Corbin Bosch
-
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కార్బిన్ బాష్ (Corbin Bosch)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా పీఎస్ఎల్-2025 (IPL 2025) సీజన్‌కు గానూ పెషావర్ జల్మీ ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్ పేసర్ ముందు నుంచి ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.అలా అదృష్టం వరించింది..అయితే, సహచర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరం కావడంతో.. బాష్‌ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు విలియమ్స్ స్థానంలో బాష్‌ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఐపీఎల్ లేదంటే పీఎస్ఎల్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్‌కే ఓటు వేసిన బాష్.. పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్‌లలో భాగమైన ముంబై ఇండియన్స్ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్‌ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.‘‘ఈ ఆల్‌రౌండర్‌పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ సెలక్షన్‌కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్ఎల్లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాగా ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్లో 30 ఏళ్ల బాష్ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’ -
IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియన్స్ బౌలర్
సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బాష్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్ఎల్ను అగౌరవపరచాలని కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్‌ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్ ఆఫర్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్ నా కెరీర్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్ఎల్కు రారని వెనక్కు తగ్గింది.కాగా, ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రాకముందు బాష్‌ను పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్ మొదటి నుంచి ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో బాష్‌కు ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఆఫర్‌కు నో చెప్పాడు.వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్‌తో క్లాష్ కాకుండా షెడ్యూల్ తయారు చేసుకునే పీఎస్ఎల్.. ఈసారి ఐపీఎల్‌తో పోటీ పడి ఐపీఎల్ డేట్స్‌లోనే షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పీఎస్ఎల్కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్లో ఆడితే పీఎస్ఎల్కు పోలేరు. ఈ యేడు పీఎస్ఎల్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్‌తో క్లాష్ కావడంతో ఈ సారి పీఎస్ఎల్లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్ ఆటగాళ్లతోనే పాక్ లీగ్ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌కు (సౌతాఫ్రికా టీ20 లీగ్) ఆడాడు. ఈ సీజన్లో (2025) ఎంఐ కేప్‌టౌన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ బౌలర్‌కు నోటీసులు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఐపీఎల్-2025లో భాగమైన ముంబై ఇండియన్స్ బౌలర్ కార్బిన్ బాష్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్.. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అయిన బాష్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్‌కు అనుకోకుండా ఐపీఎల్ ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ కాంట్రాక్ట్‌కు నో చెప్పాడు. లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో ముంబై ఇండియన్స్ బాష్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్ జల్మీ) ఏజెంట్ ద్వారా బాష్‌కు లీగల్ నోటీసులు పంపింది. కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్ఎల్ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్ 2025, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 తేదీలు క్లాష్ అయ్యాయి. పీఎస్ఎల్-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
CT 2025: సౌతాఫ్రికాకు భారీ షాక్!.. స్టార్ పేసర్ అవుట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ(ICC Chapions Trophy)లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో కార్బిన్ బాష్(Corbin Bosch) చోటు దక్కించుకున్నాడు. పేసర్ అన్రిచ్ నోర్జే(Anrich Nortje) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో... అతడి స్థానంలో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బాష్‌ను ఎంపిక చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నోర్జే 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ బరిలోకి కూడా దిగలేదన్న విషయం తెలిసిందే.ఇక నోర్జే స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చిన 30 ఏళ్ల బాష్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో మూడో వన్డేలో బరిలోకి దిగి ఒక వికెట్ తీసిన ఈ రైటార్మ్ పేసర్.. లక్ష్య ఛేదనలో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా.. ఒక్క మ్యాచ్ అనుభవంతోనే అతడు ఏంగా ఐసీసీ టోర్నీకి ఎంపికకావడం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చేశాడు! ఇక కార్బిన్ బాష్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో పాటు యంగ్ పేసర్ క్వెనా మఫాకాను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్ఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్లో ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా... తొలి మ్యాచ్ అనంతరం బాష్, మఫాకాతో పాటు టోనీ డీ జోర్జీ సఫారీ జట్టుతో కలవనున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. ఎనిమిది జట్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అడుగుపెట్టగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.షెడ్యూల్ ఇదేఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ ప్రాథమిక జట్లను ప్రకటించగా.. టీమ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి.ఈ ఐసీసీ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఫిబ్రవరి 21నతమ తొలి మ్యాచ్ ఆడనుంది. కరాచీ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం రావల్పిండిలో ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ పూర్తి చేసుకుని.. మళ్లీ కరాచీ వేదికగానే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. మార్చి 1న ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టుతెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డసెన్, కార్బిన్ బాష్.ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని ఓ ఫీట్ సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో నమోదైంది. అరంగేట్రంలో 9వ స్థానంలో వచ్చి 80 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ చరిత్ర సృష్టించాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 81 పరుగులతో అజేయంగా నిలిచాడు.టెస్ట్ అరంగేట్రంలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్లు81* - కార్బిన్ బాష్ (SA) vs PAK, సెంచూరియన్, 202472 - మిలన్ రత్నాయకే (SL) vs ENG, ఓల్డ్ ట్రాఫోర్డ్, 202471 - బల్వీందర్ సంధు (IND) vs PAK, హైదరాబాద్ (సింద్), 198365 - డారెన్ గోఫ్ (ENG) vs NZ, ఓల్డ్ ట్రాఫోర్డ్, 199459 - మొండే జోండేకి (SA) vs ENG, హెడింగ్లీ, 2003పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాష్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటాడు. బ్యాట్‌తో వరల్డ్ రికార్డు స్కోర్ సాధించడానికి ముందు బాష్ నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సహా నాలుగు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో బాష్ 122 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అరంగేట్రంలో ఎనిమిది అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
మార్క్రమ్, బాష్ మెరుపులు.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
సెంచూరియన్: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. లోయర్ ఆర్డర్ అండతో పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్ రికార్డుల్లోకెక్కాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. కెప్టెన్ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్హమ్ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్ వెరిన్ (2), మార్కో యాన్సెన్ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
SA Vs PAK: నిప్పులు చెరిగిన ప్యాటర్సన్, బాష్.. పాకిస్తాన్ 211 ఆలౌట్
సెంచూరియన్: అరంగేట్రం చేసిన ‘బాక్సింగ్ డే’ టెస్టును దక్షిణాఫ్రికా సీమర్ కార్బిన్ బాష్ (4/63) చిరస్మరణీయం చేసుకున్నాడు. సహచర పేసర్ డేన్ పాటర్సన్ (5/61)తో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి టెస్టు మొదలైన రోజే ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 211 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ (54; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించి సఫారీ బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో అమీర్ జమాల్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. జోర్జి (2), రికెల్టన్ (8), స్టబ్స్ (9) సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించినా... ఓపెనర్ మార్క్రమ్ (47 బ్యాటింగ్; 9 ఫోర్లు) పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కెప్టెన్ బవుమా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు.. అరంగేట్రంలోనే నిప్పులు చెరిగిన పేసర్
పాకిస్తాన్‌తో మొదటి టెస్టులో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేన్ పాటర్స(Dane Paterson)న్‌తో కలిసి అరంగేట్ర పేసర్ కార్బిన్ బాష్(Corbin Bosch) పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ఆర్డర్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 211 పరుగులకే ఆలౌట్ అయింది.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లిన పాకిస్తాన్.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో మిశ్రమ ఫలితాలు అందుకుంది. టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు 0-2తో కోల్పోయినా.. వన్డే సిరీస్‌లో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది.టాపార్డర్ కుదేలుఈ క్రమంలో సౌతాఫ్రికా- పాకిస్తాన్(South Africa vs Pakistan) మధ్య సెంచూరియన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. షాన్ మసూద్ బృందాన్ని బ్యాటింగ్ ఆహ్వానించింది.ఆది నుంచే సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో పాక్ టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(14), వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(4)ను పెవిలియన్‌కు పంపి పాటర్సన్ శుభారంభం అందించాడు.రాణించిన కమ్రాన్ గులామ్మరో ఓపెనర్, కెప్టెన్ షాన్ మసూద్(17)ను అవుట్ చేసిన కార్బిన్ బోష్.. సౌద్ షకీల్(14), అమీర్ జమాల్(28), నసీం షా(0)లను కూడా వెనక్కి పంపించాడు. మరోవైపు.. టాపార్డర్‌లో రెండు కీలక వికెట్లు తీసిన డేన్ పాటర్సన్.. డేంజరస్‌గా మారుతున్న కమ్రాన్ గులామ్(54)కు కూడా చెక్ పెట్టాడు. అదే విధంగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(27), సల్మాన్ ఆఘా(18) వికెట్లు కూడా కూల్చాడు. డేన్ పాటర్సన్పాటర్సన్ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు సమంఈ క్రమంలో డేన్ పాటర్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా తరఫున 35 వయస్సులో.. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించి.. రెగ్గీ స్వార్జ్(1910- 1912), గాఫ్ చబ్(1951)ల రికార్డును సమం చేశాడు.కార్బిన్ బాష్ అరుదైన ఘనతమరోవైపు.. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన 30 ఏళ్ల కార్బిన్ బాష్ కూడా ఓ అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్లో మొట్టమొదటి టెస్టులో తొలి బంతికే వికెట్ తీసిన ఐదో సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. షాన్ మసూద్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతకు ముందు.. హర్దూస్ విల్జోన్, డేన్ పెట్, బెర్ట్ వోగ్లర్, షెపో మోరేకీ సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించారు.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో డేన్ పాటర్సన్ ఐదు వికెట్లు కూల్చగా.. కార్బిన్ బోష్ నాలుగు, మార్కో జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులామ్(54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్