
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మరో మ్యాచ్ వరుణుడు ఖాతాలో చేరింది. ఈ మెగా టోర్నీ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్ మధ్య శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీఫైనల్‌కు ఆర్హత సాధించింది. కానీ ఈ మ్యాచ్ రద్దు కావడంతో అఫ్గానిస్తాన్ సెమీస్ ఆశలు మాత్రం అవిరయ్యాయి. అయితే మాథ్యమేటికల్‌గా మాత్రం ఇంకా అఫ్గాన్ సెమీస్ చేసే దారులు మూసుకుపోలేదు.
అఫ్గాన్ సెమీస్ చేరాలంటే?
ఈ మెగా టోర్నీ గ్రూపు-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌కు ఆర్హత సాధించగా.. మరో బెర్త్ ఇంకా అధికారికంగా ఖారారు కాలేదు. గ్రూపు-బి చివరి లీగ్ మ్యాచ్‌లో రావల్పిండి వేదికగా ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే.. 5 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు ఓడితే మాత్రం 3 పాయింట్లతో అఫ్గానిస్తాన్‌తో సమంగా నిలుస్తుంది. అప్పుడు రన్‌రేట్ పరిగణనలోకి వస్తుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా (2.140)తో పోలిస్తే అఫ్గాన్ రన్‌రేట్ చాలా పేలవంగా (–0.990) ఉంది. ఇప్పటికే చెత్త ఆట తీరుతో గ్రూపు స్టేజిలో ఇంటి ముఖం పట్టిన ఇంగ్లండ్.. సూపర్ ఫామ్‌లో ఉన్న సఫారీలను ఓడించడం అంత సులువు కాదు. అయితే అఫ్గాన్ సెమీస్‌కు చేరాలంటే అద్బుతం జరగాలి. ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా కనీసం 207 పరుగుల తేడాతో ఓడాలి. అప్పుడే సౌతాఫ్రికా రన్‌రేట్ అఫ్గాన్ కంటే దిగువకు వస్తుంది.

హెడ్ మెరుపులు..
ఇక వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సాదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్‌షూయిస్ 3 వికెట్లు తీయగా... ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేదనలో 12.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసి విజయం దిశగా వెళుతోంది. మాథ్యూ షార్ట్ (20) అవుట్ కాగా... ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 59 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (19 నాటౌట్) రెండో వికెట్‌కు అభేద్యంగా 65 పరుగులు జోడించారు. ఈ దశలో కురిసిన వాన ఆపై తెరిపినివ్వలేదు. నిబంధనల ప్రకారం వన్డే మ్యాచ్‌లో ఫలితం రావాలంటే ఛేజింగ్ చేస్తున్న జట్టు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు.
చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment