సెంచూరియన్: అరంగేట్రం చేసిన ‘బాక్సింగ్ డే’ టెస్టును దక్షిణాఫ్రికా సీమర్ కార్బిన్ బాష్ (4/63) చిరస్మరణీయం చేసుకున్నాడు. సహచర పేసర్ డేన్ పాటర్సన్ (5/61)తో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి టెస్టు మొదలైన రోజే ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57.3 ఓవర్లలో 211 పరుగుల వద్ద ఆలౌటైంది.
మిడిలార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ (54; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించి సఫారీ బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో అమీర్ జమాల్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. జోర్జి (2), రికెల్టన్ (8), స్టబ్స్ (9) సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించినా... ఓపెనర్ మార్క్రమ్ (47 బ్యాటింగ్; 9 ఫోర్లు) పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కెప్టెన్ బవుమా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment