Afghanistan vs Australia
-
సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూపు-బి నుంచి ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు ఆర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం అఫ్గానిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో నాలుగు పాయింట్లతో ఆసీస్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే సెమీఫైనల్స్‌కు ముందు కంగారులకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.షార్ట్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షార్ట్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షార్ట్ కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి అతడు ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం షార్ట్ గాయంపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు."షార్ట్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు నడవడానికి కాస్త ఇబ్బంది పడడం మేము చూశాము. అయితే నాకౌట్స్ మ్యాచ్‌లు మొదలు కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కాబట్టి షార్ట్ తన గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నాము. అయితే షార్ట్ ఒకవేళ సెమీస్‌కు దూరమైనా, అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు మా కుర్రాళ్లు సిద్దంగా ఉన్నారని" స్మిత్ పేర్కొన్నాడు.కాగా సెమీస్‌కు షార్ట్ దూరమైతే ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడికి అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌పై భారీ లక్ష్యాన్ని ఆసీస్ చేధించడంలో షార్ట్ది కూడా కీలక పాత్ర. రన్ ఛేజ్‌లో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ 62 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.కాగా ఈ మెగా ఈవెంట్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్ల సేవలను ఆసీస్ కోల్పోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి షార్ట్ చేరాడు. షార్ట్ స్ధానంలో యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: ఆసీస్‌తో మ్యాచ్ రద్దు.. అయినా అఫ్గాన్‌కు సెమీస్ చేరే ఛాన్స్! ఎలా అంటే? -
ఆసీస్‌తో మ్యాచ్ రద్దు.. అయినా అఫ్గాన్‌కు సెమీస్ చేరే ఛాన్స్! ఎలా అంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మరో మ్యాచ్ వరుణుడు ఖాతాలో చేరింది. ఈ మెగా టోర్నీ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్ మధ్య శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ ఈ మ్యాచ్ రద్దు కావడంతో అఫ్గానిస్తాన్ సెమీస్ ఆశలు మాత్రం అవిరయ్యాయి. అయితే మాథ్యమేటికల్‌గా మాత్రం ఇంకా అఫ్గాన్ సెమీస్ చేసే దారులు మూసుకుపోలేదు.అఫ్గాన్ సెమీస్ చేరాలంటే?ఈ మెగా టోర్నీ గ్రూపు-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌కు ఆర్హత సాధించగా.. మరో బెర్త్ ఇంకా అధికారికంగా ఖారారు కాలేదు. గ్రూపు-బి చివరి లీగ్ మ్యాచ్‌లో రావల్పిండి వేదికగా ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే.. 5 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు ఓడితే మాత్రం 3 పాయింట్లతో అఫ్గానిస్తాన్‌తో సమంగా నిలుస్తుంది. అప్పుడు రన్‌రేట్ పరిగణనలోకి వస్తుంది.ప్రస్తుతం దక్షిణాఫ్రికా (2.140)తో పోలిస్తే అఫ్గాన్ రన్‌రేట్ చాలా పేలవంగా (–0.990) ఉంది. ఇప్పటికే చెత్త ఆట తీరుతో గ్రూపు స్టేజిలో ఇంటి ముఖం పట్టిన ఇంగ్లండ్.. సూపర్ ఫామ్‌లో ఉన్న సఫారీలను ఓడించడం అంత సులువు కాదు. అయితే అఫ్గాన్ సెమీస్‌కు చేరాలంటే అద్బుతం జరగాలి. ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా కనీసం 207 పరుగుల తేడాతో ఓడాలి. అప్పుడే సౌతాఫ్రికా రన్‌రేట్ అఫ్గాన్ కంటే దిగువకు వస్తుంది.హెడ్ మెరుపులు..ఇక వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సాదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షూయిస్ 3 వికెట్లు తీయగా... ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం ఛేదనలో 12.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసి విజయం దిశగా వెళుతోంది. మాథ్యూ షార్ట్ (20) అవుట్ కాగా... ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (19 నాటౌట్) రెండో వికెట్‌కు అభేద్యంగా 65 పరుగులు జోడించారు. ఈ దశలో కురిసిన వాన ఆపై తెరిపినివ్వలేదు. నిబంధనల ప్రకారం వన్డే మ్యాచ్‌లో ఫలితం రావాలంటే ఛేజింగ్ చేస్తున్న జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా -
‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్
అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్(Spencer Johnson) అద్బుతం చేశాడు. నమ్మశక్యం కాని రీతిలో రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz)ను బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్- ఆసీస్(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.నమ్మశక్యం కాని డెలివరీఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా నేరుగా గ్రూప్-‘బి’ నుంచి సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఇక గడాఫీ స్టేడియంలో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు.ఈ క్రమంలో అఫ్గన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఐదో బంతికే జాన్సన్ అద్బుత రీతిలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను బౌల్డ్ చేశాడు. నమ్మశక్యం కాని డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు. గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో జాన్సన్ సంధించిన బంతిని గుర్బాజ్ తప్పుగా అంచనా వేశాడు. స్వింగ్ అవుతున్న బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఏంటిది? నేను అవుటయ్యానా?ఈ క్రమంలో బ్యాట్ కిందుగా వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో గుర్బాజ్.. ‘‘ఏంటిది? నేను అవుటయ్యానా?.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లుగా ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ వైరల్ అయింది. మరోవైపు.. జాన్సన్ సహచర సభ్యులతో కలిసి తొలి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లలో అతడు వరుసగా 10, 6 పరుగులు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.Goneee!#SpencerJohnson sends #RahmanullahGurbaz packing with a brilliant yorker! 📺📱 Start Watching FREE on JioHotstar: https://t.co/3pIm2C5OWa#ChampionsTrophyOnJioStar 👉 #AFGvAUS | LIVE NOW on Star Sports 2 & Sports 18-1 pic.twitter.com/FGSwXB2WGA— Star Sports (@StarSportsIndia) February 28, 2025సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను టోర్నీ నుంచి నాకౌట్ చేశాయి. ఇక గ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసిన ప్రొటిస్ జట్టు రెండు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు(+2.140) పరంగా అదరగొట్టింది. అయితే, ఆసీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మరో పాయింట్ సౌతాఫ్రికా ఖాతాలో చేరింది.చాంపియన్స్ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తుదిజట్లుఅఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు! -
Aus vs Afg: కరుణించిన వరుణుడు.. సెమీస్ రేసు సమరానికి సై
వరణుడు కరుణించాడు. అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) మధ్య మ్యాచ్‌కు మార్గం సుగమం చేశాడు. ఫలితంగా లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య సెమీస్ రేసు సమరానికి నగారా మోగింది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొదలైన విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగాయి. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్(Team India), న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ సెమీ ఫైనలిస్టులు శుక్రవారం నాటి ఆఫ్గన్- ఆసీస్ మ్యాచ్ ఫలితంతో ఖరారు కానున్నాయి.గెలిస్తే నేరుగా సెమీస్కేగ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో అఫ్గన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం ఆస్ట్రేలియాతో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మొత్తంగా మూడు పాయింట్లు సాధించిన ప్రొటిస్ జట్టు నెట్ రన్‌రేటు(+2.140) పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇక ఇదే గ్రూపులో ఉన్న ఆసీస్ కూడా ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉండగా.. ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గనిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఆసీస్, అఫ్గన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఇంటిబాట పట్టగా.. సెమీస్ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.ఇందులో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్ తొలి సెమీ ఫైనలిస్టును ఖరారు చేయనుంది. అఫ్గన్- ఆసీస్ పోరులో గనుక కంగారూ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అఫ్గన్ గెలిచినా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. అయితే, అప్పుడు ఆస్ట్రేలియా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.అందుకే ముందుగా బ్యాటింగ్ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ‘‘వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ద్వితీయార్థ భాగంలో కాస్త మందకొడిగా ఉంటుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంగ్లండ్‌పై గెలిచిన జట్టుతోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాం’’ అని హష్మతుల్లా తెలిపాడు.మరోవైపు.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని.. ఏదేమైనా తమ ఆటగాళ్లు దూకుడుగా ముందుకు వెళ్లడం ఖాయమన్నాడు.తాము కూడా ఎలాంటి మార్పుల్లేకుండా.. ఇంగ్లండ్‌తో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నట్లు తెలిపాడు.అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తుదిజట్లుఅఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
ఆసీస్‌ను ఇప్పటికే ఓడించాం.. మీకేం అనిపిస్తోంది?: అఫ్గన్ కెప్టెన్
అఫ్గనిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi)కి కోపమొచ్చింది. తాము చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు వచ్చామని.. కేవలం ఒక్క వ్యక్తితో పోటీపడటానికి కాదంటూ అతడు అసహనాన్ని వెళ్లగక్కాడు. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు విలేకరులు వేసిన ప్రశ్నే ఇందుకు కారణం.ఇంగ్లండ్‌ను బయటకు పంపిన అఫ్గన్కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్.. ఇంగ్లండ్‌పై గెలుపుతో సెమీస్ రేసులో నిలిచింది. రెండో మ్యాచ్‌లో భాగంగా బట్లర్ బృందాన్ని(Afghanistan vs England) ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపిన అఫ్గన్ జట్టు.. శుక్రవారం లాహోర్‌లో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది.మీకేం అనిపిస్తోంది?ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మీడియాతో మాట్లాడగా.. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. మాక్సీ కోసం అఫ్గన్ ఎలాంటి ప్రణాళికలు రచించిందని విలేకరులు అడుగగా.. ‘‘మీకేం అనిపిస్తోంది?... కేవలం మాక్స్‌వెల్‌తో ఆడేందుకే మేము ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా?దయచేసి అలా ఆలోచించవద్దు. మేము మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నాము. అందుకు తగ్గ వ్యూహాలు మా దగ్గర ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023లో మాక్స్వెల్ అద్బుతంగా ఆడాడని నాకూ తెలుసు. కానీ అదంతా గతం.ఆస్ట్రేలియాను ఓడించాంఆ మ్యాచ్ తర్వాత మేము టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాను ఓడించాం. ప్రత్యర్థి జట్లు అన్నీ మాకు సమానమే. అన్ని మ్యాచ్‌లకు మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాము. అంతేగానీ.. ఒక్క ఆటగాడిని ఎదుర్కొనేందుకు మేము ఇక్కడకు రాలేదు.మాక్స్‌వెల్‌తో పాటు ఆసీస్ జట్టు మొత్తాన్ని ఎదుర్కునేందుకు అత్యుత్తమ స్థాయిలో రాణించాలని భావిస్తున్నాం’’ అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. కాగా భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, ఇంగ్లండ్‌ను ఓడించడంతో పాటు ఆస్ట్రేలియానూ ఓడించినంత పనిచేసింది.మాక్స్వెల్ మాయతో ఆరోజు అలా!అయితే, అఫ్గన్ విధించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ మాక్స్వెల్ పరుగుల తాండవం చేశాడు. చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్నట్లుగా బ్యాట్‌తో మాయచేశాడు. ఒక కాలికి గాయమైనా.. ఒంటి కాలితోనే పరుగులు తీశాడు. అద్బుత బ్యాటింగ్‌తో ఏకంగా 201 పరుగులతో అజేయంగా నిలిచి కంగారూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఫలితంగా సెమీస్ చేరుకోవాలన్న అఫ్గనిస్తాన్ ఆశలకు గండిపడగా.. ఫైనల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత అఫ్గన్- ఆసీస్ టీ20 ప్రపంచప్-2024లో తలపడగా.. ఈసారి హష్మతుల్లా బృందం పైచేయి సాధించి సెమీ ఫైనల్ చేరుకుంది.ఇక వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లలో తలపడగా.. నాలుగింట ఆసీస్ విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీ తాజా మ్యాచ్‌లో గనుక అఫ్గన్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కావడంతో పాటు.. ఆసీస్‌ను బయటకు పంపి సెమీస్‌కూ చేరి కొత్త రికార్డు సాధిస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా.అఫ్గనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్,ఇక్రం అలిఖిల్, నంగెలియా ఖరోటే, నవీద్ జద్రాన్.చదవండి: Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు.. పంత్కి ఛాన్స్! -
ఆసీస్‌నూ వదలకండి: అఫ్గన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్(Afghanistan vs England)తో మ్యాచ్‌లో హష్మతుల్లా బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని.. ఇదే జోరులో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలని ఆకాంక్షించాడు. అఫ్గన్ ఆటగాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని... దేశం మొత్తాన్ని గర్వించేలా చేశారని కొనియాడాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా అఫ్గనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది అఫ్గనిస్తాన్. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్బుత విజయంతో సెమీస్ రేసులోకి దూసుకువచ్చింది.ఇంగ్లండ్ నిష్క్రమించగా..లాహోర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని ఓడించింది. దీంతో ఇంగ్లండ్ ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అఫ్గనిస్తాన్ తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టే గ్రూప్-బి నుంచి సెమీస్ చేరబోయే జట్లు ఖరారు కానున్నాయి.మీరేం బాధపడకండి సోదరా..!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అఫ్గనిస్తాన్ జట్టును ఆకాశానికెత్తాడు. ‘‘మీకు శుభాకాంక్షలు. మీ విజయం పట్లనాకెంతో సంతోషంగా ఉంది. గుల్బదిన్(అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్)ను కలిసినపుడు.. ‘మీరు ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి’ అని అతడితో అన్నాను. అప్పుడు అతడు.. ‘మీరేం బాధపడకండి సోదర.. వాళ్లను మేము అస్సలు ఉపేక్షించం.. ఓడించి తీరతాం’ అన్నాడు.ఆ తర్వాత నేను.. ‘ఆస్ట్రేలియాను కూడా మీరు ఓడించాలి’ అని కోరాను. దుబాయ్‌లో ఉన్నపుడు నేను గుల్బదిన్తో ఈ మాటలు చెప్పాను. ఏం చేసైనా ఇంగ్లండ్‌పై గెలుపొందాలని అతడికి బలంగా చెప్పాను. ఈరోజు అఫ్గనిస్తాన్ ఆ పని చేసి చూపించింది. ఆటలో ఎలా ముందుకు దూసుకువెళ్లాలో చెబుతూ గొప్ప పరిణతి కనబరిచింది.పటిష్ట జట్టును ఓడించింది. ఈరోజు మీదే. అయితే, సెమీ ఫైనల్ చేరాలనే లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి అది పునరావృతం కాకూడదు. ఆసీస్‌నూ వదలకండినిజానికి మీరు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో కూడిన కఠినమైన గ్రూపులో ఉన్నారు. అయినా, సరే ఈరోజు అత్యద్భుతంగా ఆడారు. మాకు మజానిచ్చే మ్యాచ్ అందించినందుకు ధన్యవాదాలు’’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్‌ను ఓడించిన హష్మతుల్లా షాహిది బృందం.. ఈసారి కూడా వారిపై గెలుపొందింది. అయితే, నాటి టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ విజయానికి చేరువైన సమయంలో గ్లెన్ మాక్స్వెల్ భీకర ద్విశతకంతో అఫ్గన్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్తర్ ఈసారి అఫ్గనిస్తాన్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గనిస్తాన్ స్కోరు: 325/7 (50)👉ఇంగ్లండ్ స్కోరు: 317 (49.5)👉ఫలితం: ఇంగ్లండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 రన్స్).చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్