Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

 YS Jagan Extends Birth Wishes To Chandrababu1
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025

BJP JP Nadda completely rejects MPs remarks on judiciary2
సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలు.. జేపీ నడ్డా ఏమన్నారంటే?

ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ సీరియస్‌గా దృష్టి సారించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి.. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్‌ వేదికగా..‘భారత న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. వారితో బీజేపీ ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ వాటిని పూర్తిగా తిరస్కరిస్తుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు మన ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమని బీజేపీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. కోర్టుల సూచనలు, ఆదేశాలను సంతోషంగా అంగీకరించింది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్కడ్‌​ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే మరో బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్‌ దూబే సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Sakshi Editorial On land allocated to it companies by Vardhelli Murali3
పైసా తక్కువ రూపాయ్‌!

‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మన పరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్‌ అంబాసిడర్‌నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ముఖచిత్రం)‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్‌ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్‌జీ భారత్‌కు అయ్యలాంటి స్కెచ్‌.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్‌ సమాచార స్రవంతి)రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్‌–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్‌ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్‌ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్‌కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్‌ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.ఈ గ్రాండ్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్‌డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్‌ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్‌షాపుల్లో ఫ్యాబ్రికేట్‌ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్‌ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్‌ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్‌ తలూపింది. ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్‌సీల నుంచి 115 టీఎమ్‌సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్‌ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్‌ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్‌ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్‌ వ్యాలీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్‌ హార్బర్లు, మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్‌ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్‌ వ్యాలీ వంటి ‘నేమ్‌ డ్రాపింగ్‌’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్‌ ససేమ్‌’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్‌ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్‌ హార్బర్లను, ఆరు ఫిష్‌ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్‌సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్‌ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్‌ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్‌కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్‌లైన్లో ఇంకా చాలా ఉన్నాయట!కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్‌ రూట్స్‌ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్‌ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ స్కామ్‌ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్‌ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్‌ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్‌ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్‌ రూమ్‌తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్‌ సర్కార్‌ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్‌ రూమ్‌లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్‌ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్‌ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్‌ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్‌ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

IPL 2025: GT Captain Shubman Gill Penalised By BCCI Know The Reason4
శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌!

గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్‌-2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ అహ్మదాబాద్‌ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశుతోష్‌ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్‌ నాయర్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జోస్‌ ది బాస్‌.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్‌ బట్లర్‌ దంచికొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్‌కు తోడుగా షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్‌తో కలిసి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్‌-2025: గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌👉టాస్‌: గుజరాత్‌.. మొదట బౌలింగ్‌👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్‌ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్‌ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌- 54 బంతుల్లో 97 నాటౌట్‌).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్‌.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్‌ ఖాన్‌

CM Omar Abdullah Slams Delhi Airport After Flight Diverted5
ఢిల్లీ​ వెళ్లాల్సిన విమానం జైపూర్‌లో ల్యాండ్‌.. సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఫైర్‌

ఢిల్లీ: ఇండిగో విమానం ఆలస్యంపై జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించక.. జైపూర్‌లో ల్యాండ్‌ కావడంపై తీవ్ర అసహనం వ్యక్త పరిచారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుని.. పరుష పదజాలంతో తన బాధను చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శనివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీలోకి బయలుదేరారు. ఈ సమయంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సదరు ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దీంతో, విమానం రాజస్థాన్‌లోని జైపూర్‌ ల్యాండ్‌ అయ్యింది. దాదాపు నాలుగు గంటల తర్వాత మళ్లీ విమానం.. ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానం ఆలస్యం కావడంపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. జైపూర్‌లో ల్యాండ్‌ అయ్యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ షో అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల విషయంలో వీరి అలసత్వం చూస్తుంటే.. సహనం కోల్పోతున్నామని.. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా తాను లేనని అన్నారు. Delhi airport is a bloody shit show (excuse my French but I’m in no mood to be polite). 3 hours in the air after we left Jammu we get diverted to Jaipur & so here I am at 1 in the morning on the steps of the plane getting some fresh air. I’ve no idea what time we will leave from… pic.twitter.com/RZ9ON2wV8E— Omar Abdullah (@OmarAbdullah) April 19, 2025దాదాపు మూడు గంటల తర్వాత ఒమర్‌ అబ్దుల్లా మరో పోస్టులో స్పందిస్తూ..‘ఎవరైనా ఆలోచిస్తుంటే, నేను తెల్లవారుజామున 3:00 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్‌ విమానాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని.. జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు కురవడం వల్ల ఈ అంతరాయం కలిగిందని తెలిపింది. వాతావరణం మెరుగైన వెంటనే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది.

Rs 500 note in the answer sheet goes viral6
10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!

బెంగళూరు: ‘పాస్‌ అయ్యేందుకు లంచమా?!’ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఆన్సర్‌ షీట్లలో నోట్లు పెట్టి, పాస్‌ చేయమంటూ ఇన్విజిలేటర్లను అభ్యర్థించిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండికర్ణాటక రాష్ట్రం (Karnataka) బెల్గావి జిల్లా చిక్కోడిటౌన్‌లో పదోతరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకనం చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ పదోతరగతి పరీక్షాపేపర్ల మూల్యాంకనం సమయంలో పలువురు ఇన్విజిలేటర్లకు ఆన్సర్‌ షీట్లలో కరెన్సీ నోట్లు తారసపడ్డాయి. దీంతో కంగుతిన్న ఇన్విజిలేటర్లు ఆన్సర్‌ షీట్లలో ఈ కరెన్సీ నోట్లు ఎందుకు వచ్చాయా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.‘సార్‌.. సార్‌ నన్ను పాస్‌ చేయండి. మీ దణ్ణం పెడతా. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. సార్‌ ఇవిగో రూ.500 ఛాయ్‌ తాగండి.. నన్ను పాస్‌ చేయండి. నన్ను పాస్‌ చేయించలేదనుకో అంటూ ఇలా విద్యార్థులు ఎగ్జామ్స్‌ ఆన్సర్‌ షీట్ల మీద పలువురు విద్యార్థులు ప్రాధేయపడుతూ రాశారు. వారిలో ఓ పదో తరగతి విద్యార్థి తన ఆన్సర్‌ షీట్‌ మీద రూ.500 నోటు పెట్టి పాస్‌ చేయమని అభ్యర్థించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రిక్వెస్ట్‌ చూసిన ఓ ఇన్విజిలేటర్‌ ‘మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు’ అంటూ ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఓ విద్యార్థి రూ.500 నోటు ఇస్తే మరికొందరు విద్యార్థులు తమకు పలు రిక్వెస్టులు చేసినట్లు చీక్కోడి టౌన్‌లో పదో తరగతి పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. వాటిల్లో విద్యార్థులు అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ప్లీజ్‌ పాస్‌ చేయండి సార్‌. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.నేను పాసాయితే నా ప్రేమను కొనసాగిస్తాసార్‌ ఇదిగో రూ.500 .. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండిమీరు నన్ను పాస్‌ చేయిస్తే .. నేను మీకు డబ్బులిస్తానేను పాస్‌ కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరూ అని ఆన్సర్‌ షీట్లో రాశారు.చివరికి పలువురు ఇన్విజిలేటర్లు ఆ ఆన్సర్‌ షీట్లలోని కరెన్సీ నోట్లను ఉన్నతాధికారులకు అందించారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ల ఆధారంగా మార్కులు వేశారు.

Lucknow beautician Chhaya Incident Full Details7
‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్‌ కోసం రావాలని ఛాయాకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్‌.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్‌, ఆదర్శ్‌ను అరెస్ట్‌ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు. ब्रेकिंग लखनऊ ब्यूटीशियन छाया की दुष्कर्म के प्रयास में हत्यातीन युवको ने ब्यूटीशियन के साथ की छेड़छाड़ छेड़छाड़ का विरोध करने पर हत्या एक आरोपी गिरफ्तार, दो फरार #BREAKING #Lucknow #Murder #RapeAttempt #indiavoice pic.twitter.com/W4ppJOskGW— India Voice (@indiavoicenews) April 19, 2025

Story On Human Relationships and Present Days8
మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది ఎలాంటి సంబంధాలు?

ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి. ఏ పునాదుల ఆధారంగా మానవ సంబంధాలు నిర్మితం అవుతున్నాయి... కాలక్రమంలో ఎలాంటి కారణాలు మానవ సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఎలాంటి వ్యవహారాలు నైతిక విలువలను పరిహాసం పాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీసే సంగతులు. వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను చంపేసే భార్యలు, కన్న పిల్లలను చంపేసే తల్లులు, అదేమాదిరి పురుషులు మనకు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆ వివాహేతర సంబంధం కంటె వారికి ఏదీ ఎక్కువ కాదేమో అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు.తాజాగా ఒకేరోజు దినపత్రికల్లో కనిపించిన నాలుగు వేర్వేరు వార్తలు గమనించినప్పుడు.. అసలు మానవసంబంధాలు ఎంత దారుణంగా పతనం అవుతున్నాయో కదా.. అనే అనుమానం కలుగుతుంది. అనుబంధాల్లో నైతికత అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా మారిపోతున్నది కదా అని కూడా భయమేస్తుంది. ముందు ఆ నాలుగు ఉదాహరణలు పరిశీలిద్దాం.ఉదాహరణ 1 :వైవాహిక బంధంలో కొనసాగుతున్న మహిళ, మరొక ప్రియుడితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నైతికతకు సంబంధించిన విషయమే తప్ప, నేరం కాదు అని దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పైగా ‘భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలానికి చెందిన భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని కూడా వ్యాఖ్యానించింది.ఉదాహరణ 2 :ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో రాహుల్ అనే వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. మరో పదిరోజుల్లో పెళ్లి. ఈలోగా ఆ అమ్మాయి తల్లి స్వప్న.. కాబోయే అల్లుడితో కలిసి పారిపోయింది. వారి కుటుంబీకులు పోలీసు కేసు పెట్టారు. అప్పటికే నేపాల్ సరిహద్దుల దాకా పారిపోయిన వారు.. కేసు సంగతి తెలిసి తిరిగివచ్చారు. కానీ స్వప్న మాత్రం.. కాబోయే అల్లుడితోనే జీవితం పంచుకుంటానని భర్త తనకు వద్దని ఇంకా మొండిపట్టుపడుతోంది.ఉదాహరణ 3 : ఉత్తరప్రదేశ్ లోని బదాయూపట్టణంలో మరో ఉదంతం జరిగింది. మమత అనే 43 ఏళ్ల మహిళ ఇంట్లో డబ్బు నగలు తీసుకుని తన కుమార్తెకు మామ అయిన శైలేంద్రతో కలిసి పారిపోయింది. వరుసకు అన్నయ్య అయ్యే అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ప్రస్తుతం పరారయ్యారు.ఉదాహరణ 4 :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ఫూర్ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మంగళగిరిలో నివాసం ఉంటాడు. అతనికి స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమార్తెతో కలిసి నంద్యాల శివార్లలో నివాసం ఉంటోంది. నాలుగురోజుల సెలవుమీద ఆమె ఇంటికి వచ్చిన ఫరూక్ ఆమె కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గొడవ అయింది. కుమార్తె స్నేహితుడితో కూడా గొడవ అయింది. దీంతో ఆ యువకుడు, మరోనలుగురు కలిసి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ ను హత్య చేశారు.మానవ సంబంధాల గురించి చాలా మంది పెద్దలు చాలా చాలా ఆదర్శాలను, నీతులను వల్లెవేస్తూ ఉంటారు. కానీ.. మానవ సంబంధాల్లో ఉండే చేదు వాస్తవాన్ని చాలా నిష్కర్షగా చెప్పాడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తేల్చేశాడు. సమాజంలో చాలా వ్యవహారాలను భిన్నమైన కోణంలో చూడగలిగిన ప్రతిసారీ మార్క్స్ చెప్పినది అక్షర సత్యం అని అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న నాలుగు ఉదాహరణలు గమనిస్తే.. మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది సెక్స్ సంబంధాలేనా? అనే అనుమానం మనకు కలుగుతుంది. 497 అధికరణం రద్దయిపోయింది తను చేసిన పనిని నేరం అని ఏ కోర్టు చెప్పజాలదు గనుక.. ఓ వివాహిత.. భర్తకు తెలిసినా నిర్భయంగా తన ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. కూతురుకు కాబోయే భర్తతో.. ముందే లేచిపోయింది మరో తల్లి. వరుసకు అన్నయ్యతో అదే ఘోరానికి తెగబడింది మరో ఇల్లాలు. ఏపీఎస్పీ కానిస్టేబులు ఏకంగా తల్లితో వివాహేతర సంబంధంలో ఉంటూ కూతురులాంటి అమ్మాయిపై అత్యాచారానికి తెగబడి హతమయ్యాడు. ఇలాంటి దారుణమైన బుద్ధులు ఎలా వ్యాప్తిలోకి వస్తున్నాయి.నేరాలు జరిగినప్పుడు.. చంపిన వారిని ముక్కలు చేసి ఆచూకీ తెలియకుండా మార్చేస్తున్నప్పుడు.. అలాంటి దారుణాలు చూసి ఓటీటీ సినిమాలు మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయని మనం నీతులు వల్లిస్తుంటాం. కానీ.. ఇలాంటి ఘటనలు ఎలా ప్రభావితం అవుతున్నాయి. నైతిక విలువల పట్ల ప్రజల్లో కనీసస్పృహ లేకపోతుండడమే ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నదనే అభిప్రాయం కలుగుతోంది. పరిష్కారం అంతుచిక్కని సమస్య లాగా సమాజ గతిని ఈ పరిణామాలు దిగజారుస్తున్నాయి....ఎం. రాజ్యలక్ష్మి

