప్రభుత్వం సేకరిస్తున్న పద్ధతి పెద్ద వివాదంగా మారింది.
 
 తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అవసరాన్ని ఎవరూ కాదనలేరు. కాని అటువంటి ప్రాజెక్టులు ప్రజల భాగస్వామ్యాన్ని, స్వచ్ఛంద అంగీకారాన్ని పొందటం, అలాగే న్యాయబద్ధమైన నష్టపరిహారాన్ని అందించటం అత్యవసరం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కు లను కాలరాచింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా తెలంగాణ ప్రభుత్వం జీవో 123 కింద భూసేకరణ ఎందుకు చేస్తున్నదని ప్రజలు మళ్లీమళ్లీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో పెరుగుతున్న ఈ ఆగ్రహానికి పలు కారణాలున్నాయి.

భూమినీ, జీవనోపాధినీ కోల్పోతున్న వారు కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా తమ గోడును చెప్పుకునే అవకాశం జీవో 123 కల్పించదు. అది భూసేకరణకు గరిష్ట పరిమితిని ఎత్తివేసి వంద లాది ఎకరాలను పరాయీకరించటానికి వీలు కల్పి స్తుంది. భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన వారికీ పునరా వాసం, పునఃస్థాపన ఖర్చులను చెల్లించే అంశాన్ని ఆ తర్వాత తెచ్చిన జీవో 241లో తొలగించడం దారుణం.
 
మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేక రణకు గత నాలుగు నెలలుగా తీవ్ర ప్రతిఘటన జరుగు తోంది. ప్రజలు భూమిని స్వచ్ఛందంగా ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అక్కడ భూ సేకరణలో తప్పుడు సమా చారం ఇవ్వటం, ఒత్తిడి తేవటం, బెదిరించటం జరుగు తున్నట్లు వార్తలొస్తున్నాయి, మా నిజ నిర్ధారణలోనూ ఇది ధ్రువపడింది. భూమినీ, జీవనోపాధినీ కోల్పో తామని, గ్రామం మునిగిపోతే రోడ్డున పడతామని ముఖ్యంగా వయసు మళ్లిన స్త్రీలు, చదువుకునే ఆడ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో పంచాయతీలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. భూమి, జీవనోపాధులపై తీసుకునే ఏ నిర్ణయంలోనైనా గ్రామ సభలు. పంచాయతీల భాగస్వామ్యం ఉండాలి.
 
 ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తున్న సంస్థ గురించి స్పష్టత లేదు. జీవో 123ని తీసుకురావటం ద్వారా మీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం వీలు కల్పించిన సామాజిక ప్రభావ అంచనా తదితర ప్రక్రి యల పరిధి నుంచి ఈ ప్రాజెక్టును బయట ఉంచాలని ప్రయత్నిస్తున్నది. చట్టానికి కట్టుబడటానికి బదులు
 మీ ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి, వారిని బలవంతపెట్టడం విచారకరం. ఇది వేములగట్టు గ్రామంలో ప్రజలపై లాఠీచార్జి, 144వ సెక్షన్ విధిం చటం వంటి సంఘటనల వరకు వెళ్లింది.
 ఈ పరిణామాల పట్ల మేము తీవ్రంగా కలత చెందాము. తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమనే అంశంపై మీతో ఏకీభవిస్తు న్నాం. అరుుతే నీటిని అందించటానికి ఇదొక్కటే మార్గమా? ప్రజాస్వామిక ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పునరావాసం, పునఃస్థాపనకు వీలు కల్పించకుండా భూసేకరణ ఎట్లా చేయగలుగు తుంది? సాగునీరు ఇవ్వటం పేరుతో ప్రభుత్వం వేలాది ప్రజలకున్న కొద్ది ఆస్తిని తీసుకోరాదు.
 
 మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల హక్కులకు రక్షణ కల్పించి, శాంతి పునరుద్ధరణకు ఈ కింది చర్యలు తీసుకోవలసిందని   మీకు విజ్ఞప్తి చేస్తున్నాం: 1. వేములగట్టు గ్రామం నుండి పోలీసులను ఉపసంహరించి 144వ సెక్షన్‌ని ఎత్తివేయాలి. 2. జీవో 123పై హైకోర్టు నుంచి అంతిమ తీర్పు వెలువడే వరకు మల్లన్నసాగర్ ముంపు గ్రామా లలో భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలి. 3. మల్ల న్నసాగర్  సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీ పీఆర్)ను స్థానిక భాషలో విడుదల చేసి దానిపై చర్చ నిర్వహించాలి.
 
 4. భూసేకరణ జరిపే ముందు.. సేకరణ జరిపే సంస్థ ఏది, ఎవరి పేరిట రిజిస్టర్ చేశారు? ఎవరి పేరిట చేయాల్సి ఉందనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలి. 5. హైకోర్టు ఆదేశాల మేరకు మల్లన్న సాగర్ భూ యజమానులకు, భూమిలేని ప్రజలకు 2013 భూసే కరణ చట్టంలోని 2వ, 3వ షెడ్యూలు ప్రయోజనాలను అందించటంపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చెయ్యాలి.
 
 పైన పేర్కొన్న అన్ని అంశాలపై వెంటనే చర్య తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల విశ్వా సాన్ని పునరుద్ధరించాలనీ మేము కోరుతున్నాం. ప్రొఫె సర్ రమా మెల్కోటే - ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ (9912021778). డాక్టర్ కే.లలిత - ఫెమినిస్ట్ మేధావి. ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే - కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ సూజీతారు - IFLU రిటైర్డ్ ప్రొఫెసర్. డాక్టర్ వీణా శత్రుగ్న -NIN డిప్యూటి డెరైక్టర్. ప్రొఫెసర్ శాంత సిన్హా - స్వతంత్ర పిల్లల హక్కుల కార్యకర్త. డాక్టర్ వి.రుక్మిణి రావ్ - మహిళా రైతుల కార్యకర్త, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్. డాక్టర్ ఉషాసీతాలక్ష్మి -  స్వతంత్ర పరిశోధకురాలు. ఎస్. ఆశాలత - మహిళా రైతుల హక్కుల వేదిక ((MAKAAM) వసుధ నాగరాజ్ - హైకోర్టు అడ్వొకేట్. కె. సజయ-ఫ్రీలా న్స్  జర్నలిస్ట్, ఫిలిం మేకర్  ( 9948352008).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement