rama melkote
-
రాజకీయాల్లో విలువలెక్కడ?
సాక్షి, హైదరాబాద్ : ‘మహిళలపై హింస పెరిగింది. అనేక రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. ఏటా గృహ హింస కేసులు వందల్లో నమోదవుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ హింస గురించి మాట్లాడడం లేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా’.. ప్రముఖ మహిళా హక్కుల నేత, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, ప్రొసర్ఫె రమా మెల్కోటే ఆవేదన ఇది. అనేక దశాబ్దాలుగా మహిళల సమస్యలపై పోరాడే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా నిలిచారు. కానీ ఏ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మహిళల పక్షాన మాట్లాడకపోవడం పట్ల ప్రొఫెసర్ రమా మెల్కోటే విస్మయం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హింస, లైంగిక దోపిడీ పెరిగాయని, అయినా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో మహిళల సమస్యలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అల్వాల్‌లో నిన్న ఆరేళ్ల పసిపాపను దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపారు. 48 గంటలు గడిచాయి.. కానీ ఏ రాజకీయ పార్టీ గొంతు విప్పలేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన దాఖలా లేదు. స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు ఆందోళన చేశారు. కానీ నాయకులు, పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. మహిళలపైనా, పిల్లలపైన జరుగుతున్న హింసను గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం మరేముంటుంది. మహిళలపై గృహహింస పెరిగింది. ఇంట్లోకి, బయటకు పెద్దగా తేడా లేదు. లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత అమానవీయమైన పద్ధతిలో పరువు హత్యలు జరుగుతున్నాయి. ఒకచోట కన్న కూతుళ్లనే కిరాతకంగా హతమార్చే తండ్రులు ఉంటే, మరో చోట అగ్రకుల అహంకారంతో హత్యలు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి గూడూరులో ఇలాంటి హత్యలే జరిగాయి. మహిళలపై ఎక్కడ ఏ రూపంలో హింస జరిగినా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నాయి.. ఆందోళనలు చేస్తున్నాయి. మహిళా సంఘాల పోరాటాలే జరుగుతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీలైనా మహిళా హింసకు వ్యతి రేకంగా పోరాడుతున్నాయా..? మహిళలకు సంబంధించిన అంశాల పట్ల ఇంచుమించు అన్ని పార్టీలు ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా దారుణం. దరిద్రపు రాజకీయాలు ఇవి.. రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరులు పూర్తిగా డబ్బు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాజకీయాలను వ్యాపారంగా మార్చు కుంటున్నారు. పెట్టుబడులు పెట్టి లాభాలను రాబట్టుకుంటున్నారు. డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎక్కడా రవ్వంత విలువలకు స్థానం లేదు. చాలా దరిద్రపు రాజకీయాలు ఇవి. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు. తిరిగి మరే పార్టీకి మారుతారో తెలియదు. ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానిస్తున్నారు. దీర్ఘకాలికమైన సమస్యల పట్ల ఒక దృక్పథం లేదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీల ఆలోచనలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. తాము నమ్మిన విలువలను ఆచరించారు. అక్రమార్జనే ధ్యేయంగా పార్టీలు మారడాన్ని ఎంతో అవమానంగాభావించారు. కానీ ఇప్పుడు.. ఎలాంటి విలువలు ఎక్కడా లేవు.. చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్లా రాజకీయ నాయకులు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ల గురించి ఏం మాట్లాడగలం’ అంటూ ముగించారు. -
దళితులకు రాజ్యాధికారం రావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు. అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు. అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు. పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు. -
మల్లన్న ‘సాగర’ వెతలు
తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమే. తెలంగాణ ప్రజలకు నీటిని అందించటానికి ఇలాంటి భూసేకరణే మార్గమా? బాధిత ప్రజల పునరావాసం, పునఃస్థాపనను మీరు ఏ విధంగా విస్మరించగలరు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బాధ్యతగల పౌరులుగా, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న మేము కొన్ని విషయాలను మీ దష్టికి తీసుకురాదలిచాము. తెలంగాణ రాష్ట్రం చిత్తశుద్ధితో పెద్ద పెట్టుబడులతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలతో, మల్లన్న సాగర్ వంటి సాగు నీటి ప్రాజెక్టులతో నీటి సమస్యను పరిష్కరించటానికి పూనుకుంది. అయితే భారీ సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద విస్తీర్ణంలో అవసరమైన భూమిని మీ ప్రభుత్వం సేకరిస్తున్న పద్ధతి పెద్ద వివాదంగా మారింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అవసరాన్ని ఎవరూ కాదనలేరు. కాని అటువంటి ప్రాజెక్టులు ప్రజల భాగస్వామ్యాన్ని, స్వచ్ఛంద అంగీకారాన్ని పొందటం, అలాగే న్యాయబద్ధమైన నష్టపరిహారాన్ని అందించటం అత్యవసరం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కు లను కాలరాచింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా తెలంగాణ ప్రభుత్వం జీవో 123 కింద భూసేకరణ ఎందుకు చేస్తున్నదని ప్రజలు మళ్లీమళ్లీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో పెరుగుతున్న ఈ ఆగ్రహానికి పలు కారణాలున్నాయి. భూమినీ, జీవనోపాధినీ కోల్పోతున్న వారు కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా తమ గోడును చెప్పుకునే అవకాశం జీవో 123 కల్పించదు. అది భూసేకరణకు గరిష్ట పరిమితిని ఎత్తివేసి వంద లాది ఎకరాలను పరాయీకరించటానికి వీలు కల్పి స్తుంది. భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన వారికీ పునరా వాసం, పునఃస్థాపన ఖర్చులను చెల్లించే అంశాన్ని ఆ తర్వాత తెచ్చిన జీవో 241లో తొలగించడం దారుణం. మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేక రణకు గత నాలుగు నెలలుగా తీవ్ర ప్రతిఘటన జరుగు తోంది. ప్రజలు భూమిని స్వచ్ఛందంగా ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అక్కడ భూ సేకరణలో తప్పుడు సమా చారం ఇవ్వటం, ఒత్తిడి తేవటం, బెదిరించటం జరుగు తున్నట్లు వార్తలొస్తున్నాయి, మా నిజ నిర్ధారణలోనూ ఇది ధ్రువపడింది. భూమినీ, జీవనోపాధినీ కోల్పో తామని, గ్రామం మునిగిపోతే రోడ్డున పడతామని ముఖ్యంగా వయసు మళ్లిన స్త్రీలు, చదువుకునే ఆడ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో పంచాయతీలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. భూమి, జీవనోపాధులపై తీసుకునే ఏ నిర్ణయంలోనైనా గ్రామ సభలు. పంచాయతీల భాగస్వామ్యం ఉండాలి. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తున్న సంస్థ గురించి స్పష్టత లేదు. జీవో 123ని తీసుకురావటం ద్వారా మీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం వీలు కల్పించిన సామాజిక ప్రభావ అంచనా తదితర ప్రక్రి యల పరిధి నుంచి ఈ ప్రాజెక్టును బయట ఉంచాలని ప్రయత్నిస్తున్నది. చట్టానికి కట్టుబడటానికి బదులు మీ ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి, వారిని బలవంతపెట్టడం విచారకరం. ఇది వేములగట్టు గ్రామంలో ప్రజలపై లాఠీచార్జి, 144వ సెక్షన్ విధిం చటం వంటి సంఘటనల వరకు వెళ్లింది. ఈ పరిణామాల పట్ల మేము తీవ్రంగా కలత చెందాము. తెలంగాణ అభివద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు అత్యవసరమనే అంశంపై మీతో ఏకీభవిస్తు న్నాం. అరుుతే నీటిని అందించటానికి ఇదొక్కటే మార్గమా? ప్రజాస్వామిక ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పునరావాసం, పునఃస్థాపనకు వీలు కల్పించకుండా భూసేకరణ ఎట్లా చేయగలుగు తుంది? సాగునీరు ఇవ్వటం పేరుతో ప్రభుత్వం వేలాది ప్రజలకున్న కొద్ది ఆస్తిని తీసుకోరాదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల హక్కులకు రక్షణ కల్పించి, శాంతి పునరుద్ధరణకు ఈ కింది చర్యలు తీసుకోవలసిందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం: 1. వేములగట్టు గ్రామం నుండి పోలీసులను ఉపసంహరించి 144వ సెక్షన్‌ని ఎత్తివేయాలి. 2. జీవో 123పై హైకోర్టు నుంచి అంతిమ తీర్పు వెలువడే వరకు మల్లన్నసాగర్ ముంపు గ్రామా లలో భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలి. 3. మల్ల న్నసాగర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీ పీఆర్)ను స్థానిక భాషలో విడుదల చేసి దానిపై చర్చ నిర్వహించాలి. 4. భూసేకరణ జరిపే ముందు.. సేకరణ జరిపే సంస్థ ఏది, ఎవరి పేరిట రిజిస్టర్ చేశారు? ఎవరి పేరిట చేయాల్సి ఉందనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలి. 5. హైకోర్టు ఆదేశాల మేరకు మల్లన్న సాగర్ భూ యజమానులకు, భూమిలేని ప్రజలకు 2013 భూసే కరణ చట్టంలోని 2వ, 3వ షెడ్యూలు ప్రయోజనాలను అందించటంపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చెయ్యాలి. పైన పేర్కొన్న అన్ని అంశాలపై వెంటనే చర్య తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల విశ్వా సాన్ని పునరుద్ధరించాలనీ మేము కోరుతున్నాం. ప్రొఫె సర్ రమా మెల్కోటే - ఉస్మానియా యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ (9912021778). డాక్టర్ కే.లలిత - ఫెమినిస్ట్ మేధావి. ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే - కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ సూజీతారు - IFLU రిటైర్డ్ ప్రొఫెసర్. డాక్టర్ వీణా శత్రుగ్న -NIN డిప్యూటి డెరైక్టర్. ప్రొఫెసర్ శాంత సిన్హా - స్వతంత్ర పిల్లల హక్కుల కార్యకర్త. డాక్టర్ వి.రుక్మిణి రావ్ - మహిళా రైతుల కార్యకర్త, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్. డాక్టర్ ఉషాసీతాలక్ష్మి - స్వతంత్ర పరిశోధకురాలు. ఎస్. ఆశాలత - మహిళా రైతుల హక్కుల వేదిక ((MAKAAM) వసుధ నాగరాజ్ - హైకోర్టు అడ్వొకేట్. కె. సజయ-ఫ్రీలా న్స్ జర్నలిస్ట్, ఫిలిం మేకర్ ( 9948352008).