CSK vs RCB
-
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్’ మాస్ క్రేజ్ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.డిఫెండింగ్ చాంపియన్‌పై గెలుపుతో మొదలుఅయితే, రజత్ పాటిదార్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను మట్టికరిపించింది.చెన్నైని చెపాక్‌లో ఓడించికేకేఆర్ను తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న పాటిదార్ సేనపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.ముంబై కంచుకోట బద్దలుముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్ టైమ్ చాంపియన్‌ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గాఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో.. ఒకే సీజన్లో కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో, చెన్నైని చెపాక్‌లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.గతంలో పంజాబ్ కింగ్స్ 2012లో ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కేకేఆర్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో ఓడించింది. అంతకుముందు డేవిడ్ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.బ్యాటర్‌గానూ సూపర్‌హిట్ ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్‌పై 16 బంతుల్లో 34, సీఎస్కేపై 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు.అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్‌పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ‘తలా’ అంత త్వరగా బ్యాటింగ్‌కు వస్తాడని ఊహించలేదన్నాడు. ఇందుకు కారణమేమిటో తనకు అర్థంకాలేదంటూ సీఎస్కే బ్యాటర్లపై జోకులు వేశాడు.ఐపీఎల్-2025లో భాగంగా సీఎస్కే శుక్రవారం ఆర్సీబీతో తలపడింది. సొంతమైదానం చెపాక్‌లో టాస్ గెలిచిన చెన్నై.. ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.ఓపెనర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించగా.. రాహుల్ త్రిపాఠి (5) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 4, సామ్ కర్రన్ 8, శివం దూబే 19 పరుగులకు వెనుదిరిగారు.తొమ్మిదో స్థానంలో ధోనిఈ క్రమంలో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25) రాగా.. రవిచంద్రన్ అశ్విన్(8 బంతుల్లో 11) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక పవర్ఫుల్ ఫినిషర్‌గా పేర్కొంది ధోని తొమ్మిదో నంబర్లో బ్యాట్‌తో రంగంలోకి దిగి 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఆల్‌రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.43 ఏళ్ల ధోనిని కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో ఉంచితే.. సీఎస్కే మున్ముందు మరిన్ని చేదు అనుభవాలు చూస్తుందనే హెచ్చరికలు వస్తున్నాయి. జట్టుకు అవసరమైన వేళనైనా తలా ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారి ధోనిపై క్రిక్‌బజ్ షోలో జోకులు వేశారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి చాలా తొందరగానే బ్యాటింగ్‌కు వచ్చాడే!’’ అని సెటైర్ వేయగా.. ‘‘అవును.. నేనైతే అతడు పదో స్థానంలో వస్తాడేమో అనుకున్నా’’ అని బదులిచ్చాడు.అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా?ఇందుకు స్పందిస్తూ.. ‘‘16 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వచ్చాడు. మామూలుగా అయితే, 19 లేదా 20వ ఓవర్లోనే అతడు బ్యాటింగ్‌కు వస్తాడు. అందుకే త్వరగా వచ్చాడని అన్నాను. మీకూ అలాగే అనిపిస్తోందా?అతడు తొందరగా బ్యాటింగ్‌కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి అతడిని రప్పించారా?’’ అని సెహ్వాగ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. కాగా ధోని ఈ మ్యాచ్‌లో 30 పరుగులు చేసిన క్రమంలో.. సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు (204 ఇన్నింగ్స్‌లో 4699) సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉండేది. అతడు చెన్నై తరఫున 171 ఇన్నింగ్స్ ఆడి 4687 పరుగులు చేశాడు. ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ బెంగళూరు👉 బెంగళూరు స్కోరు: 196/7 (20)👉చెన్నై స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం.చదవండి: ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం -
పతిరణ షార్ప్ డెలివరీ.. ఇదీ నా పవర్! కోహ్లి రియాక్షన్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. 2008 తర్వాత తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చెపాక్‌లో ఓడించింది. ఏకంగా యాభై పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసి చిదంబరం స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) ధనాధన్ దంచికొట్టగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఆచితూచి ఆడాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. అయితే, తాను సిక్స్ కొట్టిన సందర్భంగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ వింటేజ్ కింగ్‌ను గుర్తు చేసింది.హెల్మెట్‌కు బలంగా తాకిన బంతిఅసలేం జరిగిందంటే.. సీఎస్కేతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పదకొండో ఓవర్లో చెన్నై పేసర్ మతీశ పతిరణ బంతితో రంగంలోకి దిగాడు. అప్పుడు కోహ్లి క్రీజులో ఉండగా.. పతిరణ పదునైన షార్ట్ డెలివరీ సంధించగా.. కోహ్లి హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఫలితంగా.. ఒకవేళ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవుతుందేమోనని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.క్లాసీ కౌంటర్.. మాస్ రియాక్షన్అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పిన కోహ్లి.. పతిరణ సంధించిన రెండో బంతికి భారీ షాట్ బాదాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సంధించిన షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా బౌండరీవైపు తరలించి ఆధిపత్యం చాటుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఇదీ నా పవర్’’ అన్నట్లుగా పతిరణ వైపు కింగ్ గుర్రుగా చూసిన విధానం అభిమానులను ఆకర్షించింది. ఇక అదే ఓవర్లో మరుసటి బంతికి కోహ్లి ఫోర్ కూడా బాదడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.1st ball – 😮💨2nd ball – 6️⃣ That’s what it’s like facing the GEN GOLD! ❤Classy counter from #ViratKohli! 🙌🏻Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc— Star Sports (@StarSportsIndia) March 28, 2025 పాటిదార్, పడిక్కల్, డేవిడ్ అదరహోఇక మ్యాచ్ విషయానికొస్తే.. సాల్ట్, కోహ్లిలు ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51) దుమ్ములేపారు. మిగతా వాళ్లలో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.హాజిల్‌వుడ్ తీన్మార్ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా(25), మహేంద్ర సింగ్ ధోని(16 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్ల(3/21)తో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్, యశ్ దయాళ్ రెండేసి వికెట్లు కూల్చారు. భువనేశ్వర్కుమార్కు ఒక వికెట్ దక్కింది. ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ👉టాస్: సీఎస్కే.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 196/7 (20)👉సీఎస్కే స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో సీఎస్కేపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్‌వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
ఈ పిచ్‌పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్‌లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్‌పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్‌ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్‌లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్‌గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. -
కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదే: CSK హెడ్‌కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణం టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని- విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2008 తర్వాత అక్కడ నో విన్!అయితే, ఇందుకు మరో కారణం.. వేదిక. అవును.. సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియం ఈ హై రేంజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఆరంభ సీజన్లో అంటే 2008లో తొలిసారి గెలిచిన ఆర్సీబీ.. ఇంత వరకు ఒక్కసారి కూడా మళ్లీ గెలుపు రుచిచూడలేదు. ఇప్పటి వరకు చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు ఆడి అన్నింటా ఓటమిపాలైంది.ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటి వరకు చెన్నైతో జరిగిన 33 మ్యాచ్‌లలో 11 మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి మీదే కేంద్రీకృతమై ఉంది. జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం సీఎస్కే మీద మెరుగై రికార్డు కలిగి ఉన్నాడు.ఇప్పటి వరకు సీఎస్కే 33 మ్యాచ్‌లలో ఆడిన కోహ్లి 1053 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియా ముందుకు వచ్చిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోహ్లితో ప్రమాదం ఉందని భావిస్తున్నారా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికి ఒక్క మ్యాచ్ ఆడింది. దానిని బట్టి ఇప్పుడే అంచనాకు రాలేము.కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదేగతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే- ఆర్సీబీ సరికొత్తగా ఉన్నాయి. గత రికార్డుల గురించి ప్రస్తావన అప్రస్తుతం. ఏదేమైనా ఆర్సీబీకి కోహ్లి అత్యంత కీలకమైన ఆటగాడు. వాళ్ల జట్టు కూడా గతం కంటే మరింత పటిష్టంగా మారింది.ఒకవేళ మేము కోహ్లి, పాటిదార్లను కట్టడి చేయగలిగితే.. అది మా విజయానికి దోహం చేస్తుంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ తొలుత డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఫలితంగా 16.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి ఆర్సీబీ గెలిచింది.ఇక సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి గతంలో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా.. చెన్నైని ముందుండి నడిపించిన ధోని.. గతేడాది తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!