sirivennela sitarama sastry
-
సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సిగరేట్ పెట్టెపై ‘అర్థశతాబ్దపు..’ పాట రాశాడు : కృష్ణవంశీ
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట. ‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని. అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు. -
సింగపూర్‌లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
ఘనంగా సిలికానంధ్ర సంస్థాపక దినోత్సవ వేడుకలు
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ఈ వేడకకు వేదికయ్యింది. గత 22ఏళ్ల ఆనవాయితీ ప్రకారం.. ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయ్యింది. సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ల రచించిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులు పాత్రలతో మమేకమైపోయారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో సభలో కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నాటకం అనంతరం డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. ఆయనకు శాలువా కప్పి పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బూదరాజు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఒక పద్యనాటక ప్రదర్శన చూడలేదని పేర్కొన్నారు. సిలికానంద్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా వేదిక మీదకి రావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.సిరివెన్నెల కుటుంబసభ్యుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే ఏడాది నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీలలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్ శాస్త్రిలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను కలిసి సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్‌తో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని సీఎంతో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ మరోమారు భరోసానిచ్చారు. చదవండి: తెలుగు నేలపై విరిసిన పద్మాలు -
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ నుంచి ఫస్ట్ సింగిల్, ఆకట్టుకుంటున్న లిరిక్స్..
మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్.. ఎయిర్ ఫ్రీయా.. నో.. నీరు ఫ్రీయా.. నో.. ఫైర్ ఫ్రీయా.. నో.. నువ్ నుంచున్న జాగా ఫ్రీయా.. అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్.. జన్మించినా మరణించినా అవదా ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
సిద్ శ్రీరామ్ పాడిన అమ్మా వినమ్మా.. సాంగ్ విన్నారా?
Akhil Akkineni releases Amma song From Sharwanand Movie: ‘అమ్మా.. వినమ్మా’ అంటూ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా, అమల కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అమల, శర్వానంద్ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
సిరివెన్నెల చివరి పాటపై సాయి పల్లవి భావోద్వేగం
Sai Pallavi Emotional On Sirivennela Seetharama Sastry Last Song: ప్రముఖ సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. హీరో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. నేడు ఈ పాటను విడుదల చేశారు శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సాయి పల్లవి. చదవండి: పుష్ప ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్ Sirivennela Seetharama Sastry Garu, Every word that you’ve ever written carries your soul and You’ll forever live in our hearts♥️#Sirivennela Lyrical Song from #ShyamSinghaRoy https://t.co/0RAM2tShHH@NameisNani @MickeyJMeyer @anuragkulkarni_ @Rahul_Sankrityn @NiharikaEnt — Sai Pallavi (@Sai_Pallavi92) December 7, 2021 ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్’ అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేయటర్లోకి రానుంది. ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. తేనెలో తీయదనం సహజంగా ఉన్నట్టే, సిరివెన్నెల సాహిత్యంలో హాయిదనం ఉంటుందని ఈ పాట మరోసారి నిరూపించింది. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ -
గుండెలను హత్తుకుంటున్న ‘సిరివెన్నెల’చివరి పాట
ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే ఈ పాట సిరివెన్నెలను మరోసారి స్మరించుకునేలా చేసింది. ఈ అద్భుత మెలోడీకి మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. -
అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్ఎంఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
సిరివెన్నెల తన మరణాన్ని ముందుగానే ఊహించారు: డైరెక్టర్
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు అందాన్నే కాక గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు సినీ పాటకు విశ్వ ఖ్యాతిని తెచ్చిన సిరివెన్నెల అస్తమయాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం అందరి హృదయాల్లో సజీవంగా మిగిలిపోనున్నాయి. ఆయన రాసిన పలు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలు రాస్తున్న క్రమంలోనే తన మరణాన్ని ఊహించినట్లున్నారు సిరివెన్నెల. ఇదే నా చివరి పాట అని రాహుల్‌తో అన్నారట! తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫోన్ చేసి తన ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నాను.. ఇంకెవరితోనైనా రాయిద్దాం అన్నారు. పర్లేదు సర్ అన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. ఆయన ఫోన్ చేసి పల్లవి అయిపోయింది చెప్తాను రాస్కో అన్నారు. నేను వెంటనే పక్కనున్న మహాభారతం పుస్తకంలో పల్లవి రాశాను. అందులో మొదటి వాక్యంలో సిరివెన్నెల తన పేరు రాశారు. ఎందుకుసార్ ఈ పాటకు సంతకమిచ్చారని అడిగితే.. బహుశా ఇదే నా ఆఖరి పాట అవచ్చు అని గట్టిగా నవ్వారు... ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది, అందుకే ఈ సాంగ్‌కు ఆయన పేరే పెట్టాం' అని చెప్పుకొచ్చాడు. హీరో నాని మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. -
సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా?
Mohan Babu Explains Why He Not Attend Sirivennela Sitarama Sastry Cremation: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అక్షర శిల్పికి టాలీవుడ్ కన్నీటీ వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదలివచ్చి ఆయనకు తుది వీడ్కోలు చెప్పారు. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, రాజశేఖర్, తివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్, వరుణ్‌సందేశ్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్, శివబాలాజీ, నరేశ్, జగపతిబాబుతో సహా నటీనటులు, క్యారెక్టర్ అర్టిస్టులతో పాటు సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హజరై నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన, ప్రముఖులు మరణించిన ముందుగా అక్కడ ఉండేది మంచు కుటుంబమే. ఏ కార్యక్రమైన విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబం తప్పకుండా హజరవుతారు. అలాంటిది తెలుగు పాటకు కోట కట్టిన సిరివెన్నెల వంటి వ్యక్తి మరణిస్తే మోహన్ బాబు, ఆయన కుటుంబం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఏమైంది, మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదంటూ పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మూవీ ఈవెంట్లో పాల్గోన్న మోహన్‌బాబు దీనిపై వివరణ ఇచ్చాడు. చదవండి: నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు ‘సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. ఇటీవల మా ఇంట్లో నా సొంత తమ్ముడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల గారు చనిపోయిన రోజే నా తమ్ముడి పెద్దకర్మ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్లకూడదు. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా. ఆ కారణంగానే ఆయన చివరికి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సినిమా పరిశ్రమలో ఇలా వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. -
సిరివెన్నెల అంత్యక్రియలు ఫోటోలు
-
సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా?
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’ అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ.. అంటూ భక్తిభావం కలిగించాడు. అర్ధశతాబ్దపు అజ్ఞాన్ని స్వతంత్రం అందామా అంటూ.. అగ్నిజ్వాలలను రగలించే పాటలను రాశారు. తెల్లారింది లెగండొయ్ అంటూ స్ఫూర్తిని నింపారు. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ ప్రేమగీతాలను రాశారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కేవలం ఒక్క జోనర్‌కు అని పరిమితం కాకుండా సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వంలో ఎన్ని విభాగాలు ఉంటే అన్నింటిలోనూ పాటలను రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో 3వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెలకు కొన్ని రకాల పాటలు రాయడం అస్సలు నచ్చదట. ఎంత డబ్బు ఇచ్చిన సరే అలాంటి పాటలు రాసేవాడు కాదట. ఈ విషయాన్ని సిరివెన్నెల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలను రాయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సిరివెన్నెల ఓ సందర్భంలో తెలిపారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు ‘సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై నన్ను పాటలు రాయమని చెప్పొద్దని డైరెక్టర్లు, నిర్మాతలకు చెప్పేవాడిని. నా అనుభూతుల్ని మాత్రమే పాటలుగా రాస్తాను. కఠినమైన పాట రాసేంత భాష నాకు రాదు. నాకు అష్టైశ్వర్యాలు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా నా పాటలు ఉండాలనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనైన నా పాటల్లో స్త్రీని కించపరచను. సినిమాలో ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే అవమానిస్తూ రాయడం నాకు ఇష్టం ఉండదు. నా పాటల్లో శృంగార రచనలు చేస్తాను.. కానీ అవి కుటుంబ సభ్యులతో కలిసి వినగలిగేలా ఉంటాయి. అంతేతప్ప అంగాంగ వర్ణనలు మాత్రం చేయను. ఇక కుర్రకారును రెచ్చగొట్టే పాటలు అస్పలు రాయను’ అంటూ ఆయన చెప్పకొచ్చారు. -
సిరివెన్నెల చివరి కోరిక ఏంటో తెలుసా?
తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట! తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల ఎంతగానో ఆశపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన 'కేక' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత 'ఎవడు' సినిమాలో విలన్‌గా, అనంతరం 'ఫిదా'లో వరుణ్‌తేజ్ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకి శాంతి చేకూరుతుందని, అది జరగాలని ఆయన అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. -
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్ 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి) ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం -
సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మృతిపై దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ షేర్ చేస్తూ సిరివెన్నెలకు సంతాపం తెలిపారు. తన ట్విటర్లో పోస్ట్ షేర్ చేస్తూ సిరివెన్నెలతో తన జర్నీని పంచుకున్నారు. ‘‘1996లో మేము ‘అర్దాంగి’ అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రి గారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికీ నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి పది గంటలకు ఆయన ఇంటికి వెళ్లాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగాడు. ఒక కొత్త నోట్‌బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్లల్లో ఆనందం. మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను. ‘సింహాద్రి’ చిత్రంలో ‘అమ్మాయినా.. నాన్నయినా.. లేకుంటే ఎవరైనా’ పాట, ‘మర్యాద రామన్న’లో ‘పరుగులు తియ్’ పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవడం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్లీ ఆయనే ‘ఐ లైక్ దిస్ ఛాలెంజ్’ అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరేసుకుంటూ అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ ఆయన స్టైల్లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. చివరగా ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో దోస్త్ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాం. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. ఇది ఆయనతో నాకున్న గొప్ప జ్ఞాపకం. నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్తి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ’’ అంటూ రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. pic.twitter.com/CmBx0ZvXj6 — rajamouli ss (@ssrajamouli) November 30, 2021 -
స్వర్గంలో మనిద్దరం ఓ పెగ్గేద్దాం : ఆర్జీవీ
Ram Gopal Varma Condolence On Sirivennela Sitaramasastry: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గర్వపడే రచయితల్లో ఒకరిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు వేలకుపైగా పాటలు రాసిన ఆయనకు పలువురు దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులతో అమితమైన అనుబంధం ఉంది. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. రామ్ గోపాల్ వర్మకు సిరివెన్నెలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. వర్మ తొలిచిత్రం శివలో అన్ని పాటలు సీతారామ శాస్త్రితోనే రాయించారు. శివ సినిమాలోని 'బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది' అనే పాట అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోను సిరివెన్నెలతో పాటలు రాయించుకోవడం మాత్రం మానలేదు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. 'శివ చిత్రం చేస్తున్నప్పుడు కవిత్వం బుకీష్ వర్డ్స్ లేకుండా కాలేజ్ విద్యార్థులు మాట్లాడుకునేలా పదాలతో సాంగ్ రాయమని అడిగితే రెండు మూడు సెకన్లలో 'బోటని పాఠముంది' అని మొదలుపెట్టారని వర్మ గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి మెమోరీస్‌కి వెళ్తే ఎన్నో పాటలు ఉన్నాయన్నారు. ఆయన మరణించడం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. 'అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోతారు. కానీ ముందు తరాలకు ఒక మార్గదర్శకునిగా రచయితలకు ఒక గురువుగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు.' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 'మీరు ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్ రాసారు కాబట్టి కచ్చితంగా స్వర్గానికి వెళ్లుంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హలో చెప్పండి. కానీ నేను ఎక్కవ పాపాలు చేసి నరకానికి వెళ్తాను. పొరపాటున స్వర్గానికి వస్తే మాత్రం మీరెలాగో నాతో వోడ్కా తాగరు. కాబట్టి అమృతం ఓ పెగ్గేద్దాం అని ఆడియో క్లిప్ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. Sitarama Shastry Garu pic.twitter.com/QfC7Gjakvc — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/wI8YvnZnbJ — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/mAre93cFl9 — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 pic.twitter.com/M0Z0HUu4a2 — Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021 -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
‘సిరివెన్నెల‘ సీతారామశాస్త్రికి ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వాయిదా.. ఎందుకో తెలుసా ?
RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్‌కు 'ఆర్ఆర్ఆర్' టీం రిప్లై.. -
సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..
Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరాలు అందించారు. 2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్ స్వరాలు సమకూర్చారు. 3. మూడోసారి హైట్రిక్గా కే. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 4. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది. 5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది. 6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది. 8. సుమంత్ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది. 9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు) 11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా) వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు -
ఇక సెలవు.. మహాప్రస్థానంలో ముగిసిన 'సిరివెన్నెల' అంత్యక్రియలు
Sirivennela Sitaramasastry: అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన సిరివెన్నెల అంతియాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సిరివెన్నెల ఇక మనమధ్య లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నసిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించిన ఆయన సిరివెన్నెల సినిమాతో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ఇప్పటివరకు మూడువేలకు పైగా పాటలు రాశారు. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. -
కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం
కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్‌ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి? సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్ -
తనకు ఆ సమస్య ఉందని తెలిసి బాధపడ్డ సిరివెన్నెల
Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’ అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదువు అక్కడే సాగింది. కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్ చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్బీబీఎస్లో చేరారు. అయితే ఎమ్బీబీఎస్లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్బీబీఎస్లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్బీబీఎస్లో చివరి బెంచ్ దొరికింది. పైగా లెక్చరర్స్ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు. చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్ సమస్య, ఐ సైట్... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్బీబీఎస్కి ఫుల్స్టాప్ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది. తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్ ఆయన్ను కలవాలనుకున్నారు. అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’ ‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డ్ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్–సిరివెన్నెల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. మూడు దశాబ్దాల్లో ... ఒక్క విశ్వనాథ్ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు. ‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్ సింగరాయ్’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’. -
ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి
Google India Tribute To Sirivennela Sitaramasastry: జగమంత కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఒంటరి చేసి లోకాన్ని విడిచిపెట్టారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 'సిరివెన్నెల' సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని, సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మెలోడీలు, జాగృతం, జానపదం , శృంగారం, విప్లవాత్మక గీతాలను అందించారు. ఆయన పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత సిరివెన్నెల. సిరివెన్నెల సీతరామ శాస్త్రి కలం సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అలాంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం సాహిత్యాభిమానులు, ప్రేక్షకులు, సినీ పెద్దలు, రాజకీయనాయకులు ఒకరేంటీ యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆ దిగ్గజ కవితో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. 'సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. 'ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్లో రాసుకొచ్చింది. Ok Google, play Sirivennela songs 😞💔 "సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌 — Google India (@GoogleIndia) November 30, 2021 ఇది చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత -
సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్/సాక్షి, అమరావతి: అక్షర యోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు సాయివెంకటయోగేశ్వరశర్మ తండ్రి చితికి నిప్పంటించారు. మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానానికి సిరివెన్నెల అంతిమయాత్ర మొదలైంది. అభిమానులు సిరివెన్నెల పాటల్ని తలచుకుంటూ ఆ వాహనం వెంట సాగారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో వేద పండితులు అంత్యక్రియల ప్రక్రియను పూర్తిచేయించారు. సిరివెన్నెలకు నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు పేర్ని నాని, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఆయన్ని కోల్పోవడం యావత్ తెలుగు ప్రజలకు బాధాకరమని పేర్కొన్నారు. సిరివెన్నెలతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుని నేపథ్యగాయకుడు మనో, మరికొందరు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు నిర్మాత సురేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటులు బ్రహ్మనందం, రఘుబాబు, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు. . సీఎం జగన్‌కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించడమేగాక ఆస్పత్రి ఖర్చులను భరిస్తుండటంపై ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మంగళవారం ఉదయమే మాకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, ఆస్పత్రి ఖర్చులు భరిస్తామన్న విషయాన్ని తెలపాలని సీఎం జగన్ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు సిరివెన్నెల మంగళవారం కన్నుమూశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తమ సంతాపాన్ని ప్రకటించారు. అంత్యక్రియలకు ఏపీ సమాచారశాఖ మంత్రి హాజరయ్యారు. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేం కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం..’ అని సిరివెన్నెల పెద్ద కుమారుడు సాయియోగేశ్వరశర్మ, ఇతర కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి – అధికారులకు సీఎం జగన్ ఆదేశం ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ ఈ ఆదేశాలిచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు.. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆ కుటుంబంపై పడకుండా చూడాలన్న సీఎం జగన్ సూచనల మేరకు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించి, మొత్తం ఖర్చులను సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్లో స్థానిక కవులు సత్కరించారు. ‘సిరివెన్నెల’గా మారిందిక్కడే.. సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్‌లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు. ►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు. ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో.. సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది. – దాట్ల దేవదానంరాజు, కవి, యానాం అలా పరిచయం చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం. – డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్) మాది 40 ఏళ్ల స్నేహబంధం సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత రాజమహేంద్రవరంతో అనుబంధం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్‌బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్‌బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్‌బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా కన్నీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల చిత్రం షూటింగ్లో సీతారామశాస్త్రి తదితరులు ఆయనతో పరిచయం మరువలేనిది ‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు. – ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం -
అభిమానిని వియ్యంకుడిని చేసుకున్న ‘సిరివెన్నెల’
Nanduri Ramakrishna Remembers His Relation With Sirivennela Seetharama Sastry: విశాఖకు చెందిన సాహితీవేత్త నండూరి రామకృష్ణతో సిరివెన్నెలకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహబంధాన్ని కుటుంబ బంధంగా మార్చుకున్నారు. తన కుమార్తె లలితా దేవిని నండూరి రామకృష్ణ తనయుడు వెంకట సాయిప్రసాద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 2001 మే 8న విశాఖలో ఈ వివాహం జరిగింది. ప్రస్తుతం అల్లుడు, కూతురు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. విశాఖ వెళ్లిన ప్రతిసారీ వియ్యంకుడు రామకృష్ణతో పాటు విశాఖలోని పలువురి స్నేహితులతో కాలక్షేపం చేసేవారు ‘సిరివెన్నెల’. అభిమాని నుంచి వియ్యంకుడిగా..‘సిరివెన్నెల’తో తన అనుబంధం గురించి నండూరి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘నాకు 1977 నుంచి సీతారామశాస్త్రితో సాన్నిహిత్యం ఉంది. ఆయన రచనలపై అభిమానంతో 1977లో ఆయన్ని తొలిసారి చెన్నైలో కలిశాను. ఆయన్ని కలిసేందుకు చెన్నై వచ్చానని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు. 1995లో ‘గాయం’ సినిమా రివ్యూ సమయంలో ఆయన ఏయూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సిరివెన్నెలతో పాటు వెన్నెలకంటి, వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు నాకు సాహిత్యంలో ప్రవేశం ఉండటంతో ఆ తరువాత అనేక సాహిత్య సమావేశాల్లో ఆయనతో స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం దక్కింది. 2001కి ముందు జరిగిన నా కుమారుడు నండూరి సాయిప్రసాద్ ఒడుగు ఫంక్షన్‌కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా మా కుమారుడుకి ఆయన కూతురు లలితా దేవితో వివాహం జరిగింది. దీంతో ఆయన అభిమాని అయిన నేను వియ్యంకుడయ్యాను. సీతారామశాస్త్రి విలువలు కలిగిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో ఏనాడూ చోటు లేదు. ఇలాంటి మనిషిని కోల్పోవడం మా కుటుంబానికే కాదు సమాజానికీ తీరని లోటు’’ అన్నారు. చదవండి: ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి -
Sirivennela Sitarama Sastry: 16 ఏళ్ల వయసులో పెళ్లి.. తను నా బెటర్ త్రీ ఫోర్త్!
Sirivennela Sitarama Sastry Heart Touching Words About Wife Old Interview: మామూలుగా జీవిత భాగస్వామిని ‘బెటరాఫ్’ అంటుంటాం. సిరివెన్నెల తన సతీమణికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారు. ‘పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు, బెటర్ త్రీ ఫోర్త్’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ‘‘ఆమె నా పాట... నా భార్య, నా పాట ఎప్పుడూ బోర్ కొట్టవు. ‘నువ్వు సీతారామశాస్త్రి మాత్రమే.. నీ జీవితానికి నిజమైన సిరివెన్నెల పద్మ’’ అని ప్రముఖ గాయని జానకిగారు నాకు చెప్పిన మాట అక్షరాలా నిజం. నన్ను, నాకుటుంబాన్ని పద్మ చూసుకుంటూ, అందరి బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా ఆనందాలను కోల్పోయింది. నా జగమంత కుటుంబాన్ని తానే మోసి నన్నెప్పుడూ ఏకాంతంగా ఉంచి, ప్రొఫెషన్‌కి అంకితం అయ్యేలా చేసింది. అలాంటి పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు... బెటర్ త్రీ ఫోర్త్’’ అని ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ఆమే ఆయన పాటకు తొలి శ్రోత పదహారేళ్ల వయసులో ‘సిరివెన్నెల’ చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు వేశారు పద్మావతి. సిరివెన్నెలతో తన జీవితం గురించి ఆ ఇంటర్వ్యూలో పద్మావతి మాట్లాడుతూ – ‘‘మాదీ, సీతారామశాస్త్రిగారిదీ అనకాపల్లే. నాకు సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. లంచ్ బ్రేక్‌లో ఇంటికి వచ్చినప్పుడు రేడియోలో వచ్చే పాటలు విన్నాకే స్కూలుకెళ్లేదాన్ని. పాటలంటే అంత ఇష్టం ఉన్న నేను సినిమా పాటలు రాసే వ్యక్తితో జీవితం పంచుకుంటానని అనుకోలేదు. పెళ్లి చూపుల్లో సీతారామశాస్త్రిగారు నన్ను చూశారు కానీ నేను బిడియంతో తలెత్తి చూడలేదు. పెళ్లి పీటల మీదే ఆయన్ను చూశాను. మా మామగారు లేకపోవడంతో ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలూ శాస్త్రిగారివే. పెళ్లి తర్వాత ఆయన భాగస్వామిగా అన్ని బాధ్యతలు నాకూ వచ్చాయి. ఇంటి బాధ్యతల్లో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. మా అత్తగారి (సుబ్బలక్ష్మి) సలహాలు తీసుకుని అన్నీ నేనే చూసుకున్నాను. మావారు ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకు సీతారామశాస్త్రిగారిని గేయ రచయితగా కె. విశ్వనాథ్‌గారు నిర్ణయించినప్పుడు మేం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘సిరివెన్నెల’ చిత్రం విడుదల వరకూ అనకాపల్లిలో ఉండేవాళ్లం. ఆ సినిమా హిట్ తర్వాత శాస్త్రిగారికి ఎక్కువ అవకాశాలు రావడంతో మద్రాసుకు (చెన్నై) షిఫ్ట్ అయ్యాం. మా అత్తగారి సహకారంతో ఇల్లు, పిల్లల చదువులన్నీ నేనే చూసుకున్నాను. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌కి వచ్చాం. ఆయన రాసిన ప్రతి పాటను ముందు వినేది నేనే. ఆయన రాసిన ప్రతి చిన్న కాగితం జాగ్రత్తగా దాస్తాను. ఆయన రాసిన పాటలతో మా ఇంట్లో నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాను’’ అన్నారు. చదవండి: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ.. -
Sirivennela: మహాప్రస్థానంలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
Live Updates: Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్ చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. ►రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు. సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు అది ఊహించడమే కష్టం: మహేశ్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు. అందుకే విష్ణు రాలేదు: నరేశ్ 'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు. ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్ కౌసల్య సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్ సునీత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు. శకం ముగిసింది: అల్లు అరవింద్ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ నివాళులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ 'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ 'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి 'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు. గుండె తరుక్కుపోతుంది: పరుచూరి 'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు. సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్ 'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్ 'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్ మారుతి 'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి 'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం
Sirivennela Seetharama Sastry Passed Away: నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసి పెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ‘కొండతల్లి నేలకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్టదాహం’... కవి ఊహ అది. సిరి ఉన్న కవి ఊహ. ‘గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా’.. ఓహో.. ఏమి ఇమేజరీ. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇంత సరళమా పల్లవి? ‘పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ’ ఈ చేదు వాస్తవం పలకనివాడు కవి ఎలా అవుతాడు? ‘ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం’ ఈ హితం చెప్పే కవి లేని సమాజం అదేల? సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ కవిగా చిరాయువును పొందారు. ఆయన రాజకీయ భావాల పట్ల అభ్యంతరాలు ఉన్నవారు సైతం ఆయన పాటను ఆనందించారు. ఆస్వాదించారు. సిరివెన్నెల పండిత కవి. తెరపై పండు వెన్నెల కాయించిన కవి. ఆయనకు నివాళి. ‘బటర్‌ఫ్లై’ ఎఫెక్ట్ అంటే? ఇక్కడ జరిగే ఘటన ఎక్కడి ప్రతిఫలనానికో అని. భలేవాడివే. అది విధాత తలంపు కదా. 1980.. ‘శంకరాభరణం’ రిలీజైంది. ఊరూవాడా సంబరాలు. సన్మానాలు. కాకినాడకు యూనిట్ వస్తోందట. సన్మానం చేయాలట. ఆ ఊళ్లో అప్పటికి ఒక బుల్లి కవి ఉన్నాడు. ప్రతి సాహిత్య సభలో ప్రారంభ గీతాన్ని పాడుతూ ఉంటాడు. ‘అతణ్ణి అడుగుదాం... విశ్వనాథ్‌ని కీర్తిస్తూ ఒక పాట కట్టమందాం’ అనుకున్నారు మిత్రులు. ‘నేను విశ్వనాథ్ మీద కట్టను. వ్యక్తి మీద పాట ఏమిటి? శంకరాభరణం సినిమా మీద కడతాను. తెలుగువారి కళాదృష్టి దాహార్తిని తీర్చడానికి గంగలా ఆ సినిమా అవతరించింది. కనక గంగావతరణం పేరుతో గేయం రాస్తాను’ అన్నాడా కవి. రాశాడు. సన్మానం జరిగే రోజు వచ్చింది. యూనిట్‌ని చూడటానికి జనం విరగబడితే పోలీసులు ఈ బుల్లి కవిని లోపలికి పంపలేదు. కవికి అహం ఉంటుంది. ‘నా పాట వినే అదృష్టం విశ్వనాథ్‌కు లేదు’ అనుకుంటూ అక్కణ్ణుంచి వచ్చేశాడు. అంతేనా? ‘నా పేరు ఎప్పటికైనా అతనికి తెలుస్తుంది’ అనుకున్నాడు. నిజంగానే తెలిసింది కొన్నాళ్లకు. సిహెచ్.సీతారామశాస్త్రి. చెంబోలు సీతారామశాస్త్రి. ‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’... అని రాశాడు వేటూరి ‘సాగర సంగమం’లో. ‘శంకరా నాద శరీరాపరా’ అని కూడా రాశాడాయన ‘శంకరాభరణం’లో. కె.విశ్వనాథ్‌కు నిజంగా తన సినిమాలో ‘గంగావతరణం’ పెట్టాల్సి వస్తే వేటూరి సంతోషంగా రాసేవాడు. విశ్వనాథ్ సినిమాలకు వేటూరిది సింగిల్ కార్డ్. కాని ‘జననీ జన్మభూమి’లో ఆ సింగిల్ కార్డ్‌కు తోడు సిహెచ్ సీతారామ శాస్త్రి అనే పేరు తోడయ్యింది. ఆ సినిమాలో ‘గంగావతరణం’ అనే చిన్న డాన్స్ బ్యాలేకు సీతారామశాస్త్రి గతంలో రాసిన ‘గంగావతరణం’లోని కొన్ని పంక్తులను వాడారు. అలనాడు కాకినాడలో సీతారామశాస్త్రి రాసిన గేయం ఆ నోట ఈ నోట విశ్వనాథ్ దాకా వెళ్లి అది విని ఆయన ముచ్చటపడి సినిమాలో వాడాల్సి వచ్చింది. తెలుగు తెర మీద సీతారామశాస్త్రికి అది తొలి పాట లెక్క ప్రకారం. అంతటితో ఆ పాట ఆగిపోయేదేమో. కాని కొనసాగాల్సి వచ్చింది. ఎందుకంటే అలా కొత్త కవి చొరబాటుకు వేటూరి అలిగాడు. ‘ఇక విశ్వనాథ్‌కు పాటలు రాయను’ అన్నాడు. విశ్వనాథ్‌కు అప్పటికి సీతారామశాస్త్రి చేత రాయించాలని లేదు. సీతారామశాస్త్రి ఎవరో కూడా ఎప్పుడూ చూళ్లేదు. దాంతో ఆయన ‘స్వాతిముత్యం’ సినిమాకు సినారెను, ఆత్రేయను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘సిరివెన్నెల’ తీయాలి. ఇటు చూస్తే తనకు అలవాటైన వేటూరి అలిగి ఉన్నాడు. అటు చూస్తే సీనియర్లు తనకు ఎక్కువ టైమ్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఏం చేయాలి? బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే. ఎవరో అలిగారు. సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’ వచ్చింది. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం’.. 1985 అక్టోబర్ 4న అఫీషియల్‌గా సీతారామశాస్త్రి తొలి పాట రికార్డ్ అయ్యింది. పాడటానికి వచ్చిన బాలూ ఆ వొత్తుజుట్టు, దళసరి కళ్లద్దాలు, పలుచటి శరీరం ఉన్న కవిని చూసి ‘మీరు కవిగా అమిత శక్తిమంతులు. రాబోయే దశాబ్దాలు మీవే’ అన్నాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు సీతారామశాస్త్రి పాట సాగిపోయింది. మొదటి సినిమాలోనే ప్రశంసల వెన్నెల కురిసింది. ఇంటి పేరు సిరివెన్నెల అయ్యింది. మద్రాసులో ఈ క్షణం కోడంబాకంలో కబురు పుడితే మరునిమిషం అది తడ దాకా పాకుతుంది. ఎవరో కొత్త కవి అట. సీతారామశాస్త్రి అట. విశ్వనాథ్‌కు రాస్తున్నాడట. నిజమే. మరి మసాలా పాట రాస్తాడా? వెళ్లిన వాళ్లకు ఆ కవి చెప్పిన జవాబు.. పెట్టిన షరతులు మూడు. 1. స్త్రీలను కించ పరచను 2. సమాజానికి చెడు సందేశాలు ఇవ్వను. 3. యువతకు కిర్రెక్కించే పాట రాయను. విన్న నిర్మాతలు సడేలే అనుకుని ముఖం తిప్పుకుని పోవడం మొదలెట్టారు. కాని సుకవి సుగంధం, సత్కవి మకరందం ఎవరు వదలు కుంటారు. ‘శృతిలయలు’ విడుదలైంది. అంతవరకూ ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తన అందులో ఉంది. ‘తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ’... ఈ కీర్తనను వెతికి పట్టాడంటే విశ్వనాథ్ ఎంత గొప్పవాడవ్వాలి. ఆ తర్వాత ‘నంది’ అవార్డులకు ఆ పాట వస్తే జడ్జిగా ఉన్న సి.ఎస్.రావు ‘ఏమయ్యా... ఇప్పుడు అన్నమయ్యకు నంది అవార్డు అవసరమా’ అనంటే ‘అది సీతారామశాస్త్రి రాసిన పాటండీ’ అని చెప్పారు. అన్నమయ్య రాసేడా అనిపించేలా సీతారామశాస్త్రి రాసిన పాట. ‘నంది’ ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. రాంగోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్. కనుక గొప్పవాళ్లే తన సినిమాకు పని చేయాలనుకున్నాడు. సీతారామశాస్త్రితో కాలేజీ పాటా? బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా? మిగిలిన సినిమా అంతా కుర్రకారు ఎంత ఉద్వేగంగా చూశారో ఈ పాటకు అంత ఉత్సాహంగా టక్కులు ఊడబెరికి గంతులేశారు. అయినా సరే.. ‘కమర్షియల్ సాంగ్’ అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రిగారు ఆ ఒక్క తరహా కూడా రాసేస్తే? రాయలేడా ఆయనా? ‘బొబ్బిలి రాజా’ వచ్చింది. ‘బలపం పట్టి భామ బళ్లో.. అఆఇఈ నేర్చుకుంటా’... పాటా సినిమా సూపర్‌డూపర్ హిట్. ఇప్పుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సమగ్ర సినీ కవి’ అయ్యాడు. హంసలా బతకాలని నిశ్చయించుకోవాలే గాని బతకొచ్చు. కాకిలా కశ్మలంలో వాలాలనుకుంటే వాలొచ్చు. చాయిస్ మనదే. నిర్ణయం తీసుకుంటే అలా బతికే వీలు ప్రకృతి కల్పిస్తుంది. ‘శుభ్రమైన పాట’ రాయాలని సీతారామశాస్త్రి అనుకున్నాడు. దారిన వెళుతుంటే అదిగో ఆ మంచి పాట రాసింది అతనే అనుకోవాలి... ఏదైనా సభకు పిలవాలి... ఎదుటపడితే నమస్కారం పొందేలా ఉండాలి... ‘శాస్త్రిగారు’లా ఉండాలి... ‘గాడు’... పేరు చివర పొరపాట్న కూడా పడకూడదు. ఆయన తన తుదిశ్వాస వరకూ ‘శాస్త్రిగారు’గానే ఉన్నాడు. పల్లవి మర్యాద. చరణం గౌరవం. కాంటెక్స్›్టలో పెట్టి చూపితే తప్ప సిరివెన్నెల గొప్పతనం అర్థం కాదు. గండు చీమ, బెల్లం, ఒడి, తడి, గొళ్లెం, తాళం వంటి పదాలు పాటలుగా చెలామణి అవుతున్న రోజుల్లో ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ రాయడం కోసం కలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవడం సిసలైన వ్యక్తిత్వం. అసలైన సంస్కారం. సరే. ఈ కవి పండితుడు కదా. ఈతనికి గ్రామీణుడి పదం తెలుసా... జానపదుని పాదం తెలుసా? ‘స్వయం కృషి’ విడుదలైంది. ‘సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి’ రాశాడు. ‘రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అని జానపద శృంగారం ఒలికించాడు. ‘ఆపద్బాంధవుడు’లో? ‘ఔరా అమ్మకచెల్ల... ఆలకించి నమ్మడమెల్లా... అంత వింత గాధల్లో ఆనందలాల’ రాశాడు. ‘శుభసంకల్పం’లో ‘నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే’ అని బెస్తపడవలో మీన మెరుపు వంటి పదాలను అల్లాడు. సిరివెన్నెలకు రాని విద్య లేదు. పాట వచ్చి దాని మీద కేవలం డబ్బు సంపాదించేవాడు సగటు కవి అవుతాడు. దాని ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని తపించేవాడు ఉదాత్త కవి అవుతాడు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని రాశాడు సిరివెన్నెల. సమాజంలో పాలకుల్లో ఎంత పెడధోరణి ఉన్నా ఎన్ని అకృత్యాలు సాగుతున్నా ‘మనకెందుకులే’ అని సాగిపోయే జనం ఈ పాటను విని భుజాలు తడుముకున్నారు. తమ నిస్సహాయతకు సిగ్గుపడ్డారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటు ఇటు ఎటో వైపు’ అని ‘అంకురం’లో రాశాడు. ఒక్కళ్లే నడవడానికి భయమా? ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి’ అని చెప్పాడు. ఎంత ధైర్యం ఇలాంటి కవి పక్కన ఉంటే. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది’ అన్నాడు ‘రుద్రవీణ’లో. ‘రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే’ అని ఈసడిస్తాడు. ‘నిత్యం కొట్టుకుచచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా’... అని ఆయన ఈ దేశపు వర్తమానాన్ని ఎద్దేవా చేస్తాడు. ఒక్క పాట వేయి మోటివేషనల్ స్పీచ్‌లకు సమానం. నిరాశలో కూరుకుపోయి, నిర్లిప్తతలో కుదేలైన వారికి లే.. లేచి నిలబడు అని ఉపదేశం ఇచ్చినవాడు సిరివెన్నెల. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అన్నాడు. సిరివెన్నెలకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసు కలిగిన తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. జీవచ్ఛవంలా మారిన తల్లి. వారి కోసం బతికాడు సిరివెన్నెల. అందుకే– ‘నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బతుకు అంటే నిత్యఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకంటే సైన్యముండునా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’... అని రాశాడు. ‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అని ‘శ్రీకారం’ కోసం ఆయనే రాశాడు. ‘భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి... తెల్లారింది లెగండోయ్’ అని కోడికూతను వినిపించాడు. ‘ఒరే ఆంజనేయులు... తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడుకు గోలీమార్’... అని ‘అమృతం’ టైటిల్ సాంగ్. రోజూ వింటే బి.పి ట్యాబ్లెట్ అవసరం రానే రాదు. ‘నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను’ అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసిపెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించి పంపాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ఉపదేశం ఇచ్చే కవి ఊరికే ఉంటాడా? ‘దేవుడా.. ఈ లోకాన్ని మార్చు’ అని పాట వినిపించడూ? అందాక ఆ కవిని గౌరవించడానికి ఆయన మంచిపాటలు పాడుకుందాం. ఈ జగత్తు మనదిగా అనుకోవాలి. జనులందరి బాగు కోరుకోవాలి. మనల్ని బాధించే మోహాల దాహాల ఒంటరి నిర్మోహత్వాన్ని సాధన చేయాలి. సిరివెన్నెల పాట చిరాయువుగా ఉండాలి. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె... సన్యాసం శూన్యం నాదె... ప్రముఖుల నివాళి బహుముఖ ప్రజ్ఞ, సాహితీ సుసంపన్నత సిరివెన్నెల రచనల్లో ప్రకాశిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి శాస్త్రి ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేనూ ఒకణ్ని. 2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి. సాహితీ విరించి సీతారామశాస్త్రికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు నా సానుభూతి. – ఎన్.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాల ద్వారా తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా ఉంటారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు. ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి, సాహిత్య అభిమానులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు స్వర్గస్తులు కావడం నాకు, తెలుగు సినిమా రంగానికి, జాతీయ భావజాలంతో కూడిన కవులు, కళాకారులకు ఎంతో లోటు. దేశభక్తిపై ఆయన రాసిన పాటలను సీడీ రూపంలో 15రోజుల క్రితం నన్ను కలిసి ఇచ్చారాయన. కోలుకుంటున్న సమయంలో స్వర్గస్తులు కావడం చాలా దురదృష్టకరం. నా భావజాలం జాతీయ భావజాలం అని స్పష్టంగా చెప్పేవారు ఆయన. – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినప్పుడు కుడి భుజం పోయిందనుకున్నాను. సిరివెన్నెల మృతితో ఎడమ భుజం కూడా పోయింది. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునేవాళ్లం.. ఒక్కసారిగా దూరమయ్యాడంటే నమ్మశక్యం కావడం లేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలి.. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – కె.విశ్వనాథ్, దర్శకుడు సిరివెన్నెలగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫోనులో నాతో ఎంతో హుషారుగా మాట్లాడారు. నవంబరు నెలాఖరుకల్లా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనబడుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, సిరివెన్నెలగారు.. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. – చిరంజీవి, నటుడు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెలగారు. – బాలకృష్ణ, నటుడు సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు, సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. – మంచు మోహన్‌బాబు, నటుడు అందమైన పాటలు, పదాలను మాకు మిగిల్చి, మీరు వెళ్లిపోయారు. వాటి రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. – నాగార్జున, నటుడు బలమైన భావాన్ని.. మానవత్వాన్ని.. ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సీతారామశాస్త్రిగారు. ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. – పవన్ కల్యాణ్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – మహేశ్‌బాబు, నటుడు అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. – ఎన్టీఆర్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని షాకయ్యాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి. – రామ్‌చరణ్, నటుడు గత శనివారం సిరివెన్నెలగారితో ఫోనులో మాట్లాడాను. ‘మీలాగ నేను కూడా ఓ పాట పరిపుష్టిగా రాయాలి’ అని ఆయనతో అంటే, ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.. నువ్వు రాయగలవు’ అన్నారు. మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంత గొప్పగా రాయాలని ఓ బెంచ్ మార్క్ సృష్టించారాయన. ఇంట్లో తండ్రిని చూసి పిల్లలు నేర్చుకున్నట్లు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నాలో ఆత్మ విశ్వాసాన్ని బలంగా నింపిన గురువు ఆయన. – రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత 1996లో ‘అర్ధాంగి’ సినిమాతో మేం సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’, ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తుతెచ్చుకుని పాడుకుంటే ధైర్యం వచ్చేది. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి. – రాజమౌళి, దర్శకుడు ‘సాహసం నా రథం. సాహసం జీవితం’.. పాట నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్పవరం. బాలూగారు మనకు దూరమైనా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’గారు కూడా మన గుండెల్లో నిలిచే ఉంటారు. – వీవీ వినాయక్, దర్శకుడు గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. – సుకుమార్, డైరెక్టర్ ∙ఇంకా అశ్వనీదత్, బీవీఎస్‌యన్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, వైవీఎస్ చౌదరి, మారుతి తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు -
Sirivennela Sitarama Sastry Demise: పాట విశ్రమించింది..
పదహారు కళల పౌర్ణమి వంటి పాట కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది. పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది. చలువ వెన్నెలలో మునిగి అలల మువ్వలను కూర్చి ఒక కలం గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని వీధి మలుపు తిరిగిపోయింది. కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది. తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు తెలిమంచులా కరిగిపోయింది. తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది. ‘అమ్మలాల.. పైడి కొమ్మలాల.. వీడు ఏమయాడె.. జాడ లేదియాల’... అయ్యో... కట్ట వలసిన పాట వరుస హార్మోనియం మెట్ల మీద పడి భోరున విలపిస్తూ ఉంది. -
‘సిరివెన్నెల’ గారు సాహిత్య పరిశోధకుడు: దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి
ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ పండితులను, పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు అయిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో), ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం నాకు కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి సినిమాల్లో అన్ని పాటలను ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందటం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. -
దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు
ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించారని.. అయినప్పటికి మరోసారి క్యాన్సర్ బారిన పడడంతో ఆపరేషన్ చేసి మరో ఊపిరితిత్తిలో సగభాగం తీసేసినట్లులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. అయితే సిరివెన్నెలకు సిగరేట్ అలవాటు ఉండడం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. సిరివెన్నెల గతంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మోకింగ్ అలవాటుపై కీలక విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచే స్మోకింగ్ అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. సరదాగా మొదలుపెట్టిన స్మోకింగ్.. వ్యసనంగా మారిందని చెప్పారు. నాకు అసలే అహంకారం ఎక్కువ.. అయినా సిగరెట్ ముందు ప్రతిసారి తలవంచుతున్నానని చెప్పారు. తన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెపినట్లు తెలిపారు. పబ్లిక్ తిరిగే ప్రాంతంలో కానీ, చిన్న పిల్లల ముందు కాని సిగరేట్ కాల్చొద్దని తనకు తానే ఓ రూల్‌ని పెట్టుకున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్యర్‌తో మరణించిన నేపథ్యంలో గతంలో స్మోకింగ్‌పై సిరివెన్నెల చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. -
సిరివెన్నెలను తలచుకుని కంట తడి పెట్టుకున్న చిరంజీవి
Megastar Chiranjeevi Emotional Words About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ముృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. (చదవండి: ఇప్పుడు నా కుడి భుజం పోయింది: కే. విశ్వనాథ్) అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్ భావోద్వేగం -
సిరివెన్నెల పాడిన చివరి పాట.. వీడియో వైరల్
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సిరివెన్నెల మృతిపూ సినీ సాహిత్య అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ అయితే సిరివెన్నెల చివరిసారిగా పాడిన ఓ స్ఫూర్తి గీతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాటను ఆయన స్వయంగా ఆలపించారు. సుమన్ హీరోగా నటించిన ‘పట్టుదల’ అనే సినిమాలోని ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సాహిత్యం అదించారు. ఆద్యంతం ఈ పాట మనిషి పట్టుదల వీడకూడదు.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదనే స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. -
సిరివెన్నెల మృతికి కారణాలు ఇవే
Sirivennela Seetharama sastry Death Reasons: ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకడంతో ఆపరేషన్ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకి చివరకు మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. -
ఇప్పుడు నా ఎడమ భుజం పోయింది: కే. విశ్వనాథ్
Director K Viswanath Emotional About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీతారామా శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు. (చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ -
సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్
Emotional Speech by Trivikram About Sirivennela Seetharama Sastry Old Video Viral: తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్తను సాహిత్య ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రి పాటలను తలచుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా సీతారామశాస్త్రి గురించి గతంలో తివ్రిక్రమ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో సిరివెన్నెలపై భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు త్రివిక్రమ్. ‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు.మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఎప్పుకోవద్దు అంటాడు. సింధూరం సినిమాలో ‘అర్థ శతాబ్దం అజ్ఞానాన్నే స్వతంతం అందామా’ అనే ఒక్క మాటతో నేను లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా.. ఎక్కడి వెళ్తున్నానో తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. -
అవార్డుల్లో రికార్డులు ‘సిరివెన్నెల’ సొంతం!
-
Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సిరివెన్నెల మరణం తీరని లోటంటూ సంతాపం వెలిబుచ్చారు. Heartbroken After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully Wil miss U Dearest Uncle Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics U r Irreplaceable — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 30, 2021 'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు — Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021 ప్రముఖ నటుడుప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?... విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. అలాగే నా తండ్రి తరువాత నన్నునడిపించిన ఏకైక వ్యక్తి మీరు .. మిస్ యూ అంకుల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) ‘పదం ఆయన ఆస్తి... జ్ఞానంతో ఆయనకు దోస్తీ ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (Sirivennela Seetharama Sastry చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? — dev katta (@devakatta) November 30, 2021 జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది... Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, — Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021 — Prakash Raj (@prakashraaj) November 30, 2021 The Lyrical Legend. It's deeply saddening to hear the demise of Sirivennela Seetharama Sastry Garu. There will never be one like him. There will never shine another star like the way he did. May his soul rest in peace — v e n u u d u g u l a (@venuudugulafilm) November 30, 2021 His words, his songs and his magic will live forever. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ.. — Nani (@NameisNani) November 30, 2021 Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. — RAm POthineni (@ramsayz) November 30, 2021 -
సిరివెన్నెలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న వార్త టాలీవుడ్లో విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించారు . ఆయన తల్లిదండ్రులు డాక్టర్ సి.వి.యోగి, తల్లి సుబ్బలక్ష్మి. కాకినాడలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకున్నా ఆయన , ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆయన కొంతకాలంపాటు టెలిఫోన్స్ శాఖలో పని చేశారు. ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాధ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు. సిరివెన్నెల చిత్రం సూపర్ హిట్ కావడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి గాంచారు. సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయనే రాశారు. ప్రతి పాట సూపర్ హిట్టయింది. సిరివెన్నెల సినిమాలోని... విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఆది భిక్షువు వాడినేది కోరేదీ, ఈ గాలీ ఈ నేలా...ఇలా ప్రతిపాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియుల మనసు దోచాయి. స్వయంకృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, శివ, క్షణక్షణం, గాయం , గులాబీ, మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, శుభసంకల్పం, పట్టుదల..ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతిపాటా ఆణిముత్యమే. పండితులను పామరులను ఆకట్టుకున్న అద్భుత కవితామృత గుళికలే. కె. విశ్వనాధ్, వంశీ, క్రాంతికుమార్, బాలచందర్, జంధ్యాల, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్‌వర్మ, సింగీతం శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, మణిరత్నం, వి.ఎన్ . ఆదిత్య, రాజమౌళి, పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీనువైట్ల, ఇంద్రగంటి......ఇలా...ఎంతో మంది దిగ్గజ దర్శకులనుంచి, కొత్త దర్శకులదాకా....అందరూ ఆయన పాటల పరిమళాల్ని ప్రజలకు పంచారు. 2019లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ఉత్తమ గేయ రచయితగా ఆయన పొందిన పురస్కారాలకు లెక్క లేదు. మొదట్లో భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు చేసిన సీతారామశాస్త్రి... ...సిరివెన్నెల సినిమా హిట్టుతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్నారు. -
సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..? సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్ ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్ ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి. సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్‌రెడ్డి ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్ రెడ్డి. -
టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత
సాక్షి; హైదరాబాద్: టాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. అప్పటివరకు తమతో ఉన్న తోటి నటులు, కళకారులు వివిధ కారణాలతో కన్ను మూయడం సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ(నవంబర్ 30) తుదిశ్వాస విడిచారు. నవంబర్ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు పాడవడంతో కన్నుమూశారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు నవంబర్ 27న గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క నాలుగు రోజుల్లోనే ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత -
గీత రచయిత ‘సిరివెన్నెల’ జ్ఞాపకాలు( ఫోటోలు)
-
సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఎన్నో వేల అద్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం. 1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల) 2. పారాహుషార్ (స్వయంకృషి) 3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ) 4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ) 5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం) 6. బోటనీ పాఠముంది (శివ) 7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1) 8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు) 9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం) 10. వారేవా ఏమీ ఫేసు (మనీ) 11. నిగ్గ దీసి అడుగు (గాయం) 12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా) 13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం) 14. తెలుసా మనసా (క్రిమినల్) 15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం) 16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం) 17. అర్ధ శతాబ్దపు (సింధూరం) 18. జగమంత కుటుంబం నాది (చక్రం) 19. సామజ వరగమన (అల వైకుంఠపురములో) 20. దోస్తీ (ఆర్ఆర్ఆర్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు. ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ మహర్షి - సాహసం నా పథం రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా క్రిమినల్ - తెలుసా మనసా పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చుక్కల్లారా.. చూపుల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’?
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ జగత్తంతా సిరివెన్నెల పరచిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మనకిక లేరు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న కారణజన్ముడు ఆయన. న్యూమోనియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తిరిగి రాని లోకానికి తరలి పోయారు. దీంతో త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి చేరుకుంటారన్న కోట్లాదిమంది ఆశలు అడియాశలయ్యాయి. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 — dev katta (@devakatta) November 30, 2021 విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల మూవీలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు. స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు. 1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు. ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం, చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తిఅయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం మూగబోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఆరేళ్ల క్రితం కేన్సర్‌ను గుర్తించారు. అప్పట్లోనే రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తొలగించారు. తర్వాత బైపాస్ సర్జరీ చేశారు. ఇటీవల రెండో ఊపిరితిత్తికీ కేన్సర్ సోకడంతో 50శాతం తొలగించాల్సి వచ్చింది. ఆక్సినేషన్ సరిగా లేకపోవడంతో ఆయన్ను గత 5 రోజుల నుంచి కిమ్స్‌లో ఎక్మోపై ఉంచా రు. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో పాటు ఇదే సమయంలో కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింది. కేన్సర్ కారణంగా రెండు ఊపిరితిత్తులు పాడైపోవడం, బైపాస్ సర్జరీ కావడంతో కోలుకోలేకపోయారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పద్మశ్రీ.. 11 నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్ పూర్తి చేసి ఆంధ్ర మెడికల్ కళాశాలలో మెడిసిన్ (బీడీఎస్)లో చేరారు. తండ్రి చనిపోవడంతో మెడిసిన్‌ను మధ్యలోనే ఆపేశారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జననీ జన్మభూమి’సినిమాతో కెరీర్ ప్రారంభించారు. కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’చిత్రానికి సీతారామశాస్త్రి అన్ని పాటలూ రాశారు. ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. సీతారామశాస్త్రి ఇప్పటివరకు సుమారు 800 సినిమాలకు దాదాపు 3,000 పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు అందుకున్నారు. ‘సిరివెన్నెల’కు భార్య పద్మావతి, కుమారులు సాయి వెంకట యోగేశ్వర శర్మ, రాజా భవానీ శంకర శర్మ, కుమార్తె లలితాదేవి ఉన్నారు. సిరివెన్నెల మరణవార్త విని సినీతారలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, సిరివెన్నెల మృతి పట్ల గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిరివెన్నెలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమవుతాడో తెలుసా?
Sirivennela Sitaramasastri And Director Trivikram Srinivas Relation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి -డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. స్వయంవరం సినిమాతో రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రివిక్రమ్.. నువ్వేకావాలి సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటివరకు మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు తన రైటింగ్ స్కిల్స్‌తో కొత్త దారిని పరిచయం చేశాడు. తేలికైన పదాలతోనే పవర్ఫుల్ పంచుడైలాగులు రాయడం ఆయన స్పెషాలిటీ. త్రివిక్రమ్ సినిమాల గురించి తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కెరీర్ పరంగా త్రివిక్రమ్ అప్పటికే రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రతిభతో పాటు అతని వ్యక్తిత్వం నచ్చిన సిరివెన్నెల స్వయంగా తమ ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారట. అయితే అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ ఆ అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లిని ఇష్టపడ్డాడట. ఇదే విషయాన్ని చెప్పగా, మొదట కాస్త సంశయించినా, తర్వాత అర్థం చేసుకొని వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే సౌజన్య. అలా వీరి పెళ్లి సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంటుంది. -
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వైద్యులు ఏమన్నారంటే..
Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
‘సిరివెన్నెల’కు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సిరివెన్నెల’న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఐసీయూలో ఉంచి ఊపిరితిత్తులకు సంబంధించి తగిన వైద్యం అందజేస్తున్నామని చెప్పాయి. అలాగే గడిచిన 24 గంటల్లో ‘సిరివెన్నెల’ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వెల్లడించాయి. -
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Sirivennela Sitarama Sastry: టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు లోనైన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్‌కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
గురు వెన్నెల
-
సాక్షితో సిరివెన్నెల చివరి ఇంటర్వ్యూ: ‘ఆ సమయంలో క్రిష్ మీద అలిగాను’
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్త్రి, క్రిష్‌లను సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.. ఆ వివరాలు.. క్రిష్: ‘వీడు పెద్ద దర్శకుడు కాబోతున్నాడు’ అని నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే సిరివెన్నెలగారు చెప్పినప్పుడు అందరూ అతిశయోక్తి అనుకున్నారు. నేను ఎవరో తెలియనప్పుడు, నేను ‘గమ్యం’ కథ రాసుకుని వెళ్లినప్పుడు ఆయన విని, కొన్ని సలహాలు ఇచ్చారు.. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయనతో పని చేసిన ప్రతిరోజూ ఓ అందమైన జ్ఞాపకం. సిరివెన్నెల: ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అతని (క్రిష్) సంస్కారం. రెండో ముక్కలో చెప్పాలంటే మన సంప్రదాయంలో గురు శిష్యుల బంధం గురించి శాంతి మంత్రం ఉంది. గురుశిష్యుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నా సిద్ధాంతం ప్రకారం శిష్యుణ్ణి గురువు తయారు చేయడు.. గురువును శిష్యుడు తయారు చేస్తాడు. వయసును బట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది.. బాధ్యతను బట్టి గురుపీఠం ఉంటుంది. తల్లీతండ్రి, ఉపాధ్యాయులతో ఉండే అనుబంధం రుణబంధం. దాన్ని గుర్తుంచుకోవడం శిష్యుడి సంస్కారం. అలాంటి ప్రతి శిష్యుడు గురువు అవుతాడు. సిరివెన్నెల: క్రిష్ నా వద్దకు వచ్చి ‘గమ్యం’ కథ చెప్పినప్పుడు ‘ఈ సినిమాకి పాటలు రాసేంత అవకాశం.. వ్యవదానం నాకు కనిపించడం లేదబ్బాయ్’ అన్నాను. ‘ప్రవచనాలకు సినిమా అనేది వేదిక కాదు.. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తే నేను ఓ విషయం చెబుతాను అన్నాను. తను చెప్పమనగానే.. ఇంత లోతైనటువంటి ప్రవచనాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.. ఒక వినోదంతో కలిగిన సందేశం ఉంటే బాగుంటుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నావు.. మిత్ర సమేతం కూడా ఉంటే బాగుంటుంది. లాజిక్కులు అడక్కు.. నువ్వు చేస్తే చెయ్.. లేకుంటే లేదు’ అన్నాను. ‘మీరు ఒక్కరు కన్విన్స్ అయితే చాలు.. అందుకు నేను ఏం చేయాలో చెప్పండి’ అన్నారు క్రిష్. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుమన్నాను.. నేను పూర్తిగా కన్విన్స్ అవడానికి చాలా సమయం పడుతుంది.. అప్పటి వరకూ నువ్వు సినిమా వాయిదా వేయాలన్నాను. వేరే ఎవరైనా అయితే ఒప్పుకునేవారు కాదు. కానీ తను ఎనిమిది నెలలు నా కోసం సినిమా వాయిదా వేశాడు. క్రిష్: ‘కృష్ణం వందే జగద్గురమ్’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు. సిరివెన్నెల: సినిమా అనేది మహాద్భుతమైన వేదిక అని తెలుసుకుని, దానిని వాడుకుంటున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి తక్కువవారిలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు దర్శకులు కె. విశ్వనాథ్‌గారికి, క్రిష్‌కు, మరికొంతమందికి (పేర్లు చెప్పకూడదు) రెండో వెర్షన్ ఇవ్వలేదు... ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే వారి ఒప్పుదల, నా శ్రమ ఎక్కడైతే ఏకీభవిస్తాయో అక్కడ ఓకే అన్నమాట. క్రిష్: ‘సిరివెన్నెల’గారు నాకు మొదట గురువుగారే. ఆ తర్వాత తండ్రి అయ్యారు. సిరివెన్నెల: సినిమా నన్ను ఎంటర్టైన్ చేయాలి.. అదే సమయంలో నన్ను నిద్రపుచ్చకుండా కూడా చూడాలి. అలాంటి సినిమాలను తీసే పని క్రిష్ చేస్తాడు. క్రిష్ కథల్లో కొందరు కమర్షియాలిటీ లేదంటుంటారు. ఎక్కువమంది ఒప్పుకుంటే అది కమర్షియాలిటీ అవుతుంది. రామాయణ, మహాభారతాలను మించిన కమర్షియాలిటీ కథలు ఇంకేమీ ఉండవు. క్రిష్: ‘కంచె’ అప్పుడు చాలామంది అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి కథను ఎవరు చూస్తారు? అసలు హిట్లర్‌కు మనకూ సంబంధం ఏంటీ? అన్నది వారి అభిప్రాయం. కానీ మన తెలుగు సైనికులు గ్రామాల నుంచి వేల సంఖ్యలో యుద్ధాలకు వెళ్లిన కథలను ఎవరూ చెప్పలేదు. ‘వేదం’ సినిమాలో రాముల కథ కావొచ్చు.. సరోజ కథ కావొచ్చు. నాదైన శైలి కథలను ప్రేక్షకులకు చూపిస్తూ సంతృప్తి చెందుతాను. సిరివెన్నెల: మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్ పాయింట్. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్ సెట్టర్. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్. మా ఇద్దరికీ ప్రపంచమే గురువు. క్రిష్: జీవితంలో మనం పరిపక్వత చెందుతూ ఉంటాం. అలాంటి జీవితంలో ఇలాంటి ఓ గురువు చేయి పట్టుకుని ఉంటే... జీవితం నేర్పించబోయే క్లిష్టతరమైన పాఠాలకు సంసిద్ధులుగా ఉంటాం. -
సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా.. ► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం. ► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం? మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు. ► ‘లైఫ్ ఆఫ్ రామ్..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్ గురించి... ‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు. ► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట? పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు ► దైవాన్ని నిర్వచించాలంటే? తనను తాను నిర్వచించుకోగలగాలి. ► మీకు బాగా నచ్చిన పుస్తకం? ‘భగవద్గీత’, ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫెట్’. ► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం? చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు. ► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను. ► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! ► తెలుగులో ట్వీట్ చేసినవారికే బదులు ఇస్తున్నారు? తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు. ► ఏకాగ్రతకు మీ నిర్వచనం? నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం. ► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం? తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం. ► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం? సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే. ► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత? ‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. ► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా? దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది. ► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు? నేనున్నాను గనుక. ► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం? ‘సరిగా చూస్తున్నదా నీ మది.. గదిలో నువ్వే కదా ఉన్నది..’ చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island.. ► లిరిక్స్ రాయడానికి మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? నా బుర్రలో అలజడి. ► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా? తప్పే! మృగాలను అవమానించకూడదు. ► పాటలో నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’ ► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం! ► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు? అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు. ► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే? జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. -
అందుకే ‘లక్ష్మీ’ అని పిలుస్తా : రాజా
తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను -
కల్యాణం... కమనీయం
సుప్రసిద్ధ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రెండో కుమారుడు, నటుడు రాజా (రాజా భవానీ శంకర శర్మ) వివాహం వెంకట లక్ష్మీ హిమబిందుతో ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు దర్శకులు కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్, వంశీ పైడపల్లి, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, గుణ్ణం గంగరాజు, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పద్మావతి, రాజా -
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
-
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లలో ఆదివారం ఉదయం వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నటుడు రాజా కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, ’ చిత్రాలతో అతడికి మంచి పేరు తెచ్చాయి.ఇక ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా మంచి నటన కనబరిచాడు. అలాగే మస్తీ, భానుమతి వర్సెస్ రామకృష్ణ వెబ్ సిరీస్‌లో రాజా నటించారు. తల్లిదండ్రులతో రాజా చెంబోలు -
ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా..
బ్రహ్మరథం! పట్టడానికి వచ్చేది ఎప్పుడూ. పట్టుకుపోవడానికి వచ్చింది! పాటని. ఏమయ్యా దేవుడూ.. ఇటు చూడు. పూమాల తెచ్చావ్!! పాడింది చాలనా? పాడించుకున్నది చాలనా? వినాలని ఉంటే వినిపోవాలి గానీ.. వినడానికి తీసుకుపోవటం ఏంటి? నీ చేతుల్లో ఉందనేగా! కోనేట్లో రాలి పడితే అది నీ పాటే. వాకిట్లోకి వాలి ఉంటే అది మా పాట. తెలియకుండా ఉందా నీకు? ‘కోరినవారు.. దేవుడు’ అని రేడియో వాళ్లకు రాసినా వినిపించేవారే.. ఆ మాత్రం ఐడియా రాకపోయిందా! పాట కోసం రథమే వేసుకొచ్చావ్! కోయిల నాది కాబట్టి రాగాలూ నావేనని లాగేసుకుంటే.. నిన్నెలా కొలవాలి స్వామీ? మా అన్నయ్య వెళ్లిపోయాడు. మాటల్ని తీసుకుని వెళ్లిపోయాడు. భారతజాతి సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలూగారు. ముఖ్యంగా దక్షిణాదిలో బాలూగారంటే ఊపిరి. ఆయనలేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటూ చాలా మంది మామూలు మాటలు మాట్లాడుతుంటారు. నాకు వేరే దుఃఖం, వేరే ఉక్రోశం ఉన్నాయి. ఇది కాలధర్మం కాదు. అకాల సూర్యాస్తమయం. చాలా మంది గాయకులు వస్తారు.. పోతారు. నిజానికి కొందరు వస్తారు.. కానీ వెళ్లరు. వాళ్లు వెళ్లారనుకుంటున్న రోజున కాలం కొత్తగా పుడుతుంది. ఈరోజు (శుక్రవారం) ఒంటిగంటకి తెలుగు వారి ఇళ్లల్లో కాలం బాలూగారి పేరుతో మళ్లీ పుట్టింది. సినిమా పాటను పూజించాల్సినటువంటి భావన సమాజానికి లేదు. అలాంటి సినిమా పాటకి అద్భుతమైన స్థాయి తీసుకొచ్చిన గాయకుల్లో బాలూగారు ఒకరు. తెలుగు సినిమా పాటకి ప్రాతినిధ్యం బాలూగారు. పాట పట్ల ఆయన చేసిన పూజ గురించి, శ్రద్ధ గురించి అందరూ ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఇంటిలోనూ బాలూగారు ఒక ముఖ్యమైన సభ్యుడు. ఆయన గొంతు విననటువంటి రోజు తెలుగువారు ఎరుగుదురా? సినిమా పాటలకు గొంతు అరువు ఇచ్చినటువంటి కళాకారుడు మాత్రమే కాదు.. 20 ఏళ్లుగా ఒక విస్మరించలేనటువంటి, మృతి లేని ఒక కటుంబ సభ్యుడు. సినిమా మాటల్లో సాహిత్యానికి సముచిత స్థానం ఇవ్వడానికి సంకోచించే పరిస్థితులు చాలా కాలం ఉండేవి. నాకు తెలిసి భారతదేశంలో పాటలోని మాట పట్ల ప్రత్యేకించి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక్క బాలూగారు తప్ప. ఇవాళ ఆయనలాంటి పెద్ద దిక్కు లేదు. ఆయన లోటు తీర్చలేనిది అంటారు. ఏంటి ఆ లోటు? 40వేల మంది బాలూగార్లను ఆయన నిర్మించి వెళ్లారు. గాలి ఉన్నంత కాలం, కాలం ఉన్నంత కాలం, తెలుగు సినిమా, భారతదేశంలో సినిమా ఉన్నంత కాలం బాలూగారు ఉంటారు. 74ఏళ్లకే ఆయన వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సినిమా పాటలు రాసే ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ ఇచ్చిన కె. విశ్వనాథ్‌గారిని నాన్నగారు అని పిలుస్తాను. విశ్వనాథ్‌గారిని నేను కలిసిన తొలి రోజు.. ఆయన బాలూగారిని పిలిచారు. నేను ‘గంగావతారం’ అనే పాట పాడి వినిపించినప్పుడు బాలూగారు కుర్చీలోంచి లేచి ‘మీరు ఎన్నో వందల పాటలు రాయాలి, అవి నేను పాడాలని అనుకుంటున్నాను’ అన్నారు. అది సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అనిపించింది. ఎన్నోసార్లు బాలూగారి నుంచి తిట్లు కూడా తిన్నా. ఈ పాట ఇలా ఉండాలని ఇప్పుడు నాకు చెప్పేవారెవరు? నా పాట పాడేవారెవరు? ఆయన మూగబోవడం ఏంటి? కాలానుగుణంగా అందరూ వెళ్లాల్సిందే. అయితే బాలూగారు వెళ్లే సమయం ఇది కాదు? ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం పక్కనపెడితే.. ఎన్నో ఇళ్లల్లో పాటల దీపాలను వెలిగించారాయన. ఆయన గంధర్వలోకంలో పాటలు నేర్పడానికి వెళ్లి మనకి దుఃఖం మిగిల్చారు. ఈరోజు నుంచి కాలం బాలూగారి పేరుతో వెళుతుంది. – సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచయిత భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు, నా ఆరో ప్రాణం. ఇలాంటి దుర్వార్తను ఇంత తొందరగా వింటాననుకోలేదు. మాట్లాడటానికి మాటలు రావడంలేదు. వాడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులందరూ ఈ భాదను ఓర్చుకోవాలని కోరుకుంటున్నాను. – కె. విశ్వనాథ్, దర్శకుడు బాలూ.. నువ్వు త్వరగా తిరిగి రా అని చెప్పాను. నిన్ను చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ నువ్వు వినలేదు. వినకుండా వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లిపోయావు? గంధర్వుల కోసం పాటలు పాడటానికి వెళ్లావా? ప్రపంచం శూన్యం అయిపోయింది. ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు. మాట్లాడానికి మాటలు రావడంలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎలాంటి బాధకైనా ఓ హద్దు ఉంటుంది. కానీ ఈ బాధకు హద్దు లేదు. – ఇళయరాజా, సంగీత దర్శకుడు ఈరోజు దుర్దినం. ఎస్పీ బాలూగారు చివరి నిమిషం వరకూ ప్రాణం కోసం పోరాడారు. ఆయన దూరం కావడం చాలా బాధాకరం. భారతదేశంలో ఎస్పీబీ పాటకు, ఆయన స్వరానికి అభిమానులు లేకుండా ఉండరు. వ్యక్తిగా కూడా ఆయన్ను అందరూ అభిమానిస్తారు. కారణం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా గౌరవించారు.. ప్రేమను పంచారు. భారత చిత్రసీమ మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఘంటసాల, టీఎమ్ సౌందరరాజన్ వంటి పెద్ద గాయకులను అందించింది. అయితే వాళ్లు కొన్ని భాషలకే పరిమితమైతే బాలూగారు పలు భాషల్లో పాడారు. గంభీరమైన, మృదువైన ఆయన గొంతు మరో నూరేళ్లయినా మన చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. అయితే ఆ గొంతుకి సొంతదారుడు మన మధ్య ఇక ఉండరనేది బాధాకరం. – రజనీకాంత్, నటుడు బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. బాలు గాయకునిగా ఎదుగుతున్న తరుణంలో నేను హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలోని అన్ని పాటలను బాలూతో పాడించాను. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. సింగర్‌గా బాలూని బిజీ చేసింది. వ్యక్తిగతంగా కూడా మేం ఎంతో ఆత్మీయులం. అలాంటి బాలు హఠాత్తుగా దూరం కావటం ఎంతో బాధగా ఉంది. – కృష్ణ, నటుడు బాలూగారితో దశాబ్దాల అనుబంధం గుర్తుకు వస్తుంటే కన్నీరు ఆగడంలేదు. గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఈ భూమి మీద పాట ఉన్నంతవరకు బాలు బతికే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనలాంటి గాయకుడు మరొకరు పుట్టరు. – కృష్ణంరాజు, నటుడు నేను, బాలు కలిసి కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో చదువుకున్నాం. శ్రీకాళహస్తిలో మొదలైన మా స్నేహం సినీ పరిశ్రమకు వచ్చాక చైన్నైలోనూ కొనసాగింది. అన్ని దేవుళ్ల పాటలను పాడి ఆ దేవుళ్లందరినీ మెప్పించిన గాన గంధర్వుడు. మా శ్రీ విద్యానికేతన్‌లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. గత మార్చి 19 నా పుట్టినరోజున శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవానికి ఆయన హాజరు కావాల్సింది. కరోనా వల్ల ఆ కార్యక్రమం కేన్సిల్ కావడంతో రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్లో ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనిపిస్తోంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ‘వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్’ అని ఆటపట్టించేవారు. నా సినిమాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలను పాడారాయన. నా చెవుల్లో ఆయన పాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నా హృదయంలో ఎప్పుడూ ఉంటారాయన. – మోహన్‌బాబు, నటుడు–నిర్మాత బాలూగారి విషయంలో ఏ మాట వినకూడదు అనుకున్నానో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ను కోల్పోవటం దురదృష్టకరం. సంగీత ప్రపంచానికి ఇది దుర్దినం. ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది బాలూనే. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే బాలూనే పుట్టాలి. నేను అన్నయ్యా అని పిలుచుకునే నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. నా కెరీర్ విజయంలో ఆయనకి సింహభాగం ఇవ్వాలి. ‘నువ్వు మంచి నటుడివి.. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని నీలోని నటుడిని దూరం చేయకు’ అని సలహాలిచ్చేవారు. ఆ సలహాల మేరకే నేను ‘ఆపద్భాంధవుడు’, ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి’ చిత్రాల్లో నటించాను. ‘నా పాటలకి సరైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కొద్దిమంది నటుల్లో చిరంజీవి ఒకరు’ అనేవారు. తాను పాడిన పాటల ద్వారా ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. – చిరంజీవి, నటుడు అతికొద్ది ప్రతిభావంతులకు మాత్రమే వాళ్ల ప్రతిభకు తగ్గ పురస్కారాలు, అభినందనలు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అందులో అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన పాడిన పాటల్లో కొన్నింటిలో కనిపించే అదృష్టం నాకు లభించింది. కొన్ని భాషల్లో నాలుగు తరాల నటులకు ఆయన పాడారు. రాబోయే తరాలన్నీ ఆయన కీర్తిని కొనియాడతాయి. – కమల్ హాసన్, నటుడు పాటలు పాడటంలో బాలూగారికి ఆపారమైన ప్రతిభ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయం పక్కనపెడితే ఆయన నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాకి హీరో. ఆయన కోసం నేను వంట మనిషిని పెడితే ‘ఎందుకు.. వద్దు భరణి, నాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. తినలేను’ అన్నారు. 30 రోజులపాటు 24 గంటలు నాతోనే గడిపారు. నేను వేసే జోకులను తెగ ఎంజాయ్ చేసేవారు. ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘ఎప్పుడైనా నీ జీవితచరిత్ర రాస్తే.. భరణి ‘మిథునానికి ముందు మిథునానికి తర్వాత’ అనేవాడు. బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించినంత వరకు ఖాళీ.– తనికెళ్ల భరణి, నటుడు–దర్శకుడు స్వర ప్రపంచాన్ని శోకసంధ్రంగా చేసి 28వ నక్షత్రంగా నింగిలో వెలిగిపోతున్న శాశ్వత స్వరమంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. – స్వర వీణాపాణి, సంగీత దర్శకుడు ఈ ఏడాది అనేక విషాద ఘటనలు జరుగుతున్నాయి. బాలూగారి వార్త వినగానే నాకు ఎంతో బాధ కలిగింది. ఆయన ఓ వెర్సటైల్ ఆర్టిస్ట్. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో ఆయన చేసిన హిందీ పాటలు అద్భుతం. లతా మంగేష్కర్తో ఆయన పాడిన పాటలు అద్భుతం. నేను ఇళయరాజా సంగీతంలో పాడినప్పుడు నా తమిళ ఉచ్ఛారణ విషయంలో ఎంతో సహాయం చేసేవారు. ఆయన మరణం సంగీత ప్రపంచంలో ఓ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – ఆశా భోంస్లే, గాయని. ప్రతిభాశాలి. మధురభాషి, యస్పీ బాలుగారి మరణవార్త విని ఎంతో దుఃఖం కలిగింది. బాలూగారితో కలసి ఎన్నో పాటలు పాడాను. షోస్ చేశాం. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – లతా మంగేష్కర్, గాయని గాన గంధర్వుడిగా గానానికి అర్థం చెప్పిన మహాగాయకుడు ఎస్పీ బాలూగారు. ఈరోజు మనందరినీ వదిలి అల్విదా చెప్పిన బాలూగారు మనతో లేరు అనేది బాధాకరం. చిన్నప్పుడు ఆయన స్ఫూర్తితో పరిశ్రమకి వచ్చిన నేను ఆయన్ను చూస్తూ పెరిగాను. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాలూగారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన పాటలెప్పుడూ మనతోనే ఉంటాయి. – జయప్రద, నటి–రాజకీయ నాయకురాలు -
'ఫిదా' నటుడి నిశ్చితార్థం
లాక్డౌన్ సమయాన్ని టాలీవుడ్ సెలబ్రిటీలు బీభత్సంగా వాడుకుంటున్నారు. ముందుగా నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిఖిల్, జబర్దస్త్ కమెడియన్, నటుడు మహేష్, హీరో నితిన్ పెళ్లిళ్లు జరిగాయి. ఈ నెలలో రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌ను వివాహమడగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో నటుడి ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్ర్రి తనయుడు, నటుడు రాజా చెంబోలు తన నిశ్చితార్థం జరిగినట్లు శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. (వైభవంగా నిహారిక నిశ్చితార్థం) "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యకు నటించిన రాజా తన ఎంగేజ్మెంట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేస్తూ "ఇది 2020లోనే బెస్ట్ పార్ట్. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాబోయే భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా రాజా..'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'మిస్టర్ మజ్ను', 'రణరంగం' వంటి పలు చిత్రాల్లో నటించారు. 'మస్తీ' అనే వెబ్‌సిరీస్‌లోనూ కనిపించారు. (స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే) View this post on Instagram The best part of 2020💍 Excited for my new journey! Thank you for all your love and support😊#engaged #rajachembolu A post shared by Raja Chembolu (@raja.chembolu) on Aug 15, 2020 at 8:48am PDT -
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాటను ఏ ముహూర్తాన తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడో తెలియదు గాని దశాబ్దపు మేటి పాటగా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డులతో సెన్సేషన్ సృష్టించింది ఈ పాట. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ హిట్ సాంగ్ అన్ని వేడుకల్లో, కచేరీల్లో మారుమోగుతోంది. అంతేకాకుండా ‘సామజవరగమన’ తో పాటు దాదాపు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ కావడం ‘అల.. వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(ఆదివారం) సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఈ లిరికల్ సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ రేపు విడుదలయ్యే వీడియో సాంగ్ దృశ్య రూపంలోనూ వారిని కనువిందు చేయనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ(చినబాబు)లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా చదవండి: సామజవరగమన పాట అలా పుట్టింది.. సామజవరగమన.. ఇది నీకు తగునా! ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
సామజవరగమన పాట అలా పుట్టింది..
సిరివెన్నెల సీతారామశాస్త్రి: అలవైకుంఠపురములో చిత్రం కోసం ఈ పాటను గంట లోపుగానే పూర్తి చేసి ఇచ్చాను. ఏ పాటనైనా, ఏ అంశాన్నయినా సుకుమారంగా మాత్రమే రాయాలని మొదటి నుంచి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూలాల్లోకి చూడగలగటం, ప్రతి చిన్న విషయాన్ని కొత్తగా ఆలోచించే లక్షణం మా నాన్నగారి పెంపకంలో వచ్చింది. ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలోని బాహ్య సౌందర్యాన్ని కాకుండా దైవత్వం మాత్రమే చూడాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యకాలంలో నేను ఏ పాట రాసినా అలాగే భావన చేస్తున్నాను. ఈ పాటలోని సాహిత్యాన్ని కొంచెం లోతుగా చూస్తే, ఒక పాపాయిని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ‘మంజుల హాసం, మలెల్లమాసం, విరిసిన పింఛం, విరుల ప్రపంచం’ అన్ని పదాలూ సౌకుమార్యంతో నిండినవే. ముగ్ధత్వం నిండిన అమ్మాయిని, పువ్వుల పాపను చూస్తే ఎలాంటి భావన రావాలో, ఒక యవ్వనంలో ఉన్న యువతిని చూసినప్పుడు కూడా అదే భావన రావాలి. సౌందర్యాన్ని చూసే విధానంలో ఆబ ఉండకూడదు. అలా చూస్తే స్త్రీత్వాన్ని అవమానించినట్లు అవుతుంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అన్నప్పుడు, పట్టీలు పెట్టుకున్న నా మనవరాలి వెనుక నేను పరుగెడుతున్నట్లు నాకు భావన కలుగుతుంది. అంతర్లీనంగా ఆ అర్థం కూడా వస్తుంది. యవ్వనంలో ఉండే అమ్మాయిలో ఉండే అమాయకత్వం ముగ్ధత్వం, పెద్దపెద్ద కళ్లతో లోకాన్ని చూస్తున్నప్పుడు వికృతమైన ఆలోచనలు రాకూడదని నా తలపు. ‘‘నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు/నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు’’ అంటే నా వల్లే నీలో జరుగుతున్న అజ అంటే చేష్టలు ఇవి. అవి నా వల్ల వస్తున్నాయి. నడుచుకుంటూ వెడుతున్నప్పుడు తొక్కేసినట్టుగా అనిపిస్తుంది. నీ కళ్ల ఎరుపు నీకు సంబంధించినది కాదు, ‘నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు/నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు’. ఆడవారు నుదుటి మీద పడిన ముంగురులను చాలా సుకుమారంగా, చేతితో వెనక్కు తీసుకుంటారు. అలా పైకి తీయటం, కళ్లు నులుముకోవటం, కులుకుతూ నడవటం.. ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తాయి అంటాడు హీరో. స్త్రీ భావన పట్ల అంతర్లీనంగా ఉన్న ముగ్ధత్వం ఇందులో చూపాను. స్త్రీ గురించి వర్ణించేటప్పుడు, టీజింగ్‌గా కాకుండా, ప్లీజింగ్‌గా రాయాలి అనుకున్నాను. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్లు పట్టుకున్నాడంటే, అందులో ఉన్న సుకుమార శృంగారాన్ని చూడాలే కాని, అందులోని కోపాన్ని చూడకూడదు. అలాంటిదే ఈ పాట కూడా. డ్యూయెట్ రాసేటప్పుడు స్త్రీ గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ లిమిటేషన్ పెట్టుకుంటాను.. కాముకత ఉట్టిపడేట్టు అస్సలు రాయను. తనకు సుపీరియర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని చూసినప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. ‘ఏంటలా చూస్తున్నారు అని బాస్ అడగగానే, మీ కాళ్లు బావున్నాయండీ అంటాడు. బాస్‌ని అయినా, భగవంతుడిని అయినా ముందుగా కాళ్లనే చూస్తాం. ఇలా కాళ్లను చూస్తున్న సిట్యుయేషన్లో నేనేం చెప్పగలనా అని ఆలోచించాను. అలా పుట్టింది ఈ పాట. నాకు పెద్దగా పుస్తక పాండిత్యం లేదు. నేను రాసే పాటలకు ఎవరూ ప్రేరణ కాకపోవటమే ప్రేరణ. ఎవరి రచనలనైనా చదివితే వాళ్ల ఆలోచనతోనే ఆలోచిస్తాం. ప్రబంధ కావ్యాలు చదివేసి ఉంటే, వసంతమాసం అనగానే అందరి కవుల ఆలోచనలు వచ్చేస్తాయి. నేను అందరూ చూసే సంవిధానం నుంచి విలక్షణంగా చూడటం అలవాటు చేసుకున్నాను. నా నిర్వచనాలలోనే ఉంది నా జీవితం. మనకు జన్మనిచ్చింది స్త్రీ. మనం మాట్లాడటానికి కారణభూతమైనది స్త్రీ. ఆవిడ పట్ల ఎంతో గౌరవం ఉండాలి. అంతర్లీనంగా ఉన్న దివ్య అంటే దైవ సంబంధమైన సౌందర్యాన్ని మాత్రమే చూడాలి. రాముడిలా బతకగలిగితే పురుషుడు కూడా సౌందర్యంగా ఉంటాడు. గుణాలు సౌందర్యంగా ఉండాలి. చిన్నపిల్లలు కాళ్లు ఆడిస్తున్నప్పుడు చూస్తే అక్కడే సౌందర్యం ఉంటుంది. చూపు ఎలా ఉండాలన్నదే నా పాటలకు ముఖ్యంగా పెట్టుకున్న లక్ష్యం. నేను చూసే దృక్కోణంలో పరిస్థితులను తీసుకునే సంవిధానం వేరే ఉంటుంది. అందం, సౌందర్యం అనేవి దైవత్వంలో ఒక లక్షణం. మనం చూసే దృష్టి మారితేనే చెడు ఆలోచనలు వస్తాయి. స్త్రీని పవిత్రంగా చూడాలి. సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఆ కాలంలో ఏ దృష్టి కోణంలో ఎలా చూసేవారు. ఈ కాలంలో ఎలా చూస్తున్నారో పరిశీలించుకోవాలి. శరీరంలో తేడా లేదు. చూసే విధానంలోనే తేడా ఉంది. ‘‘స్త్రీలు ఇంకొకరి కంటి ఆకలికి ఆరాధనగా కనపడాలి, ఆహారంగా కనపడకూడదు. వారిలోని మానసిక సౌందర్యాన్ని చూడాలి’’ అనేదే నా భావన. అందుకే ఏ పాటనైనా లా రాయాలి అన్నది నాకు నేను నిర్దేశించుకున్నాను. పూర్తి పాట మీకోసం పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా -
‘అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం’
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని అనపర్తి జీబీఆర్ కళాశాలలో గురువారం జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మెట్రో ఎండీ ఎంవిఎస్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్యారిస్‌లో సామజవరగమన
‘అల.. వైకుంఠపురమలో..’ చిత్రంలోని ‘సామజవరగమన....’ పాట శ్రోతలను, సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ప్యారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం వారం రోజులు చిత్రబృందం ప్యారిస్‌లో ఉంటుంది. ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా షూటింగ్ పూర్తయినట్లేనట. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది. -
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి ఏం మారిందని ఎన్ని యుగాలయినా? ఏదో తెలియని గాయం సలిపినప్పుడు, రేగే ఆవేశం ఈ పాట. సమాజ జీవచ్ఛవాన్ని– శవాన్ని కాల్చేయాలి అగ్గిలో. కానీ కడగమంటున్నాడు కవి, మళ్లీ పునీతం అయ్యేట్టుగా. గాయం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ఇది. సంగీతం శ్రీ. పాడినవారు బాలసుబ్రహ్మణ్యం. 1993లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. పాటలో రేవతితోపాటు సీతారామశాస్త్రి కూడా కనిపిస్తారు. నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణ మార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ -
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీ
‘నా పేరు సూర్య’ ఇచ్చిన షాక్‌తో దాదాపు ఏడాది పాటు ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను ప్రకటించారు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో.. కలిసి సినిమా చేయనున్న బన్నీ.. తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్‌తో కలిసి పనిచేయనున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీ షూటింగ్ ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. ఈలోపే మ్యూజిక్ సిట్టింగ్‌కు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్, సిరివెన్నెలతో కలిసి ఉన్న ఫోటోను థమన్ షేర్ చేశారు. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనున్నారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: అక్షరాన్ని అందలమెక్కించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తన పాటతో, తూటాలాంటి మాటతో తెలుగు సినీ రచనా రంగానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన సిరివెన్నెలకు 2019 ఏడాదికిగానూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో çజరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సిరివెన్నెలను ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించింది. రాష్ట్రపతికి తిమ్మక్క ఆశీస్సులు అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ‘వృక్షమాతె’గా కర్ణాటకలో అందరూ పిలుచుకునే 107 ఏళ్ల సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అనంతరం రామ్‌నాథ్ కోవింద్ నుదుటిపై చేయుంచి ఆశ్వీదించారు. అలా చేయడం ప్రొటోకాల్‌కు వ్యతిరేకం అయినప్పటికీ రాష్ట్రపతి కూడా తల్లివంటి ఆమె నుంచి ఆశీస్సులను వినమ్రంగా స్వీకరించారు. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని దర్బార్ హాల్లో ఉన్న సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అర్హుడిగా భావిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్ అనంతరం ఈ ఘటనపై రాష్ట్రపతి ట్విట్టర్లో స్పందించారు. ‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తములైన, అర్హులైన వారిని గౌరవించడం రాష్ట్రపతికి దక్కే అరుదైన అవకాశం. కానీ, కర్ణాటకకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యంత వయోవృద్ధురాలైన సాలుమరద తిమ్మక్క ఈ రోజు నన్ను ఆశీర్వదించడం నన్ను కదిలించివేసింది. ఆమె ఆశీర్వాదానికి నేను అర్హుడిని. సాధారణ భారతీయులకు ముఖ్యంగా ధైర్యం, పట్టుదల, నిరంతరం శ్రమించే గుణాలున్న భారతీయ మహిళలకు తిమ్మక్క ప్రతినిధి. అవార్డు గ్రహీతల స్ఫూర్తితో దేశం మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. దృఢసంకల్పానికి ప్రతీక కర్ణాటకలోని హుళికల్ గ్రామానికి చెందిన సాలుమరద తిమ్మక్క ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిమ్మక్క ఒక దశలో ఆత్మహత్యకు యత్నించారు. కానీ, భర్త బిక్కల చిక్కయ్య ఆమెకు ధైర్యం నూరిపోసి తోడుగా నిలిచారు. ఆపై ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొక్కలను నాటి వాటినే బిడ్డలుగా భావించి సాకాలనుకున్నారు. రోజంతా పొలం పనులు చేసి, సాయంత్రం మొక్కలు నాటేవారు. అలా వారు మొదటి ఏడాది తమ గ్రామ పరిసరాల్లో 10 మొక్కలు నాటారు. ఏడాదికేడాది సంఖ్య పెంచారు. నాటిన మొక్కలను నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి మరీ బతికించారు. అలా వారు 65 ఏళ్లలో ఆ ప్రాంతంలో 400 మర్రి చెట్లు సహా 8000 చెట్లను పెంచారు. చిక్కయ్య 1991లో కన్నుమూశారు. -
నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?
‘‘కళలన్నింటిలో తలమానికమైన కళ సాహిత్యం. సాహిత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. వాటిలో మొదటిది నాటకం. కవులు ఎంత బాగా రాసినా దాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపేది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా’’ అన్నారు ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ బుధవారం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి సత్కార సభ ఏర్పాటు చేసింది. సిరివెన్నెల, ఆయన సతీమణి పద్మావతిని సన్మానించారు. ఈ సమావేశానికి ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ అవార్డు విలువ, ప్రాముఖ్యత ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే ఇంత మంది అభిమానం, ప్రేమ, ఐశ్వర్యం పొందడం చాలా సంతోషంగా ఉంది. నా శ్రీమతి పద్మతో అంటుంటాను.. ‘నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?’ అని. నేను సినిమా రంగాన్ని దేవాలయంలా భావిస్తాను. నా పాటల ద్వారా సంస్కారవంతమైన భావాలని చెబుతున్నా. గతంలో ఎంతోమంది ‘పద్మశ్రీ’ అవార్డులు తీసుకున్నారు. వారు ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ, ఈ అవార్డు మాత్రం నాకు ప్రత్యేకమైనది. రామాయణాన్ని 5 మాటల్లో చెప్పమంటే ఎలా చెబుతాం? అయితే పాట ద్వారా చెప్పే అవకాశం సినిమా ద్వారానే వస్తుంది. అది నాకు వచ్చింది. 30ఏళ్లుగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకే ఇచ్చాడేమో అనిపిస్తోంది. సినిమా అన్నది జీవితానికి అతీతంగా ఉంటుందనుకోను. సమాజం పట్ల బాధ్యత పెంచేది సినిమా. మొదటిసారి నాకు ‘నంది’ అవార్డు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. మీరందరూ అన్నట్టు ‘భారతరత్న’ అవార్డు నాకు వస్తుందా? రాదా? అన్నది కాదు. భారతీయులంతా మంచి మనసుతో జీవించి, మేమంతా భారతీయులం అని ఇతర దేశాలవారికి సగర్వంగా చాటిచెప్పినప్పుడే మనందరికీ ‘భారతరత్న’ అవార్డు వచ్చినట్లు. ఇంతమంది అభిమానులు, ఆశీస్సులు, ఆత్మీయతను అందించిన ‘పద్మశ్రీ’ అవార్డుకి ధన్యవాదాలు. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ, నా శ్రీమతి పద్మ మాత్రం ముందుండి నన్ను నడిపిస్తున్నారు’’ అన్నారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు రాసిన పాటలన్నీ అద్భుతం. అయితే నాకు ప్రత్యేకించి ‘మహాత్మ’ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ...’ పాట అంటే చాలా ఇష్టం. మేం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శ్రీశ్రీగారి పక్కన కూర్చున్నప్పుడు ఎంత గర్వంగా ఫీలయ్యామో ‘సిరివెన్నెల’తో కలిసి ఉన్నప్పుడూ అలాగే ఫీలయ్యాం’’ అన్నారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘‘సిరివెన్నెల’ అన్నయ్యకి ‘పద్మశ్రీ’ అవార్డు ఆలస్యంగా వచ్చిందంటున్నారు.. నిజానికి రచయితకి ‘పద్మశ్రీ’ తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు ‘భారతరత్న’ అవార్డు కూడా రావాలని కోరుకుందాం’’ అన్నారు. ‘‘తొలిసారి ఓ సినిమా రచయితకి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం సినిమా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. రచయితలందరికీ ‘సిరివెన్నెల’ గర్వకారణం’’ అన్నారు రచయిత వడ్డేపల్లి కృష్ణ. ‘‘ఇండస్ట్రీకి వచ్చేముందు గురువుగారివద్ద (సిరివెన్నెల) శిష్యరికం చేయడం గొప్ప వరంగా భావిస్తాను’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘సిరి వెన్నెలగారిని ‘గ్రంథసాంగుడు’ అంటారు. అంటే గ్రంథంలో చెప్పలేని విషయాన్ని కూడా సాంగ్‌లో చెబుతారు’’ అన్నారు రచయిత భాస్కరభట్ల. ‘‘ఎవరికైనా ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే డబ్బులిచ్చి కొనుక్కుని ఉంటారులే అని కామెంట్లు చేసేవారు. కానీ, గురువుగారికి ఈ అవార్డుని ప్రకటించాక అర్హతగల వ్యక్తికి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు’’ అని రచయిత సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఈ సత్కార సభలో విజయేంద్రప్రసాద్, గుణ్ణం గంగరాజు, బల్లెం వేణుమాధవ్, బలభద్రపాత్రుని రమణి, గొట్టిముక్కల రాంప్రసాద్, కేఎల్ నారాయణ, వైవీఎస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, ఆర్పీ పట్నాయక్, ఆచంట గోపీనాథ్, కాసర్ల శ్యామ్‌తో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. -
కోకిలమ్మకు నల్లరంగు నలమిన వాడినేది కోరేది
కళాకారుడితోపాటు ఒక అన్వేషి కూడా అయినవాడు మాత్రమే ఈ ప్రశ్నల్ని సంధించగలడు. తన ఇంటిపేరుగా మారిపోయిన సిరివెన్నెల చిత్రం కోసం సీతారామశాస్త్రి రాసిన ఈ పాట– సృష్టిలోని వైరుధ్యాలను ఒక దగ్గర చేర్చడం వల్ల కవిత్వమైంది. దీనికి సంగీతం కె.వి.మహదేవన్. పాడింది బాలసుబ్రహ్మణ్యం. 1986లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. సుహాసిని, సర్వదమన్ బెనర్జీ నటీనటులు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగు నలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు -
పాములాంటి సీకటి పడగ దించి పోయింది
భయం లేదు. తెల్లారింది. పాములాంటి చీకటి పడగ దించింది, చావు లాంటి రాత్రి చూరు దాటింది, ముడుచుకున్న పిట్ట కూడా చెట్టును విడిచింది. లెగండి. మంచాలు దిగండి. చమటే చమురుగా సూర్యుడినే వెలిగించాలి, అగ్గిపూలు పూయించాలి. లేవండి. ‘పద్మశ్రీ’ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసి, స్వయంగా పాడిన ఈ పాట ‘కళ్లు’ చిత్రంలోనిది. సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు. శివాజీరాజా, భిక్షు, ‘కళ్లు’ చిదంబరం నటించారు. తెల్లారింది లెగండోయ్ కొక్కురోక్కో మంచాలింక దిగండోయ్ కొక్కురోక్కో పాములాంటి సీకటి పడగ దించి పోయింది భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి సావు లాటి రాతిరి సూరు దాటి పోయింది భయం నేదు భయం నేదు సాపలు సుట్టేయండి ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిసింది మూసుకున్న రెప్పలిడిసి సూపు లెగరనీయండి సురుకు తగ్గిపోయింది సెందురుడి కంటికి చులకనై పోయింది లోకం సీకటికి కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం ఎనక రెచ్చి పోయింది అల్లుకున్న పాపం మసకబారి పోయిందా సూసే కన్ను ముసురుకోదా మైకం మన్నూ మిన్ను కాలం కట్టిన గంతలు దీసి కాంతుల ఎల్లువ గంతులు ఏసి ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ సెమట బొట్టు సమురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం ఎలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం ఏకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి -
కళావెన్నెల
విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి ‘పద్మశ్రీ’ ప్రకటించిన నేపథ్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ తన స్వగృహంలో సిరివెన్నెలను సత్కరించారు. ఇద్దరూ కలసి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ‘సాక్షి’ అడిగితే గురుశిష్యులిద్దరూ బోలెడన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి: ఒకరు దర్శక దిగ్గజం.. ఒకరు గొప్ప ‘కలం’కారుడు. ‘సిరివెన్నెల’తో ప్రారంభమైన మీ ఇరువురి ఈ ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంది. ముందుగా ‘పద్మశ్రీ’ గురించి మీ అనుభూతి.. విశ్వనాథ్: నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా.. ఆదుర్తి సుబ్బారావు (దర్శక–నిర్మాత)గారు మా ఇంటికి వచ్చి ‘విశ్వానికి దిష్టి తగలకుండా ఆరు నందులు ఉన్నాయి. ఆ నందులే పోట్లాడతాయిలే’ అన్నారు. సిరివెన్నెల: ఆ సమయంలో ప్రతీ ఏడాది బెస్ట్ పిక్చర్, బంగారు నంది.. అన్నీ నాన్నగారి (విశ్వనాథ్)కి వచ్చాయి. ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చిందనగానే ముందు గురువు (విశ్వనాథ్)గారిని కలవాలనిపించింది. విశ్వనాథ్: నాకు ‘పద్మశ్రీ’ (1992) అవార్డు వచ్చినప్పుడు ఆ విషయం సాయంకాలమే తెలిసింది. హోమ్ మినిస్ట్రీ నుంచి కాల్ వచ్చింది. చెబితే నమ్మవు. నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాను. భోజనాల వేళ దాక ఇంట్లో ఎవ్వరితోనూ పంచుకోలేదు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేదు. సిరివెన్నెల: ఆ రోజు మా తండ్రిగారి తిథి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. ఓ విచిత్రమైన భావన కలిగింది. అది చాలా బలమైన భావన. ఇవాళ జనవరి 25, పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు. ఆ విషయాన్ని సాయి (కుమారుడు యోగేశ్వర శర్మ) నాకు వచ్చి చెబుతాడని అనిపించింది. ఇంతలో ఓ ఫోన్ వచ్చింది.. నేను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మరోటి. సాయి పరిగెత్తుకొచ్చి ఫోన్ తీశాడు. వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు. పద్మశ్రీ వచ్చిందా ఏంటి? అనుకున్నాను. అది నిజమైంది. నాకా విషయాన్ని సాయి చెప్పగానే, ‘మీ నాన్నగారికి చెప్పు అని మా నాన్నగారు’ తనని పంపించారా అనిపించింది. నా జీవితంలో మొదటిసారి ఓ అవార్డుకి సంబంధించి వచ్చిన టెలిగ్రామ్ గుర్తుకు వచ్చింది. ‘ఏ నోబడీ బికేమ్ ఏ స్టేట్ గెస్ట్ వితిన్ నో టైమ్’ అని అప్పుడు నేను అనుకున్నాను. పద్మశ్రీ గురించి చెప్పి, ‘తాతకు ఏం వచ్చింది’ అని నా మనవరాలిని అడిగితే.. తన్నమానం (సన్మానం), తాతకు పద్దమశ్రీ వచ్చింది అంది (నవ్వులు). మేం తన్నమానం ఎందుకొచ్చింది? అంటే తాతకు ఇంగ్లిష్ రాదు కాబట్టి అంది. తన్నమానం అంటే ఏం చేస్తారు? అని మేం అడిగితే.. చేతికి కర్ర ఇచ్చి, టోపీ పెట్టి దుప్పటి కప్పుతారు అని చెప్పింది. భలే ముచ్చటగా అనిపించింది. రచయితలు ఆత్రేయ, ఆరుద్రగార్లకే పద్మశ్రీ రాలేదు? సిరివెన్నెల: ఎవరో అడిగితే చెప్పాను.. వాళ్ల ప్రసాదంలా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తాను అని. తెలుగులో లిరిక్ అనే విషయాన్ని ఎందుకో గుర్తించలేదు. విచిత్రమేంటంటే నాన్నగారూ.. ‘మీ కంటే ముందు నారాయణ రెడ్డిగారికి వచ్చింది’ కదా అని నాతో కొందరు అన్నారు. ఆయనకు ‘పద్మభూషణ్ కూడా’ ఉంది. కానీ ఆయనకు ఆ అవార్డ్ వచ్చింది ‘లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్’ విభాగంలో. తమిళంలో వైరముత్తు, బాలీవుడ్లో జావేద్ అక్తర్లకూ అదే విభాగంలో ఇచ్చారు. లిరిక్ అనే విభాగంలో రాలేదు. గతేడాది లిరిక్ అనే విభాగంలో కర్ణాటక సినీ రచయిత దొడ్డ రంగె గౌడకి వచ్చింది. ఈ ఏడాది నాకు వచ్చింది. హాలీవుడ్ వాళ్లు సాంగ్ రైటర్, లిరిసిస్ట్ అని డివైడ్ చేశారు. సాంగ్ రైటర్ అంటే ట్యూన్‌కి మాటలు ఇచ్చేవాడు. లిరిక్ అంటే సాంగ్ విత్ పొయెటిక్ లైన్స్ అని. పొయెటిక్ కంటెంట్ నాన్నగారి సినిమాల్లోనే రావడం మనం గమనించవచ్చు. ఆయన సినిమాతో∙కాకుండా ఇంకో చోట నేను పరిచయమయ్యుంటే ఇండస్ట్రీలో నేనుండేవాడినే కాదేమో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు సిరివెన్నెలగారు ‘పద్మశ్రీ’ ప్రకటించగానే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను నాన్నగారూ అంటే.. ‘ఇప్పుడైనా ఏముందిలే. ప్రతి క్షణమూ మన క్షణమే’ అన్నారు. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉంది అనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. అయితే తనకు ఎలా కబురు పంపానో నాకు గుర్తులేదు. సిరివెన్నెల: ఆకెళ్ల సాయినాథ్ ద్వారా పంపారు. విశ్వనాథ్: ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాల గారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? వంట రుచిగా ఉంటుందో, అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్నగారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’కి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. సిరివెన్నెల: ఐదు చరణాలు రాశాను. అంతా గుర్తుంది. మరి ఈ వాక్యాలు పెట్టే సందర్భం కుదురుతుందా? అంటే ‘కథ మన చేతుల్లో ఉంటే, మనం చెప్పినట్టు నడుస్తుంది’ అన్నారు గురువుగారు. విశ్వనాథ్: మా స్నేహం ఎంతలా పెరిగిపోయిందంటే శాస్త్రీ.. నువ్వు రాసినా, రాయకపోయినా ఓసారి వచ్చి కథ విని వెళ్లు. నీతో రాయిస్తానో లేదో నాకు తెలియదని కబురు పంపేవాడిని. అంత కుటుంబ సభ్యుడు అయిపోయాడు. మా ఇంటి వ్యక్తిలా అన్నమాట. మీరు పాట సందర్భం అనుకున్నప్పుడే పల్లవి రాసుకుంటారట. నిజమా? విశ్వనాథ్: నేను కథ రాసేటప్పుడే అబద్ధపు సాహిత్యం (డమ్మీ లైన్స్) పక్కన పెట్టుకుంటాను. ఊరికే నా ఐడియా ఇదీ అని చెబుతాను. ఇలా ఉండాలి అని శాసించను. రాస్తున్న కవి మనసుకు హత్తుకుని, ఛందోబద్ధంగా ఉంటే అది తీసుకుంటారు. తీసుకోవాలని నేను పట్టుబట్టింది లేదు. విశ్వనాథ్‌గారి పల్లవులు యథాతథంగా వాడిన సందర్భాలు ఏమైనా? సిరివెన్నెల: ‘శ్రుతిలయలు’ సినిమాలోని ‘తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునకలో..’ పల్లవి ఆయనిచ్చినదే. ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎందుకు ఎంచుకున్నామా? అని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఓ సందర్భంలో విశ్వనాథ్‌గారు అన్నారు. మరి.. ఆ సినిమాకి పాటలు రాసేటప్పుడు మీకేమైనా? విశ్వనాథ్: శాస్త్రికి బదులుగా నేను చెబుతా. అలాంటి సందర్భాలు తనకు అనేకం పెట్టాను. శాస్త్రిది యంగ్ బ్లడ్ కదా అని (నవ్వుతూ). ‘కష్టపెడుతున్నారు వీళ్లు’ అని ఏ సందర్భంలోనూ తను అనుకోలేదు. పెద్ద అదృష్టం ఏంటంటే మాకు నిర్మాతలు అడ్డు చెప్పలేదు. ఉదయం అని రాస్తే ‘సార్ అర్థం అవ్వదేమో... పొద్దునే, లేచినవేళ’ అని రాయండి అని చెప్పలేదు. సిరివెన్నెల: కవిత్వం రాయడం అనేది కేవలం విశ్వనాథ్‌గారి సినిమాల్లోనే సృష్టించబడింది. అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి పాట కవిత్వం కానక్కర్లేదు. కవిత్వం అంటే చెప్పినదే కాకుండా చెప్పని భావం కూడా బోలెడంత కనబడాలి. ఆయన నాకు పది చాలెంజ్‌లు విసిరితే వాటిని నేను పన్నెండు చేసుకోవడానికి ఇష్టపడతాను. విశ్వనాథ్: త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు వింటాం. ఆస్వాదిస్తాం. వాటికి ఇదే సందర్భం అనలేం కదా. మా పాట సినిమాలో సందర్భానికి సరిపోవడం ఒక్కటే కాదు... ఎవరు విన్నా కూడా ఎలా అయినా ఆపాదించుకునేలా ఉండాలి. అలాంటి పాటలను పెట్టాం. సిరివెన్నెల: ఎక్కడైతే మాట ఆగిపోతుందో అక్కడ పాట మొదలవుతుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో సంస్కారం ఉన్న పాత్రలే ఉంటాయి. ఆ మినిమమ్ సంస్కారం ఉన్న మనుషులకు రావాల్సిన సమస్యలే వస్తాయి. రిక్షావాడికి ఓ సంస్కారం ఉంటుంది. కసాయివాడికి ఓ సంస్కారం. ‘జీవన జ్యోతి’లో ఓ సన్నివేశంలో ఓ తాగుబోతు వాణిశ్రీని రేప్ చేస్తాడు అని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ వచ్చి దుప్పటి కప్పి వెళ్లిపోతాడు. అది వాడి సంస్కారం. విశ్వనాథ్: దర్శకుడిగా నేను స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు ఓ పాటొస్తుంది సుమా అని ప్రేక్షకుడిని భయపెట్టను. ప్రియుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఇన్ని పూలు పెట్టుకుంది. పాట రాబోతోంది... అలా ఉండదు. నిజంగానే జరిగిన విషయాన్ని పాట రూపంలో ఎలా అలంకారం చేస్తాం అన్నది ముఖ్యం. మరీ ఎక్కువ అలంకారం చేసినా బప్పీలహరి పాటలా ఉంటుంది. అది ఉండకూడదు. హ్యాండ్ ఇన్ గ్లౌ అంటారే అలాగ. సిరివెన్నెల: ఓవర్ డ్రమటైజేషన్ అనేది విశ్వనాథ్‌గారి సినిమాల్లో ఉండదు. సన్నివేశం తీసే ముందు డైలాగ్ పేపర్ని చూస్తూ, నేనైతే ఇంట్లో ఇలా మాట్లాడతానా? అని అనుకుంటారు ఆయన. అలా లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. తొలి సినిమానే విశ్వనాథ్‌గారితో చేయడంవల్ల మీ పాటల్లో కవితాత్మక ధోరణి కనిపిస్తుందా? సిరివెన్నెల: కవిగా నా స్వభావమే అది. ఏ సీన్‌కి అయినా నేను చాలా త్వరగా రియాక్ట్ అయి రాస్తుంటాను. సంఘటన, వ్యక్తులు, ప్రదేశాలకు రాయమంటే నేను రాసేవాణ్ణి కాదు. అవన్నీ కాదు.. ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పండి రాస్తాననేవాణ్ణి. ఫలానా ఆయన్ని పొగిడి రాయమన్నా కూడా తత్వాన్ని పొగుడుతాను. విశ్వనాథ్: మామూలుగా అయితే దీన్ని పొగరుబోతుతనం అనుకుంటారు కానీ వ్యక్తిత్వం అనుకోరు. ఆ రెంటినీ డివైడ్ చేసే లైన్ చాలా కష్టమైంది. ‘వ్యక్తిని పొగడను’ అని సిరివెన్నెలగారు కనబర్చిన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన తాను అనుకున్నదే రాస్తారని కానీ మీకేమైనా కంప్లైంట్స్ వచ్చాయా? విశ్వనాథ్: ఒక ఇరవై ఏళ్ల స్నేహంలో అలాంటి కంప్లైట్స్‌ని నిజమని నమ్మితే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఆయన నాకు చాన్స్ ఇవ్వడమేంటి? నాకు టాలెంట్ ఉంది కాబట్టే ఇచ్చారు’ అని సిరివెన్నెల అంటున్నాడు అని అన్నప్పుడు, దాన్ని నమ్మేసి ఇంట్లోవాళ్లందరితో వాగేసి, శాస్త్రి రేపొస్తే కడిగేస్తాను అనుకుంటే కరెక్ట్ కాదు. అలా చెప్పినవాడిని కొట్టాలి (నవ్వుతూ). ఇలా సరదాగా సంభాషణ సాగుతున్న సమయంలో విశ్వనాథ్‌గారి సతీమణి (జయలక్ష్మి) వచ్చారు. మెల్లిగా నడుస్తూ వచ్చిన జయలక్ష్మిగారు సిరివెన్నెలగారి కుర్చీ పక్కన కూర్చుంటే.. విశ్వనాథ్‌గారి పక్కన కూర్చోమని అడిగిన ‘సాక్షి’తో నడవలేనేమో అన్నప్పుడు ‘ఇంతకాలం నన్ను నడిపించావు కదా’ అని విశ్వనాథ్‌గారు చమత్కరించడంతో అక్కడే ఉన్న ఆయన తనయుడు, కోడలు.. అందరూ హాయిగా నవ్వేశారు. భర్త పక్కన కూర్చున్నాక ‘‘నా బిడ్డ (సిరివెన్నెలను ఉద్దేశించి)ను నేనే మెచ్చుకుంటున్నానేమో కానీ ఎంతో లవ్లీగా అనిపిస్తోంది. నాలుగు రోజుల నుంచి (పద్మశ్రీ వచ్చిన రోజు నుంచి) మా ఆనందం చెప్పలేనిది. మా కన్నబిడ్డకు వచ్చినట్లుగానే అనుకుంటున్నాం’’ అన్నారు జయలక్ష్మి. సిరివెన్నెల: ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే.. నాన్నగారు తీసిన ప్రతీ సినిమా కూడా వేదమే. వేదానికి కొన్ని వందల అర్థాలు ఉన్నాయి. సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకు ఏది తెలియాలో అది వేదం. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? సిరివెన్నెల: ఆయనకు నచ్చకపోవడం ఉండదు. విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. సిరివెన్నెల: ‘స్వర్ణకమలం’ సినిమాకు నంది వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లాను. ‘మూడు నందులు వరుసగా అందుకున్నాను. అయినా కానీ సంతృప్తిగా లేను’ అన్నాను. ఎందుకు? అని అడిగారు. మీ సినిమాల్లో ఏ క్రాఫ్ట్ వాళ్లకు అవార్డు వచ్చినా అందులో మీ పాత్ర ఉంటుంది. మీకు కాకుండా వేరే వాళ్లకు రాసి, నంది తెచ్చుకుంటే అప్పుడు నందికి అర్హుడిని అన్నాను. ఆ తర్వాత వేరేవాళ్ల సినిమాలకు కూడా చాలా వచ్చాయి. మనం జపనీస్ దర్శకుడు అకీరా కురొసావా గురించి చెప్పుకుంటుంటాం. ఆయన్ను తక్కువ చేయడం కాదు కానీ విశ్వనాథ్‌గారు తెలుగుకు పరిమితమైపోవడం వల్ల ఆయన గురించి అకీరా కురొసావా గురించి చెప్పుకున్నట్లు చెప్పుకోవడంలేదు. విశ్వనాథ్: మన తెలుగు వాళ్లకు ఉన్నదే అది. సిరివెన్నెల: కేన్వాస్ అదే. దాని మీద బూతు బొమ్మ గీసుకోవచ్చు. మామూలు బొమ్మ గీయొచ్చు, ఎక్కాలు రాయొచ్చు. విశ్వనాథ్‌గారు చేసింది చూడటం వల్ల ఆయన్ని పొగడటం అవదు. మీ (ప్రేక్షకులు) జీవితాన్ని మీరు విస్తృతపరచుకోవడం అవుతుంది. అది ఒక ఉనికి. అతిశయోక్తిగా విశ్వనాథ్‌గారిని దేవుడు భూమి మీదకు పంపారు అనడం లేదు. మనకు ఆకలి, డబ్బు సంపాదన ఇలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా మన లోపల ఓ ఆర్తి ఉంటుంది. దాని కోసం ఆయన సినిమాలు చూడండి. మన మీద మనకు గౌరవం పెరుగుతుంది. మనం రోజూ చేస్తున్న ఘనతలు ఏమున్నాయి? తినడం, ఉద్యోగం చేయడం. ఇది తప్ప ఇంకేం ఉంది. ఆయన ‘శంకరాభరణం’ చూస్తే.. అంతకు ముందు మంచి సినిమాలు లేవని కాదు. ఆయన మనకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చారు. ప్రేక్షకులు వాళ్ల అర్హతను ఆయన సినిమాను విజయవంతం చేసి మాత్రమే నిరూపించుకోగలరు. నిరూపించుకున్నారు కూడా. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. ఈతరంలో మీకు విశ్వనాథ్గారిలాంటి దర్శకుడు దొరికారా? సిరివెన్నెల: లేరు. ఒకటి విశ్వనాథ్‌గారు కథను చెప్పే విధానం. రెండు.. రచయితని నీ మనసు ఎలా పలుకుతుందో అలా రాయి అనే దర్శకుడు ఆయన. మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాట రాస్తున్నప్పుడే నీకు ఏం తోస్తే అది రాయి. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. హిమాలయాలంత మనిషి తన స్థాయిని ఆపాదించుకుని నాకు అర్థం కానిది ఏదీ లేదు అనొచ్చు. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. ‘నాకే అర్థం కాలేదు. జనాలకు ఎలా అర్థం అవుతుంది’ అని కొందరు దర్శకులు అంటారు. జనాలు అని ఎవరైనా సంబోధిస్తే నాకు కోపం వస్తుంది. మనం ఎవరి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఒక యుగం ముందర. ఒక శకం ముందర కూర్చొని. ఏనాడూ ఆయన ఆడియన్స్‌ను తక్కువ చేసి మాట్లాడలేదు. మనం కాదా జనం.. జనంలో నుంచి మనం రాలేదా? జనాన్ని తక్కువ చేస్తే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అని ఆయన అనుకుంటారు. మీరు సినిమాల్లోకి వచ్చే నాటికే విశ్వనాథ్‌గారు గొప్ప పేరున్న వ్యక్తి. మరి.. ఆయనతో జర్నీ మొదట్లో భయంగా అనిపించేదా? విశ్వనాథ్: నేను సమాధానం చెబుతా. మా గురువుగారు ఆదుర్తిగారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ‘మొదట్లో వచ్చేవాళ్లకు భయం, భక్తీ ఉంటాయి. మనం చనువు చేసి, జాగ్రత్తగా భయం పోగొడితే... అప్పుడు వాళ్లు భయం లేకుండా ఇలా ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పగలుగుతారు. ఒకవేళ మనం భయం పోగొట్టకపోతే ఏమీ చేయకుండా బొమ్మల్లా మనల్ని ఫాలో అయిపోతుంటారు’ అని చెప్పారు. అందుకే నేను భయం పోగొట్టేవాణ్ణి. నిజానికి ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి. నేను అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్తే నిలబడతాను. ఆయన స్టేచర్‌కు నేను గౌరవం ఇస్తాను. మా ఊళ్లో నేను గొప్పవాణ్ణి అంటే ఏం లాభం? ఈ లక్షణాలు చివరిదాకా ఉండాలి. ఇవే మా సినిమాల్లో పెడతాం. భయం పోయినా గౌరవం పోకూడదు. సిరివెన్నెల: ఇప్పుడు వేల్యూ సిస్టమ్ అనేది లేదు. అవన్నీ పోయాయి. ‘కొత్త దర్శకులను తండ్రీ కొడుకులిద్దరూ స్నేహితులైతే కలసి కూర్చుని తాగాలా? ఆ సన్నివేశం లేకపోతే నష్టమా?’ అని అడుగుతుంటాను. విశ్వనాథ్: అవన్నీ మీకెందుకు? మీ పాట మీరు రాయండి. (నవ్వుతూ). సిరివెన్నెల: నన్ను అలా అనే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే నేను ఏ స్కూల్ నుంచి వచ్చానో వాళ్లకు తెలుసు (నవ్వులు). ఎంతటి ప్రతిభావంతులకైనా ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. మీ సినిమాలను మెచ్చుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? విశ్వనాథ్: మనం చేసినదాన్ని ఒకరు మెచ్చుకుని అందులో ఉన్న మెరుపును చెప్పినప్పుడు ‘అమ్మయ్య.. ఇంత ఇదిగా గుర్తించారు’ అని ఆనందం వస్తుంది. అది వీక్నెస్ అనండి ఇంకేదైనా అనండి. ఎంత బావుందో సినిమా అని అనిపించుకోబుద్ధి అవుతుంది (కళ్లల్లో ఆనందంతో). సిరివెన్నెల: ఇక్కడ మమ్మల్ని పొగడక్కర్లేదు. సినిమాలో ఉన్న విషయం అర్థం చేసుకుని ఆనందించడం ముఖ్యం. సినిమా బావుండటం వేరు. ప్రయోజనం వేరు. రెండూ వేరే వేరే విషయాలు. చాలా బావున్నది మనకు దేనికీ పనికి రాకపోవచ్చు. నాన్నగారు తీసిన సినిమాలు చూడటం ఎవరికి వాళ్లు సంస్కారం పెంచుకోవడానికి రుజువు. ఇవాళ పనిగట్టుకుని శాస్త్రి వచ్చి ఆయన్ను పొగడక్కర్లేదు. విశ్వనాథ్: బాక్సాఫీస్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. కొన్ని సినిమాలకు ఎందుకని డబ్బు రాలేదో అర్థం కాదు. కొన్నింటికి ‘దాంట్లో ఏమీ లేదు. ఊరికే డబ్బు వచ్చేస్తుంది’ అంటుంటారు. సిరివెన్నెల: కళా తపస్వి అన్నది బిరుదు కాదు. మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. మరి శాస్త్రి అందరి దగ్గర అలా చేస్తాడో లేక మా దగ్గరే అలా చేస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు తెల్ల కాగితాలు తెచ్చుకుంటాడు. రీమ్ అంటామే. నాలుగు లైన్స్ ఏవో రాస్తాడు. పక్కన పెడతాడు. పడేయడు. మళ్లీ కాసేపు బయటకు వెళ్లిపోతాడు. అలా ఎప్పుడో రాసినవి ఇప్పటికీ తన దగ్గర ఉంటాయి. సిరివెన్నెల: అవును.. ఇప్పటికీ ‘సిరివెన్నెల’ సినిమాకు రాసిన కాగితాలు ఉన్నాయి. చివరి ప్రశ్న... వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. – డి.జి.భవాని -
పద్మశ్రీ’ నాది కాదు.. వారందరిదీ!
‘‘చెంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారు, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్లు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబ సభ్యులు. అందుకే తెలుగులో సినీ గేయకవితా రచన విభాగానికి తొలిసారి వచ్చిన ఈ ‘పద్మశ్రీ’ అవార్డు నాది కాదు.. వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు ఆశీర్వాద సభగా భావిస్తున్నా’’ అని సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. భారత ప్రభుత్వం సిరివెన్నెలకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్ స్వగృహంలో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట ఆత్మీయ అభినందన సభ జరిగింది. సీతారామశాస్త్రి దంపతులను, ఆయన మాతృమూర్తిని విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజులలానే ఇప్పటికీ నిగర్వంగా ఉండటం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు. విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని పాటలను గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్ గానం చేశారు. వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి, నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ ఫేమ్ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, నటుడు గుండు సుదర్శన్ పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, దశరథ్, వీఎన్ ఆదిత్య, ఇంద్రగంటి, కాశీ విశ్వనాథ్, బీవీఎస్ రవి, రచయితలు జనార్దన మహర్షి, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు ‘సిరివెన్నెల’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ∙సిరివెన్నెల, పద్మ, విశ్వనాథ్ -
ప్రేక్షక హృదయ నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని
‘‘నాకు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి సకాలంలో వివరిస్తూ తమ అభ్యర్థనలను పంపిన వేలాది మందికి పేరు పేరునా ధన్యవాదాలు. నాకు అవార్డు రావడం వేడుకగా, పండగలా భావిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించిన సందర్భంగా గురువారం సీతారామశాస్త్రి హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► ‘పద్మశ్రీ’ అవార్డు ఎంతది అన్న విషయం పక్కనపెడితే ఈ అవార్డు నాకు రావాలని కోరుకున్న తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. 30ఏళ్లుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా నాకు పద్మ అవార్డు రావాలనేది వారి ఆకాంక్ష, ఆశీర్వాదం, కోరిక.. ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అనుకుంటున్నాను. వారి ఆనందానికి కారణమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకింత వినయంతో కూడిన గర్వం కలిగింది. నాకు గీత రచయితగా జన్మనిచ్చిన దర్శకులు విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలని తలపించిన మా మాస్టారును తలచుకుంటున్నా. ఈ వేడుకను పై నుంచి చూస్తున్న నాన్నగారికి నమస్కరిస్తున్నా. ► ‘మాటలతో చెప్పడానికి అవకాశం లేని, సరిపోని భాష మూగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ కనిపించని భావాన్ని అనిపింపజేసే ప్రక్రియ పాట’ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ రంగంలోకి వచ్చాను. శోకం, క్రోదం, కోపం... ఇలాంటి దేశ, కాల అతీతమైన కొన్ని భావాలు ఉన్నాయి. సంఘటనలు, వ్యక్తులు, స్థలాలు... వీటిపై పాట రాయడం ఆసక్తి లేదు. పద్యం రాయాలని కానీ లేదా వచన కవిత్వం కానీ రాయాలని అప్పట్లో ఉండేది. ► నాకు చంధస్సు, పద్యం రాయడం రాదు కనక పాట రూపంలో నా అభిప్రాయాలను వ్యక్తపరిచేవాడిని. మెచ్చుకున్నవాళ్లూ నొచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. నేనేమీ సంస్కృతాన్ని ఒక సన్నిధానంలో చదువుకున్నవాడినేం కాదు.. వినికిడి పాండిత్యం. మా నాన్నగారు మహా పండితులు. ఆయన సహచర్యం, భగవద్గీత ఇత్యాది వాటివల్ల నా భావాలకు అవసరమైన పద సంపద దొరికింది. అది అందరి దగ్గర ఉంది. నేను కఠినమైన భాషలో రాస్తాను అని చాలా మంది అంటుంటారు. కానీ, అలా రాయడం నాకు రాదు. ► విశ్వనాథ్‌గారి సినిమాకు సంబంధించి ఓ సారి విలేకర్ల సమావేశం జరిగింది. అప్పుడు ‘సిరివెన్నెల’ పాట చదువుతారు అన్నారు నొక్కి. అప్పుడు చదివాను. అక్కడి నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా భావం అనిపించింది. జన్మ ధన్యమైన భావం కలిగింది. ► నా ప్రతి పాటను అవార్డుగానే భావిస్తాను. పాట ఎలా కావాలో తెలిస్తే దర్శక–నిర్మాతలే తీసుకునేవారు. ఎలా ఉండాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. సినిమా కోసమే కాదు.. నా కోసం కూడా నేను పని చేస్తున్నా. ఆ శ్రద్ధ, ఆ భయం ఉన్నాయి. వీటికి భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి. పాట పట్ల నాకు ఉన్న భయం, భక్తి... నా పాట పంచామృతం. ► పద్మం బురదలో వికసిస్తుంది. గళం అశ్లీల మాటలను ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని కోరుకుంటాను నేను. సరస్వతీదేవి కూర్చొనే ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠం కావాలనే కోరికతో శ్రద్ధతోనే చేశాను. ఇకపై కూడా అలానే చేస్తాను. ► మీ (ప్రేక్షకులు) హృదయాల్లో నిక్షిప్తమైన, మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడితే మెచ్చుకునేవారు కాదు. సీతారామశాస్త్రి మంచి పాటలు రాస్తారు అనే భావనకు వెళితే రేపు నేను తప్పు చేసినా మీ కంట పడదు. మీ గుండెల్లోని నిశ్శబ్దానికి ప్రతిధ్వని నేను. సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది. కాకపోతే కాస్త డ్రామా ఉంటుంది. ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడ పాట ఆలాపన మొదలవుతుంది అంటూ ‘సిరివెన్నెల’ తరంగాలు అనే పుస్తకం రాశాను. ► పద్మ అవార్డుని ఆశించలేదు. నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను. ఎంతో మంది అభిమానించారు. వారి హృదయ స్పందనకన్నా పెద్ద అవార్డు ఉంటుందని అనుకోను. అవార్డు కోసం నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. నా ప్రతి పాట నాకు నచ్చుతుంది. ‘లాలిజో..లాలిజో ఊరుకో పాపాయి, గుమ్మాడి గుమ్మాడి...’ ఇలా అనేక పాటలు ఉన్నాయి. ► ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు. నేను వ్యక్తిత్వానికి విలువిస్తాను. నువ్వు ఏం సాధించావ్? అంటే మానవ వ్యవసాయం చేసి హృదయాల్లో స్థానం సంపాదించానని చెబుతాను. రాజ్యం సంపాదించడం కంటే ఒక మనిషి హృదయంలో విలువైన స్థానం సంపాదించడానికే నేను ఇష్టపడతాను. ► నేనే నం.1... లాంటి పాటలు రాయడానికి ఇష్టపడను. ఎందుకంటే తెర ఆడే వరకే ఆ మాట మిగులుతుంది. కథానాయకుడిని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ‘గెలుపంటే పసిడి పతకాల తీరం కాదురా..’ అని రాశాను. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని ఓ సందర్భంలో రాశాను. పాత్రకు సరిపోతుంది. కేవలం ఆ ఒక్క సందర్భానికి మాత్రమే కాకుండా అన్ని సందర్భాలకు అన్వయించవచ్చు. ► ఆకలేస్తుందని భయపడుతుంటాం. భయపడితే ఆకలి తీరుతుందా? ప్రకృతి కఠినంగానే ఉంటుంది. భయానికి ఎంత స్థానం ఇవ్వాలో తెలుసుకోవాలి. అలా ఏయే భావాలకు ఏయే స్థానాలు ఇవ్వాలో తెలిస్తే ‘ఇవాళ ఉన్నటువంటి ఇన్‌బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఇలాంటి భావాలను పంచుకునేందుకు నాకు సినిమా రంగం దొరికింది. నేను సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. సినిమా అన్నది నాటక శాస్త్రానికి యాంత్రిక స్వరూపం. ఒకే చోట.. చాలా చోట్లా ప్రదర్శించవచ్చు. సాహిత్యంలో అనేక రకాలున్నాయి. కథ, సాహిత్యం, నవల.. ఇలా పలు రకాలున్నాయి. నాటకానికి ఇంకా ముఖ్య స్థానం ఉంది. సినిమా వల్ల సమాజం పాడవుతుంది అంటారు. సినిమా వల్ల సమాజం బాగుపడుతుంది. సినిమా సమాజానికి అద్దం మాత్రమే. సినిమా కొత్తగా చూపించేది ఉండదు. 5 రూపాయలతో పెన్సిల్ తయారు చేసి, దాన్ని 7 రూపాయలకు అమ్మరు. ఆ శ్రమకు విలువ కట్టకుండా భౌతికంగా వెచ్చించే సమయానికి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఇది ధర్మమైన వ్యాపారం చేస్తున్నాను అనే గర్వం పోవడం మన దురదృష్టం. ఒక్కసారి ఆ గర్వాన్ని మళ్లీ భావిస్తే తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని అనుకుంటా. ► పాట రాయడం ప్రసవ వేదన అంటారు. ఏ పనిలో కష్టం లేదు? కష్టపడకుండా ఏదీ రాదు. అమూల్యం అన్నదానికి రెండర్థాలున్నాయి. పొగరుగా ధ్వనించవచ్చు. పల్లవి నుంచి పాటలోని ఆఖరి వాక్యం వరకూ పాడుకుంటూ తమ జీవితాల్లోకి అన్వయించుకుంటూ ఆనందిస్తున్న వాళ్ల సంతోషానికి విలువ ఏం ఉంటుంది? పారితోషికం ఆలోచించకుండా, ఆశించకుండా పాటలు రాసిన సందర్భాలున్నాయి. అది త్యాగం అనుకోను. నా బాధ్యత అని భావిస్తాను. నేను సైతం అని సహాయం చేస్తాను. ► కాలం మారదు. కాలం మారితే మనం బతకలేం. పంచభూతాలే మారనప్పుడు మనం మారడమేంటి? సభ్యంగా పూర్తిగా ప్యాంటు వేసుకునే దగ్గరి నుంచి చిరిగినవే వేసుకుంటున్నాం. ట్రెండ్ అండీ.. అంటారు. మన సమాజం తాలూకు సంస్కృతులు ఓవర్‌ల్యాప్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ అంటే వల. మౌస్ అంటుంటాం. ఎలుక తోక పట్టుకొని ముందుకు వెళ్లడం ఏంటి? చాటింగ్ అంటూ మాట్లాడటం మానేశాం. తెలుగులో ఎకిమీడ (రాజా) అని రాస్తే పట్టించుకోం. అదేదో ఫారిన్ భాష నుంచి కసరసకరస అని రాస్తే అర్రే బహు బాగుందే అని ఫీల్ అవుతుంటాం. తెలుగు వాళ్లు తమ తాలూకా ఉనికిని కోల్పోవడానికి ఎక్కువగా ముచ్చటపడుతుంటారు. ఇలాంటి తలకిందుల చేష్టలు కూడా మళ్లీ మామూలుగా అయిపోతాయనే అనుకుంటున్నాను. ► ఒక పాట బయటకు రావడానికి దర్శక–నిర్మాతలు, సంగీత దర్శకుడు, రచయిత అభిప్రాయాలు కలవాలి. దీన్నే సాంఘిక జీవనానికి అన్వయిస్తే ఈ మధ్య మా అభిప్రాయాలు కుదరడం లేదని విడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభిప్రాయం కలవని ఇద్దరూ సాగించే ప్రయాణమే పెళ్లి అంటాను. నచ్చనది చెబుతూ నచ్చినవి స్వీకరించడమే ప్రయాణం. జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. సినిమా రంగం కూడా అలానే. ► ట్యూన్‌కి రాయడమే ఆది నుంచి ఉన్నది . సినిమా నేర్పింది కాదిది. మనకు నూట ఒక్క వృత్తాలు ఉన్నాయి. ఇవన్నీ ట్యూన్లే. కవి చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బావుంటుందో నువ్వే ఎంచుకొని అది రాయి. ట్యూన్‌కి రాయడం సాధారణ ప్రక్రియ. ట్యూన్ ఓకే చేసేశాం సార్ అంటుంటారు. ఓకే చేయాల్సింది నేను కదయ్యా అనిపిస్తుంది (నవ్వుతూ). ► నిర్మాత సంకల్పంలో లోపం ఉండదు. మంచి సినిమా తీయాలనే అనుకుంటారు.. అందరూ గౌరవించాలి. నేను నిర్మాతల రచయితను. ఇది వరకు పాటను రాత్రిళ్లు రాసేవాడిని. ఆరోగ్య రీత్యా ఇప్పుడు కొంచెం తగ్గించాను. అయినప్పటికీ రాత్రుళ్లే రాస్తున్నాను. పాట ఎందుకు? కథ అడగని పాట ఎందుకు? ఇటీవల హిట్ అయిన సినిమాల్లో పాటలు గుర్తున్నాయా? వస్తున్నా సరే క్షమించి కూర్చుంటున్నారు. అంత అక్కర్లేని, ఆనందింపజేయలేని పాట పెట్టే బదులు ఆ పాటకు అయ్యే ఖర్చు మిగిల్చుకోవచ్చుగా. ఈ విషయం నిర్మాతలకు చెప్పాలి అనిపిస్తుంది. ఆరు నుంచి నాలుగుకు పడిపోయాయి. ఇప్పుడు మూడు అయ్యాయి. మెల్లిగా పల్లవి, ఆ తర్వాత రెండు వాక్యాలు చిత్రీకరిస్తున్నారు. పాట ఎందుకుండాలో, ఎప్పుడుండాలో అని కూర్చుని ఆలోచించి అవసరమైతే పెట్టండి. పాటలు ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఉన్నంతకాలం పాటలుంటాయి. ఆ భావాల్ని రాయను ఏ పరిస్థితుల్లోనూ స్త్రీని కించపరచలేను. ఆమె పాత్ర ఏదైనా అవ్వొచ్చు. సెక్స్ వర్కర్ అవ్వొచ్చు. క్లబ్ డ్యాన్సర్ అవ్వొచ్చు. ఎంత ఘాటు శృంగారం అయినా, మోటు శృంగారం అయినా రాస్తాను. అది కూడా నా తల్లితోటి, చెల్లితోటి వినగలిగేలా రాస్తాను. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటల్ని రాయను. జీవితం ఏదైనా నేర్పుతుంది. బలవంతంగా జీవితం నేర్పే పాఠాల్ని వదిలేసి వయసు మళ్లే దాకా నాలుగు గోడల మధ్య చదివేదే చదువు అంటున్నాం. మనకు నాలుగు భాషలు రావు. ఆటో డ్రైవర్‌కి వస్తాయి. ఎలా? అవసరం. పాట పదాలలో లేదు. మాటల్లో కానీ, అక్షరాల్లో కానీ లేదు. వాటి పోహళింపు మధ్య ఉన్న నిశ్శబ్దంలో ఉంది పాట. కేవలం పదాల పదాల ప్రయోగం నుంచి బయట పడినప్పుడే సినీ గీత రచయితలు మంచి పాటలు రాయగలుగుతారు. -
అలాంటి పాటలు రాయలేను: సిరివెన్నెల
సాక్షి, హైదరాబాద్ : స్వరం కూడా ఒక బురద.. అందులోనే పద్మాలు వికసిస్తాయని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ పైవిధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీకి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఎన్నో యేళ్లుగా తాను చేస్తున్నసాహితీ వ్యవసాయానికి ఒక గుర్తింపు దక్కిందని, తనను పరిచయం చేసిన కె. విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని తెలిపారు. సిరివెన్నెలకు పద్మశ్రీ ఎందుకివ్వాలో కేంద్రానికి చెప్పిన ప్రతి ఒక్కరికి తన నమస్సులు తెలియజేశారు. సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై తనను పాటలు రాయమని అడగకండని చెప్పేవాడినని, పద్యం రాయడం రానందు వల్ల పాట రూపంలో తన అనుభూతులను పంచుకనేవాడినని తెలిపారు. తన అనుభూతులన్నీ పాటలుగా రాసేవాడినని, కఠినమైన పాట రాసేంత భాష తనకు రాదని చెప్పుకొచ్చారు. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా తన పాటలు ఉండాలని అనుకున్నానని, తన ప్రతి పాటను అవార్డ్‌గానే భావిస్తానన్నారు. లాలిజో లాలిజో పాట.. గుమ్మాడి గుమ్మాడి.. పాటలు తన బాగా నచ్చుతాయన్నారు. అష్టయిశ్వర్యాలకంటే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమన్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ రాయమని వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందింగా ఉంటుందన్నారు. -
‘సైరా’కు సింగిల్ కార్డ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోని అన్ని పాటలను సీనియర్ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాస్తున్నారు. ఈ విషయాన్ని హీరో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన్ను కలిసి చిరు ఈ విధంగా స్పందించారు. ‘సిరివెన్నెలగారు నేను హీరోగా నటించిన రుద్రవీణకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అప్పుడే ఆయనకు జాతీయ అవార్డు రావాల్సి ఉన్న ఒక్క ఓటుతో మిస్ అయ్యారు. ఇప్పుడు సైరాకు ఆయన అన్ని పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది’ అన్నారు.ఔ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, తమన్నా, సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన చిరంజీవి -
‘సిరివెన్నెల’ను కలిసిన చిరు
తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం.. అన్నట్టు బిరుదులు, అవార్డుల వెంట సిరివెన్నెల సీతారామశాస్త్రి పరుగెత్తడు.. ఆయన వెనకే అవన్నీ పరుగెత్తుతాయి. మధురమైన పాటలనే కాదు, ఆలోచనలు రేకెత్తె గీతాలను కూడా సృష్టించగలరు. అన్ని రకాల పాటలు ఆయన కలంలోంచి పుట్టాయి. ఎన్నో రాగాలకు పదాలతో ప్రాణాలు పోశారు. ‘సిరివెన్నెల’తో ప్రయాణం మొదలవ్వగా.. నేటి వరకు ఆయన తన పాటలతో అందరినీ అలరిస్తున్నారు.. ఆలోచింపజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డుని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన్ను సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలియజేశారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మంచి గీతాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పలు వేదికలపై సిరివెన్నెల ప్రస్థావించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజా, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లాంటి ప్రముఖులు సిరివెన్నెలను కలిసి తమ అభినందనలు తెలిపారు. -
పద పద్మం
-
నాకు పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉంది
-
ఉద్యోగం చేసే సమయంలో ఆర్ఎస్ఎస్లో ..
విశాఖపట్నం : భారత ప్రభుత్వ ఉన్నత పురస్కారం పద్మశ్రీ సిరివెన్నెలను ముద్దాడింది. ప్రజాస్వామ్య విలువలను, సమాజ శ్రేయస్సును ముందుండి నడిపిన ఆ పద సంపదకు సముచితస్థానం లభించింది. సందేశాత్మక సిన గేయ రచయితగా సుప్రసిద్ధులైన సిరివెన్నెల సీతారామశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం సినీ గేయరచయిత సిరివెన్నెలకు పద్మశ్రీ అవార్డును శుక్రవారం ప్రకటించింది. మూడు దశాబ్దాలుగా సినీ వీధిలో తనదైన ముద్రవేయడంతో పాటు సమాజాన్ని మెల్కోలిపే అనేక సందేశాత్మక గీతాలకు ఆయన ప్రాణం పోశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆయనకు పద్మశ్రీ లభించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లితో విడదీయరాని అనుబంధం సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేబోలు సీతారామశాస్త్రి. ఆయన తండ్రి సీవీ యోగి వేదపండితుడు. తల్లి అమ్మాజి గృహిణి. అనకాపల్లిలోని గాంధీనగర్‌లో వారి నివాసం. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. అనకాపల్లిలోని మునిసిపల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆయన ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి బీఎస్ఎన్ఎల్ అనకాపల్లి శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసే సమయంలో ఆర్ఎస్ఎస్లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక దేశభక్తి గీతాలు రాసే అలవాటు ఉన్న ఆయన అనేక కార్యక్రమాల్లో గీతాలు సైతం ఆలపించేవారు. 1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుసుకునే అవకాశం ఆయనకు లభించింది. సీతారామశాస్త్రి ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ ఆయన చిత్రం సిరివెన్నెలలో పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. సినిమాలో ఆ పాటలకు మంచి గుర్తింపు లభించి సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా సుపరిచితమైంది. అనంతరం 3 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఎన్నో సందేశాత్మక గీతాలు రాసిన సిరివెన్నెల అద్వితీయమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు పద్మశ్రీ లభించడం పట్ల అనకాపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా హర్షతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది. 2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలను పద్మ విభూషణ్ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్ లాల్(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది. నర్తకి నటరాజ్, ఖాదర్ ఖాన్ కరియా ముండా, మోహన్‌లాల్ రైతు నేస్తం వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ లభించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు 1994 నుంచి హైదరాబాద్‌లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. 2001 నుంచి 2004 వరకు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి కలత చెందిన వెంకటేశ్వరరావు రైతు రాజులా బతకటానికి తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2005లో రైతునేస్తం మాసపత్రికను ప్రారంభించారు. మొదటి సంచికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2012లో ప«శునేస్తం మాస పత్రికను, ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 2014లో ప్రకృతి నేస్తం మాస పత్రికను ప్రారంభించారు. తన ఆలోచనలను పుస్తక రూపంలో అందిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటుచేసి, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొర్నెపాడు గ్రామంలో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 వారాలకు పైగా తరగతులను నిర్వహించి 4000 మంది పైచిలుకు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి సూచనల ప్రకారం.. చిరుధాన్యాల సాగుపై రైతునేస్తం తరఫున పుస్తకాలు ప్రచురించారు. వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఆయన స్వగ్రామం కొర్నెపాడులో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవార్డును రైతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. సాక్షి ‘సాగుబడి’ తన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. నలుగురికి ‘కీర్తి చక్ర’ దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ను నలుగురు జవాన్లు పొందారు. వీరిలో జాట్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు లభించింది. ఎమర్జెన్సీపై గొంతెత్తిన నయ్యర్ ప్రముఖ జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్త, దౌత్యవేత్త కుల్దీప్ నయ్యర్ అవిభక్త భారత్‌లోని సియాల్ కోట్(ప్రస్తుతం పాకిస్తాన్)లో 1923, ఆగస్టు 14న జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఉర్దూ పత్రిక అంజామ్ లో రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అదే పత్రికలో రిపోర్టర్‌గా చేరారు. దేశవిభజన అనంతరం కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చేశారు. ఆయన ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక ఢిల్లీ ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కేంద్ర మాజీ హోంమంత్రి గోవింద్ బల్లప్పంత్కు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా పత్రికలపై సెన్సార్షిప్ను వ్యతిరేకించడంతో ఇందిర ప్రభుత్వం ఆయన్ను తీహార్ జైలులో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయన్ను లండన్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. కుల్దీప్ నయ్యర్ 1997లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో రామ్‌నాథ్ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బియాండ్ ది లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, స్కూప్, ఎమర్జెన్సీ కీ ఇన్సైడ్ స్టోరీ, వాల్ ఎట్ వాఘా తదితర పుస్తకాలు రాశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన నయ్యర్ 2018, ఆగస్టు 23న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. పాండవని కళలో ప్రసిద్ధురాలు తీజన్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తీజన్ బాయి (62) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన జానపద గాయకురాలు. ఆమెకు 1987లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. మహాభారతం నుంచి పాండవుల వీరగాథలను ఆమె ఏకకాలంలో సంగీత వాద్యాలను ఉపయోగిస్తూ, జానపద గేయాలు పాడుతూ వివరిస్తారు. దీనినే పాండవని కళ అంటారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎంతో కృషి చేసి ఈ స్థాయికి చేరారు. భిలాయ్ పట్టణానికి సమీపంలోని గణియారి గ్రామంలో గిరిజన తెగకు చెందిన చంక్లాల్ పార్ధి, సుఖవతి దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానంగా తీజన్ బాయి జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అప్పటికే ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తికి తీజన్ బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతా ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఇక ఆమె అత్తారింటిని వదిలి వచ్చేశారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎంతో కాలం నిలువలేదు. ఛత్తీస్‌గఢ్‌లో లెక్కలేనన్ని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన ఆమె, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, నాటి యూఎస్ఎస్ఆర్, సైప్రస్, ట్యునీషియా, టర్కీ, మాల్టా తదితర అనేక దేశాల్లోనూ పర్యటించి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఆమె ఎంతో వినమ్రతతో అణుకువగా ఉంటారు. ఎదురులేని నేత ఒమర్ గులెహ్ ఆఫ్రికా దేశమైన జిబౌటీని గత 20 ఏళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న ఇస్మాయిల్ ఒమర్ గులెహ్(72) ఇథియోపియాలో 1947, నవంబర్ 27న జన్మించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక జిబౌటీకి వలసవెళ్లారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న జిబౌటీలో 1968లో ప్రభుత్వఉద్యోగిగా చేరారు. రెండేళ్లలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ‘జిబౌటీ టుడే’ వార్తాపత్రికను ప్రారంభించారు. 1977లో స్వాతంత్య్రం పొందాక జిబౌటీ తొలి అధ్యక్షుడు, తన బంధువైన హసన్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఏకంగా 22 ఏళ్లు పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న హసన్ తన వారసుడిగా గులెహ్ పేరును ప్రతిపాదించారు. చైనా ఇప్పటికే జిబౌటీలో నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో భారత్ గులెహ్కు పద్మవిభూషణ్‌ను ప్రకటించడం గమనార్హం. మరాఠా నాటక రచయితకు పద్మవిభూషణ్ నాటక–కథా రచయిత, చరిత్రకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరే(96) మహారాష్ట్రలోని పుణెలో 1922, జూలై 29న జన్మించారు. ఆయన రచనల్లో 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవితం, పాలన ఆధారంగా రాసినవే ఎక్కువగా ఉన్నాయి. శివాజీ పాలనపై పురందరే రాసిన ‘జనతా రాజా’ అనే నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందింది. చరిత్రపై అమితాసక్తి చూపే పురందరే.. రాజా శివ ఛత్రపతి, కేసరి వంటి పుస్తకాలను రాశారు. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007–08 సంవత్సరానికి కాళిదాస్ సమ్మాన్ అవార్డును ప్రకటించింది. అలాగే 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందించింది. -
స్టెప్పుకి మెప్పు
డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు. ‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు. డైరెక్షన్ మారింది తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది. -
పాట పరవశించింది
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. సిరి శక్తి సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే. కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది. -
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను శుక్రవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నలుగురికి పద్మ విభూషణ్, 14 పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్ పొందిన వారిలో ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్‌కుమార్ మణీబాయ్, బల్వంత్ మెరేశ్వర్ పురందరే, టీజెన్ బాయ్‌లు ఉన్నారు. మాళయళ నటుడు మోహన్ లాల్‌ను, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌లను పద్మ భూషణ్ వరించింది. పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిలో కొందరు... ద్రోణవల్లి హారిక(చెస్ క్రీడాకారిణి) సిరివెన్నెల సీతారామశాస్త్రి(గేయ రచయిత) యెండవల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయ వేత్త) ప్రభుదేవా(కొరియోగ్రాఫర్) మనోజ్ బాజ్ పాయ్(నటుడు) సునీల్ చెత్రీ(పుట్‌బాల్ ప్లేయర్) గౌతమ్ గంభీర్(క్రికెటర్) శివమణి(డ్రమ్మర్) పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘సంక్రాంతి అంటే అదే’
సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. స్వాగతం మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం. రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం. – సుద్దాల అశోక్‌తేజ సమైక్య క్రాంతి పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి. ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి. ఎలక్ట్రికల్ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). – సిరివెన్నెల అందుకే ఈ పండగంటే ఇష్టం సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం. కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు. – గోరటి వెంకన్న, కవి అలా రెండు సంక్రాంతులు గడిచాయి సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్ ఫేవరేట్ ప్లేస్ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి. విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది. – శ్రీమణి ఇది కర్షకుల పండగ పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. – రామజోగయ్య శాస్త్రి -
దర్శకేంద్రుడి సారథ్యంలో డాన్స్ డాక్యుమెంటరీ
విద్య, విజ్ఞానం, సంస్కృతి, కళల ద్వారా సమాజ సేవ చేయడమే లక్ష్యంగా గత 10 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న పద్మా మోహన్ గారి సారధ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఆధ్యాత్మ రామాయణం- బాలకాండ’. ఆంధ్ర నాట్యం మీద అవగాహన కల్పించడానికి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలతో ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను శ్రీమతి దెందులూరి పద్మామోహన్, ఆమె కుమార్తె దెందులూరి మూర్తి అఖిల జ్యోతి స్వయంగా నర్తించి సమర్పిస్తున్నారు. కళాకృష్ణ నృత్య దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణ నేతృత్వ సారధ్యంలో మీర్ దర్శకత్వంలో ఈ డాక్యమెంటరీ రూపొందింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య విశిష్ట కృషి పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అందజేశారు. రామకమల్ ల్యాబ్స్ ప్రొప్రైటర్ పి.ఎస్.శ్రాస్త్రి, ప్రఖ్యాత హరికథా విద్వాంసురాలు శ్రీమతి ఉమామహేశ్వరి, ప్రముఖ యోగా శిక్షకులు జి.చంద్రకాంత్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘మన పిల్లలకి సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవశ్యకతను గుర్తించి ఓ షౌండేషన్‌ను స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నళినీ మోహన్, పద్మా మోహన్‌లకు అభినందనలు తెలుపుతున్నాను’ అన్నారు. నృత్య దర్శకుడు కళా కృష్ణ మాట్లాడుతూ - ‘నాట్యంలోని అభిరుచి గురించి ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్న దెందులూరి ఫౌండేషన్‌కు నా సహకారం ఎప్పుడూ ఉంటుంద’న్నారు. -
‘రంగు’లో హీరోలు విలన్లు ఉండరు
నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ... ‘టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’ అని రాజ్ కందుకూరి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..‘ చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా. గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేశారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్లా మిగలుతుంది. ఈ సినిమాతో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దిగ్గజాలతో కలసి పనిచేసినందుకు గర్వంగా ఉంది.. హీరో తనీశ్ మాట్లాడుతూ..`నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనందమేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జరుపుకుంటున్న తొలి ఫంక్షన్. ఈ మూడు కారణాలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయగారు సినిమాను నాతో చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇందులో హీరోలు, విలన్స్ లేరు.. అన్ని పాత్రలే. ప్రతి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదనే విషయాలను నేర్పిస్తుంది. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యోగీశ్వర శర్మ, సినిమాటోగ్రాఫర్: టి.సురేందర్ రెడ్డి. -
ముప్పై ఏళ్ల వెలుగు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు. ఒక కన్ను ఎస్.డి. బర్మన్ ‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్‌గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది. ఇంకో కన్ను సీతారామశాస్త్రి ‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట. కళ్ల నిండా జ్ఞాపకాల తడి ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు. కంటికి కనిపించిన పాట అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్‌గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది. కంటిని నడిపించిన పాట మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు. ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్‌లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు. (‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ సిరివెన్నెల సీతరామశాస్త్రీ
-
ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వ్యక్తుల్లో ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మహోన్నత స్థానముందని, ప్రతీ వారిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఏలూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తనను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ఏలూరు నగర ప్రజల ఆత్మీయతను ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు. చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సినీ సాహిత్యాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లిన ఘనత సీతారామశాస్త్రికే దక్కుతుందన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉగాది పురస్కారం అందించి దంపతులకు ఘన సన్మానం చేశారు. తొలుత మాచిరాజు వేణుగోపాల్, మాచిరాజు కిరణ్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి టీవీ యాంకర్ చిత్రలేఖ, కేఎల్వీ నరసింహం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అనంతరం బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి మహిళ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సిరివెన్నెల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పారిశ్రామికవేత్త అంబికా రాజా, ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్, ఎంబీఎస్ శర్మ, కె.కృష్ణమాచార్యులు, ద్రోణంరాజు వెంకటరమణ, తోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అదే కదా ఉగాది
అన్ని రోజులూ ఒకలా ఉండవు. అలా అని ప్రతి రోజూ పండగలా ఉండకూడదని కాదు. నిజానికి ప్రతిరోజూ ఉగాది కావాలి. అన్ని భావోద్వేగాలనూ షడ్రుచులలా ఆస్వాదించాలి. సిరిలాంటి మాటలు..వెన్నెల్ లాంటి భావాల‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఇంటర్వ్యూను ఆస్వాదించండి. ► సిరివెన్నెలగారిది అచ్చ తెలుగు సాహిత్యం. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. ఈ సందర్భంగా బాల్యంలో మీరు జరుపుకున్న ఉగాదిని గుర్తు చేసుకుంటారా? సాధారణంగా బాల్యానికి శ్రమను, ఉత్సాహాన్ని, ఇష్టాన్ని కలిగించేవి వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతికి భోగి మంట. వినాయక చవితి పత్రి కోసం అడవిలోకి వెళ్లేవాళ్లం. దీపావళికి నెల ముందు నుంచీ మందుగుండు సామగ్రి తయారు చేస్తూ చేతులు కాల్చుకునేవాళ్లం. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామేమో అని పెద్దవాళ్లు కంగారుపడేవాళ్లు. ఉగాది గురించి పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేవు. ఉగాది అంటే ఉదయాన్నే పచ్చడి తినటం. ఏ పండగైనా సరే పులిహోర, గారెలు, పాయసం అన్నీ ఉంటాయి. ఆ వయసులో తిండి యావ ఉంటుంది. నా బాల్యంలో ఆటపాటలు ఎక్కువగా లేవు. నా జీవితం ఎక్కువగా లైబ్రరీలోనే గడిచింది. ► వేపపూత కోసం చెట్టెక్కిన సందర్భం మిగతా రోజుల్లో అయితే చెట్టెక్కితే కాళ్లు విరగ్గొట్టే వారు. ఆరోజు మాత్రం చెట్టెక్కితే ఏమీ అనేవాళ్లు కాదు. ► ఉగాది రుచుల్లో మీకు ఏది ఇష్టం? ఆరు రుచులు కలిసిన ఒక కొత్త రుచితో ఉగాది పచ్చడి తయారవుతుంది. ఆ రుచి ఇష్టం. మా చిన్నప్పుడు చేసిన పచ్చడిలాగా ఇప్పుడు చేయడం లేదు. మా అప్పుడు చిక్కగా ఉండేది. ఇప్పుడు పల్చబడిపోయింది. ఏం లోపించిందో చెప్పలేను కానీ కచ్చితంగా తేడా వచ్చింది. ► మీకు పచ్చడి చేయడం వచ్చా? వంటలో ప్రవేశం ఉందా? వంట మీద ఆసక్తి లేదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పప్పు, చారు నేర్చుకున్నాను. వంకాయ, బంగాళ దుంప, టమాటా.. మూడూ కలిపి కూర చేయడంవచ్చు. ఇప్పుడు ఇటు పుల్ల అటు పెడదామనుకున్నా అదేదో అపరాధం అనుకుంటారు నా భార్య, పిల్లలు. తన వల్లే నేను వంట మర్చిపోయాను. నాకు ఏ మూడు కూరలు ఇష్టమో తను అందులో స్పెషలిస్ట్. నేను వండుకున్న రోజుల్లో గ్యాస్ స్టౌ లేదు. అందుకే గ్యాస్ స్టౌ అంటే తెలియని ఫోబియా. అది ఎటు తిప్పితే ఆన్ అవుతుందో కూడా తెలియదు. ► ఉగాదికి మీరు తీసుకోబోయే కొత్త సంకల్పం ఏంటి? ఏమీ లేదు. అందరికీ నేను చెప్పదలచుకున్నది కొత్త సంకల్పం ఏమీ తీసుకోవద్దని. ‘మనో వాక్కాయ కర్మణే’ అంటారు. ముందు మనసులో సంకల్పించాలి. తర్వాత దాన్ని మాటతో అనాలి. ఆ తర్వాత చేత. ఒకసారి సంకల్పించుకుంటే ఆ పని మొదలైనట్లే. సంకల్పించుకోవ టానికి ఒక రోజు ఎందుకు? తలచుకుంటే ప్రతిరోజూ యుగాది. యుగాది అంటేనే అంతకు ముందు యుగంలో లేనిది ఆ రోజుతోనే మొదలయ్యేది అనే అర్థం వస్తుంది. ప్రతిరోజూ సూర్యుడితో పాటు మళ్లీ పుట్టాను అనుకో. నిత్యం శుభాన్నే సంకల్పించుకుందాం. దీని కోసం జనవరి ఒకటి నుంచి, ఇంకెప్పుడో అని అనుకోవక్కర్లేదు. ► ప్రపంచం పరిగెడుతోంది. ఈ పరుగులో ఉద్వేగాలు కోల్పో తున్నాం. పోటీ తప్ప మరోటి లేదు. ఈ పరిస్థితి గురించి? ఓ ఇరవై, ఇరవై ఐదేళ్ల నుంచి కొంచెం విపరీతాలు.. పైత్యం ఎక్కువ చేస్తున్నాం. జీవితం గురించి ఏమీ మాట్లాడుకోవడంలేదు. జీవితం నుంచి తప్పించుకు పారిపోయేవే చేస్తున్నాం. అసలు కొట్టుకోవడమేంటి? కొట్టుకోవ డం అనే కాన్సెప్ట్ విచిత్రమైన విషయం. గట్టిగా తిట్టుకోవాలంటే అవమానంగా అనిపిస్తుంది. మన అందరిలోనూ సున్నితత్వాలు పోతున్నాయి. అందుకే సినిమాల్లో కూడా ఒక్కడే పదీ ఇరవై మందిని కొట్టేస్తున్నాడు. సమాజంలో ఉన్న సంక్లిష్టత అంతా చిక్కు పడిపోయిన దారపు ఉండలా ఉండి పోయింది. దీన్ని బాగు చేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? అనే తెలియని కంగారులో ఎవరికి వాళ్లు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూస్తూ కలలు కంటూ కూర్చుంటాం. ‘ఒక్కడు’ సినిమాలో హీరో క్రీడాకారుడు. ‘పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం’ అని పాట రాశాను. అలాగే ‘గోల్కొండ హైస్కూల్’లో ‘మొదలెట్టక మునుపే ముగిసే నడక కాదే మన పయనం, సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే యుద్ధం’ అని రాశా. పాట అంటే మనసుకు ఆనందాన్నిచ్చేది, ఆహ్లాదాన్ని కలిగించేది. ఇవాళ పాటల పోటీ అని పెట్టి, ‘మీరు ఓడిపోయారు.. మీరు గెలిచారు’ అని చెప్పటం మూలానే అసలు గెలుపనే మాటకు అర్థం తీసేశారు. పోటీలు పెట్టకండి. ఇలాంటి దౌర్భాగ్యపు భావాల్ని పెంపొందించకండి. యుద్ధం అంటే గెలిచాడు.. ఓడిపోయాడని కాదు. యుద్ధానికి నేను సిద్ధం అన్నప్పుడే గెలిచినట్టు. మన జీవితంలోకి ఇది అన్వయించుకుంటే ఏ కష్టం కష్టంలా తోచదు. ► బడి చదువుకి, జీవితపు చదువుకి తేడా చెబుతారా? బడి చదువులు సులభమైనవి. జవాబులు చెప్పి, తర్వాత ప్రశ్నలు వేస్తుంది. కానీ జీవితపు చదువు ముందు ప్రశ్నేసి తర్వాత సమాధానం నేర్పుతుంది. జీవితం అక్కడ గొయ్యి ఉందని చెప్పదు. ముందు పడేస్తుంది. ఆ పడటం మనకు జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. శివరాత్రి రోజు భక్తితో పస్తుంటాం. ఒకరోజు అన్నం లేకా పస్తుంటాం. అప్పుడు భక్తితో ఊగిపోయాం, ఇప్పుడు ఆకలితో తల్లడిల్లిపోయాం. ఆకలి పస్తును భక్తి పస్తే అనుకుంటే ఇష్టంగా పస్తుంటాం. ► ‘తెలుగు పాట’లో పరభాష పదాల తాకిడి ఎక్కువైందనే వాదన ఉంది. ఈ పరిస్థితి మారాలంటే మీరిచ్చే సలహా? ఈరోజుల్లో అందరి సంస్కృతులు అందరికీ పరిచయం అవుతున్నాయి. చచ్చేలోపు కాశీకి పోకపోతే పుణ్యం రాదనుకుంటాం. ఇప్పుడు అమెరికాకు వెళ్లకపోతే బతుకు లేదనుకుంటున్నాం. ఇలా దేశవిదేశాల తాలూకు వివిధ సంస్కృతుల కలబోతలలో స్వీయ సంస్కృతులను, మనం పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోయి ఎదుగుతున్నాం. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవద్దు అనటం లేదు. కానీ పాట అనగానే షకీరా పాడిన పాటను తీసుకువచ్చి ఇక్కడ పెడతానంటే నువ్వు ఏ భావాన్నీ కలిగించలేవు. సినిమా పాటలలో చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం పరిపూర్ణంగా విస్మరించబడుతోందని నా అభిప్రాయం, అభియోగం కూడా. దీనికి కారకులు ఎవరంటే ఇచ్చేవాళ్లూ.. పుచ్చుకునేవాళ్లు. ఈ మధ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కూడా పట్టుమని ఒక్క పాట కూడా నిలబడలేదు. నిర్మాతలకు నేను చెప్పేది ఏంటంటే పాట అంటే ఆరు లక్షల నుంచి ఆరు కోట్లు వరకు ఖర్చు అయ్యే ప్రొడక్ట్. అలాంటి పాట పట్ల అంత అశ్రద్ధ ఏంటి? సినిమా బావుంటే పాట లేక పోయినా చూస్తారు అనే స్థితికి ప్రేక్షకులు వెళితే పాటలు తీసేయ్. డబ్బులు మిగులుతాయి కదా. లేదా ఈ పాటలు మాకు కావాలని వాళ్లు తహతహలాడాలి. పూర్వం తహతహలాడే వారు. సాహిత్యం కాకపోయినా ఆ సంగీతం అయినా చాలా కమ్మగా ఉండేది. ఆ రోజుల్లో విశ్వనా«థ్గారి సినిమాల్లో ఒక పాట కూడా మిస్ అయ్యేవారు కాదు. ఆ పాట ఏదో చెబుతుంది. ఈరోజుల్లో తెలుగు పాట నిద్రావస్థ స్థితిలో ఉంది. నేను ఆశావాదిని. నిద్ర అంటే లేస్తాం. నిదనం అంటే చావు. ఇది నిద్ర తప్ప నిదనం కాదు. ఈ ఉగాది సందర్భంలో అయినా మంచి పాట కావాలని మీరు, చేయాలని నటులు అనుకుంటే సరిపోతుంది. ► మీరు అనేక దేశాల్లోని తెలుగువాళ్లను కలుస్తుంటారు. తెలుగుదనాన్ని కాపాడుకోవడంలో అక్కడివాళ్ల చిత్తశుద్ధికి, ఇక్కడివాళ్ల చిత్తశుద్ధికి ఎలాంటి తేడా గమనించారు? నిస్సంశయంగా ఇక్కడికంటే అక్కడే బాగుంది. వాళ్లు ఎందుకు వెళ్లినప్పటికీ కూడా ఒక ‘నోస్టాలిజిక్’ ఫీలింగ్ ఉంటుంది. అది మానవ సహజం. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారేటప్పుడు మొత్తం సామానంతా పట్టుకెళ్లలేం. నా చిన్నప్పటి సంగతి చెబుతున్నా. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లేటప్పుడు అయిష్టంగా రుబ్బు రోలు ఇచ్చేస్తాం. ఆ బరువు తీసుకెళ్లలేక (నవ్వుతూ). వాళ్లు ఇక్కడ ఉంటే చేసుకుంటారో లేదో చెప్పలేం. ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నవి అక్కడికెళ్లాక చేసుకోలేకపోతున్నాం అనే బెంగ ఉంటుంది. ఆ బెంగ వల్ల చేసుకుంటున్నారు. కష్టపడి వేప పువ్వు సంపాదించుకుని పచ్చడి చేసుకుంటున్నారు. వాళ్ల దేశాలు ఒప్పుకోకపోతే ఇంట్లో గుట్టుగా ఎలక్ట్రికల్ భోగి మంటైనా వేసుకుంటున్నారు. అక్కడికెళ్లినప్పుడు నేనేం చెప్పానంటే... ‘‘పండగ పరమార్థం తెలుసుకుని చేయండి. అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిషు మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి,‘బొహియల్లో బొహియల్లో’ అని తిప్పకండి. మీకు సంక్రాంతి కావాలంటే సంక్రాంతి తాలూకు అర్థాన్ని చెప్పండి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదీ సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. ఆ రోజు తెలుగువాళ్లందరూ ఒకచోట కలవండి. అవసరమైన వాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. ► తెలుగువారి ఖ్యాతికి జాతీయ స్థాయిలో న్యాయం జరుగుతోందని మీకనిపిస్తోందా? ‘పద్మ’ అవార్డుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అవార్డులనేవి ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఐదారుగురు కూర్చుని, ఇవ్వబడిన తక్కువ సమయంలో అనేకమైన సినిమాలు చూసి, గబగబా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, ఇంకా ఇతరత్రా పైరవీలు.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక అవార్డు ద్వారా నీ విలువను నిరూపించకూడదు. ఒక విలువని గుర్తించి, గౌరవించడం కోసమే అవార్డు పుట్టింది కానీ అవార్డుల కోసం విలువ పుట్టలేదు. ఏనాడైతే నువ్వు రాసిన పాట పది మంది పెదాల మీద కూనిరాగాలు తీస్తుందో అదే పెద్ద అవార్డు కింద లెక్క. అది కాకుండా చెక్కముక్క మీద పద్మశ్రీ రాసి ఇస్తే, అది నా గోడకు తగిలించుకుంటే ఏం ప్రయోజనం? అంటే.. రాక ఏడుస్తున్నావా? అని మీరు అనొద్దు. నాకన్నా అవార్డులు పొందినవాళ్లు తెలుగులో ఎవరూ లేరు. అవార్డులు తీసుకుంటున్నప్పుడు నేను ఒకటే చెబుతా... మనం పెట్టుకున్నటువంటి, మనం విధించుకున్నది ప్రభుత్వం. తప్పూ తేడా ఉంటే సరిదిద్దుకుందాం. మనం ఏర్పాటు చేసుకున్న మన వ్యవస్థను గౌరవించుకోవడానికి సంకేతం కోసమే అవార్డులను స్వీకరిస్తాను తప్ప అవార్డు వచ్చిన ఆ పాట మాత్రమే గొప్పది అని కాదు. దాని విలువను జడ్జి చేయడానికి అక్కడ కూర్చున్న కమిటీ సరిపోదు.. సమయమూ సరిపోదు. అసలు నేను ‘పద్మశ్రీ’ తెచ్చు కునే ఇండస్ట్రీకి వచ్చాను అని ఆ మధ్య ఓ సందర్భంలో అన్నాను. నా భార్య పేరు ‘పద్మ’ (నవ్వుతూ). నా జీవితాన్ని ఇవాళ మీరొచ్చి ఇంటర్వ్యూ అడిగేదాకా తీసుకొచ్చింది ఆవిడే. ఈ వెన్నెల్లో ‘సిరి’ ఆవిడే. ► తెలుగు సంప్రదాయాల్ని మీ ఇంట్లో ఎలా మార్గదర్శకత్వం చేస్తుంటారు? నేను నమ్మేది ఒక్కటే. పిల్లలకు ఏమీ చెప్పడానికి ప్రయత్నించొద్దు. పిల్లలు చాలా చురుకైన మేధస్సు కలిగినవాళ్లు. వాళ్ల మెదడు ఖాళీగా ఉంటుంది. గబగబా నింపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండు కళ్లతో ప్రపంచాన్ని తాగేయడానికి చూస్తుంటారు. వాళ్లకు ఏం కనిపించాలి? వాళ్ల చెవులు ఏం వినాలి? వాళ్ల చేతులు ఏం పుచ్చుకోవాలి? అన్నది మొట్టమొదట వేసుకో వాల్సిన ప్రశ్న. అమ్మా నాన్న ఇద్దరూ ఏం మాట్లాడు కుంటే వీళ్లేం వింటారు. సో.. ఇంట్లో జీవించండి. ఆడదాని నుంచి ఇల్లాలివై, ఆ తర్వాత అమ్మ అయ్యావు. ఒక మగాడివై భర్త అయ్యి, తండ్రి అయ్యావు. దానికి తగ్గట్టు ఇద్దరూ జీవించాలి. మీలో అంతవరకూ ఏమైనా లోపాలుంటే దిద్దుకుని ఇంతకు మునుపు లేని విలువలు తెచ్చిపెట్టుకోవాలి. అంతకు ముందు లక్ష్యం లేకుండా తిరిగితే లక్ష్యం పెట్టుకో. నా పాటల్లో ఇదే రాశాను. నా పాటల్లో ఒకలా జీవితంలో ఒకలా నేను లేను. పాటల్లో చెప్పే నీతినే ఆచరిస్తున్నాను. ► ‘చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే ఉగాది అనుకోమా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ‘మరీ అంతగా మహా చింతగా..’ పాటలో రాశారు. ఎంతో అర్థం ఉన్న ఆ వాక్యం గురించి వివరంగా చెబుతారా? మనకు అవకాశం ఉందని చేదు లేకుండా పచ్చడి చేస్తే ఏదో లోపించినట్టు ఫీలవుతాం కదా. చేదును కోరుకుంటున్నాం. అదీ ఎప్పుడు? జీవితానికి మరో కొత్త ప్రారంభం (కొత్త సంవత్సరం) అనుకుంటున్న రోజు. అదే కదా ఉగాది. ఉగాది పచ్చడి ఆరు రుచులలో చేదు, కారం ఉంటాయి. అవి ఇష్టంగా తీసుకుంటున్నాం. ఆ రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే కష్టాలు వచ్చినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ తల్లడిల్లి పోము. తల్లడిల్లకూడదని కాదు. ఎక్కువ తల్లడిల్లకూడదంటున్నాను. అలా రాయడానికి ఆ సినిమాలో అవకాశం దొరికింది. ఎంతో ఇష్టంగా రాశానా పాట. సంగీతప్రియులకు నచ్చింది. నంది అవార్డు గెలుచుకున్నాను. ► కుటుంబ విలువలను శ్లాఘించే పాటలెన్నో రాశారు. ఇవాళ తెలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయని మీకనిపిస్తోంది? మా చిన్నతనంలో ఉన్నవి కొన్ని డిగ్రీలే. ఏదో గుమస్తా ఉద్యోగమో.. మహా అయితే బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగమో. ఎప్పుడైతే అవకాశాలు తక్కువ అనుకున్నామో అప్పుడు చదువుకుని, ఓ ఉద్యోగం చూసుకునే వాళ్లం. త్వరగా పెళ్లి చేసుకుని, వంశం నిలబడాలి కాబట్టి, పిల్లల్ని కనేవాళ్లం. ఇప్పుడలా కాదు. 40 ఏళ్ల వయసు వచ్చేవరకూ చదువుతూనే ఉంటారు. సెటిల్ కాలేదని పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడంతా 40ఏళ్ల పెళ్లికొడుకు లు, 35 ఏళ్ల పెళ్లి కూతుళ్లు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. వారి స్పర్శ తాలూకు వెచ్చదనం పిల్లలకు ఎక్కడ తెలుస్తుంది? తెలుగు కుటుంబాలు అనేకన్నా ఇవాళ కుటుంబం అనేది భారతదేశంలో విచ్ఛిన్నం అవుతోంది. అనేక రకాల ఆరాటాలు, సమస్యలతో జీవితాన్ని క్లిష్టమయం చేసుకుని ఏం సాధిస్తున్నావ్? ఇవాళ ప్రతి ఒక్కరికీ కారు ఉంది. నా చిన్నతనంలో ఒక్క సైకిల్ ఉండేది. నలుగురైదుగురు సర్దుకునేవాళ్లం. మాకది బాగుండేది. మేం జీవితంలో ఒక్కసారైనా కారు ఎక్కాలని కల కన్నాం. ఇవాళ కళ్లల్లోంచి కలలు కూడా రాలిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ రెండేసి కార్లు ఉన్నాయి. కారు ఉంది కాబట్టి 250 మైళ్ల దూరంలో ఆఫీసు ఉన్నా వెళుతున్నారు. కారు అనేది పరిగెత్తడానికి పనికొస్తోంది... సౌకర్యానికి కాదు. ఈరోజు సాంకేతిక ప్రగతి అనేది మనకు సుఖం ఇవ్వడంలేదు. అంటే వికాసం వద్దనను. 1995లో వచ్చింది సెల్‌ఫోన్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుని చనిపోయే పరిస్థితికి రావడం అనేది ఏ రకమైన సాంకేతిక వికాసం. ఇది అడిగేవాళ్లు లేరు. అడిగితే చెప్పేవాళ్లు లేరు. చెబితే వినేవాళ్లు లేరు. ‘నువ్వంటే నువ్వు కాదు. ఒక వ్యవస్థవి. ఈ వ్యవస్థకి పునాది ఒక కుటుంబం. నీ కుటుంబంలోను, పక్క కుటుంబంలోనూ నీతో పొంతనలేనివాళ్లు ఉంటారు. వాళ్ల కోసం నీ ఇష్టాలను వదులుకుని గడపడమే కుటుంబం, పక్క కుటుంబం. పక్క కుటుంబం ద్వారానే ఊరు, ఊరు ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశం. ఇలా అయితేనే ఎప్పటికైనా నిలబడగలుగుతాం. లేకపోతే క్రమంగా విచ్ఛిన్నం తప్పదు. ► భారతీయులంతా ఒక్కటే అనే భావనతో బతకాలి అంటుంటాం. కానీ నీ ప్రాంతం.. నా ప్రాంతం.. నీ భాష.. నా భాష అంటూ గొడవలు పడుతున్నాం. దీనిపై మీ అభిప్రాయం? ఇటీవల కాలంలో భారతీయత అనే కాన్సెప్ట్ మరుగునపడిపోయి తమ తమ ప్రాంతాలతో తోటి, తమ తమ యాసలతోటి, భాషలతోటి ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. చెట్టు మూలాలను నరుక్కుంటూ బయటికొచ్చేస్తున్న పరిస్థితి. భారత మాత ఒక్కటే. తెలుగు తల్లి, తమిళ తల్లి అని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరం మన తల్లిదండ్రులను దేవతలుగా పూజించాలి అని విశ్వసిస్తాం. మన పుట్టుక ముందు నుంచీ ప్రయాణం ఉంది. చనిపోయాక కూడా మన ప్రయాణం ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న మనం ఇవాళ మన భాష ద్వారా మనం వేరుపడుతున్నాం. ‘నేను బెంగాలీవాణ్ణి కాదు.. నేను తమిళీయుణ్ణి’ అంటున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకవాళ్లు జెండా తయారు చేసుకున్నారు. ఇది వినాశకర ఆలోచన. ఇప్పుడు కూడా మనం తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయింది పరిపాలనా సౌలభ్యం కోసం, భౌగోళికంగానూ, భౌతికంగానూ, రాజకీయంగానూ మారాం. అది తప్పు లేదు. రెండు తెలుగులు లేవు. ఒకటే తెలుగు ఉంది. మనము, తమిళులం, అందరం.. ఈ భారతదేశపు వివిధ శాఖలం అనుకోవాలి. సమైక్యంగా ఉండాలి. ఎవరో పోయారని అదే పనిగా తలుచుకుంటే వాళ్లు మళ్లీ రారు. వాళ్లు మనల్ని ఎంతగాప్రేమించారో గుర్తుపెట్టుకుంటే వాళ్లు మనతోనే బ్రతికి ఉన్నట్టు లెక్క. మన తల్లిదండ్రులుఎప్పుడూ పోరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వయసు వాళ్ల శరీరాల్ని తీసుకువెళ్తుంది. వాళ్లేవాళ్ల ప్రాణాల్ని, ఆత్మల్ని మనలో పెట్టారు. ఆ సంగతి గ్రహిస్తే వాళ్లు పోయినట్టు లెక్క కాదు. – డి.జి. భవాని -
తరలిరాద తనే వసంతం...
రుద్రవీణ చిత్రంలోని ఒక అభ్యుదయ గీతం ఇది. సంగీత విద్వాంసుడి కుమారుడు... అడవిలో కట్టెలు కొట్టుకునే వారి దగ్గరకు వచ్చినప్పుడు, ‘మీ నాన్నగారి సంగీతం వినలేకపోయాం, మీరైనా మాకు పాట వినిపించండి...’ అని కోరినప్పుడు, శ్రామిక ప్రజల కోసం పాడే పాట ఇది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వసంతాన్ని తెలుగు ముంగిళ్లలోకి తెచ్చిన పాట. సహజంగా అభ్యుదయ గీతాల్లో కాస్తంత అలజడిని రేపే లక్షణముంటుంది. కాని అభ్యుదయాన్ని అందమైన వనకన్యలా మలచిన పాట. ఆ పాటలో అభ్యుదయం ఉంటుంది, ఆశలు ఉంటాయి, వికాసం ఉంటుంది. కళ్లు మూసుకుని ఒకసారి వింటే కళ్లు తెరిపించే పాట. జీవితంలోనే శ్రుతిలయలుంటాయి. బ్రతుకు శ్రుతిలో ఉంటే, గుండె చప్పుడులో లయ ఉంటుంది. జీవితమే ఒక నాటకరంగం, అందులో మనమంతా పాత్రధారులం అని వేదాంతం చెప్పిన అంశాన్ని ‘బ్రతుకున కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...’ అని చెప్పారు. ప్రపంచంలో ఎవరి పనులు వారు చేసినా చేయకపోయినా కాలం ఆగదు. కోయిల పాడినా పాడకపోయినా వసంత కాలం వస్తుంది, తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. వసంతం వస్తే కోయిల కూస్తుంది. కోయిల కూసింది కదా అని వసంతం రాదు. వెదురుతో రూపొందిన మురళి పెదవికి తగిలితేనే స్వరాలు పలుకుతాయి. ఎత్తుగడే చాలా అందంగా ప్రారంభించారు సిరివెన్నెల... ‘తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం...’ అంటూ. వసంతం ప్రవేశిస్తేనే వనాలు సౌరభాలు విరజిమ్ముతాయి. వనాల సౌరభాన్ని చూడడానికి వసంతం స్వయంగా వస్తుంది. శ్రామికుల కష్టాన్ని, వారి శ్రమసౌందర్యాన్ని చూడడానికే తాను వచ్చాననే అంతరార్థాన్ని ఇందులో ఎంతో అందంగా వివరించారు. ‘గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా...’ సముద్రాలలో నీరు ఆవిరి రూపంగా మారి ఆకాశం చేరి, మేఘాలుగా మారకపోతే, వర్షాలు పడవు. శ్రామికుడు కష్టపడి పండించకపోయినా, ఏ పని చేయకపోయినా మానవ మనుగడ సాగదు అనే విషయాన్ని భావకవిత్వంలో పండించారు సిరివెన్నెల. –సంభాషణ: డాక్టర్ వైజయంతి -
నన్నయ పూర్వసాహిత్యంపై పరిశోధన అవసరం
సినీగేయ రచయిత సిరివెన్నెల ‘ఆదికవి’ ప్రారంభమైన ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన’ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయకు ముందు కాలంపై కూడా పరిశోధనలు జరపవలసిన అవసరం ఉందని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. నన్నయ కాలం నాటికే తెలుగు భాష ఎంతో పరిణతి చెంది మహాభారతం వంటి హృద్యకావ్యం రాసే స్థాయికి చేరుకుందంటే అప్పటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు భాష ఆవిర్భవించి ఉండవచ్చన్నారు.æ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన – నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై రెండు రోజులు జరిగే జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన కుమారుడు, సినీ సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మతో కలిసి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆదికవి నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మన ఆచార్య సాంప్రదాయాల కంటే సాహిత్యమే ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. వివిధ భాషలు, ప్రాంతాలతో మిళితమైన భారతదేశంలో నాగరికత, జాతీయత పరిఢవిల్లుతున్నాయన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారిలో ఆప్యాయత, అనురాగాలు దర్శనమిస్తాయంటే అందుకు భాషాభిమానమే కారణమన్నారు. నన్నయ పూర్వసాహిత్యంపై త్వరలో సదస్సు నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయ సదస్సు తరహాలోనే సిరివెన్నెల సూచించి నట్టు నన్నయకు ముందు తెలుగు సాహిత్యం, భాష పరిస్థితులపై త్వరలోనే మరొక సదస్సు నిర్వహిస్తామన్నారు. సినీగేయ రచయితగా తెలుగు భాషలోని మాధుర్యాన్ని సిరివెన్నెల తన పాటల ద్వారా లోకానికి తెలియజేస్తున్నారని అభినందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాణి సదాశివమూర్తి, కేంద్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు జి.అరుణకుమారి, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు ఎస్.రఘునాథశర్మ, తెలుగు యూనివర్సిటీ డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ తెలుగు భాష గొప్పదనం, పరిశోధన అంశాలను వివరించారు. ప్రత్యేకంగా ముద్రించిన సాహిత్య సమాలోచన పత్రికను ఆవిష్కరించారు. డీ¯ŒS ఆచార్య ఎస్.టేకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, తెలుగు శాఖ సమన్వయకర్త తలారి వాసు, సదస్సు డైరెక్టరు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, సహాయ ఆచార్యులు డాక్టర్ కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, డాక్టర్ లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు. విశ్వనాథని మించిన కవి ఉండబోరు తెలుగు సాహిత్యానికి విశ్వకవి విశ్వనాథ çసత్యనారాయణను మించిన కవి లభ్యమవుతారని తాను భావించడం లేదని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన –నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గురువారం ప్రారంభమైన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయ పేరిట ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఒక అదృష్టంగా భావిస్తానన్నారు. కాగా నన్నయకు పూర్వం గురించి కూడా పరిశీలన చేయవలసి ఉందన్నారు. సాహిత్యం కంటే నాటకం ఉత్కృష్టమైనదంటూ తెలుగు భాషాభివృది్ధకి సాంకేతికతను కూడా జోడించాలని సూచించారు. సినీ పరిశ్రమ ఒక ధర్మబద్ధమైన వ్యాపారం, బాధ్యతయుతమైన మాధ్యమంగా పేర్కొన్నారు. ప్రజల ప్రతిస్పందన కనిపించేది చలనచిత్రసీమలోనేనన్నారు. అయితే «ఇటీవల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. టీవీల ప్రభావం అనడానికి లేదని, ప్రతి వ్యక్తీ బిజీ లైఫ్‌తో సినిమాకు మూడు గంటల సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాడన్నారు. నిజానికి మన సమాజంలో గొప్ప ఆలోచనాధోరణి ఉందని, ఇక్కడ సాహిత్యం ఎలా ఉండాలి, ఎటువంటి దాన్ని ఆదరిస్తారు అనే ప్రశ్న ఎప్పుడు జవాబు దొరకనిదిగానే మిగిలిపోతుందని అన్నారు. -
విద్యార్థి దశనుంచే సాహిత్యంపై మక్కువ అలవర్చుకోవాలి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల పెద్దాపురం : విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కువ అలర్చుకోవాలని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. ఆయనకు పాఠశాల డైరెక్టర్ సతీమణి చిట్టూరి సమీర సాదర స్వాగతం పలికారు. విద్యార్థులనుద్దేశించి సిరివెన్నెల మాట్లాడుతూ, అమ్మ మాట, అమ్మ పాట, అమ్మ భాష అని పలుకుతూ అమ్మ గొప్పదనాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు బీవీ చలం సిరివెన్నెలపై రచించిన గేయాన్ని చిన్నారులు ఆలపించారు. అనంతరం పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాస్ ‘సిరివెన్నెల దృశ్య రూపకల్పన’ చిత్రపటాన్ని చిట్టూరి సమీర చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డీ¯ŒS బండారు రాజేశ్వరి, కాకినాడ కిడ్స్ చీఫ్ మెంటర్ కనకదుర్గ, ఏఓ శ్రీరామకృష్ణ, లైజా¯ŒS ఆఫీసర్ ఎం.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. సత్యదేవుని సన్నిధిలో.. అన్నవరం : కుటుంబ సభ్యులతో కలిసి సీతారామశాస్త్రి సోమవారం రాత్రి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీస్సులందజేసి, ప్రసాదాలు బహూకరించారు. సిరివెన్నెలను దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. సిరివెన్నెల వెంట తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రకాష్ తదితరులున్నారు. -
ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాన్ని తాకాలి
సినీ గేయ రచయిత సిరివెన్నెల తుని రూరల్ (తుని) : ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాలను తాకాలన్న సంకల్పమే తనకు గుర్తింపునిచ్చిందని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్లు సంయుక్తంగా వేటూరి కవితా సప్తమ సాహితీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వేటూరి 81వ జయంతి సందర్భంగా తుని చిట్టూరి మెట్రో ఫంక్ష¯ŒS హాలులో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. సీతారామశాస్త్రి మాట్లాడుతూ, వ్యక్తికంటే వ్యక్తిత్వం గొప్పదన్నారు. మానవతా విలువలతో రచనలు పరిపూర్ణంగా ఉండాలని, సాహితీవేత్తకు సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు. కాకినాడలో సినిమా చూస్తుండగా ‘అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, గట్టుమీద గోదారమ్మ, రెల్లిపూలవలే గంతులేస్తుంటే’ అనే పాట వేటూరిపై అభిమానాన్ని పెంచిందన్నారు. ఆ రోజే పాటలు రాసేందుకు ధైర్యం వచ్చిందన్నారు. తన తండ్రి వయస్సే కావడంతో వేటూరిని తండ్రిగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వరశర్మ, ముఖ్య అతిథి యనమల కృష్ణుడు, విజయ ప్రకాష్‌లు సిరివెన్నెల సీతారామశాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించారు. వేటూరి సాహితీ పీఠం 81 పుస్తకాలను బహూకరించింది. ముఖ్యవక్తలు పలువురు సిరివెన్నెల రచనలు, పాటల్లో భావాలను విశదీకరించారు. వేటూరి, సిరివెన్నెల సుమధుర గీతాల సంగీత విభావరి నిర్వహించారు. -
ఆదిభిక్షువు వాడినేది కోరేది...
పాటతత్వం సిరివెన్నెల చిత్రం కోసం కె.విశ్వనాథ్ కోరిక మేరకు ‘విధాత తలపున ప్రభవించినది’ పాట రాశారు సీతారామశాస్త్రి. షూటింగ్ జరిగేటప్పుడు మేమంతా లొకేషన్‌కి వెళ్లేవాళ్లం. నందిహిల్స్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఒకసారి నేను, సీతారామశాస్త్రి కలిసి శివాలయానికి వెళ్లాం. అక్కడ దర్శనం పూర్తి చేసుకుని, వెనుకకు వస్తుండగా, ‘నాకు మంచి పాట వస్తోంది’ అంటూ ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది... బూడిదిచ్చేవాడినేది అడిగేది...’ అంటూ పాట వినిపించాడు. పాట వినగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ పాటను సినిమా కోసం రాయలేదు. తన ఆనందం కోసం రాసుకున్నారు. పాటను పూర్తిగా విన్నాక, విశ్వనాథ్‌గారికి వినిపించాను. పాట వినడం, ఓకే చేయడం వెంటనే జరిగిపోయాయి. ఈ పాటను రాజస్థాన్‌లోని బ్రహ్మ దేవాలయంలో చిత్రీకరించారు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది... అనే పల్లవితో ప్రారంభమైన ఈ పాట నిందాస్తుతిలో సాగింది. బూడిదిచ్చేవాడు అంటే సర్వసంపదలు ఇచ్చేవాడని మరో అర్థం ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చేవాడిని ఇంకేమీ కావాలని అడగక్కర్లేదని నిందిస్తూనే స్తుతించాడు పల్లవిలో. చరణం – 1 తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేదిఎంతో మధురంగా గానం చేసే కోయిలమ్మకు నల్లని రంగునిచ్చాడు ఆ మహాశివుడు. కరకుగా గర్జించే మేఘాలకు మాత్రం తెల్లని రంగును హంగుగా కూర్చాడు. అటువంటి వాడిని ఏమివ్వమని అడగాలి అంటూ నిందిస్తాడు. ప్రతివారిలోనూ చూడవలసింది అంతఃసౌందర్యమే కాని బాహ్య సౌందర్యం కాదు అని స్తుతిస్తూ చెబుతాడు. నల్లగా ఉన్న కోయిల ఎంతో తీయగా గానం చేస్తుంది. తెల్లగా ఉన్న మేఘం భీకరంగా గర్జిస్తుంది. కాని అందరూ కోయిలనే ఇష్టపడతారు. ఆ గానమాధుర్యాన్ని ఆస్వాదిస్తారు... అనే అంతరార్థాన్ని స్ఫురింపచేస్తాడు. చరణం – 2 తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఈ చరణంలో... పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటాయి. తేనెను స్రవిస్తాయి. అటువంటి పూలకు మూడునాలుగు రోజుల ఆయుష్షు మాత్రమే ఇచ్చాడు. కాని బండరాళ్లను మాత్రం చిరకాలం జీవించమన్నాడు. అటువంటివాడిని ఏమడగాలి అని నిందించాడు. అందులోనే కాకిలా కలకాలం జీవించడం కంటె, హంసలా ఆరు నెలలు జీవించినా చాలు అనే విషయాన్ని పరోక్షంగా స్తుతించాడు. చరణం – 3 గిరిబాలతో తనకు కల్యాణమొనరింప దరిజేరు మన్మ«థుని మసి చేసినాడు... వాడినేది కోరేదివర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు మూడవ చరణంలో... పార్వతిని తనకిచ్చి వివాహం చేయాలనే సత్సంకల్పంతో వచ్చిన మన్మథుడిని బూడిద చేశాడు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఇచ్చిన వరగర్వంతో లోకాలను పీడిస్తున్న రాక్షసులను మాత్రం కరుణించాడు. ముఖస్తుతులు కోరే ఆ శంకరుడిని ఏమి కోరుకుంటాం. అసలే ఆయన ముక్కోపి, ముక్కంటి... అంటూ నిందించాడు. మన్మధుడిని మసి చేసి, మళ్లీ ప్రాణం పోశాడు. రాక్షసులకు వరం ఇచ్చాడు, ఆ తరువాత అంతం చేశాడు. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఆయనకు తెలుసు అని అంతర్లీనంగా స్తుతించాడు. నిందాస్తుతిలో సాగిన ప్రత్యేకమైన పాట, సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా చేసిన పాట. ఆకెళ్ల సినీ రచయిత – డా. వైజయంతి -
సిరివెన్నెలకు అన్యాయం జరిగింది
హైదరాబాద్: పద్మ అవార్డుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్రీడాకారులు పంకజ్ అద్వానీ, గుత్తా జ్వాల తమను విస్మరించారని నేరుగా ఆరోపించగా.. సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తరఫున సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. పద్మ అవార్డుల ఎంపికలో సిరివెన్నెలకు అన్యాయం జరిగిందని పట్నాయక్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ సిరివెన్నెలను గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మంచి వినండి... మంచి చూడండి...మంచి చెప్పండి...
... మహాత్ముని గురించి కొన్ని మంచి మాటలు నీతో నువ్వు అబద్ధమాడకు! ‘‘గాంధీజీ అనగానే నాకు ఒకటి కాదు... ఎన్నో గుర్తుకొస్తాయి. మా నాన్న గారికి గాంధీజీ అంటే తీవ్రమైన ఇష్టం. నిజానికి సత్యవ్రతం, సత్యనిష్ఠ లాంటి మాటలు కొద్దిగా అస్పష్టమే. అసలీ ప్రపంచంలో ఏదీ యాబ్సొల్యూట్ ట్రూత్... నిరపేక్షమైన సత్యం కాదు. వాస్తవం (ఫినామినన్), నిజం (రియాలిటీ), సత్యం (ట్రూత్) అనే మూడు ఉంటాయని నా వర్గీకరణ. సత్యం మాట్లాడాలని తెలిసినా- అబద్ధం అవసరాల్ని అడ్డదారుల్లో తీరుస్తుంది కాబట్టి, సహజంగా అంతా అటు మొగ్గుతారు. చిన్న వయసులో నాకు ఇంట్లో నాన్న గారికి చెప్పకుండా, దొంగతనంగా సినిమాలు వెళ్ళి చూసి వచ్చే అలవాటుంది. మా నాన్న గారికి అబద్ధం చెబితే కోపం. తప్పు చేస్తే, తల దించుకొని తప్పు చేశానని నిజం చెబితే వెంటనే క్షమించేసేవారు. క్రమంగా నాకు కూడా అబద్ధం చెప్పే కన్నా, నిజం చెప్పి తలెత్తుకు నిలబడడమే కంఫర్టబుల్‌గా అనిపించింది. మా స్కూల్లో ఒక టీచర్ ఎప్పుడూ సినిమాలు చూసేవారు. బాగా మార్కులొచ్చే నేను ఆయన వెంటపడి, ఆయన తీసుకెళ్తే సినిమాకెళ్ళా. కానీ, ఆ రోజున నా లెక్క తప్పి, మా చుట్టాలెవరో రావడంతో, మా నాన్న గారు రోజూ కన్నా ముందే ఇంటికి వచ్చారు. నన్ను చూసి, ఎక్కడికెళ్ళావంటే మాస్టారితో సినిమాకు వెళ్ళానని చెప్పా. కానీ, నేను అబద్ధం చెప్పాననుకొని, నాన్న గారు లాగి లెంపకాయ కొట్టారు. నా జీవితంలో మా నాన్న గారు నన్ను కొట్టింది అదొక్కసారే. అబద్ధం చెప్పాననుకొన్న నాన్న గారు మరునాడు ఆదివారమైనా సరే, సైకిలెక్కి ఊరంతా తిరిగి, మాస్టార్ని వెతికి, కలిసి నేను చెప్పింది నిజమేనని తెలుసుకున్నారు. ఇంటికి రాగానే, చిన్నవాడినైన నాకు అంత పెద్దాయన ‘సారీ’ చెప్పారు. నిజం చెప్పడంలోని రుచి తెలిశాక, దాన్నెవరూ ఒదులుకోరు. ప్రాణ మాన విత్తాలకు భంగం కలిగేటప్పుడు అబద్ధమాడినా పాపం కాదని పెద్దలే చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ‘నీతో నువ్వు అబద్ధం ఆడకు. ఎవరి నుంచైనా తప్పిం చుకోగలవేమో కానీ, నీ నుంచి నువ్వు తప్పించు కోలేవు’. అదే నా సిద్ధాంతం. గాంధీజీ రాజకీయ ప్రయోగాల మాటెలా ఉన్నా, వ్యక్తిగా ఆయన నిబద్ధతపై ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. తాను చేసిన ప్రయోగాలూ, వాటిలో వైఫల్యాలు దాపరికం లేకుండా చెబుతూ, జీవితాంతం నమ్మినవాటికే కట్టుబడ్డ ఆయన వైయక్తిక నిష్ఠ నాకూ ఇష్టం. ఆయన తన పరిమి తుల్ని, తప్పుల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకే, గాంధీ కన్నా గాంధీతత్వం నాకిష్టం. ‘మహాత్మ’లో ఎందరికో నచ్చిన నా పాట ‘ఇందిరమ్మ (కొంతమంది) ఇంటిపేరు కాదుర గాంధీ’లో ‘పదవులు కోరని పావనమూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి’ అనడంలో ప్రాచీన ఋషుల నుంచి గాంధీ దాకా అందరి తాత్త్వికత ఉంది. అలాంటి మంచి మాటలు కొందరినైనా ఆలోచింపజేయడం సంతోషం.’’ - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ప్రముఖ కవి - ఆలోచనాశీలి -
గాలి పల్లకిలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె...
