
‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాటను ఏ ముహూర్తాన తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడో తెలియదు గాని దశాబ్దపు మేటి పాటగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది ఈ పాట. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ హిట్ సాంగ్ అన్ని వేడుకల్లో, కచేరీల్లో మారుమోగుతోంది. అంతేకాకుండా ‘సామజవరగమన’ తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను చిత్ర బృందం ప్రకటించింది.
‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(ఆదివారం) సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ లిరికల్ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ రేపు విడుదలయ్యే వీడియో సాంగ్ దృశ్య రూపంలోనూ వారిని కనువిందు చేయనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు)లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది.
పూర్తి పాట మీకోసం
పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
చదవండి:
సామజవరగమన పాట అలా పుట్టింది..
సామజవరగమన.. ఇది నీకు తగునా!
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