మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల దాడికి నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.
మెదక్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల దాడికి నిరసనగా సోమవారం మెదక్ జిల్లా బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. బంద్‌లో పాల్గొనాలని కార్యకర్తలకు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షడు శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను జిల్లాకు తరలిస్తోంది. కాగా.. ప్రతిపక్షాల కవ్వింపు చర్యల మూలంగానే ఇవాళ్టి ఘటన జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.