పాటతత్వం పాట: జగమంత కుటుంబం నాది.. సినిమా: ‘చక్రం’ గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: చక్రి ‘‘మనిషి తత్వాన్ని.. మనస్తత్వాన్ని చాటి చెప్పే అరుదైన పాటల్లో ‘జగమంత కుటుంబం..’ పాట తప్పకుండా అగ్రస్థానంలో ఉంటుంది. మనిషి స్వార్థజీవి.. ఈ జగమంతా, ఈ జీవితమంతా తనదే అనుకుంటాడు. కానీ, చివరికి ఏకాకిగా కాలం చేయాల్సిందే. ఈ జీవితం నీది కాదు.. లోకానిది. బతికిన కొన్నాళ్లైనా నలుగుర్నీ నవ్వించాలని, మరణించిన తర్వాత నలుగురూ మన గురించి మాట్లాడుకోవాలని చెప్పే పాట ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు, చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్. ప్రభాస్ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చక్రం’. చక్రి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ‘జగమంత కుటుంబం..’ పాటతత్వం గురించి మహిత్ మాటల్లో... ‘జగమంత కుటుంబం..’ పాట ఎక్కడ వినిపించినా మనసంతా అటువైపు పరుగులు తీస్తుంది. ఆ పాటలోని ఆవేదన అటువంటిది. అన్నయ్య సంగీతం అందించిన పాట ఇది అని చెప్పడం లేదు. బిడ్డను కన్నప్పుడు పడే పురిటినొప్పుల ప్రసవ వేదన ఎలా ఉంటుందో.. ప్రతి పాట వెనుకా కవి అటువంటి ఆవేదనను అనుభవిస్తాడు. ఈ పాటలో శాస్త్రిగారి ఆవేదన కనిపిస్తుంది. పల్లవి: జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది ఈ శ్వాస ఇక నీది కాదు.. పొమ్మంటున్న తరుణాన ఎలాంటి దృశ్యాలు కళ్ల ముందు తారసపడతాయో ఈ పాటలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ జగమంతా.. అన్నింటిలో మనిషే ఉన్నాడనిపిస్తుంది. ఏదీ వదులుకోవడానికి మనిషి మనసు ఇష్టపడదు. కానీ, వదులుకోక తప్పదు. ఆత్మ ఏకాకి కాక తప్పదు. శ్వాస వదలక తప్పదు. బతికినంతకాలం మన చుట్టూ ఎందరు ఉన్నా.. చివరకి ఏకాకిగా జీవితానికి ముగింపు పలకక తప్పదు. చరణం 1: కవినై కవితనై.. భార్యనై భర్తనై (2) మల్లెల దారిలో.. మంచు ఎడారిలో (2) పన్నీటి జయ గీతాల.. కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం.. కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని.. మాటల్ని పాటల్ని.. రంగుల్నీ రంగవల్లుల్ని.. కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని ॥ మనిషి అనేవాడు సకల కళా వల్లభుడు. ఇల్లూ.. ఇల్లాలు.. పిల్లలు.. ఆస్తి.. అంతస్తులు.. అన్నీ తనవే అనుకుంటాడు. మనిషి తత్వమే అంత. అది మంచిదే. కానీ, చివరకు మిగిలేది ఏంటి? అనేది పల్లవిలో చెప్పారు. మనిషి ఎప్పుడూ జీవితం మల్లెల దారిలా ఉంటుందనుకుంటాడు. కలలు కంటుంటాడు. పైకి చల్లగా ఉన్నా లోపల మంటలు రగిలించే ఎడారి తోవ ఈ జీవితం. కష్టసుఖాలు.. కన్నీరు.. పన్నీరు.. ఒకదాని తర్వాత ఒకటి వస్త్తూనే, పోతూనే ఉంటాయి. ఏవీ శాశ్వతం కాదు. అశాశ్వతమైనది ఉంటే అది నువ్వే. నువ్వు ఈ భూమ్మీద ఉండవు. నువ్వు చేసే మంచి మాత్రమే మిగులుతుంది. చరణం 2: మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై (2) మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ.. నాతో నేను రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం.. కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల.. హరిణాల్ని హరిణాల.. చరణాల్ని చరణాల.. చలనాన కనరాని.. గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని ॥ మనం ఒకటి తలిస్తే, విధి మరొకటి రాస్తుంది. మంటల మాటున వెన్నెల, వెన్నెల మాటున మంటలు.. ఎప్పుడు ఏది ఎదురవుతుందో? ఎవరూ చెప్పలేరు. నువ్వు బతికున్నంత కాలం మాత్రమే నువ్వు కోరుకున్నది సాధించుకోగలవు. మరణించిన తర్వాత తోటి మనిషి ప్రేమను పొందాలంటే మనలో దివ్యజ్యోతిని మనమే వెలిగించుకోవాలి. ఎప్పుడు ఆరుతుందో తెలియనిది ఈ జీవనజ్యోతి. ఆ జ్యోతి ఆరక ముందే నలుదిక్కులు జీవనజ్యోతి వెలిగించు అన్న మహోన్నత తత్వాన్ని ఈ చరణం ప్రబోధిస్తుంది. చరణం 3: గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి.. నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి.. నా హృదయములో ఇది సినీవాలి ॥ మనిషికి హృదయమే లోగిలి. ఆ హృదయంలో తరిగిపోని ప్రేమానురాగాలు ఉంటాయి. ఎన్నో ఎన్నెన్నో బడబాగ్నులు ఉంటాయి. వాటి నడుమ సాగే ప్రయాణమే ఈ జీవితం. గాలి పల్లకీలో ప్రయాణించే పాట వంటిది. మన గొంతులో ఆ పాట ఎప్పుడు ఆగుతుందో? చెప్పడం కష్టం. అంటే ఈ జీవితం ఎప్పుడు మూగబోతుందో? ఎవ్వరూ ఊహించలేరు. మూగబోయిన నాడు మిగిలేది మన హృదయం పంచిన ప్రేమానురాగాలే. పాట రాయడానికి సిరివెన్నెలగారు ఎన్ని ప్రసవ వేదనలు అనుభవించారో నాకు తెలీదు. ఆయన గురించి మాట్లాడేంత అర్హత ఉందో? లేదో? కూడా నాకు తెలీదు. శాస్త్రిగారు రాసిన పాటలో భావం చెడకుండా చక్రి అన్నయ్య అద్భుతమైన ట్యూన్ అందించారు. ఈ పాట స్వరపరిచినప్పుడు అన్నయ్య ఎంత తృప్తి పొందారో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే పాట ఇది. అన్నయ్య మన మధ్య లేరనే విషయన్ని నా మనసు ఇప్పటికీ అంగీకరించదు. ఈ పాట రూపంలో బతికే ఉంటున్నారని అనుకుంటున్నాను. ఈ పాటతత్వం గురించి చెప్పే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాను. ఇంటర్వ్యూ : సత్య పులగం - మహిత్‌నారాయణ్, సంగీత దర్శకుడు -
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా!
పాటతత్వం ప్రేమ అంటే సంతోషం... సంతోషమంటే జీవితం. ప్రేమించిన వ్యక్తి తోడుంటేనే సంతోషం..జీవితం. మనకు దొరికే అరుదైన విలువైన బంధమదే. ఆ నవ్వులు, ఆ మాటలు, ఆ స్పర్శ, ఆ సాంగత్యం నీకిష్టం..అలాంటి బంధాన్ని వీడటమంటే జీవితాన్ని వీడటమే. ఆ స్నేహం వరం, అది జ్ఞాపకమైతే శాపం. ఇలాంటి సందర్భం నేను సంగీత దర్శకత్వం వహించిన ‘సంబరం’ సినిమాలో కథానాయకుడికి ఎదురవుతుంది. బాల్య స్నేహితులైన నాయకా నాయికలు ఒక విషయంలో విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు హీరో పడే మానసిక సంఘర్షణను పాటలో చెప్పాలని దర్శకుడు దశరథ్ అడిగారు. ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లాం. సినీ సాహిత్య మాగాణిలో పసిడి పాటలు పండిస్తున్న హాలికుడాయన. ముఖ్యంగా ఆయన రాసే ప్రేమ పాట సిరి’వెన్నెల’ వెలుగే. ‘సంబరం’ కథలో హీరో హీరోయిన్లు బాల్య స్నేహితులు. ఆటపాటల సంతోషాలు తప్ప ఎలాంటి గొడవలు లేని పిల్లలు వీళ్లు. చిన్నప్పటి నుంచే ఒకరితో ఒకరు ఉండటం చాలా ఇష్టం. వయసొచ్చిన ప్రేమలో శారీరక స్వార్థాలు ఉంటాయి గానీ... నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ వీళ్లది. పెరుగుతున్న వయసుతో పాటే వాళ్ల స్నేహమూ పెరుగుతుంది. పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. పరస్పరం ఇష్టమే కానీ... శ్రద్ధగా చదువుకునే అమ్మాయికి... చదువులో, ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండే అబ్బాయి అంటే కోపం. చాలా సార్లు చెప్పి చూస్తుంది అతను మారడు. దాంతో అతని ప్రేమను తిరస్కరిస్తుంది. బాధ్యతలేని వాళ్లతో బతుకు పంచుకోలేనని బాధతోనే చెబుతుంది. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు హీరో. ఇళ్లు, కుటుంబం కన్నా... తన ప్రాణమైన ప్రేమని వదులుకొని వెళ్లాల్సి రావడం కథానాయకుడు తట్టుకోలేకపోతాడు... సీతారామశాస్త్రి గారు పల్లవి ఇలా రాశారు... ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీకా ఎన్నాళ్లిలా వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా తన ముందే ఉంది తన ప్రేమా, తన జీవితం... కళ్ల ముందే కదలాడే కల అది. వాస్తవానికి అందనిది. ఆ ప్రేమను విడిచి వెళ్లకుండా అన్నివైపులా అల్లుకోకనీ, వెంటాడుతూ వేధించొద్దని... జ్ఞాపకమై రగిలించొద్దనీ దయలేని స్నేహాన్ని కోరారు సీతారామశాస్త్రి గారు. మొదటి చరణంలో తను వీడటం తప్పదు... కొత్తదారి వెతుక్కోవాల్సిందే, మదిలో నిప్పులు మండుతున్నా... గతమంతా చితిమంటై వెంటే ఉన్నా... బాటసారిగా బతకాల్సిందే. నువ్వూ, నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి... ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి అని రాశారు. ఒక్క సీతారామశాస్త్రి మాత్రమే పలికించగల భావమిది. ప్రేమికుడికి ప్రేయసే లోకం... అందుకే నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే లేదంటాడు... ఒక వేళ ఉంటే అది తనకు తెలీదంటాడు... తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్తదారి నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి కలిసి ఉన్నప్పుడు నయనంలో రోజూ తన ఉదయమే... విడిపోతే ఆ కళ్లు క్షణక్షణం వరుణమే. అందుకే వెళ్లే దారిలో కనీసం వెలుగైనా చూడనీక కన్నీటి అల రేపకనీ, జన్మలో నువు లేవనీ ఇకనైన నన్ను నమ్మనీ అంటాడు. చెంతే ఉన్నా సొంతం కావని నిందించననీ... తననే తాను వెలివేసుకుని వెళిపోతానని... ఆ పాత్ర ఆవేదన వ్యక్తం చేశాడు సిరివెన్నెల... ఆపకిలా ఆనాటి కలా అడుగడుగు కూలిపోదా రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మనీ నిన్నలో వదిలేయని ఇన్నాళ్ల ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించేకన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా తనకంటే... తానంటేనే ఇష్టం... ఇదీ విడదీయలేని... వేరుచేసి చూడలేనిది ప్రేమ బంధం. బాల్యం నుంచి ఇంత ఇష్టంగా తనతో బ్రతకడానికి అలవాటైన వ్యక్తి... తను లేకుంటే ఉండగలడా. ఆ వ్యక్తి స్థానంలో తానే ఉన్నంత వేదనతో పాట రాశారు సీతారామశాస్త్రి గారు. ఆయనతో నాది తండ్రీ కొడుకుల బంధం. భావం లేకుండా ఆయన ఏ పాటా రాయరు. ఏవో కొన్ని పదాలతో పాటలు పూర్తిచేయడం సీతారామశాస్త్రి కెరీర్లో లేదు. ఇప్పుడున్న ఏ గీత రచయితతోనూ ఆయన్ని పోల్చలేం. తెలుగు సినిమా పాటల రచయితగా ఆయన కీర్తి శిఖరం. ఈ పాట వింటూ ఏడ్చిన వాళ్లను ఎందరినో చూశాను. ట్యూన్‌కు రాసిన పాట ఇది. పాటంతా ఊటీలో చిత్రీకరణ జరిపారు. సినిమా కమర్షియల్ సక్సెస్ కాకున్నా... ఈ పాటకు బాగా పేరొచ్చింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. సినిమా హిట్టయితేనే ఆ చిత్రంలోని పాటల గురించి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి మారితేనే మంచి పాటలకు గౌరవం దక్కినట్లవుతుంది. సేకరణ: రమేష్ గోపిశెట్టి - సిరివెన్నెల, గీత రచయిత - ఆర్పీపట్నాయక్ నటుడు, సంగీత దర్శకుడు -
'చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం'
వర్ధమాన సినీ సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ అమలాపురం: అవకాశం ఇస్తే అగ్రహీరోల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాలని ఉందని వర్ధమాన సినీ సంగీత దర్శకుడు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు యోగేశ్వరశర్మ తెలిపారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన మహిళల రామాయణ ప్రోత్సాహక పరీక్షకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. నా అభిరుచిని గుర్తించి మా నాన్నగారు సంగీతం వైపు పోత్సహించారు. లండన్‌లో మ్యూజిక్ కోర్సు చేసి, మృదంగం, కీ బోర్డులపై పట్టు సాధించా. ప్రముఖ సంగీత విధ్వాంసుడు వీఎస్మూర్తి వద్ద పని చేసిన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టాను. తొలుత లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చాను. కుదిరితే కప్పు కాఫీ, ఎంత అందంగా ఉన్నావే, యామిని చంద్రశేఖర్, ఎవరు చిత్రాలకు సంగీతం అందించాను. ఇంకా పేరు పెట్టని రెండు కొత్త చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నా. మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం'. -
ప్రశ్నలోనే బదులు ఉంది... గుర్తుపట్టే గుండెనడుగు...
పాటతత్వం నేను హైదరాబాద్‌కు రావడానికి కారణం సంగీత దర్శకుడు అనిల్. అయితే పాట మీద నాకున్న ఇష్టానికి కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి. వారిద్దరూ కలిసి తొలిసారి చేస్తున్న చిత్రం ‘గమ్యం’. ఓ రోజు అనిల్ స్టూడియోలో ఓ పొడుగాటి పేపర్ చూశాను. బ్లాక్‌పెన్‌తో అర్థం అయి కానట్టుగా ఏదో రాసుంది. పైన చూస్తే ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు బోల్డ్ లెటర్స్‌లో ప్రింట్ అయి ఉంది. అప్పుడే అది శాస్త్రిగారి ‘ఎంత వరకు...’ అనే పాటని అర్థమైంది. ఆ రోజుల్లో ‘ఆత్మసాక్షాత్కార శాస్త్రం’ అనే పుస్తకంలో ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే అధ్యాయం చదివాను. ‘ఎంతవరకు...’ అనే పాటలో ప్రతి అక్షరం మనల్ని మనకి పరిచయం చేస్తుంది. చాలా ప్రశ్నలు. చాలా జవాబులు. ఔననిపించే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి. గొప్ప పాట ప్రపంచానికి తెలియక ముందే నేను విన్నాను అనే సంతోషం అందులోంచి పుట్టిన ఆలోచన. నాలోని మానవతావాదానికి ప్రేరణ. తర్వాత రోజుల్లో శాస్త్రిగారితో నాకున్న పరిచయంతో నేను అడిగిన ప్రశ్నలకు ‘‘నువ్వడిగే ప్రతి ప్రశ్నకీ నీ దగ్గరే జవాబు ఉంటుంది’’అని ఆయన అన్నారు. ఆలోచిస్తే అవును కదా అనిపించింది. ‘‘ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తు పట్టే గుండెన డుగు’’ అని మనకి చెబుతూ ఉంటారు. ‘ఐ సీ హ్యూమన్స్ నాట్ హ్యుమానిటీ’’ ఈ కోట్ విన్నప్పుడల్లా ... ‘మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరూ’ అని పాటలోని ఈ లైన్లు మళ్లీ మళ్లీ గుర్తొస్తాయి. శాస్త్రిగారు ఎప్పుడో చెప్పిన మాట ‘పోయెట్రీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ అండర్స్టుడ్’’ అని పలు సందర్భాల్లో చెప్పేవారు. ‘‘సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలతో విడి విడి రూపాలతో నువ్వే కాదంటున్నది’’ అనే వాక్యాలు ఆ లైన్‌ను ప్రతిబింబిస్తాయి. వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది. ‘‘మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోన లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ’’ ఆయన మన ఇష్టాలను గౌరవిస్తారు. లోపాలను ఎత్తిచూపుతారు. దీన్ని కేవలం పాటగానే విని వదిలేద్దామా, లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందామా అని అనుకోకుండా ఉండలేం. మనం నవ్వినా నవ్వలేనిది... ఏడ్చినా ఏడవలేనిది నీడ మాత్రమే... అందుకే మనం చేసే ప్రతి పనికి నీడలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. జీవితం పట్ల మనిషి దృక్పథం, ఆలోచన అతనిని నిర్వచిస్తాయి. ఏ భావోద్వేగాలైనా మనం ఏమిటో ఎదుటివారికి పరిచయం చేస్తాయి. ‘‘ఎదురైన మందహాసం నీలోన చెలిమి కోసం మోసం ద్వేషం రోషం నీ నకిలీ మదికి భాష్యం’’ మనలోని ద్వేషం, కోపం, ఆనందం ఇలా..ఎన్ని రకాల పోలికలతో చెప్పినా, మనకు మనమే కనబడతాం. నీలోని భావాలకు నువ్వే అద్దం...నీవే నిదర్శనం. ‘పుటుక చావు రెండే రెండవి నీకవి సొంతం కావు’ అనే లైన్ వేదాంతం నుంచి పుట్టింది కాదు, నిత్యజీవితంలో మనకుండే ప్రశ్న నుంచి పుట్టింది. గమ్యం అంటే చేరడం కాదు. అదే జీవిత గమనం అనే సత్యాన్ని చాలా సరళంగా అర్థమయ్యేట్లు చెప్పారు. ‘‘జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ’’ బ్లాక్ అండ్ వైట్ కళ్లతో ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంటాం. మనం ఏ మనిషిని చూసినా, ఏ పనిని గమనించినా మనం ఎక్కడ నిలబడి, ఏ దృక్పథంతో చూస్తున్నామనేదే ముఖ్యం. మన ఉద్దేశం..మన నిర్దేశం కూడా అదే. మన ప్రపంచం, గమ్యం కూడా అదే. ఇలాంటి పాటతో సీతారామశాస్త్రిగారు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. సేకరణ: శశాంక్.బి - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కృష్ణ చైతన్య, గీత రచయిత -
ఈగాలి.ఈ నేల..!
-
సిరివెన్నెల
-
పత్రం పుష్పం ఫలం
ఉగాదితో కొత్త సంవత్సరం మొదలైనా... మన జీవితాల్లో ఎలాంటి విఘ్నాలూ లేకుండా ఉండడానికి మనం చేసుకునే మొదటి పండుగ వినాయక చవితి. మంచి మాట తెలుసుకోడానికి... మంచి బాటలో నడవడానికి మంచివారుగా బతకడానికి... గణనాథుడు నృత్త, గీత, వాద్యాలతో వినోదాత్మకంగా మనకు జ్ఞానం ప్రసాదిస్తాడన్నది నమ్మకం. పత్రం, పుష్పం, ఫలం... ఇవేవీ లేకపోయినా తోయం... అంటే... గరిటెడు జలంతో కూడా సంతృప్తి పడే జనదేవుడు లంబోదరుడు... వరసిద్ధి వినాయకుడు. ఈ పది రోజులూ ఆయనే ప్రతి వీధికీ కళ. అందుకే మా పాఠక దేవుళ్లకు ఇవాళ్టి ఫ్యామిలీ కళకళ. పత్రం దండాలయ్య ఉండ్రాళ్లయ్యా... దాదాపు పాతికేళ్లు అయ్యింది ఈ పాట వచ్చి. ఇప్పటికీ చవితి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. ఏ కవికైనా ఇది సంతోషం కలిగించే అంశమే. ‘కూలీ నెం.1’ సినిమాలో ఈ పాట ఒక టీజింగ్ సందర్భంలో వస్తుంది. బాగా డబ్బు, అహంకారం ఉన్న ఒక అమ్మాయి రైల్వే కూలీలు చేస్తున్న గణేశ్ ఊరేగింపునకు అడ్డం వస్తుంది. అంతకు ముందే ఆమె ప్రవర్తన గురించి విన్న హీరో దీనిని చాన్స్‌గా తీసుకుని టీజ్ చేస్తూ పాట పాడతాడు. పైకి ఇది టీజింగ్ సాంగ్లా అనిపించినా, అర్థం చూస్తే శాశ్వతంగా నిలిచే భక్తిగీతంలా రాయాలని నిశ్చయించుకున్నా. ఆ విధంగానే వచ్చింది. ‘చిన్నారి ఈ చిట్టెలుకరా భరించెరా లంబోదర... పాపం కొండంత నీ పెనుభారం... ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మధన్యం’ అనే పల్లవి ఎలుకకు వర్తిస్తుంది, హీరోయిన్‌కూ వర్తిస్తుంది. హీరోయిన్ను మర్చిపోవచ్చు. ఎలుకను మర్చిపోరు గదా. ‘శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం... ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం’... అనే లైన్లు హీరోయిన్‌కి వర్తిస్తాయి, వినాయకునికీ చంద్రునికీ మధ్య జరిగిన కథనూ చెబుతాయి. ఈ రెండో అర్థం వల్లే పాట ఇప్పటికీ నిలుచుందని అనుకుంటున్నాను. ఇళయరాజా ఇచ్చిన పల్లవికి చెన్నైలో కూచుని రాసిన పాట ఇది. బాలూ గళం, కోరస్, కంపోజిషన్ అందులో ఉండే సెలెబ్రేషన్ మూడ్ పాటను శాశ్వతం చేశాయి. ఈ పాటే కాదు చాలా సినిమాల్లో దైవప్రస్తావన ఉండే పాటలు అనేకం రాశాను. కాని నాది ఒక రకంగా నిరీశ్వరవాదం. నా దైవానికి రూపం లేదు. ఇది నాస్తికత్వం కాదు. నా దృష్టిలో దైవాన్ని బాహ్యంగా చూడటం కాదు లోలోపల చూడాలి. అందుకే నేను దేవతా మూర్తులను వివిధ బాధ్యతలు నిర్వహించే కార్యనిర్వహణాధికారులుగా చూస్తాను. ఇన్ఛార్జ్లన్న మాట. నిర్వికల్ప సమాధి అంటారు. ఈ స్థితికి చేరుకున్నప్పుడే దైవాన్ని, మనల్ని కూడా ఒకసారి దర్శిస్తాం. నా దృష్టిలో పూజలు, పండుగలు దుష్కార్యాల నుంచి కాసేపు మనసు మళ్లించడానికి ఉద్దేశించినవే. కాని దైవానికి చేరువ కావాలంటే బాహ్య బంధనాల నుంచి విముక్తి పొంది అంతఃస్వేచ్ఛను అనుభవించాలంటే ఇవి చాలవు. లోపలి ప్రయాణం సాగాలి. ఈ మాటను చెప్పడానికే నేను ‘శివదర్పణం’ గ్రంథం రాశాను. అందులో శివుణ్ణి ఒక వేటగాడిగా భావిస్తూ ‘నా మనసే ఒక కారడవి. అందులో కోర్కెలనే క్రూరమృగాలు విషసర్పాలు తిరుగుతున్నాయి. వాటిని వేటాడు’ అని వేడుకున్నాను. ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఇదే. మనలో ప్రతి ఒక్కరం అంతర్గత సమృద్ధితో సంపదతో తులతూగాలని వినాయకచవితి సందర్భంగా ఆశిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. - సిరివెన్నెల సీతారామశాస్త్రి పుష్పం జైజై గణేశా.. జై కొడతా గణేశా... ‘జై చిరంజీవ’ సినిమా కోసం ఈ పాట సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసి హీరో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడాలి అని చెప్పారు. ఏం స్తుతిస్తాడు... ఎలా స్తుతిస్తాడు... ఆ స్తుతిలో నుంచి ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలి అనేది ఇక నా తలనొప్పి. కాని కవి కన్ను అనేది ఒకటి ఉంటుంది. దానికి దృష్టిలోపం, చత్వారం లేకపోతే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక అర్థాన్ని వెతుకుతుంది. ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న చెత్త నాకు గుర్తుకు వచ్చింది. ఈ చెత్తను వినాయకునికి గుర్తు చేయాలి. ఆయన తొండంతో కుంభవృష్టిని కురిపించి దానిని కడిగేయించాలి అనిపించింది. అందుకే పల్లవిలో ‘లోకం నలుమూలలా లేదయ్యా కులాసా... దేశం పలువైపులా ఏదో రభస... మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా... పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా’ అన్నాను. ‘చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి ఈ చిక్కు విడిపించడానికి రమ్మ’ని పిలిచాను. పల్లవి ఓకే. చరణంలో ఏం చెప్పాలి? వినాయకుడు కుమారస్వామి సహిత శివపార్వతుల పటం చూడండి. వారి వాహనాలు గమనించండి. వాస్తవంగా అయితే ఒక వాహనానికీ మరో వాహనానికీ వైరం ఉంది. కాని అవి కలిసి మెలిసి లేవూ. మనమెందుకు కొట్టుకుంటున్నాం. అదే మొదటి చరణంలో చెప్పాను. ‘నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా... ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా... పలుజాతుల భిన్నత్వం కనిపి స్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా’... మనకెందుకు లేదు సోదరభావం అని నిలదీశాను. బాగుందనిపించింది. ఈ స్ఫూర్తితో మేం ఉంటాం కాని మాకో బెడదుంది దానిని తొలగించు అని రెండో చరణంలో చెప్పాను. దాదాల నుంచి లంచాలు మరిగిన నాయకుల నుంచి రక్షించమని కోరుకున్నాను. కాని అక్కడ నాకు తోచిన చమత్కారం ఏమిటంటే ‘ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా’ అనడం. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు చుక్కల్లోనేగా ఉన్నాయి. కందిపప్పు కిలో రెండు వందలని విన్నాను. మనం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాం. కాని ఈ సందర్భంగా చేయాల్సింది మనలోని చెడును ముంచడం మనలోని అహాన్ని వంచడం. ఆ మాటను కూడా చెప్పాను. ఈ పాట జనానికి బాగా నచ్చింది. వినాయకుని మంటపాల్లో జేజేలు అందుకుంటూనే ఉంది. మరో విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నేను విఘ్నేశ్వరుడి భక్తుణ్ణి. మా ఊరి చెరువు దగ్గర మంచి నల్లరేగడి మట్టి దొరికేది. దానిని తీసుకొచ్చి నా స్వహస్తాలతో వినాయకుడి ప్రతిమను చేసి ఇంట్లో ఒక గుడిలాంటిదే మెయింటెయిన్ చేసేవాణ్ణి. ఆయన దయ వల్ల నాకు బుద్ధి లభించింది. పాటల రచయిత కావాలనే కోరికా సిద్ధించింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. - చంద్రబోస్ ఫలం తిరు తిరు గణనాథ... వినాయక చవితి అనగానే నాకు మా వూరు ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) పక్కన ఉండే చిట్టడివి గుర్తుకు వస్తుంది. ఆ రోజు పిల్లలందరికీ ఆ అడవిలోకి వెళ్లే పర్మిషన్ దొరుకుతుంది. మరి పత్రి తేవాలి కదా. అందరం సరదాగా పోలోమంటూ పోయి పత్రి తెచ్చేవాళ్లం. మా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి దర్బలో ఇంట్లోనే ఉండేవి. నేను మరీ భక్తుణ్ణి కదా. అంత భక్తిశ్రద్ధలతో చిన్నప్పుడు పూజలూ అవీ చేసిన గుర్తు లేదు. అయినప్పటికీ ఆ వినాయకుడి దయ వల్ల చదువు బాగా వచ్చింది. అయితే నాగార్జున యూనివర్సిటీలో బి.టెక్ చేరాక చదువుపై శ్రద్ధంతా పోయింది. వినాయకుడు అనగానే చదువు గుర్తుకొస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ‘100% లవ్’ సినిమాలో నేను రాసిన పాటలో కూడా ఇదంతా కనిపిస్తుంది. ఆటపాటల్లో హాయిగా ఉండాలనుకునే యూత్‌కి బాబోయ్ ఈ పరీక్షల భారం లేకుండా హాయిగా మార్కులొస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ మూడే పాట పల్లవిలో కనిపిస్తుంది. ‘తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై.. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అని ఉంటుంది పల్లవి. కాని చరణం అంతకన్నా సరదాగా ఉంటుంది. ‘చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనివ్వు’.... ఇలా ఉంటుంది చరణం. ఇందులో ‘ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు’ అడగడం ‘ఆన్సర్ షీటు మీద ఆగిపోని పెన్ను’ అడగడం కనిపిస్తుంది. రెండో చరణంలో ఇంకా సింపుల్ కోరికలు ఉంటాయి. ‘తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు’ అని చెప్తూ కనుక మా తలరాతలు బాగుండేలా చూడు స్వామి అని వేడుకుంటుంది హీరోయిన్. ‘పేపర్లో ఫొటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు’ అనడం ఒక చమక్కు. అప్పటికే కొన్ని మాంటేజస్ తీసి కొన్ని రఫ్నోట్స్లు సుకుమార్‌గారు తయారు చేశారు. ఆ మాంటెజస్కు తగినట్టుగా ఆ రఫ్నోట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాసిన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బాణి, దానికి హరిణి గొంతు రాణించాయి. తమన్నా, నాగచైతన్య కూడా ఈ పాటలోని సన్నివేశాలను బాగా పండించారు. క్లాసికల్ బాణీలో ఉన్న ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు రామ్ నటించిన ‘గణేశ్’ సినిమాలో కూడా వినాయకుడి మీద ఒక పాట రాశాను. మాలాంటివాళ్లకు పాటే దైవం. మంచి పల్లవి తడితే అదే పెద్ద ప్రసాదం. మీ అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. - రామజోగయ్యశాస్త్రి -
సిరి అరవై... వెన్నెల దొరవై
పదిమందికి నచ్చే పాట రాయాలనుకున్నావు. పదిమంది మెచ్చే పాటగా దేవుడు రాయించాడు. నీ పల్లవికి పల్లకీ కట్టి, నీ చరణాల ధూళిని ఊరేగించి నిన్ను బోయీలుగా మోసిన నీ జగమంత కుటుంబం ఒకే పాట పాడుతోంది నీ పాట చిరకాలం బతకాలని... పాటంత ఆయుష్షు నువ్వు పోసుకోవాలని! మా సిరి నువ్వు. మా వెన్నెల నువ్వు. ఇంగ్లిష్ తేదీల ప్రకారం రేపు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టినరోజు. ఆ సాహితీ తపస్వి రచనల్లో తమకిష్టమైన సినీ గీతాల గురించి... ఆయనతో ప్రయాణించిన పదిమంది దర్శకులు పంచుకున్న ఆత్మీయ అభిప్రాయమాలిక. ఆదిభిక్షువు... వాడినేది కోరేది?... సిరివెన్నెల ‘‘సీతారామశాస్త్రికి అప్పుడే షష్టి పూర్తంటే, ఆశ్చర్యంగా ఉంది. టెలిఫోన్స్‌లో ఉద్యోగం చేస్తూ, చిక్కనైన కవిత్వం రాస్తూ నా దగ్గరకు వచ్చిన చేంబోలు వారి అబ్బాయి రూపం, స్వరం నాకు ఇప్పటికీ గుర్తే. ‘భరణి’ అని కలం పేరుతో రాస్తుంటే, హాయిగా అమ్మానాన్న పెట్టిన పేరుతోనే పాటలు రాయమన్న సంగతీ గుర్తే. మా ‘సిరివెన్నెల’ సినిమా ఆదిగా శాస్త్రి ఎన్నో ఆణిముత్యాలందించారు. ఆయన రాసిన ప్రతి పాటా నాకు ఇష్టమే. ఏదని చెప్పను? ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది...’ చెప్పనా? ‘అందెల రవమిది పదములదా...’ చెప్పనా? నా సినిమా కాకపోయినా, ‘నేనున్నాను’కు రాసిన ‘ఏ శ్వాసలో చేరితే...’ చెప్పనా? ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? ఇన్ని పాటల పరిమళాలు సినీ సాహిత్యానికి అద్దినందుకు శాస్త్రిని అభినందించనా? ఈ షష్టిపూర్తి వేళ ఆశీర్వదించనా? ఈ పద్మావతీ సీతారాముల కోసం ఆ ఆదిభిక్షువునేది కోరేది... చిరాయురస్తు!’’ - కె. విశ్వనాథ్ దివిని తిరుగు మెరుపులలన సామజ వరగమనా... లాయర్ సుహాసిని ‘‘ప్రతి లైను చివరా ‘సామజవరగమనా’ ఉండేలా ఓ డ్యూయట్ కావాలని సీతారామశాస్త్రిని అడిగితే, చాలా అవలీలగా ఈ పాట రాసిచ్చేశాడు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా బాణీ కట్టారు. ఈ సినిమా పేరు చెబితే అందరికీ ఈ పాటే గుర్తుకొస్తుంది.’’ - వంశీ ముసుగు వేయొద్దు మనసు మీద... ఖడ్గం ‘‘అసలు సీతారామశాస్త్రిగారి పాటల్లో నచ్చింది ఒక్కటి చెప్పమంటే, చాలా చాలా కష్టం. చిటికెలో పది, ఇరవై పాటలు చెప్పగలను నేను. జగమంత కుటుంబం నాది, అలనాటి రామచంద్రుని కన్నింట సాటి, మేఘాలలో తేలిపొమ్మన్నది, జర జర, నువ్వు... నువ్వు... నువ్వే.. నువ్వు... ఇలా చాలా పాటలున్నాయి. అయితే వీటన్నింటిలో నేను బాగా దగ్గరితనం ఫీలయ్యే పాట అంటే మాత్రం ‘ఖడ్గం’లోని ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ పాటే చెప్పాలి. అందులోని ఫిలాసఫీ అంతా నాదే. అసలు మనసుకు ముసుగు వేసుకుని ఎందుకు బతకాలంటూ గొప్ప ఫిలాసఫీని మోడ్రన్ వాయిస్‌లో చెప్పిన పాట ఇది. అసలు నేనూ, శాస్త్రిగారు కలిస్తే వచ్చే పాటలన్నీ ఇంతే ఓపెన్‌గా, వయొలెంట్‌గా, టెర్రిఫిక్‌గా ఉంటాయి. ఈ పాటల విషయంలో నేను ఆత్మనైతే, ఆయన పరమాత్మ.’’ - కృష్ణవంశీ చిలకా... ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక... శుభలగ్నం ‘‘ప్రతి ఒక్కరి హృదయంలోకి సూటిగా దూసుకెళ్లిపోయి స్థిరపడిపోయిన అద్భుతమైన పాట ఇది. ఆరాటం, పోరాటం, ఆత్రుత... ఇలా మనిషిలో ఉండే రకరకాల భావోద్వేగాలకు, మానసిక పరిస్థితులకు దర్పణం పట్టేలా ఆత్రేయలాగా చిన్న చిన్న పదాలతో సాహిత్యం రాశారు సీతారామశాస్త్రి. అందుకే పాట సెన్సేషనల్ హిట్టయ్యింది... నందీ అవార్డు సాధించింది.’’ - ఎస్వీ కృష్ణారెడ్డి ఏ శ్వాసలో చేరితే... నేనున్నాను ‘‘సిరివెన్నెలగారు ఏ పాట రాసినా, ఆ పాటకు విపరీతమైన రెస్పెక్టు వచ్చేస్తుంది.. వెయిటూ పెరిగిపోతుంది. నా సినిమాలకు చాలా మంచి పాటలు రాసిచ్చారాయన. ‘నేనున్నాను’ కోసం రాసిన ‘ఏ శ్వాసలో చేరితే’ పాట ఎక్స్ట్రార్డినరీ. ఈ పాట తయారీ వెనుక చిన్న కథ ఉంది. సాహిత్యం రాస్తే బాణీ కడతానని కీరవాణిగారు, లేదు లేదు... ముందు బాణీ ఇచ్చేసేయమని శాస్త్రిగారు చాలాసేపు చిన్నపిల్లల్లా వాదులాడుకున్నారు. శాస్త్రిగారు పుస్తకాల బీరువాలో ఆయన రాసిన ‘‘కృష్ణా నిన్ను చేరింది... అష్టాక్షరిగా మారింది... ఎలా ఇంత పెన్నిధి... వెదురు తాను పొందింది...’’ అనే కవిత కనబడింది. ఈ కవిత ప్రేరణతో పాట రాయమని శాస్త్రిగారిని అడిగితే ఈ పాట రాసిచ్చారు. ‘నేనున్నాను’ విజయంలో ఈ పాట పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. కె. విశ్వనాథ్‌గారి లాంటి మహానుభావుడు ఈ పాట గురించి నన్ను చాలా మెచ్చుకున్నారు.’’ - వి.ఎన్ ఆదిత్య నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... గాయం ‘స్వయంవరం’ సినిమాకి మొదట నేనే దర్శకుణ్ణి. అప్పుడు సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకున్నా. ఆ తర్వాత నేను బయటికొచ్చేశా. సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం తర్వాత నాకు కలగలేదు. ఆయన పాటలన్నీ నా కిష్టమే. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ పాటలు. ‘గాయం’లోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ పాటను మాత్రం లెక్కలేనన్ని సార్లు విన్నా. ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.’’ - చంద్రసిద్ధార్థ్ బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది... శివ ‘‘నేను సిక్త్స్ క్లాస్‌లో ఉండగా ‘శివ’ రిలీజైంది. ‘బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది..’ పాటకు చాలా బాగా కనెక్ట్ అయిపోయా. పాట అంటేనే తెలీని నాకు అప్పటి నుంచీ పాటతో పరిచయం మొదలైంది. సిరివెన్నెల గారి పాటలతోనే పెరుగుతూ వచ్చా. నేను కాలేజ్ ఏజ్‌లో ఉండగా వచ్చిన ‘గులాబి’లోని ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ పాట అయితే నా మనసు దోచేసింది. ‘మురారి’లోని పెళ్లి పాట అయితే తెలుగునాట ప్రతి పెళ్లి వీడియోలోనూ కంపల్సరీ అయిపోయింది. ఇలా జీవితంలో ఏ సందర్భం తీసుకున్నా ఆయన పాట ఉండి తీరాల్సిందే. ఆయన మొన్ననే షష్టి పూర్తి ఫంక్షన్ చేసుకున్నారు. కానీ నాకు తెలిసి ఆయనకు పదహారేళ్లే. ‘ఓకే బంగారం’ సినిమాలో ‘మెంటల్ మది’ పాట వింటే ఆయన మది ఎంత యూత్‌లో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం నేను నాగార్జున-కార్తీలతో తీస్తున్న సినిమాకు అన్ని పాటలూ ఆయనే రాస్తున్నారు.’’ - వంశీ పైడిపల్లి ఎవరో ఒకరు ఎపుడో అపుడు... అంకురం ‘‘గాంధీ ఫిలాసఫీని అద్భుతంగా ఒడిసిపట్టిన పాట ఇది. ఏ ప్రయాణమైనా, ఏ పోరాటమైనా ఒక్క మనిషితోనే మొదలవుతుంది. అది నువ్వే కావాలి... ఆ తర్వాత మిగతా వారంతా నిన్ను అనుసరిస్తారు. ఇలా ఉద్బోధిస్తూ, ఉత్తేజపరుస్తూ ‘ఎవరో ఒకరు...’ పాట రాశారు శాస్త్రి. ఇప్పటికీ, ఎప్పటికీ ఇన్స్పైరింగ్ సాంగ్. నేను డెరైక్ట్ చేసిన ‘శ్రీకారం’లో కూడా ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగాలా?...’ అంటూ మంచి పాట రాశారు.’’ - సి.ఉమా మహేశ్వరరావు ఎందుకే ఇలా గుండె లోపల... సంబరం ‘ఈ పాట కోసం 20 పేజీల నోట్స్ రాసుకు న్నారు. హీరో మనసులోని భావ సంచలనాన్ని అణువణువునా ఈ పాటలో ఆవిష్కరించారు. ‘చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా’ లాంటి గొప్ప వాక్యాలు రాశారు.’’ - దశరథ్ గోపికమ్మ... చాలును లేమ్మా... ముకుంద ‘ముకుంద’లో పాటలన్నీ గురువుగారివే. ముఖ్యంగా ‘గోపికమ్మ’ పాట హైలైట్. ధనుర్మాసంలోని పాశురాలను ఒక పాటలో ఒదిగేటట్టు రాయడం శాస్త్రిగారికే చెల్లింది. ఆయన పాటల్లో నేను ఎక్కువగా వినేది ‘సిరివెన్నెల’లోని ‘ఆది భిక్షువు వాడినేది కోరేది’. - శ్రీకాంత్ అడ్డాల సంభాషణ: పులగం చిన్నారాయణ -
సిరివెన్నెల రచన, బాలు గానం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై ప్రత్యేక పాటను రూపొందించాలని ఏపీ ప్రభుత్వ అధికారుల అత్యున్నత స్థాయి కమిటీ తీర్మానించింది. పుష్కరాలపై కమిటీ ఈ రోజు సమావేశమైంది. పుష్కరాలపై ప్రత్యేక పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రితో రాయించాలని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో, టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేయించాలని నిర్ణయించారు. పుష్కరాలలో వేయి మంది కూచిపూడి కళాకారులతో నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహాకులు సిరివెన్నెలను సంప్రదించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వహాకులు థీమ్ సాంగ్ రాయించేందుకు స్థానికంగా ఉన్న గీత రచయితలను సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే విశాఖ ఉత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తామని భీమిలి ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. అందుకోసం ప్రముఖ గీత రచయితతో థీమ్ సాంగ్ రాయిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉత్సవం జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. -
హృదయాలను కొల్లగొట్టాలి : సీతారామశాస్త్రి
‘‘ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తడానికి శక్తివంచన లేకుండా శ్రమించిన పని రాక్షసుడు ఈవీవీ. ఎన్నో మంచి సినిమాలు అందించాడు. ఇప్పుడాయన కుమారులు ఈవీవీ సినిమా పతాకంపై మళ్లీ సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ ‘బందిపోటు’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. కల్యాణ్ కోడూరి స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. సినిమా విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేస్తారనీ, పరాజయంపాలైతే ఎత్తి కుదేస్తారనీ, దేనికీ పొంగిపోకూడదని, కుంగిపోకూడదని వీవీగారు అన్న మాటలు తనకెప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని రాజమౌళి చెప్పారు. ఈవీవీకీ, తనకూ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కృష్ణారెడ్డి అన్నారు. ఈవీవీ సంస్థ మళ్లీ చిత్రాలు నిర్మించడం, అది కూడా తన దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో ఆరంభం కావడం ఆనందంగా ఉందని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘‘మా నాన్నగారు మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో ఈ సంస్థను నిలబెట్టడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడతాం’’ అని నరేశ్ అన్నారు. ఈ వేడుకలో నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, చలపతిరావు, నాని, సందీప్ కిషన్, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, దామోదరప్రసాద్, దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, హరీశ్ శంకర్, జి. నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముకుంద ఆడియో లాంచ్
-
అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ..!
