'మల్లన్న' పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం | telangana-congress-leaders-meets-governor-narasimhan-over-mallanna-sagar | Sakshi
Sakshi News home page

'మల్లన్న' పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

Published Mon, Sep 12 2016 12:26 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'మల్లన్న' పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం - Sakshi

'మల్లన్న' పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

హైదరాబాద్: మల్లన్నసాగర్ పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తోందని, ముంపు గ్రామం వేమలఘట్ లో 50 రోజులుగా 144 సెక్షన్ విధించటం అన్యామన్నారు. గవర్నర్ నరసింహన్తో  సోమవారం భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై గవర్నర్ తో చర్చించారు.
 
భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇదేమైనా కశ్మీరా? మనం భారతదేశంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు.  మల్లన్న సాగర్ లోని పరిస్థితులను గవర్నర్ కు వివరించి జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. తక్షణమే ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేసేలా డీజీపీ ఆదేశాలివ్వాలని కూడా కోరామన్నారు. మల్లన్న సాగర్ పై ఈ నెల 14న లేదా 15 న రాష్ట్ర్రపతిని కలవనున్నట్టు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరిపేలా ప్రభుత్వానికి గవర్నర్ సూచించాలన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పలువురు నేతలు ఉన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement