న్యూఢిల్లీ : మల్లన్నసాగర్పై టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు ఆరోపించారు. బుధవారం న్యూఢిల్లీలో విద్యాసాగర్రావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్పై సమాచారం అడిగితే ఇంజనీర్ హన్మంతరావు, కోదండరామ్కు అందిస్తామన్నారు. పాలమూరు - డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రైతుల పేరుతో కేసులు వేయించిందని విద్యాసాగర్రావు విమర్శించారు.