తెలుగు చలన చిత్ర ప్రేక్షకులు ఇక్కడి వాళ్ళైనా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇష్టం, అభిమానం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరేమో! ఆవిధంగా అందరిలాగే నేను కూడా అతని అభిమానిని! సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన అతని ప్రతిభా విశేషాల గురించి మరోసారి విస్తారంగా ప్రస్తావించవలసినది లేదు. దాదాపు దశాబ్దిన్నర పైగా, అతన్ని అతి సన్నిహితుడుగా ఎరిగి ఉన్న వాణ్ణి గనక, జన బాహుళ్యానికి అంతగా పరిచయం లేని అతని విశిష్ట వ్యక్తిత్వం గురించి (వ్యక్తిగత విషయాల గురించి కాదు) క్లుప్తంగా చెప్పడం సందర్భానికి సముచితంగా ఉంటుందనుకుటున్నాను. రచయితగా, దర్శకుడిగా, అతని గురించి విశ్లేషిస్తూ పనిగట్టుకుని ప్రయత్నిస్తే అతనిలో ఒకటో, అరో లోపాలు వెతికి చూడగలవేమో కానీ, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, స్నేహితుడిగా, సామాజికుడిగా... ఇలా జీవితంలో ఎదురైన ప్రతి పాత్రకి పరిపూర్ణ న్యాయం కలిగించడంలో ఇంత చిన్న వయసులో (నా వయసుతో పోలిస్తే) అతను సాధించిన పరిణతి వేలెత్తి వంక చూపవీల్లేనిది. అతనంటే నాకున్న అపారమైన ఇష్టానికి ఇదొక ముఖ్య కారణం!విద్య, వివేకము, వినయం, సమపాళ్ళలో కలగలుపుకున్న అరుదైన వ్యక్తి. గుండెల్లో కొండంత నిబ్బరం, అపారమైన ఆత్మవిశ్వాసం, అణుమాత్రమైనా అహంకారం లేకపోవడం వంటి విలువైన లక్షణాలు జన్మసిద్ధంగా అబ్బిన వ్యక్తి. సునిశితమైన మేధస్సు, సున్నితమైన మనస్సు అతని సహజగుణాలు. తన అంతర్గత శక్తులు, తన పరిమితులు, తన ప్రయాణ మార్గాలు, మజిలీలు అన్నిటి గురించి ఏమాత్రం తడబాటు లేని స్పష్టమైన అవగాహన అతనికే ప్రత్యేకమైన సుగుణం. ఒక చిట్టాలో పైన వల్లించిన ఉత్తమ లక్షణాలన్నీ అనడానికీ వినడానికీ బాగానే ఉంటాయి గానీ, అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నూటికో కోటికో ఒకళ్లుంటారు. అలాంటి వాళ్ళలో అతను ఒకడు.ఏ రకంగానూ, చుట్టుపక్కల నుంచి ఎవ్వరూ, ఏ చిన్న చేయూతని కూడా అందించలేని ఒకానొక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం తన స్వశక్తితో ఇంత ఎత్తుకి ఎదిగిన త్రివిక్రమ్, ఆ ఎదుగుదల క్రమంలో ఎంతమందికి, ఇంత అని చెప్పలేనంతగా చేయూతనందించాడో, పొందిన వారెవ్వరూ ఎప్పుడూ మరచిపోరు. అలా తానెందరికో ఆసరాగా నిలిచిన సంగతి అతనెన్నడూ గుర్తుపెట్టుకోడు. ఒక నీడనిచ్చే చెట్టులా, నీటినిచ్చే ఏటిలా, ఊపిరిచ్చే గాలిలా, అలా అలా సింపుల్‌గా, న్యాచురల్‌గా అతను సాటి మనుషుల పట్ల స్పందించే తీరు నాకు అశ్చర్యానందాలు కలగజేస్తుంది.సుగంధం చిందడం పూలకెంత సహజమో, అలా తన ఈ ‘గొప్పతనం’ లేదా ఈ మంచితనం.. వీటిని అతను ప్రదర్శించడు... ప్రవర్తిస్తాడు. అంతే!అతని సహజ లక్షణం అతని చిత్రాల్లో, కథల్లో, కథనంలో, సంభాషణల్లో ప్రతిఫలిస్తుంటుంది. ‘అతి’ గాని, మెలోడ్రమెటైజేషన్ గాని, కాంప్లికేషన్గానీ లేకపోవడం అనే అతని శైలిని పరిశీలిస్తే, అవి కావాలని తెచ్చి పెట్టుకున్న ప్రక్రియలు కావనీ, అతని సొంత సంతకం అని తెలుస్తుంది. అతను తన భావోద్వేగాలను (ఎమోషన్స్), అభిప్రాయాలనూ అదుపులో ఉంచుకునే సంవిధానం అత్యంత అరుదైన లక్షణం. ఇది నేర్పితే వచ్చేది కాదు. ఏ ఫార్మాలిటీస్ లేని వాడిలా కనిపిస్తూ, ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడికి పిలవకుండానే వెళ్ళి అక్కడి (అక్కర) తీర్చి ఏవీ పట్టని వాడిలా ఇట్టే చటుక్కున మాయం అయిపోతాడు. ఎప్పుడో నేను రాసిన ఓ పాటలో ‘‘అయినవాడే అందరికీ... అయినా అందడు ఎవ్వరికీ’’ అన్నట్టుగా అనిపిస్తూ ఉండడం అతని ప్రత్యేకత. అతను మంచి వక్త. అయినా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ, ఏది బడితే అది మాట్లాడేస్తూ ఉండడు. కనుకనే అతను ఎప్పుడైనా బహిరంగ వేదికల మీదుగా మాట్లాడుతూ ఉంటే ఏటికోసారి వచ్చే పండుగలా ఉంటుంది. అతను ప్రచార ప్రసార మధ్యమాల్లో కూడా తరచుగా కనబడడు. అతని సినిమాలే అతన్ని చూపిస్తాయి. కాస్త వివరంగానే రాశానేమో... ఇది చదివితే అతను ‘కొంచెం ఎక్కువగా రాశారేమో కదండీ!’ అన్నా అంటాడు. అతని సినిమాలు చూస్తూ వాటి ద్వారా అతన్ని చూడడానికి ప్రయత్నించేవారికి నేను రాసిన ఈ పద్ధతి ‘మరీ ఎక్కువేమో’ అనిపించదని నా నమ్మకం.ఇక మా ఇద్దరికి ఉన్న వ్యక్తిగత, వృత్తిగత సంబంధ బంధవ్యాలకు సంబంధించి ఒకే మాట... ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఇరుకు అనిపించేంత దగ్గరగా ఉండం, అరిచినా వినిపించనంత దూరంగా ఉండం! శ్రీనూ! నీ గురించి నా మనసులో ఉన్న నాలుగు మాటలు నీకు చెప్పనివి నాకు చెప్పాలనిపించినవి చెప్పడానికి అవకాశమిచ్చిన సాక్షి పత్రిక వారికి కృతజ్ఞతలు... శతాయుష్మాన్‌భవ!!! త్రివిక్రమ్ పని చేసిన చిత్రాలకు నేను పాటల రచన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన వంతు భాగం కూడా అందులో కలిసేది. పాట గురించి మా మధ్య చర్చ జరిగి, అందులో నుంచి రూపుదిద్దుకొన్న రచనకు ‘నువ్వేకావాలి’ చిత్రంలోని ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట ఓ ఉదాహరణ. అలా అతని భాగస్వామ్యమున్న పాటలు చాలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే త్రివిక్రమ్‌లో కూడా మంచి పాటల రచయిత ఉన్నాడు. ఒక సినిమా (ఒక రాజు ఒక రాణి)కు పూర్తిగా పాటలన్నీ రాసిన అనుభవమూ అతనికి ఉంది. కానీ, అతని దృష్టి అంతా దర్శకత్వం మీదే! త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు మా మధ్య చర్చలు రావా, వాదన ఉండదా అంటే... ఎందుకుండవు? ఉంటాయి. కాకపోతే, అది ఆ సన్నివేశానికి తగ్గ సరైన సాహిత్యంతో, భావంతో రచన కోసమే! అది అక్కడకే పరిమితం. అతని సినిమాల్లో కొన్ని మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది, రాశాను. ‘జల్సా’ చిత్రంలో తెలుగు భాషలో భాగమైపోయిన ఇంగ్లీషు పదాలు వాడుతూ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా...’ పాట రాసినా, ‘చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్...’ లాంటి భావగర్భితమైన పాట రాసినా... జనం అంతే ఆనందంగా అర్థం చేసుకున్నారు... ఆస్వాదించారు... ఆనందించారు! ఇటీవల ‘జులాయి’లో కానీ, ‘అత్తారింటికి దారేది’లో కానీ నేను పాటలకు రాయకపోవడానికి కారణం - వాటిలో నేను రాయదగ్గ పాటలున్నాయని దర్శకుడు త్రివిక్రమ్ భావించకపోవడమే! నేను మాత్రమే రాయాల్సిన, రాయగల పాటలు ఉన్నప్పుడు అతను తప్పకుండా నా దగ్గరకు వస్తాడు. నాతోనే రాయించుకుంటాడు. ఇట్లు సిరివెన్నెల సీతారామశాస్త్రి -
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా?
తెల్లవాడి గుండెల్లో బాకు దించినా.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసినా.. అది మధ్యతరగతి మేధావి వర్గం వల్లే సాధ్యమైందంటారు ప్రముఖ కవి, సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెగువతో తెగించి పోరాడిన ఆ వర్గం... ఇపుడు మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛా భారతంలో అన్యాయాన్ని నిలదీసి సత్తా చాటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాన్ని బలిగోరే సమాజంపై కన్నెర్ర చేయడం లేదని నిగ్గదీస్తున్నారు. అయితే.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు పదునెక్కిన ఆలోచనలతో ముందుకొస్తారని ఆకాంక్షిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. సిరివెన్నెల మదిలో ఉప్పొంగిన ఆవేశమే ఇక్కడ అక్షరరూపమైంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా? .. సగటు మనిషిలో రగిలిపోయే ఆవేశమిది. శాంతి కపోతపు కుత్తుక తెగిపోతున్న వేళ.. తెగిపడిన తలే భారతావని నుదుట సింధూరమైన వేళ.. సామాన్యుడి స్పందన ఇలాగే ఉంటుందేమో? ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? పోయిందా? అన్న సందేహమే కల్గిస్తుందేమో? ఈ దేశాన్ని కొల్లగొట్టి, గుల్లచేసిన తెల్లవాడిని తరిమికొట్టడానికి ఏకమైన జాతి ఇప్పుడెందుకు నైరాశ్యంలో ఉంది? స్వాతంత్య్రం అనే భావజాలం కోసం ఒకే మాట, ఒకే బాట ఎంచుకున్న భారతీయులు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? స్వాతంత్య్రం వచ్చాక యావత్ భారతావని ఏకమైన సందర్భాలేంటి? చైనా, పాకిస్తాన్‌తో యుద్ధం సమయమో.. క్రికెట్ కప్పు గెలుపోటముల్లోనో తప్ప మన కోసం.. భావి తరం కోసం ఏకమయ్యే పరిస్థితి లేదా? నిజాన్ని బలిగోరే సమాజమెందుకు? గాంధీ కోరింది దేశానికి స్వాతంత్య్రమే కాదు. గ్రామ స్వరాజ్యం కూడా. దశాబ్దాలుగా ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. సురాజ్యమవ్వలేని స్వరాజ్యాన్నే గొప్పగా చెప్పుకుంటున్నాం. సుఖాన మనలేని వికాసాన్నే ప్రగతి సంకేతమంటున్నాం. నిజాన్ని బలిగోరే సమాజాన్నే చూస్తున్నాం. తెల్లవాడు రాకముందు ఈ దేశంలో వికేంద్రీకరణ ఉండేది. ఏ ఊళ్లో పాలన ఆ ఊరిలోనే. అక్కడే తీర్పులు, అక్కడే శిక్షలు. అప్పట్లో ఊరిలోనే పని దొరికేది. ఇప్పుడు మనం చెప్పుకునే సర్వసత్తాక ప్రజాస్వామ్యం పల్లెల్లోనే కన్పించేది. ధార్మిక సంబంధాలే తప్ప పొరుగూరితోనూ పనిలేని వ్యవస్థ మన పల్లెల సొంతం. బ్రిటీష్ వాళ్లు దీనిపై దెబ్బకొట్టారు. వికేంద్రీకరణతో గ్రామీణ భారతాన్ని ఛిన్నాభిన్నం చేశారు. న్యాయం కోసం, ఉపాధి కోసం మైళ్ల కొద్దీ వెళ్లే పరిస్థితి తెచ్చారు. ఆ పద్ధతినే మనం అనుసరిస్తున్నాం. ఈ భావదారిద్య్రం నుంచి బయటపడేదెప్పుడు? మెకాలేకు మొక్కాలా? ఇంగ్లీష్ మాట్లాడకపోతే దేశద్రోహమని భావించే విద్యా సంస్థలు.. దాన్ని ప్రోత్సహించడమే ఫ్యాషన్ అనే తల్లిదండ్రులు మారేదెన్నడు? ఇంగ్లీషోడి భాషను ఇంకా ఇంపుగా ఆదరించడమంటే.. తెల్లవాడి భావజాలం నుంచి మనం బయటపడనట్లేగా. విశ్వవ్యాప్తంగా దూసుకెళ్లే చైనా, రష్యా వంటి దేశాలు స్వదేశీ భాషకే పట్టం కడుతున్నా.. మనకేంటీ దుర్గతి? బానిసత్వపు ఆలోచనలనే భావి తరాలకు బోధించడాన్ని కార్పొరేట్ విద్యగా పేర్కొనడం అన్యాయమే. తెలుగు చదవలేని, మాట్లాడలేని దౌర్భాగ్యంలో ఉంటే స్వాతంత్య్రం వచ్చినట్టేనా? మెకాలే విద్యావ్యవస్థ ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. ఆధునికతా? అధోగతా? మూడు దశాబ్దాల క్రితం ఈ దేశంలో కంప్యూటర్ వాడకం మొదలైంది. అంతకు ముందు ఇండియా అనేక రంగాల్లో ఎన్నో దేశాలకు పోటీ ఇచ్చింది. విజ్ఞాన వీచికలు పంచుతూ అమెరికాకే ఆదర్శమైంది. శాస్త్ర,సాంకేతిక పురోగతి అందివచ్చాక.. ఆ వేగం ఎందుకు కుంటుపడింది? పరిశోధన రంగం జాడలు బలంగా కన్పించవెందుకు? వందమంది పని ఒక్క కంప్యూటర్ చేస్తుంటే, 99 మంది రోడ్డున పడుతున్నారే? ఆధునిక యంత్రం.. సంప్రదాయ వృత్తులను నుజ్జునుజ్జు చేస్తుంటే పట్టించుకోరే? నేలతల్లే భారమైన దయనీయ స్థితి.. దీన్నేనా మనం ప్రగతి అంటున్నాం? నిజం తెలుసుకోరే.. భుజం కలిపి రారే? ఒకప్పుడు మతం మన బలం. కులం ఉపాధి గుణం. ఈ రెండూ జాతిని ఏకం చేశాయి. స్వాతంత్య్రం తర్వాత పరిస్థితి ఏమిటి? కులం రాజకీయమైంది. మతం వికృత భావజాలమై సమాజంలోకి వచ్చింది. కులాల కోసం గుంపులు కట్టే దుస్థితి దాపురించింది. మతాల కోసం మంటలు పెడుతున్న వైనం కన్పిస్తోంది. భారతావని బంధనాలు తెంచే క్రమంలో కులమతాలు అడ్డొచ్చాయా? ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులూ ముక్త కంఠంతో నినదించలేదా? ఇవన్నీ ఇప్పుడెందుకు మరచిపోతున్నాం. ముస్లింలు ఈ దేశ పౌరులు కాదనే హక్కు ఎవరికి ఉంది? దేశం కోసం వాళ్లూ ప్రాణాలర్పించలేదా? దేశాభివృద్ధిలో పాలుపంచుకోలేదా? రక్తసిక్తమైన జలియన్‌వాలా బాగ్‌లో పేలిన వందల తూటాలూ డయ్యర్వేనా? స్వార్థంతో తెల్లవాడి పంచన ఉద్యోగం చేసినవాళ్లవి లేవా? వాళ్లలో ఎవరిది ఏ కులం? ఎవరిది ఏ మతం? సమాజ క్షేమం పట్టని స్వార్థం.. ఇరుకుతనంతో ముడుచుకుపోతే ఈ జనం నిజమెలా తెలుసుకుంటారు? నిరాశావాదమే కారణమా? నిరాశావాదం బలహీన భావనలకు ఆజ్యం పోస్తుంది. ఈ దేశంలో జరిగింది అదే. స్వేచ్ఛ కోసం పోరాడిన జనం.. ఒక్కసారిగా నిరాశావాదంలోకి వెళ్లారు. స్వార్థ ప్రయోజనాలకే పరిమితమయ్యారు. నిర్దేశిత లక్ష్యాలు లేకుండా పోయాయి. ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు జరిగాయి. కార్పొరేటీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణల పర్వం.. ఇలా ఏదైనా పరాయి వాడి వ్యాపారమే పరమాన్నమైంది. పేదవాడి బతుకు బుగ్గయినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రజలూ కారణమే. అప్పుడప్పుడూ ఆవేశం వస్తుంది? ఆ క్షణంలో మార్పు కోసం ఏకమవుతారు. అంతలోనే చల్లబడతారు. పాలకులే అన్నీ చూసుకుంటారని ఊరుకుంటారు. ఆటవికన్యాయం మారదేం? ఒక జంతువు ఆకలి తీర్చుకోవడానికే వేటాడుతుంది. ఆ క్రమంలో ఎదుటి జంతువు ఏంటని చూడదు. తనదా? పరాయిదా? అన్న భావన రాదు. కానీ మనిషి ఆకలి కోసం దోచుకోవడం లేదు. సంపద కూడబెట్టాలనుకుంటున్నాడు. జంతువుకన్నా హీనంగా ఉన్న భావనలను ఏమని సంబోధించాలి? ఈ భావజాలంతో సమాజాభివృద్ధి ఎలా సాధ్యం? ధర్మాగ్రహమే ముఖ్యం జాతి నిర్మాణం చాలా అలస్యమవుతుంది. కానీ కూల్చివేయడం క్షణాల్లో పని. నిర్మాణాత్మక ఆలోచనలు జనంలోనూ ఉన్నాయి. కాకపోతే అవి వాళ్ల వద్దే ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయితే మంచి, చెడును అన్ని ప్రాంతాలవాళ్లూ సమానంగా నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో వచ్చిన అభిప్రాయమే వైజాగ్‌లోనూ వస్తుంది. ఈ దేశం బాగుపడాలని అంతా అనుకుంటారు. దాన్ని నిలదీసి అడగలేరు. ‘నేనొక్కడిని అడిగి ఏం లాభం’ అన్న భావనతో ఉంటారు. ఇలా పక్కవాడు ఆలోచిస్తాడని ఎందుకు అనుకోరు? ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..’ అన్నప్పుడు ‘అబ్బ.. ఏం అడిగాడు’ అన్నారే తప్ప, ఆ జనంలో తానూ ఉన్నానని గుర్తించరా? ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు! ఈ దేశంలో మార్పు కేవలం మధ్య తరగతి మేధావి వర్గం నుంచే సాధ్యం. స్వాతంత్రోద్యమ కాంక్ష రగిలించినా, విప్లవోద్యమ కెరటాలు సృష్టించినా, భారతమాత పాపిట రక్త సింధూరమైనా.. అందుకు కారణం మధ్య తరగతి మేధావే. బతుకు పోరాటమే జీవన విధానమయ్యే ఈ వర్గం అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈ ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. ఆ ఆలోచనల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. కానీ వాళ్లు ఉదాసీనంగా ఉంటారు. వేదనలు, రోదనలు పరిమితి మించినప్పుడు మార్పు కోసం సమైక్యంగా గళమెత్తుతారు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పురాణాలు తిరగేయక్కర్లేదు. రామాయణ, భారత గ్రంథాలు చదవక్కర్లేదు. మనిషిని బంధించగలరేమో కానీ.. ఆలోచించే మనసును బంధించడం ఎవరి వల్లా కాదు. మన చేత్తోనే మన ఇంటి వస్తువులు భోగి మంట వేసుకుని ఆనందించే పరిస్థితి నుంచి.. ఆలోచించి అడుగేసే రోజు వస్తుంది.. అదీ మధ్యతరగతి ఇంటి నుంచే! - వనం దుర్గాప్రసాద్ -
మాది త్రివేణీ సంగమం - సిరివెన్నెల
‘‘ఇలాంటి కథ, నిర్మాతలు, అన్ని సమయాల్లో దొరకరు. అందుకే ‘కహానీ’ తెలుగు రీమేక్ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నా. అయితే ‘కహానీ’లోలాగా ‘అనామిక’లో కథానాయికను గర్భవతిగా చూపించం. నాకిది కొత్త తరహా సినిమా. నేనెలా తీసినా కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలరని గట్టి నమ్మకం’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన దర్శకత్వంలో వయాకామ్ 18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అనామిక’. నయనతార, హర్షవర్థన్ రాణే, వైభవ్ ముఖ్యతారలుగా నటించిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘పాటలో ఈ పదాన్ని ఎందుకు వాడారని ప్రశ్నిస్తే కరెక్ట్‌గా చెప్పగలిగే సీతారామశాస్త్రిగారు మనకుండడం మన అదృష్టం. అందుకే ఆయన పాట రాసేవరకూ ఎంత కాలమైనా ఎదురు చూస్తాం’’ అని చెప్పారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ -‘‘నేను, శేఖర్ కమ్ముల, కీరవాణి కలిసి త్రివేణి సంగమంగా ఈ సినిమా వచ్చింది’’ అన్నారు. ఈ సినిమాకు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదని యండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. శేఖర్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని వైభవ్ తెలిపారు. ఈ వేడుకలో ఎ. కోదండరామిరెడ్డి, నరేష్ తదితరులు మాట్లాడారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా ॥ చరణం : 1 అ: ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా ఆమె: నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా ॥ చరణం : 2 అ: చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ: ఆ జ్వాలలతోనే జీవించే టి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తె ంపడం నేర్పడానికి ॥ చిత్రం: ఆహ్వానం (1997) రచన: సిరివెన్నెల, సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
'యామిని చంద్రశేఖర్' ఆడియో ఆవిష్కరణ
-
నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల
‘‘ఇప్పటివరకూ నేను చూసిన హారర్ చిత్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా మాత్రమే నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నాకు నచ్చిన హారర్ చిత్రం ఇదే. ఈ చిత్ర నిర్మాత అంకమ్మచౌదరి చాలా విలువలున్న వ్యక్తి’’ అని ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. తారకరత్న, అనూప్‌తేజ్, పంచిబోర, లాస్య ముఖ్య తారలుగా వెంకటరమణ సాళ్వ దర్శకత్వంలో ముప్పా తిరుమలరావు చౌదరి సమర్పణలో అంకమ్మ చౌదరి నిర్మించిన ‘యామిని చంద్రశేఖర్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. యోగీశ్వరశర్మ స్వరపరిచిన ఈ సినిమా పాటల సీడీని సీతారామశాస్త్రి ఆవిష్కరించగా, చాట్ల శ్రీరాములు స్వీకరించారు. ప్రేమ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ చిత్రం ఇదని దర్శకుడు పేర్కొన్నారు. చేసే పనిలో నిబద్ధత ఉండాలనే సూత్రంతో ఈ చిత్రానికి పనిచేశామని నిర్మాత చెప్పారు. భీమనేని, టి.ప్రసన్నకుమార్, చంద్రసిద్దార్థ్, రాజా, సాయికిరణ్, అడివి శేష్ పంచిబోర తదితరులు కూడా మాట్లాడారు. -
ప్రభంజనం ఆడియో వేడుక
-
ఒక ఆశయం కోసం...
‘‘సినిమా... వినోదానికి మాత్రమే పరిమితమైన నేటి తరుణంలో ఇలాంటి సినిమా ఒకటి రావడమే ఒక ప్రభంజనం’’ అని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘రంగం’ ఫేం అజ్మల్, సందేశ్, ఆరుషి, పంచిబోర ముఖ్య తారలుగా భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రభంజనం’. పే బ్యాక్ టు సొసైటీ అనేది ఉపశీర్షిక. ఆర్పీ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏ.కోదండరామిరెడ్డి, దశరథ్ కలిసి ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సిరివెన్నెలకి అందించారు. ప్రచార చిత్రాల్ని సి.బి.ఐ. మాజీ జె.డి. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ‘‘మనుషుల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే ‘ప్రభంజనం’ తీశాడు భాస్కరరావు. ఆయన ప్రయత్నం సఫలం అవ్వాలి’’ అని ఆకాంక్షించారు సిరివెన్నెల. భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఎంతమంది వచ్చినా సమాజంలో లంచగొండితనాన్ని నిర్మూలించలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందని నలుగురు ఇంజినీర్లు సర్వే చేస్తారు. ఆ సర్వేలో ఈ పరిస్థితికి కారణం ఓటర్లు, రాజకీయ నాయకులని బయటపడుతోంది. ఓటర్లలో మార్పు తెస్తేనే ఈ దుర్నీతిని అంతం చేయగలమని నిర్ణయించుకున్న ఆ ఇంజినీర్లు ఏ విధంగా అడుగులేశారు అనేదే ఈ సినిమా కథాంశం. ఒక ఆశయం కోసం తీస్తున్న ఈ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యం, పట్నాయక్ సంగీతం ఆభరణాలుగా నిలుస్తాయి’’ అని చెప్పారు. మంచి సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇదని అజ్మల్ చెప్పారు. ఇంకా సుందర్, ఆరుషి, పంచిబోర కూడా మాట్లాడారు. గొల్లపూడి మారుతీరావు, బి.గోపాల్, ఎస్.గోపాల్‌రెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు. -
గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు పల్లవి : నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా (2) చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం ॥ చరణం : 1 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం ॥ చరణం : 2 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమన్న నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది అంతేగాని నీలో లేదే దోషం ॥ చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్ -
గీత స్మరణం
అతడు: ఏమో ఎక్కడుందో కూసే కోయిల... నాతో ఏవిటందో ఊహించేదెలా ఎదలో ఊయల ఊగే సరిగమ ఏదో మాయలా అల్లే మధురిమ ఆమె: లలలా లాలలా లాలాలాలలా (2) పల్లవి : అతడు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఆమె: ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ... అంటానుగా అ: మనమే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా చరణం : 1 అ: ఇద్దరికీ ఒద్దిక కుదరగ ఇష్టసఖి వద్దని బెదరక ఆ: సిద్ధపడే పద్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక ॥ఉన్న॥ చరణం : 2 ఆ: రెప్పలలో నిప్పుల నిగనిగ నిద్దరనే పొమ్మని తరమగ అ: ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయ్యారి వయస్సు తయారైందిగా ॥ఉన్న॥ పల్లవి : ఆమె: వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాఠం అతడు: సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలిగీతం ఆ: ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా? అ: ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా ఆ: ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా! అ: నా సితార ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 1 ఆ: రేయిభారం రెట్టింపయ్యింది లేవయ్యారం నిట్టూరుస్తుంది అ: రాయబారం గుట్టే చెప్పంది హాయి బేరం గిట్టేలాగుంది ఆ: మాయలేని ప్రేమంటే ఇదేరా! అ: సాయమడిగే ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 2 అ: తేనె మేఘం కాదా నీ దేహం వానరాగం కోరే నా దాహం ఆ: గాలివేగం చూపే నీమోహం తాకగానే పోదా సందేహం అ: ప్రాణముంది ప్రేమంటే ఇదేరా! ఆ: ప్రాయమంది ప్రేమంటే ఇదే... ॥ చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998), రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల, గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
పోటీ పడి విజయం సాధించండి
బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్‌లైన్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీపడి విజయం సాధించాలని ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విద్యార్థులకు సూచించారు. అలాగే సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను యువతకు తెలియజేయాల్సి బాధ్యత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉందని ఆయన అన్నారు. అభ్యుదయ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ సందర్భంగా సూర్యకళామందిరంలో శనివారం నిర్వహిస్తున్న సంప్రదాయ సాంస్కృతిక వైభవ్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. తొలుత సరస్వతీదేవి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం యువత మోడిబారిపోయిన కొమ్మను మాత్రమే చూస్తోందని, చెట్టు మొదలుకున్న పచ్చదనం చూడటం లేదన్నారు. ఆధునికత మోజులో పడి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. సంక్రాంతి వచ్చిందంటే పల్లెలో అచ్చమైన పండుగ వాతావరణం నెలకొనేదని, ప్రస్తుతం ఆ వాతావరణం ఎక్కడా కనబడటం లేదన్నారు. అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ బాదం మాధవరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై సంగీతం, పద్యనాటకాలు వంటి కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాహిత్యం పై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సిరివెన్నెల సమాధానమిచ్చారు. ‘నేను తినే తిండిలో సంఘం కనిపిస్తుంది’ కాకినాడ కల్చరల్, న్యూస్‌లైన్ : దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చింది కాని... మాతృభాషను మాట్లాడే స్వాతంత్య్రాన్ని హరించింది. పాశ్చాత్య సంస్కృతి మోజు దేశ సంస్కృతిని పతనావస్థలో నడిపిస్త్తోంది. అందుకే ఈ వ్యవస్థను నిగ్గదీసి అడగాలి...అగ్గితోటి కడగాలి... అంటున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘న్యూస్‌లైన్’తో పంచుకున్న విషయాలు మీకోసం... ఈ మధ్యన సినిమా పాటలే ఎక్కువ రాస్తున్నారు?ఙఞ్చటజ: ప్రస్తుతం సినిమానే అన్ని రకాల ప్రజల్లోకి త్వరగా వెలుతుంది. అందుకే సినిమా గేయాల ద్వారానే ప్రజా చైతన్యానికి నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. పుస్తకాలు రాసినా సామాన్యులు వాటిపై దృష్టి పెట్టడంలేదు. మీ పాటల్లో భావం తీక్షణంగా ఉంటుంది కారణం?ఙఞ్చటజ: ప్రతీ విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తాను. ఉదాహరణకు మనం తినే అన్నం ఈ సంఘం పండించింది. అందుకే మనం ప్రతీ నిమిషం ఈ సమాజానికి రుణపడి ఉండాలి. అటుంటి ఆలోచనల్లోంచి పుట్టిందే నా సాహిత్యం. నేటితరం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తోంది. మీ అభిప్రాయం? మనకు జీవించడం నేర్పేది మాతృభాష, ప్రాథమిక భాషపై పట్టు సాధించినపుడే మనకు ప్రతీ విషయాన్ని అర్ధం చేసుకునే అవగాహన పెరుగుతుంది. సంస్కృతానికి ఆదరణ ఉందా?ఙఞ్చటజ: ఆదరణ కాదు కావాల్సింది గౌరవం కావాలి. వజ్రాన్ని భూమిలోనుంచి తవ్వనంత మాత్రాన అది రాయిగా రూపాన్ని మార్చుకోదు కదా.! మన సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి ప్రధాన తేడా ఏమైనా చెబుతారా? మనకు భావాత్మక పునాదులు లేవు. వారికి జీవాత్మక పునాదులు లేవు. సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయంటున్నారు?ఙఞ్చటజ: సినిమా ఒక కాలక్షేపం మాత్రమే. ఒకప్పుడు కుటుంబ కథాచిత్రాలు మాత్రమే వచ్చేవి. ఆసినిమాలను చూసిన అప్పటి సమాజం ఒకే కుటుంబంలా జీవించాలని వారు అనుకోలేదు. కాబట్టి ప్రస్తుత సినిమాలను చూసి చెడిపోయేది ఏమీ లేదు. సమాజం మారినప్పుడే సినిమాలూ మారతాయి. కాబట్టి సినిమాలనుంచి సమాజాన్ని రక్షించాల్సిన అవసరంలేదు. రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం?ఙఞ్చటజ: రాష్ట్ర విభజన రాజకీయ ప్రయోజనాలకు కాకుండా, ప్రజల, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: తుమ్మెదా... ఓ తుమ్మెదా... ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ॥ అతడు: మగడులేని వేళ తుమ్మెదా వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా ఆ: మాట వరసకంటూ తుమ్మెదా పచ్చి మోటసరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెదా ॥ చరణం : 1 ఆ: ఎదురుపడితే కదలనీక దడికడతాడే పొదచాటుకు పద పదమని సొదపెడతాడే ॥ అ: ఒప్పనంటే వదలడమ్మా ముప్పు తప్పదంటే బెదరడమ్మా ॥ చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం పట్టు విడుపులేనిదమ్మా కృష్ణుని పంతం ॥॥ చరణం : 2 ఆ: తానమాడువేళ తాను దిగబడతాడే మాను మాటు చేసి చూడ ఎగబడతాడే ॥ అ: చెప్పుకుంటే సిగ్గుచేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు ॥ ఆ: ఆదమరచి ఉన్నావా కోకలు మాయం ఆనక ఏమనుకున్నా రాదే సాయం ॥॥ చిత్రం : శ్రీనివాస కళ్యాణం (1987) రచన : సిరివెన్నెల సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలు, పి,సుశీల నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఒక్కటే ఆశ అందుకో శ్వాస అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా (2) అతడు: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా (2) ఆ: ఒక్కటే ఆశ... అ: అందుకో శ్వాసా... చరణం : 1 ఆ: మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం ఆడపుట్టుకే అందుకోసం అ: గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం పాదపూజలే అది పాఠం ఆ: చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా అ: దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్థకం పొమ్మిక ఆ: మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం అ: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా ఆ: అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా ఆ: ఒక్కటే ఆశ... అ: అందుకో శ్వాస... చరణం : 2 ఇద్దరు: తాతారరు తారరు తాతారరు తారూ తాతరరు తారరు తాతారరు తారూ తారా తారారా తారారా తారరారా అ: నచ్చనే నారీ వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సఖ్యం ఆ: మెచ్చెనే చేరీ ముచ్చటే తీరీ ఇచ్చెనే ప్రేమరాజ్యం అంతులేనిదే సంతోషం అ: స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా ఆ: స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా అ: మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం ॥ చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా గానం : మనో, కె.ఎస్.చిత్ర నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా (2) అంత మారం ఏంటంటా మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంటా వస్తా తీసుకుపో నీ వెంటా... చరణం : 1 నా సంతోషాన్నంతా పంపించా తనవె ంటా భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా తన అందెలుగ తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా చినబోయిందేమో చెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీవాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంటా... వస్తా తీసుకుపో నీ వెంటా... హే... పుటుక్కు జరజర డుబుక్కుమే (2) చరణం : 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది ఏం గారం చేస్తావే ప్రేమా నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంటా... ఓ ప్రేమా తీసుకుపో నీ వెంటా... ॥ చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : మల్లికార్జున్, సాగర్ నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క చెంపనొక్క ఆమె: నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగ తిమ్మిరెక్క అ: కో... అంది కోక ఎందుకో ఆ: కోరింది కోసి అందుకో అ: రాణీ... ఐ లవ్ యూ... ఆ: రాజా... ఐ లవ్ యూ... ॥ చరణం : 1 అ: మారుమూల సోకుచేర లేఖరాయనా ఆ: సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా అ: తేరిపార చూడనీ దోర ఈడునీ ఆ: చీర చూరు దాటనీ వేడి ఊహనీ అ: వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ ఆ: పళ్లగాటు కత్తిరించు కన్నె కంచెలన్నీ అ: రా... గారంగా ఆ: సైరా... సారంగా... ॥ చరణం : 2 ఆ: ఈటెలాటి నాటుచూపు నాటుకున్నదీ అ: అలవాటులేని చాటుచోట మాటుకున్నదీ ఆ: ఈదలేను యవ్వనం ఆదరించవా అ: మీదవాలు మోజుతో స్వాగతించవా ఆ: రంగ రంగ వైభవాల మంచుమేలుకోవా అ: గంగ పొంగు సంబరాల రంగుతేరనీవా ఆ: ఈ... ఏకాంతం... అ: జాలీ... హహ్హా... కైలాసం... ॥ చిత్రం : బొబ్బిలిరాజా (1990) రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
జగమంత కుటుంబంపాట కాదు... నా జీవితం!
పాట తప్ప, సీతారామశాస్త్రికి... వేరే స్వరూపం లేదు, సారూప్యం లేదు, సదృశమూ లేదు. పోనీ మాటల్లో? ‘బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అని కదా అన్నాడు... అహాన్ని దహనం చేసుకుని, ఆ బూడిదగా కూడా మిగలని వాడితో... ఏం మాట్లాడి ఏం రాబడతాం? ఏం రాబట్టి ఏం రాస్తాం? ఒకర్ని ఒక మాట అనడు, అననివ్వడు. ‘మీరు గ్రేట్ సర్ ’ అంటే ఒప్పుకోడు. తనలోని జగమంత కుటుంబాన్ని చూపిస్తాడు. అందులో ఆయన తప్ప అంతా గ్రేట్‌గా కనిపించేలా చేస్తాడు! జీవితాన్ని, జీవితంలోని ప్రేమను, కవినీ, కవి డిగ్నిటీని... కళ్లకద్దుకుంటూ మాత్రమే తను కనిపిస్తాడు. మరెలా ఆయన్ని క్యాచ్ చెయ్యడం? కాని పని. నిర్నిమిత్తంలో, నిర్వికారంలో, నిరహంకారంలో... లుప్తమై విశ్వవ్యాప్తమైన సృజనశీలి ‘సిరివెన్నెల’! ఆ వెన్నెలలో లభించిన ఒకటీఅరా సాక్షాత్కారాలే... ఈవారం మన ‘తారాంతరంగం’! జీవితంలో సక్సెస్ మొదలయ్యేది మన ప్రజ్ఞ మనం తెలుసుకున్నప్పుడే. మీలో ఓ కవి ఉన్నాడని మీకెప్పుడు తెలిసింది? సిరివెన్నెల: అటు పల్లెటూరు, ఇటు పట్టణం.. రెండూ కాని ఓ ప్రాంతం. చదువుకున్నదేమో గవర్నమెంట్ బడి. ‘పాడిన వారు ఘంటసాల, సుశీల’ అని రేడియోలో చెబుతుంటే... ‘అదేంటి? పాడింది అక్కినేని, సావిత్రి అయితే.. ఘంటసాల, సుశీల అంటారు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునే ఇన్నోసెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నాకు... రాయడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని, రాస్తారని ఎలా తెలుస్తుంది? కానీ ఏదో రాస్తూ ఉండేవాణ్ణి... నాకు తెలీకుండానే! నేను రాస్తున్నది కవిత్వం అని ఓ రోజు నా తమ్ముడు చెబితే కానీ నాకు అర్థంకాలేదు. అంటే.. బాల్యం నుంచీ అక్షరసాన్నిహిత్యం ఉండేదన్నమాట! సిరివెన్నెల: పుస్తకాల్లో అక్షరాలు కనిపిస్తే చాలు, నమిలి మింగేసేవాణ్ణి. మా నాన్నగారు గొప్ప పండితుడు, మానవతావాది, సాహితీ ప్రేమికుడు, గొప్ప ఫిలాసఫర్. హిమాలయ శిఖరం అంచుని నేలపై నిలబడి చూస్తే కనిపించదు... ఆయన కూడా అంతటి వారే! కానీ దురదృష్టం ఆయన 40 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. ఇప్పుడుంటే అద్భుతాలు చేసి ఉండేవారు. ఆయన ద్వారా నాకు సంక్రమించిన ఆస్తే నాకు అక్షరం. మీ నాన్నగారితో మరచిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సిరివెన్నెల: నాకు చిన్నప్పుడు డైరీ రాసే అలవాటు ఉండేది. ఓరోజు ఆయన నా డైరీని చదువుతూ కనిపించారు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ‘అదేంటి? ఒకరి డైరీని అలా చదవడం కుసంస్కారం కాదా?’ అని ఆయన్ను సీరియస్‌గా ప్రశ్నించాను. ‘ఏం? దొంగల డైరీలు పోలీసులు చదవడంలేదా?’ అన్నారు నింపాదిగా నాన్న. ‘నేను దొంగనా...’ అన్నాను ఉక్రోషంగా. ‘నువ్వు దొంగవు కాకపోవచ్చు, కానీ నేను పోలీసునే. నా కొడుకు ఆలోచనాధోరణి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది’ అన్నారు. పరులకు తెలియకూడని పనులు నువ్వెందుకు చేయాలి? పోనీ చేశావే అనుకో... అవన్నీ పుస్తకాల్లో రాయడమేంటి అర్థం లేకుండా? అవి నేను చూస్తే సంస్కారం లేదా అని నన్నడగటం ఏంటి?’ అంటూ ఆపకుండా అక్షింతలు వేశారు. ‘చూడు నాయనా... ప్రైవసీ, సీక్రెసీ అని రెండు ఉంటాయి. ప్రైవసీ అందరికీ ఉండాలి.. కానీ, సీక్రెసీ మాత్రం ఉండకూడదు. శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగని బట్టలు విప్పేసి తిరగం కదా’ అని నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక కవిగా సాహిత్యానికి మీరిచ్చే నిర్వచనం? సిరివెన్నెల: సాహిత్యం.. ఓ విరాట్ స్వరూపం! ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారిగా చూడలేక దాన్ని మనం విభజించుకున్నాం. కథ, కథానిక, కవిత, నాటకం, నాటిక, వ్యాసం... ఇలా! ఇది పాశ్చాత్యుల ప్రభావంతో జరిగిన విభజన. సాహిత్యానికి అసలైన రూపం మహాభారతం! అందులో వచనం ఉంటుంది, వర్ణనలుంటాయి, శ్లేషలు, ధ్వనులు ఉంటాయి. ‘సిరివెన్నెల వంటి సాహితీవేత్త సినీరంగంలోకి రావడం సినిమా అదృష్టం.. ఆయన చేసుకున్న దురదృష్టం. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి ఆయన’ అని ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ గురించి అన్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? సిరివెన్నెల: కచ్చితంగా ఏకీభవించను! ఓ వ్యక్తి నా గురించి వ్యక్తపరిచిన అభిప్రాయం మాత్రమే అది. అదేం గీటురాయి కాదు, సర్టిఫికెట్ కాదు.. శిలాశాసనం అంతకన్నా కాదు. ‘ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి’ అంటే.. ప్రేక్షకులకు స్థాయి లేదనా? ఇప్పటివరకూ అందరూ స్థాయిలేని పాటలు రాశారనా? శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె ఇత్యాది కవుల పాటలను ఆదరించిన అలనాటి శ్రోతలు స్థాయి లేనివారనా? అది తప్పు. సినిమాను నేను మరోతల్లిగా భావిస్తాను. నా భావాలను, ప్రతిభను ప్రపంచానికి వ్యక్తపరచడానికి సినిమా ఓ వేదిక అయ్యింది. అంతకంటే ఓ కళాకారుడికి ఏం కావాలి? సినిమా అంటే సకల కళల సమన్వయ వేదిక. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే పదానికి పరిపూర్ణమైన రూపం సినిమా. అలాంటి సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు ఎప్పుడూ గర్విస్తాను. నాపై ఉన్న అభిమానంతో నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాడు త్రివిక్రమ్. అనేకమంది భావాలను తన మాటగా వ్యక్తపరచినందుకు తివిక్రమ్‌కి రుణపడి ఉంటానని ఆ వేదికపైనే చెప్పాను. అంతేకానీ ‘అక్షర సత్యాలు మాట్లాడాడు త్రివిక్రమ్’ అని చెప్పలేదే! సినిమా సకల కళల సమన్వయ స్వరూపం అన్నారు. కానీ ప్రస్తుతం సినిమా అలా లేదు కదా? సిరివెన్నెల: నేను చెబుతున్నది సినిమా గొప్ప వేదిక అని! అందులో ఏ మాత్రం సందేహం లేదు. వేదిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సినిమా లేకపోతే.. చూడకండి. శుభ్రంగా చాగంటి కోటేశ్వరరావుగారితో పురాణ కాలక్షేపం చెప్పించుకోండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ‘పాడుతా తీయగా’ చూసుకోండి. సినిమా ఎవరు చూడమన్నారు? వేదిక అనేది పరమేశ్వర స్వరూపం. అది ఎప్పుడూ పూజనీయమైనదే! పాట ద్వారా సాహిత్యాన్ని వినిపించడమే కాదు, ఆ పదాల అర్థాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచిన రచయిత సిరివెన్నెల అని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: అవునా.. ‘చిలక తత్తడి రౌతా.. ఎందుకీ హూంకరింత..’. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసిన ‘రహస్యం’ సినిమాలోని ఈ పాటను శ్రోతలు వినలేదా? ‘చిలక తత్తడి రౌతా..’ అంటే.. చిలకను వాహనంగా కలిగినవాడా. అంటే... ‘మన్మథుడా..’ అని! జనాలు విన్నారు... అర్థం తెలుసుకున్నారు. శ్రోతల మేథస్సును తక్కువ అంచనా వేయకూడదు. నా ‘విధాత తలపున’ పాటను అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే కారణం.. నేను ఆ పాటను ‘సిరివెన్నెల’ సినిమా కోసం రాశాను కాబట్టి! అదే ఏ ‘యమకింకరుడు’ కోసమో రాసుంటే ఆ పాట గురించి మాట్లాడుకునేవారా? మీకు తెలీని విషయం ఏంటంటే... నేను కొన్ని రకాల పాటలు ఇప్పటికీ రాయలేను. మీరు రాయలేని పాటలు కూడా ఉన్నాయా? సిరివెన్నెల: ఎందుకుండవు? కొన్నికొన్ని పాటలుంటాయి. భలే తమాషాగా, తిక్కగా ఉంటాయి. ఉదాహరణకు ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘మండపేట.. మలక్‌పేట.. నాయుడుపేట.. పేటర్యాప్..’ పాటనే తీసుకోండి. భలే ఉంటుంది ఆ పాట. ఎప్పుడు విన్నా కూడా ‘ఇలా రాయడం నావల్ల కాదేమో’ అనిపిస్తుంది. ‘జీన్స్’ సినిమాలో ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ’ పాట విన్నప్పుడూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. డెఫినిట్‌గా అలాంటివి నేను రాయలేను. మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఓసారి వెళితే.. అసలు ఇంతటి సాహితీ ప్రియులు టెలిఫోన్ శాఖలో ఎలా ఇమడగలిగారు? సిరివెన్నెల: జీవన కర్మక్షేత్రంలో తనకివ్వబడ్డ పనిని చేసుకొని పోవడం మానవధర్మం. ఇందులో ఇమడకపోవడానికి ఏముంది? ఇప్పుడు నేను చేస్తున్నది అదే! సద్గురువు సాంగత్యం లేకపోతే... ఇంత జ్ఞానసంపద అసాధ్యం! మీ గురువుల గురించి... సిరివెన్నెల: జన్మసిద్ధంగా మా నాన్నగారి నుంచి నాకు చాలా లక్షణాలు అలవడ్డాయి. సో... ఆ విధంగా నా తొలి గురువు ఆయనే! నా రెండో గురువు జీవితం! ప్రపంచంలో నేను చూసిన ప్రతి ఒక్కటీ నాకు గురువే! ఇష్టపడేవారు, ఇష్టపడనివారు... ఇలా అందరూ నాకు గురువులే! యోగీశ్వరులు శివానందమూర్తిగారు నా మూడో గురువు! కెరీర్ ప్రారంభంలోనే ‘విధాత తలపున’ లాంటి గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... కొన్ని సాధారణమైన పాటలు రాయడానికి అంతర్మథనానికి లోనౌతారా? సిరివెన్నెల: మీరంటున్న నా ‘సాధారణమైన పాట’... నా ‘విధాత తలపున’ కంటే ఏ విధంగా తక్కువో చెప్పండి. అప్పుడు అది రాయడానికి నేను పడ్డ అంతర్మథనం ఏంటో చెబుతాను. సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లోని మీ పాటలన్నీ కావ్యాలని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: ‘గుండెనిండా గుడిగంటలు, గువ్వల గొంతులు, ఎన్నో మోగుతుంటే... కంటి నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే... వెంటనే.. పోల్చాను నీ చిరునామా ప్రేమా...’ ఈ కాన్సెప్ట్‌ని ఏ విధంగా వాటికంటే తక్కువ చేసి చూస్తారు మీరు? ఈ పాటలు ఆ పాటలంత గౌరవాన్ని పొందాయంటారా? సిరివెన్నెల: ఎందుకు పొందలేదు? ఎన్నో రసాల సమ్మేళనం జీవితం. ఒక చెట్టుని నువ్వు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. నీ బిడ్డను చూస్తూ... ‘అబ్బా... పువ్వులా నవ్వుతుంది...’ అని నీ భార్యతో మురిపెంగా నువ్వంటున్నప్పుడు నువ్వో తండ్రివి. నీ భార్యను చూసి ‘నువ్వు ఈ రోజు ఎంతో నాజూగ్గా, తాజా పువ్వులా ఉన్నావ్’ అన్నప్పుడు నువ్వొక ప్రేమికుడివి. ఇవన్నీ జీవితానికి అవసరమే. కాబట్టి ‘విధాత తలపున’ రాస్తేనే పాట, ‘గుండెనిండా గుడిగంటలు’ రాస్తే పాటకాదు అనడం అసమంజసం. ‘గుండెనిండా గుడి గంటలు’ లాంటి సాహిత్యాన్ని రాయవలసి వచ్చినప్పుడు.. ‘ఎలా రాస్తే దానికి ఆ డిగ్నిటీ వస్తుంది’ అని ఆలోచించి రాసినప్పుడే కవిగా నీ డిగ్నిటీ ఏంటో తెలుస్తుంది. శృంగారం అనేది ఓ చెడు ప్రక్రియే అయితే... ఈ సృష్టే లేదు గుర్తుంచుకోండి. కాబట్టే శృంగారగీతం ఎంతో బాధ్యతాయుతమైనదని తెలుసుకోండి. ఇంకా ఎక్కువ పూజనీయమైనది, ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందని అర్థం చేసుకోండి. ఆ పాటల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాయవలసి వచ్చినప్పుడు పడే అంతర్మథనం గురించి అడుగుతున్నా... సిరివెన్నెల: నాకు ట్రెండ్ అనేది లేదు. ‘కళ్లు’లో ‘తెల్లారింది లెగండో..’ పాట నేనే రాశాను. మొన్నమొన్ననే ‘ఓనమాలు’లో ‘పిల్లలూ బాగున్నారా?’ అనే సందేశాత్మక గీతాన్నీ నేనే రాశాను. ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో దశావతార రూపకం నేనే రాశాను. ఆ పక్కనే యూత్‌కోసం ‘స్పైసీ స్పైసీగాళ్...’ పాటనూ నేనే రాశాను. ‘స్పైసీ స్పైసీగాళ్’ పాటలో ఎక్కడైనా మీకు అశ్లీలత స్ఫురించిందేమో చెప్పండి. సో, ఇక్కడ అంతర్మథనానికి తావేది? ఓ పక్క ఆధ్యాత్మికం, మరో పక్క శృంగారం, ఇంకో పక్క విప్లవం.... ఓ వ్యక్తిలో ఇన్ని కోణాలా? సిరివెన్నెల: ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పగలిగే సహజ లక్షణం మనిషికి మాత్రమే ఉంది. అవన్నీ చూపించకపోతేనే తప్పు. మనిషి శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. అందులో ఒక్కటి పనిచేయకపోయినా... ‘వికలాంగుడు’ అంటారు. ఇదీ అంతే! మీరు రాసిన కొన్ని పాటలు వింటుంటే.. సమాజంపై మీకు కోపమేమో అనిపిస్తుంది సిరివెన్నెల: ‘సమాజం వేరు.. నేను వేరు’ అని అనుకోను. నాకు జ్వరం వస్తే.. నాపై నేను ఆగ్రహం వ్యక్తం చేసుకోను కదా. ‘కాస్త ఇబ్బందిగానే ఉందండీ’ అంటాను. కారణం... అది నాకొచ్చింది కనుక. నన్ను నేను ప్రేమించుకుంటాను కనుక. ఇక్కడ సమాజమే నేను! సమాజంలోని అవకతవకలన్నీ నావే! అలాంటప్పుడు కోపానికి తావెక్కడిది. వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్.. ఇలా కొందరు దర్శకులతో మీకు అటాచ్మెంట్ ఎక్కువ అంటారు. నిజమేనా? సిరివెన్నెల: కొందరితో అటాచ్మెంట్, కొందరితో డిటాచ్మెంట్ ఉండదు. ఉదాహరణకు మనిద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆసక్తి ఉన్నంతవరకూ మీరు నా మాటలు వింటారు. ఎక్కడో ఒక చోట ఆ ఆసక్తి తెగిపోతుంది. దాంతో ఏదో కారణం చెప్పి నా దగ్గరనుంచి తప్పుకుంటారు. దానికి కారణం కోపమే కానక్కరలేదు. దీన్నే మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ‘వేవ్‌లెంగ్త్ కలవడం’ అంటుంటాం. సో... వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వాళ్లు తీస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నా ఒపీనియన్స్ కానీ, సలహాలు కానీ వాళ్లకు నచ్చి ఉండొచ్చు. దాంతో వాళ్లు నాతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడున్న దర్శకుల్లో మీకు ప్రియమైనవాళ్ళు... సిరివెన్నెల: ఏ రంగంలోనూ, ఏ అంశంలోనూ ఒక వ్యక్తిని ఇష్టపడటం ఉండదు నాకు. నాకే కాదు... ఎవరికీ ఉండకూడదు. ప్రతి దర్శకుడూ ఓ మంచి సినిమా తీసే ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడూ ఓ చెత్త సినిమా కూడా తీసే ఉంటాడు. వారి పనిని ఇష్టపడతాను కానీ.. వ్యక్తిని కాదు! కవిగా మీకు సాటి, పోటీ ఎవరనుకుంటున్నారు? సిరివెన్నెల: బాగుందా, లేదా అని చెప్పగలం కానీ... ఒక శిల్పంతో మరో శిల్పాన్ని ఎలా పోల్చగలం? వంద మీటర్ల పరుగుపందెంలో ఒకడు ఫస్ట్ వస్తాడు. ఆ వంద మీటర్లను రెండొందల మీటర్లు చేస్తే... ఆ ఫస్ట్ వచ్చినవాడే థర్డ్ రావచ్చు. చెప్పలేం కదా. సో... పోటీ అనేది తీసుకునే సంవిధానాన్ని బట్టి ఉంటుంది. ‘వశిష్టుడు’ అనే ఓ వేల్యూని చూసుకుంటూ... ‘బ్రహ్మర్షి’ అనే స్కేల్ పెట్టుకొని... విశ్వామిత్రుడు తన ధర్మప్రయాణాన్ని సాగించాడు. ఆ సంవిధానాన్నే పోటీ అంటారు. అలా ప్రయాణిస్తే జ్ఞానం సమృద్ధి అవుతుంది! రాయడంలో ఎప్పుడైనా బోర్‌గా ఫీలయ్యారా? సిరివెన్నెల: నా జీవితంలో మార్పు లేని రెండే విషయాలు నా భార్య, నా పాట. ఈ రెండూ నాకెప్పుడూ బోర్ కొట్టవు. ఆ విషయం మా ఆవిడక్కూడా తెలుసు. ఇంతటి జ్ఞానితో జీవితాన్ని పంచుకున్న మీ సహధర్మచారిణి గురించి తెలుసుకోవాలని ఉంది... సిరివెన్నెల: ‘సహ.. ధర్మ.. చారిణి’ అని మీరే అన్నారు. ధర్మంగా తను నడుస్తూ.. తనతో పాటు తన భర్తనూ నడిపించేది సహధర్మచారిణి. ఆ పదానికి అక్షరాలా యోగ్యురాలు నా భార్య పద్మావతి. నేను ఓ అద్భుతమైన శిల్పాన్ని అనుకుంటే... ఆ ‘అద్భుతం’ అనే పదం చెందాల్సింది ఆవిడకే. ఎందుకంటే... ఈ శిల్పాన్ని చెక్కింది తనే. అందమైన పాటలా నా జీవితం సాగిపోవడానికి కారణం ఆవిడ. నన్ను ఈ విధంగా మలచడానికి తన జీవితంలో చాలా భాగాన్ని పణంగా పెట్టి, తాను చాలా కోల్పోయి, నేను చాలా పొందేలా చేసిన త్యాగమయి నా భార్య. షీఈజ్ మై బెటర్ త్రీఫోర్త్! నేను వన్ ఫోర్త్ మాత్రమే. అందులో అసత్యం కానీ, నిష్టూరం కానీ, అతిశయోక్తి కానీ ఏమీ లేదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఓ ఇంటి కోడలిగా తన ప్రతి బాధ్యతనూ పరిపూర్ణంగా నిర్వర్తించింది కాబట్టే.. నా ఒక్క బాధ్యతను నేను గొప్పగా నిర్వర్తించగలిగాను. మీకోసం మీ భార్య ‘ఎంతో కోల్పోయింది’ అన్నారు. అదేంటో కాస్త వివరంగా చెబుతారా? సిరివెన్నెల: నేను మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేంత స్థాయికి రాగలిగానంటే, ఇన్ని వందల పాటలు రాయగలిగానంటే.. నాకెంత విశ్రాంతి లభించి ఉండాలి? ఈ విశ్రాంతి కోసం ఎన్ని బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండాలి? చెప్పండి? ‘నీ బిడ్డలమైన మాకు.. ఓ తండ్రిగా నువ్వు ఏ మాత్రం ప్రేమనందించావ్?’ అని నా పిల్లలు నన్ను ప్రశ్నించొచ్చుగా? ‘అందరు తండ్రుల్లా ఏనాడైనా నువ్వు మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లావా? పేరెంట్స్డేకి ఎన్నిసార్లు నువ్వు కాలేజీకొచ్చావ్? అసలు మేం చదువుతున్న స్కూళ్ల పేర్లయినా నీకు తెలుసా?’... ఈ ప్రశ్నలన్నీ నా పిల్లలు నాపై సంధించొచ్చుగా? అడక్కపోగా నన్ను గౌరవిస్తున్నారెందుకు? దీని వెనుక ఏ మెకానిజం ఉండుండాలి? పెళ్లిళ్లనీ, అశుభాలనీ, చుట్టాలనీ, పక్కాలనీ... అందరిలా తానూ ఓ పద్ధతి ప్రకారం జీవిస్తానంటే... ఇంత తపస్సు నాకు సాధ్యమయ్యేదా? రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు గడపగలిగానంటే... ఎన్ని సామాజికమైన బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండి ఉండాలి? నేను సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని జనాలు అనుకుంటున్నారు. అలా అనిపిచేలా చేసింది ఆవిడ కదా? దానికి ఆమె ఎంత సమయాన్ని కేటాయించి ఉండాలి? తన జీవితం తాను జీవిస్తూ ..ఇన్ని రకాలుగా నా ఖాళీలను పూరిస్తూ.. ఆమె ముందుకెళ్లింది కాబట్టే, ఈ రోజు బంధువుల్లో కూడా నన్నెవరూ బాధ్యతారహితుడనట్లేదు. ఓ యోధుణ్ణి కవచం కాపాడటం మనం చూస్తాం. కానీ ఆ కవచానికి తగిలే బల్లేల దెబ్బలు మనం చూస్తామా? నా కవచమే నా భార్య. మా చిన్నబ్బాయి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే ఓసారి ఇదే విషయాన్ని అందంగా, క్లారిటీతో చెప్పాడు. ‘మాకు మీకంటే అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో అమ్మే మాకు నేర్పించింది’ అని. మీకోసం ఇంత చేసిన ఆమెకోసం మీరేమి చేశారు. ఆమె కోసం కొంతైనా చేయాలని మీకు అనిపించలేదా? సిరివెన్నెల: అరవైకి దగ్గరపడ్డాను. ఎవ్వరికీ రుణపడకుండా రిటైర్ అవ్వాలనేదే నా కోరిక! నిజంగా కూడా నేనెవ్వరికీ రుణపడిలేను... నా భార్యకు తప్ప! తన రుణం మాత్రం తప్పకుండా తీర్చుకుంటా. 30 ఏళ్ల సంసారంలో ఏనాడూ ఆమె ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లలేదంటే నమ్ముతారా! అంతెందుకు... తన పుట్టింటికి కూడా నేను లేకుండా ఆమె వెళ్లలేదు. ఎందుకంటే... నేను లేని జీవితాన్ని ఆమె కోరుకోదు. అంతెందుకు.. ఇప్పుడామెను ‘ఏదైనా కోరుకో’ అంటే.. మహా అయితే.. ‘తిరుపతి తీసుకెళ్లండి’ అంటుంది. స్త్రీ అంటే ఏంటో.. స్త్రీత్వం అంటే ఏంటో.. తెలీని ఈ కాలంలో... అనవసరమైన బాధలు కొనితెచ్చుకుంటూ జీవితాన్ని నరకం చేసుకుంటున్న ఈ రోజుల్లో, ‘ఇవ్వడం ద్వారా ఏం పొందచ్చు’ అనే విషయం తెలుసుకోవడానికి నా భార్య గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. తను ఎంతో ఇచ్చింది. తద్వారా అన్నీ పొందింది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే... మీది ప్రేమ వివాహమేమో అనిపిస్తోంది. సిరివెన్నెల: ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం... ఇలాంటి కాన్సెప్టుల మీద నాకు సరైన అవగాహన లేదు. ప్రేమించడం ‘ఒక పని’ అని నేను అనుకోను. ఒకానొక క్షణంలో ఒకానొక చోట అది మొదలవుతుందని కూడా భావించను. నా పెళ్లి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగానే జరిగింది. ఇక స్త్రీ, పురుషుల మధ్య ఉండవలసిన సహవాసం, సహచర్యం, సాన్నిహిత్యం, సాంగత్యం... ఇవన్నీ ప్రేమ అనే కాన్సెప్ట్‌లో ఉంటే కనుక... మాది కచ్చితంగా ప్రేమే! తెలుగులో ఓ సామెత ఉంది. ‘పేదవాడికి గంజే పరమాన్నం. పెళ్లామే ప్రియురాలు’ అని! దానితో నేను వందశాతం ఏకీభవిస్తా. అసలు ప్రేమ అనే కాన్సెప్ట్‌ని మీరు నమ్ముతారా? సిరివెన్నెల: సత్యాన్ని నమ్మడమేంటి? పగలు అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? రాత్రి అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? అనడిగితే ఏం సమాధానం చెబుతాం. ప్రేమ అనేది ఈ రోజు మనం ప్రశ్నించే స్థితికి దిగజారిందంటే... కారణం దానికి మనం వేరే వేరే అర్థాలు ఆపాదించడం వల్లే. ఈ విశ్వంలో ప్రేమ కానిది ఏది? ఎండ ప్రేమకాదా? వాన ప్రేమ కాదా? జీవితం పట్ల మనకున్నది ప్రేమ కాదా? మనపట్ల జీవితానికి ఉన్నది ప్రేమకాదా? ప్రేమ సర్వాంతర్యామి. భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడంటూ గుళ్లూ గోపురాలు తిరిగే ఈ మనిషి... సర్వే సర్వత్రా ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇంతకీ మీరు ప్రేమికుడా? భక్తుడా? లేక విప్లవకారుడా? సిరివెన్నెల: మనిషిని. మనిషంటే ఇవన్నీ ఉండాలి. మీకు బలహీనతలున్నాయా? సిరివెన్నెల: మనిషంటే అవి కూడా ఉంటాయి కదా. మానవత్వానికి మహత్తరమైన కానుక మనదేశమే మనకిచ్చింది. అదే ‘రామాయణం’. మనిషితనానికి ప్రతిరూపం రాముడు. వాల్మీకి అనే కవి.. రాముడు అనే పాత్రను సృష్టించి, మనిషి అనేవాడు ఎలా బతకాలో సమాజానికి తెలియజేశాడు. ‘రాముడు మహావిష్ణువు అవతారం’ అని రామాయణంలో వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ‘నేను దశరథుని కుమారుడును.. రాముడను’ అని విజిటింగ్ కార్డు పట్టుకొని తిరిగాడు రాముడు. ఏం... ఆయన ఏడవలేదా? ఆయనకు కోపం రాలేదా? ఆయనకు నొప్పి కలగలేదా? ఒక మనిషికి ఎన్ని లక్షణాలుంటాయో రాముణ్ణి చూస్తే తెలుస్తుంది. మనల్ని రాముడితో పోల్చి చూస్తే కొన్ని ఆయన కంటే ఎక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. కొన్ని తక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువైనా రోగమే, తక్కువైనా రోగమే. అదే మనం గ్రహించాల్సింది. వాటినే ‘బలహీతనలు’ అంటాం. అవి నాకూ ఉన్నాయి. మీ అబ్బాయ్ యోగీశ్వరశర్మ స్వరపరచిన తొలి గీతం విని మౌనం వహించారట కారణం? సిరివెన్నెల: నేను ఇంతవరకూ వినని ఓ నోవెల్ ప్రయోగం చేశాడు తను! అది వినడానికి చాలా బావుంది. కానీ రాయలేకపోయాను. దాంతో ఓ ముప్ఫై రోజుల పాటు నాలో నేను స్టడీ చేసి ఆ పాట రాశాను. సెలైంట్‌గా ఉండటం అనేది పాజిటివ్ కాంప్లిమెంటే కానీ, కామెంటూ కాదు, విమర్శ అంతకన్నా కాదు. తాను సంగీత దర్శకుడవ్వడంలో మీ ప్రోద్బలం ఉందా? సిరివెన్నెల: వాళ్ల అభిరుచిని, పాండిత్యాన్నీ వాళ్లే పెంపొందించుకున్నారు. దానికి తగ్గ కృషి వాళ్లే చేసుకున్నారు. ఇందులో నా ప్రోద్బలం లేదు అనడం కంటే.. నా ‘అడ్డు లేదు’ అనడం కరెక్ట్. సినిమాలోకి రావాలనేది వాళ్ల కోరిక. దాన్ని ఏనాడూ నాపై రుద్దలేదు. వాళ్ల ప్రయత్నాలు వాళ్లే చేసుకున్నారు. ప్రోత్సహించేవారు ప్రోత్సహించారు. ఒక తండ్రిగా.. సాయం చేసినవారికి థ్యాంక్స్ చెబుతుంటా. దర్శకుడు సందర్భం చెబుతాడు. దానికి తగ్గట్టు గేయరచయిత పాట రాస్తాడు. ప్రస్తుతం ఈ పద్ధతే నడుస్తోంది. కానీ మీరు మాత్రం అందుకు భిన్నంగా... సినిమా కథంతా తెలుసుకుంటారు. దాని ఆత్మను గ్రహిస్తారు. దాన్ని బట్టి పాట రాస్తారు. ఇంకా ఒకడుగు ముందుకేసి, దర్శకులుగా వాళ్లేమైనా తప్పులు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇంత స్ట్రగులు అవసరమా? సిరివెన్నెల: ఎముకల డాక్టర్లు చాలా మందే ఉంటారు. కానీ ఒకరిద్దరి పేర్లే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం? అందరు చదివిందీ అదే చదువుగా?... అంటే.. ఎక్కడో వారి వ్యక్తిత్వాన్ని పనిలో లీనం చేస్తున్నారు వాళ్లు. తాము తెలుసుకున్న విషయాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనూ అంతే. సినిమా కథ ఎలాంటిదైనా అది మనిషి జీవితానికి నీడలా ఉండాలని కోరుకుంటాను. నా పాటను నా తాత్వికాన్వేషణను ఆవిష్కరించే సాధనంగా భావిస్తాను. ఓ అమ్మాయి ఏడుస్తుంది. దానికి ఓ పాట రాయాలి. ‘ఏడవకమ్మా ఏడవకు..’ అని ఏదో ఓ పాట రాయొచ్చు. కానీ నేను అలా రాయను. ‘కన్నీళ్లే కురవాలా లోకానికి తెలిసేలా..? ముస్తాబే చెదరాలా.. నిను చూస్తే అద్దం దడిచేలా’ అని రాస్తా. ఏదో చెప్పాలి. అందులో ఫన్ ఉండొచ్చు. పరామర్శ ఉండొచ్చు. ప్రతిఘటన ఉండొచ్చు. అలా ఉండాలంటే.. కథ ఆత్మ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కథకు పాట సరిపోతే చాలదు. ఆ తర్వాత కూడా శ్రోత హృదయంలో ఆ పాట చిరస్థాయిగా నిలవాలి. అంత కష్టపడేది అందుకే. గీత రచయితగా ఎంతో సాధించారు. పద్మశ్రీ రాలేదని ఎప్పుడైనా బాధపడ్డారా? సిరివెన్నెల: మెడ ల్ కోసం మెడలు వంచడం నాకు చేతకాదు. అయినా, పద్మశ్రీ కోసం నేను పాటలు రాయలేదు. దాని మీద నాకు ఆసక్తి కూడా లేదు. ఇంతమంది అభిమానాన్ని పొందగలిగాను. ఇన్ని కోట్లమందికి కుటుంబ సభ్యుణ్ణి కాగలిగాను. ‘జగమంత కుటుంబం నాది’ అని ఓ పాట రాశాను. తాము రాసిన పాట ఎంతమంది రచయితల జీవితాల్లో నిజమయ్యాయంటారు? నాకు మాత్రం నిజమైంది. ఇప్పుడు నాది ‘జగమంత కుటుంబం’... ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేదైనా ఉంటుందా? అందుకే అంటాను... ‘జగమంత కుటుంబం పాట కాదు... నా జీవితం’ అని! - బుర్రా నరసింహా *********** మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? సిరివెన్నెల: నచ్చే సినిమా అనే సైంటిఫిక్ ఫార్ములా ఉంటే... ఆ ఫార్ములాను ఫాలో అవుతూ అందరూ సినిమాలు తీసేస్తారుగా. ఈ మధ్య ‘పా’ సినిమా చూశా. నచ్చింది. ఆ మధ్య ‘అదుర్స్’ అనే సినిమా చూశా. అదీ నచ్చింది. ఫలానా సినిమాలే నచ్చుతాయనేం లేదు. తప్పక రాసిన పాట ఏమైనా ఉందా? సిరివెన్నెల: అసలు అలాంటి పాటల్ని నేను రాయను. మీ కెరీర్లో కష్టపడి రాసిన పాట? సిరివెన్నెల: పాట రాయడం ఎప్పుడూ కష్టంగా ఫీలవ్వను. అయినా... కష్టపడి కోసే మామిడిపండు మహత్తరంగా ఉంటుంది. పాట కూడా అంతే. *********** ఇల్లాలుగా కాకుండా... ఆమెలో మీరు చూసిన అదనపు ప్రత్యేకతలేమైనా ఉన్నాయా? మొన్నటిదాకా నాకూ తెలీదు. ఈ మధ్య తెలిసింది. తాను అద్భుతంగా రాస్తుంది. ఆ మాటకొస్తే నాకన్నా బాగా రాస్తుంది. కొన్ని కొన్ని విషయాలను నేను సింపుల్‌గా చెప్పలేను. మా ఆవిడ అలా కాదు. ‘సంసారం-బంధములు’ అనే విషయాన్ని సరిగ్గా ఒకటిన్నర పేజీలో.. అయిదు పేరాల్లో విపులంగా చెప్పేసింది. అది చదివి షాక్ అయ్యాను. ఎందుకంటే.. అంతకు మించి చెప్పడానికి నాకేమీ కనిపించలేదు. అంత అద్భుతంగా రాసింది తను. మా నాన్నగారి గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు, తనూ ఓ భాగం రాసిచ్చింది. ఆమెలో నేను రచయిత్రిని చూసింది అప్పుడే. ఆమె శైలిని, వాక్య నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అందుకే ఆ వ్యాసంలో మనసు విప్పి ఓ మాట చెప్పాను. ‘మా తమ్ముడంత సరళంగా, నా భార్య అంత గొప్పగా నేను రాయలేకపోయానేమో’ అని. మరి నవ రచయిత్రికి అభినందన ఎలా తెలిపారు? కెరీర్ ప్రారంభంలో అనంతశ్రీరామ్ నా దగ్గరకొచ్చాడు. అప్పటికి అతను ఓ నాలుగైదు పాటలు రాసుంటాడు. ‘నువ్వు రాసిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు’ అనడిగాను. తను చెప్పాడు. పల్లవిలోనే నాలుగైదు తప్పులు చెప్పాను. ‘నువ్వు గొప్పగా రాయబోతున్నావ్. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతోంది. సో... నిరంతరం నీ తప్పుల్ని వెతికి చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మెచ్చుకోడానికి లేను’ అని చెప్పాను. తను నా మాటల్ని స్పోర్టీవ్‌గానే తీసుకున్నాడు. బాగా రాసేవాళ్లను నేను అభినందించను. వాళ్ల విషయం కఠువుగా ప్రవర్తిస్తా. ఎందుకంటే నిజమైన రచయిత అభినందనలకోసం చూడడు. మెప్పులు పొందకపోయినా.. అక్షరంతోనే జర్నీ చేస్తాడు. అలాంటి వాళ్లు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. నా భార్య విషయంలోనే కూడా అలాగే ఉన్నాను. ‘గొప్పగా రాశావ్. రాయడంలో ఆనందాన్ని పొందు. ఇంకొకరికి చూపించి మెప్పు పొందాలని మాత్రం చూడకు. అలా చేస్తే రాయాలనే తపన ఆగిపోయే ప్రమాదం ఉంది’ అని చెప్పాను. అలా అన్నానని నాపై అలిగింది తను. -
‘ఎంత అందంగా ఉన్నావె’
‘‘అపార్ట్మెంట్ అన్నాక రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. అందరూ అందరితో కలవాలనే నిబంధనలేవీ లేవు. కొందరు పాలూ నీళ్లలా కలిసిపోతారు. మరికొందరు ఉప్పు నిప్పులా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అలాంటి రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకునే ప్రేమకథ ఇది’’ అని నిర్మాత గంగపట్నం శ్రీధర్ చెప్పారు. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్ మంతెన, జియానా జంటగా ఎస్.ఐ. మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘ఎంత అందంగా ఉన్నావె’ ఈ వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్లాట్స్ నేపథ్యంలో అందర్నీ ఫ్లాట్ చేసే కథ ఇది. యోగీశ్వరశర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. సీతారామశాస్త్రి సాహిత్యం గురించి మేం ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, ప్రణయాత్మకంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి, సహనిర్మాతలు: అశోక్ సోని, మహ్మద్ రఫీ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.