Ilayaraja Comments On His Music Journey In Shashtipoorthi Movie Event9
అది తెలిసిన రోజు సంగీతం మానేస్తాను: ఇళయరాజా

‘‘నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు... సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణం సంగీతం మానేస్తాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా, రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వంలో రూపేష్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) టీజర్‌ రిలీజ్‌ చేసిన అనంతరం మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’ ద్వారా కొత్తవాళ్లు తొలి ప్రయత్నం చేశారు. వారిని ప్రోత్సహించాలని ఇక్కడకి వచ్చాను. ఈ సినిమాకి, పని చేసిన అందరికీ దేవుడు ఆశీస్సులు అందించాలి’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..’ అనే పాట రాశాను. ఇళయరాజాగారి సంగీతానికి పాడాలనుకున్నా ఆ అవకాశం రాలేదు. కానీ, ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఇదొక రకంగా నా జీవితానికి సంబంధించినదే. ఇళయరాజాపై నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటని అనుకోండి’’ అని అన్నారు. రాజేందప్రసాద్‌( Rajendra Prasad) మాట్లాడుతూ– ‘‘ఇళయరాజా సంగీతం వల్లే ‘లేడీస్‌ టైలర్‌’ సినిమా హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు నా సినిమాకి ఆయన సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో పాటు ఎంతోమందిని తన సంగీతంతో స్టార్లుగా ఇళయరాజా నిలబెట్టారు.’ అని అన్నారు. ‘‘ఇంత గొప్పవారు మా సినిమాకి పని చేయడం సంతోషంగా ఉంది’’ అని పవన్‌ ప్రభ, రూపేష్‌ అన్నారు. కాగా ఇళయరాజాకి భారతరత్న ఇవ్వాలన్న ఆకాంక్షను పలువురు ఈ వేదికపై వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ రామ్, కళా దర్శకుడు తోట తరణి, గీత రచయిత చైతన్య ప్రసాద్‌ మాట్లాడారు.

Sebi proposes higher mutual fund investment limits in Reits InvITs10
సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్‌లలో మరిన్ని పెట్టుబడులు!

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)లలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్‌లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్‌ ఎన్‌ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్‌లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్‌ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ఫండ్స్‌లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)లో చేరినట్లు యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్‌ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్‌ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్‌ ఎంఎఫ్‌ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్‌డీసీ ఎండీ టి. కోషి చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement