Dal Lake
-
కశ్మీర్‌కు పర్యాటక కళ
కశ్మీర్ నెత్తుటి మరకలను తుడుచుకుంది. పాశవిక దాడి తాలూకు చేదు అనుభవం నుంచి చూస్తుండగానే తేరుకుంది. పర్యాటకులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. దాడి నేపథ్యంలో భయాందోళనలతో లోయను వీడిన టూరిస్టులు ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్తున్నారు. ఉగ్ర దాడుల ఆందోళనలు పూర్తిగా తొలగకపోయినా దేశమంతా ఏకమై ఉందని చెప్పడానికి కశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. శని, ఆదివారాల్లో కోల్‌కతా, బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు కశ్మీర్ చేరుకున్నారు. ‘‘కశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది, షాపులు, సందర్శన స్థలాలు అన్నీ తెరిచే ఉన్నాయి’’ అని వారు స్వయంగా చెబుతున్నారు. ‘‘లోయ మళ్లీ పర్యటాకులతో కళకళలాడుతోంది. కశ్మీర్ పర్యటనకు రండి’ అని స్థానిక టూర్ ఆపరేటర్లతో పాటు ప్రభుత్వం కూడా పిలుపునిస్తోంది. ప్రఖ్యాత దాల్ సరస్సు ఆదివారం ఉదయం మళ్లీ సందడిగా మారింది. పర్యాటకులు షికారాల్లో విహరాన్ని, స్థానిక ఆతిథ్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. కశ్మీరీల ఆతిథ్యం గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఉగ్ర దాడితో పర్యాటకం దెబ్బతినకుండా చూసుకుందామంటూ పిలుపునిస్తున్నారు.‘ఛలో కశ్మీర్’ నటుడు అతుల్ కులకర్ణి కశ్మీర్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి ముందుకొచ్చారు. ‘చలో కశ్మీర్’ అంటూ ఆయన ఆదివారం ఉదయం పహల్గాం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కశ్మీర్ పర్యటన ప్రణాళికలను రద్దు చేసుకుంటే ఉగ్రవాదులు అనుకున్నది నెరవేరుతుంది. అది జరగకూడదు. పర్యాటకులు కశ్మీర్‌కు రావాలి’’ అని ఎక్స్‌లో పిలుపునిచ్చారు. ‘చలో కశ్మీర్’, ‘టెర్రరిజాన్ని ఓడించండి’, ‘ఫీట్స్ ఇన్ కశ్మీర్’ అంటూ హ్యాష్‌టాగ్‌లు జోడించారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే సందేశంతో కశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటిస్తానని కులకర్ణి చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కశ్మీరీ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకుల బృందాన్ని పహల్గాంలో చూశానని, ఇలాంటి సంభాషణలు ప్రజల సన్నిహిత బంధాలను పెంపొందించడానికి, ఐక్యత, కరుణ సందేశాన్ని పంపడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. పహల్గాంలోని బైసారన్ లోయలో మంగళవారం ఉగ్ర దాడి జరిగిన వెంటనే కశ్మీర్‌లోని హోటళ్లు, హౌస్ బోట్ల టూరిస్ట్ బుకింగ్స్‌లో 80 శాతం వరకు రద్దవడం తెలిసిందే. వేలాది మంది పర్యాటకులు కశ్మీర్లో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ప్రత్యేక విమానాలు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు.ఉగ్ర లక్ష్యం నెరవేర నీయొద్దు‘‘దుర్గా పూజ తర్వాత కశ్మీర్ పర్యటనకు బుకింగ్స్ చేసుకున్నాం. దాడితో షాకయ్యాం. కానీ స్థానికులతో మాట్లాడాక వెళ్లొచ్చని నిర్ధారించుకున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్‌ను కచ్చితంగా పర్యటించాలనే వచ్చాం. భయపడి ఆగిపోతే ఉగ్రవాదుల లక్ష్యాన్ని నెరవేర్చిన వాళ్లమవుతాం అనిపించింది. అందుకే వచ్చాం’ అని కోల్‌కతా నుంచి వచ్చిన ఓ యువతి తెలిపారు. ‘‘ఇప్పుడు కశ్మీర్ సురక్షితంగా ఉంది. గుల్మార్గ్, సోన్మార్గ్, తరువాత పహల్గాం కూడా వెళ్లాలనుకుంటున్నాం. కశ్మీర్ భారత్‌లో భాగం. మనం కశ్మీర్ సందర్శించడం స్థానికులకు సాయం చేసినట్టవుతుంది. ఈ విషాద సమయాల్లో మనమంతా ఒక్కటని చాటాల్సిన అవసరముంది’’ అని మరో యువకుడు నొక్కి చెప్పారు. ‘‘మేం దాడి తర్వాతే వచ్చాం. ఇప్పుడిక్కడ అంతా సాధారణంగానే ఉంది. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశాం’ అని బెంగళూరుకు చెందిన దంపతులు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? -
యువతుల‘పడవ’ళ్లు!
దాల్ సరస్సులోని నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి, శ్రీనగర్ పట్టణ ప్రాంత సోయగాలను, ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక ఆ సరస్సులో సోమవారం జరిగిన బోట్ రేస్ ఏకంగా మహిళా సాధికారతనే పరవళ్లు తొక్కించింది! 150 మందికి పైగా అందరూ మహిళలే పాల్గొన్న అలాంటి ఒక రేస్ దాల్ సరస్సులో జరగటం ఇదే మొదటిసారి. మహిళా అథ్లెట్లను ప్రోత్సహించటం, జమ్మూ లోయలోని మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టించి మహిళల్ని ఇంటి బయటికి రప్పించటం ఈ పడవ పోటీల లక్ష్యం. కశ్మీర్ మహిళలకు వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రఖ్యాత అథ్లెట్,పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ.. బిల్కిస్ మీర్ ఈ పోటీలను నిర్వహించారు.‘‘మహిళల కోసం దాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ట్రాక్ రేస్ చరిత్రాత్మక మైనది. పురుషులకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. మహిళలకు అన్ని ఉండవు. ఇటువంటి మరిన్ని రేసులను నిర్వహించి, 35మంది యువతుల్ని వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని అంతర్జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తాం’’ అని బిల్కిస్ మీర్ తెలి΄ారు. పోటీలోపాల్గొన్న మాదిహా ఫరూక్ అనే యువతి, తను ఈ రేసులో భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆడపిల్లలకు ఆటలేంటి అనే భావజాలం సమాజం నుండి రూపుమాసిపోవాలి’’ అని అన్నారు.అందమైన జలమార్గాలకు పేర్గాంచిన కశ్మీర్లో, మహిళల్ని వాటర్ స్పోర్ట్స్‌లో ప్రోత్సహించటం ద్వారా సాధికారత వైపు పడవల్ని పరుగులెత్తించటం బాగుంది. -
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.... శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది. ఓటర్లలో నిరుత్సాహం... శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది. వలసదారులకు ఉన్నచోటే ఓటు! జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్బోట్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనర్‌లో ఉన్న దాల్ సరస్సులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు ఉదయం నిప్పంటుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో అనేక బోట్లు కాలిబూడిదయ్యాయి. దాల్ సరస్సులో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Several houseboats were gutted in a fire in Srinagar's Dal Lake last night pic.twitter.com/uDtuOQO9yw — ANI (@ANI) November 11, 2023 ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాల్ సరస్సులోని ఘాట్ నెంబర్ 9 సమీపంలోని హోస్బోట్లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ మంటలు ఇతర బోట్లకు వ్యాపించినట్లు పేర్కొన్నారు. #WATCH | Srinagar, J&K: On fire in houseboats at Dal Lake, Station House Officer Fire Service Farooq Ahmad says, "The fire emerged at around 5:15 in the morning and as soon as I received the call we came here. Some 5-8 houseboats and huts were gutted in the fire. We can't… pic.twitter.com/rEQ0cSCDw7— ANI (@ANI) November 11, 2023 సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అయిదు నుంచి ఎనిమిది పడవల వరకు పూర్తిగా దగ్ధం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. చదవండి: జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు Deeply saddened by the devastating fire incident in Dal Lake, Srinagar, where several houseboats were gutted. Requesting @OfficeOfLGJandK and the district administration to kindly ensure swift and comprehensive assistance to those affected. Our thoughts are with the victims… pic.twitter.com/qgvkvcNcGN — Tanvir Sadiq (@tanvirsadiq) November 11, 2023 -
వైజాగ్‌లో ‘దాల్ లేక్’!
ఇదీ దాల్ లేక్... జమ్మూ, కశ్మీర్లో ఇది రెండో అతిపెద్ద సరస్సు. దీనిని ఫ్లవర్ లేక్, శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు. 5 అడుగుల నుంచి 20 అడుగుల లోతుతో 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ లేక్‌లో బోటింగ్‌తో పాటు అక్కడ సేద తీరేందుకు రూమ్స్, భోజనం చేసేందుకు హోటల్స్ మాత్రమే కాకుండా షాపింగ్ చేసేందుకు షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ హోటల్స్, షాప్స్ కూడా బోట్ల మీదనే ఏర్పాటు చేయడంతో పాటు లేక్‌లోనే ఉండటం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒక వైపు మంచుకొండలు.. మరోవైపు సరస్సు అందాలను చూస్తూ బోటింగ్ చేయడం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి బోటింగ్ చేసి సేదతీరడాన్ని అమితంగా ఆస్వాదిస్తున్నారు. ఇదేతరహాలో ఇక్కడ ముడసర్లోవను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం జీవీఎంసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ముడసర్లోవ రిజర్వాయర్‌లో బోటులో విహరిస్తూ కంబాలకొండ అందాలను తనివితీరా చూస్తూ కాఫీ తాగాలని ఉందా? అక్కడే నచ్చిన వాటిని కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా? అచ్చంగా శ్రీనగర్‌లోని దాల్ లేక్ తరహాలో... ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు...నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమాయత్తమవుతోంది. తాజాగా జీవీఎంసీ అధ్యయన యాత్రలో భాగంగా శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పర్యటనలో ‘దాల్ లేక్’ను పరిశీలించారు. పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేందుకు వీలుగా దాల్ లేక్‌ను అభివృద్ధి చేశారు. బోటులో షికారు చేస్తూ... ఫ్యామిలీతో కలిసి అక్కడే భోజనం చేయడం, షాపింగ్ చేసేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు.అదేతరహాలో ఇక్కడ ముడసర్లోవను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులతో సమీక్షించారు. దీనిపై అధ్యయనం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రధానంగా నగర వాసులతో పాటు విశాఖకు విచ్చేసే పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ముడసర్లోవలో....! వాస్తవానికి గతంలో జీ–20 సమావేశాల సందర్భంగా వచ్చిన ప్రపంచదేశాల అతిథుల బృందం ముడసర్లోవలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు (ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)ను పరిశీలించారు. ఇప్పటికే ముడసర్లోవ వివిధ రకాలుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ రిజర్వాయర్ మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు నిరంతరం ప్రయత్నించడంలో భాగంగా దాల్ లేక్ తరహాలో ముడసర్లోవ లేక్‌ను అభివృద్ధి చేయాలని జీవీఎంసీ మేయర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఇంజినర్స్ డే సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రిజర్వాయర్ ఎంత లోతులో ఉన్నది? బోటింగ్ సమయంలో పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఎక్కడెక్కడ సేదతీరేందుకు షాపింగ్, హోటల్స్ వంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది? అనే అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించాలని సూచించారు. అధ్యయనం చేయాలని ఆదేశించాం శ్రీనగర్‌లో కార్పొరేటర్లతో కలిసి పర్యటించాం. అక్కడ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గమనించాం. అక్కడ 4 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. మనతో పోలిస్తే చిన్న ప్రాంతం. అయినప్పటికీ అక్కడ దాల్ లేక్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేశారు. అదేతరహాలో ఇక్కడ ముడసర్లోవలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇదే విషయంపై అధ్యయనం చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించాం. ఇప్పటికే నగరవాసులకు సౌకర్యాలను కల్పించడంలో జీవీఎంసీ ముందంజలో ఉంది. బస్ బేలు, రోడ్ల వెడల్పు, జంక్షన్ల అభివృద్ధి, వైఎస్సార్ వ్యూ పాయింట్ ఏర్పాటు, బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ముడసర్లోవ రిజర్వాయర్‌ను దాల్ లేక్ తరహాలో అభివృద్ధిపై అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ముందుకు వెళతాం. – గొలగాని హరి వెంకటకుమారి, మేయర్ -
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో రెండు హౌస్బోట్లు దగ్ధమయ్యాయి. దాల్ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్, అపోలో xI అనే రెండో హౌస్బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్బోట్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్బోట్లు దాల్ సరస్సులో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇవి పశ్చిమ భాగంలో విడిగా లంగరు వేసి ఉంచుతారు. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే హౌస్బోట్లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి. (చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..) -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్
జమ్మూ కాశ్మీర్ స్థానికులకు, పర్యాటకులకు ఎస్బీఐ భారీ బహుమతి ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం శ్రీనగర్ లోని దాల్ సరస్సులోని హౌస్‌బోట్‌లో తేలియాడే ఎటిఎంను ప్రారంభించింది. "స్థానికులు, పర్యాటకుల సౌకర్యం కోసం శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్‌బోట్‌లో ఎస్బీఐ ఎటిఎమ్ ప్రారంభించింది. దీనిని ఎస్బీఐ ఛైర్మన్ ఆగస్టు 16న ప్రారంభించారు. ప్రముఖ దాల్ సరస్సులోని #FloatingATM దీర్ఘకాలిక అవసరాన్ని నెరవేరుస్తుంది. ఇది శ్రీనగర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని" ఎస్బీఐ ఒక ట్వీట్ లో పేర్కొంది. ఎస్బీఐ 2004లో కేరళలో తేలియాడే ఎటిఎంను మొదటిసారి ప్రారంభించింది. కేరళ షిప్పింగ్, ఇన్ లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ (కెఎస్ఐఎన్ సీ) యాజమాన్యంలోని ఝాంకర్ యాచ్ లో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్ ఏర్పాటు చేసింది. ఎర్నాకుళం & వాయ్పియన్ ప్రాంతం మధ్య ఈ హౌస్‌బోట్ పనిచేస్తుంది. తన తన కస్టమర్ల సౌలభ్యం కొరకు ఎస్బీఐ నిరంతరం సేవలు అందిస్తుంది. భారతదేశంలో 22,224 బ్రాంచీలు, 63,906 ఎటిఎమ్/సిడిఎమ్ నెట్ వర్క్ తో ఎస్బీఐ అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా ఉంది. SBI opened an ATM on a Houseboat at #DalLake, Srinagar for the convenience of locals & tourists. It was inaugurated by the Chairman, SBI, on 16th August. The #FloatingATM in the popular Dal Lake fulfills a long-standing need & will be an added attraction to the charm of Srinagar. pic.twitter.com/nz3iddHIdp — State Bank of India (@TheOfficialSBI) August 19, 2021 -
కరోనా రోగుల కోసం బోట్ అంబులెన్స్ సేవలు
శ్రీనగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. చాలామంది కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఎంతో మంది మానవతా మూర్తులు పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. కశ్మీర్లో తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్నాడు. అతడి సేవకు జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసించే తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు ఈమధ్యే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. తారిక్కు కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ పడవలోకి ఎక్కనివ్వలేదు. కారణం కరోనా భయం. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా అనుభవించాడు. అప్పట్లో తారిక్ పట్లూ… 20 రోజులు ఇంట్లో క్వారంటైన్ అయ్యాడు. అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది… అయితే ఎవరు కూడా తనను పడవ ఎక్కనిచ్చేవారు కాదు. పడవ నడిపే తన తోటి వారే పడవలోకి ఎక్కించుకోవడానికి భయపడటం చూసి… పట్లూ బాధపడేవాడు. కానీ వారికి ఓ కుటుంబం ఉంటుందని అర్థం చేసుకున్నాడు. దాంతో తనకున్న పడవను అంబులెన్సుగా మార్చేశాడు. దాల్ సరస్సులో పర్యాటకులను తిప్పి ఆ డబ్బులతో జీవించే తారిక్ తన పడవను అంబులెన్స్‌గా మార్చి సేవలందిస్తున్నాడు. కరోనా రోగులను తన పడవలో తీసుకెళ్తున్నాడు..అంతేకాకుండా వారికి ఏం కావాలో తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చి ఏం సహాయం కావాలన్నా తన శక్తి మేరకు చేసి పెడతానని భరోసా కల్పిస్తున్నాడు. తారిక్ రూపాయి రూపాయి కూడబెట్టాడు. కొంత అప్పు చేశాడు. అలా ఆయన పడిన కష్టానికి ఏప్రిల్‌లో ఓ రూపం వచ్చింది. దాల్ సరస్సులో తేలియాడే పడవ కాస్తా అంబులెన్స్‌గా మారిపోయింది. వాటర్ అంబులెన్స్ సిద్ధం అయ్యింది. ఈ పడవ అంబులెన్స్ లో పీపీఈ కిట్స్, స్ట్రెచర్స్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఉంది. దీంతో కరోనా రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికైంది. కాగా..శ్రీనగర్‌కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో… అక్కడ కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 25న శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ తెరవడంతో కేసులు మరింత ఎక్కువయ్యాయి. ఆ రోజు 131 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 2.29 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.75 లక్షల మంది కోలుకున్నారు. 2,912 మంది మరణించారు. (చదవండి: ఆనంద్ మహీంద్ర: ‘‘చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’) -
కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా చలిగాలుల ఉధృతితో వణికిపోతున్న ఉత్తర భారతానికి ఇంకో రెండ్రోజులపాటు ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది. తూర్పు, మధ్యభారతదేశ ప్రాంతాల్లో నూ చలితీవ్రత పెరగనుందని తెలిపింది. వాయవ్య దిక్కు నుంచి వస్తున్న శీతల పవనాలు కొనసాగుతున్న కారణంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్ ఉత్తర ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌లలో రానున్న రెండు రోజులు చలి లేదా అతిశీతల పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ తెలిపింది. కొత్త సంవత్సరం తొలిరోజు, అంతకుముందు రోజుల్లో దేశ వాయువ్య, మధ్య ప్రాంతాల్లో వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముంది. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు –5.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ విభాగం తెలిపింది. కశ్మీర్, లడాఖ్‌ల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మైనస్లలోకి వెళ్లాయి. కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని గుల్మార్గ్లో ఉష్ణోగ్రతలు – 9.5 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోగా, పహల్గామ్ రిసార్ట్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు – 12.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
సరస్సులో మూత్ర విసర్జన.. ఇదిగిదిగో స్వచ్ఛ భారత్!
సాక్షి, న్యూఢిల్లీ : అమరనాథ్ యాత్ర కోసం కశ్మీర్లో అడుగుపెట్టిన ఉత్తర, దక్షిణాది భారతీయులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఒడ్డున మూత్ర విసర్జన చేయడం పట్ల కశ్మీరీలు మండిపడుతున్నారు. మరోపక్క మహిళలు కూడా సామూహికంగా మూత్ర విసర్జనలు చేయడం ఏమిటని? ఇదెక్కడి సంస్కృతి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సరస్సు ఒడ్డున మగవాళ్లు మూత్ర విసర్జన చేస్తున్న ఫొటోను ప్రచురించిన ‘కాశ్మీర్ వాలా, ది సిటిజెన్’ లాంటి స్థానిక పత్రికలు ఈ తీరును తప్పుబట్టగా.. అలాంటి ఫొటోలతోని ట్విట్టర్, వాట్సాప్‌లలో కొందరు తమదైన శైలిలో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను చూసి మీరు నేర్చుకున్నది ఇదేనా ? అంటూ కొందరు.. ‘టాయ్‌లెట్’ బాలీవుడ్ సినిమా చూడలేదా అంటూ మరికొందరు స్పందించారు. అమర్నాథ్ యాత్ర కోసం భారీ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ భారీ ఎత్తున మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దాల్ లేక్‌ను ఎందుకు పాడుచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ‘మేం బతకడానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకునే మీరు ఈ కుసంస్కారాన్ని ఎలా సమర్థిస్తారు?’ ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నవారిలో కశ్మీర్ ముస్లింలతోపాటు హిందువులు, ముఖ్యంగా పండిట్లు కూడా ఉన్నారు. ‘ అమర్నాథ్ యాత్రికులను మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు మా సహజ వనరులను కలుషితం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే మనస్తత్వాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇది విచారకరమే కాదు, సిగ్గుచేటైన విషయం. అత్యున్నత ఆధ్యాత్మిక స్ఫూర్తితో వెళుతున్న యాత్రికులకు కూడా మీరు అగౌరవం తీసుకొచ్చారు. మీరు ఏ రాష్ట్రం వారైనా కావచ్చు. స్వచ్చ భారత్ అభియాన్‌కు మచ్చతెచ్చారు’ అని సామాజిక కార్యకర్త, కశ్మీర్ పండిట్ సంజయ్ పార్వ వ్యాఖ్యానించారు. దాల్ సరస్సు పక్కన పారిశుద్ధ్య పరిస్థితులు అంత సవ్యంగా లేకపోవడం వల్లనే అక్కడ యాత్రికులు మూత్ర విసర్జన చేశారని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముందు తమరు ముందు నేర్చుకోండంటూ కశ్మీరీలకు కొందరు కౌంటర్ ట్వీట్లు ఇచ్చారు. -
ప్రమాదం నుంచి బయటపడ్డ నటి
శ్రీనగర్ : బాలీవుడ్ చిత్రం 'దంగల్'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైరా వాసిమ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి గురువారం బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్ లేక్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా వాసిమ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నఓ వ్యక్తికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. అయితే జైరాకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కాగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాశ్మీర విలయం మానవ తప్పిదమే..
కాశ్మీర్లో అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కారణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండాపోయాయి. కాశ్మీర్ అనగానే జివ్వుమనిపించే హిమ పాతాలు, దాల్ సరస్సు అందాలు స్ఫురణకు రావడం సహజం. అందులోనూ శ్రీనగర్ అంటే సుంద రమైన వనాలకు, పూలతోటలకు ప్రసిద్ధి. అయితే అదంతా గతం. ఇపుడు శ్రీనగర్ వరదనీటిలో మునకలేస్తున్నది. నయనమనోహరమైన పూదోట లన్నీ నడుం లోతులో మునిగి ఉన్నాయి. వీధు లను వరద ముంచెత్తింది. వందేళ్లలో కనీవిని ఎరుగని జలవిపత్తు కాశ్మీర్‌ను కకావికలం చేసింది. వందల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో నిర్వాసితుల య్యారు. ఎన్నడూ లేనిది ఈ జల విలయా నికి కారణమేమిటి? ప్రశాంత కాశ్మీరంలో ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులు? జమ్మూ కాశ్మీర్లో వరదలు ప్రకృతి వైపరీ త్యమేనా... అంటే.. కానేకాదు ఇది మానవ తప్పిద ఫలితమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కార ణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండా పోయాయి. శ్రీనగర్‌లో ఒకప్పుడు 2400 హెక్టార్లలో విస్తరించి ఉన్న దాల్ సరస్సు ఇపుడు 1200 హెక్టార్లకు పరిమితమైపో యింది. శ్రీనగర్‌కు ఎగువన 20,200 హెక్టా ర్లలో విస్తరించి ఉండే ఉలార్ సరస్సు 2,400 హెక్టార్లకు కుంచించుకుపోయింది. కాశ్మీర్‌లోయలో జీలం నది ఉరవడిని తట్టుకోవడానికి సరస్సుల దాపులనుండే చిత్తడినేలలు ఎంతగానో ఉపకరి స్తాయి. అయితే కాశ్మీర్లో గత 30 ఏళ్లలో 50 శాతం చిత్తడి నేలలు అంతరించిపోయాయి. సరస్సుల సమీపంలో ఉండే విశాలమైన చిత్తడినేలలన్నీ కుంచించుకుపోయాయి. ఉలార్ సరస్సునే తీసుకుంటే.. ఈ సరస్సు సమీపంలోని నేలలను కాశ్మీరీ మహరాజాలు, చివరకు బ్రిటిష్‌వారు సైతం ఎంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవి వరద నీటిని స్పాంజిలాగా పీల్చుకుంటాయి. అయితే అనేక సంవత్సరాలుగా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కార్యకలాపాలకు ఆలవాలంగా మారిపోయాయి. జీలం నది పొడవునా అనేకచోట్ల ఆక్రమణలు జరిగాయి. వెడల్పు తగ్గడంతో నది ఉరవడి పెరిగింది. దీంతో పాటు శ్రీనగర్‌లోని దిగువ ప్రాంతాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వరదనీటి విడుదలకు ఉపకరించే చిన్నచిన్న కాల్వలు చాలావరకు పూడిపోయాయి. జీలం వరదల నుంచి శ్రీనగర్‌ను రక్షించేందుకు గాను శతాబ్దం కిందట దోగ్రా పాలకుడు ప్రతాప్ సింగ్ నిర్మించిన జీలంబండ్ కూడా ఆక్రమణలపాలయ్యింది.వాస్తవానికి జీలం పరివాహకప్రాంతాలకు ముఖ్యంగా శ్రీనగర్‌కు వరద ప్రమాదం పొంచి ఉందని అనేకమార్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. అసలు జమ్ము కాశ్మీర్‌కు వరదల గురించి హెచ్చరించే వ్యవస్థ ఏదీలేదు. జీలం నది శ్రీన గర్‌ను చేరుకోవడానికి ముందు దక్షిణ కాశ్మీర్లో ఆరు రోజుల పాటు ప్రవహిస్తుంది. అనంతనాగ్ సమీపంలో సంగం వద్ద నీటిమట్టం పెరగడం కూడా స్పష్టమైన సూచికలా పనిచేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురు స్తున్నా, దక్షిణ కాశ్మీర్లో జీలం నది ఉరవడి పెరు గుతున్నా అధికార యంత్రాంగం, ఒమర్ ప్రభు త్వం అప్రమత్తం కాలేదు. వారి మొద్దు నిద్ర శ్రీన గర్‌కు ప్రాణాంతకంగా పరిణమించింది. జమ్ము కాశ్మీర్‌కు తీవ్ర వరద ముప్పు పొంచి ఉన్నదని 2010లో వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. తగిన మౌలిక సదుపాయాల కల్పనకు, వరద నివారణ చర్యలకుగాను 22,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుకు అప్పటి రాష్ర్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఆ తర్వా త వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించేశాయి. దీంతో పాటు అభివృద్ధి పేరుతో జరిగిన అనేక కార్యక్రమాలు కాశ్మీర్ నీటిపారుదల వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టాయి. కాశ్మీర్ లోయలో నిర్మించిన కొత్త రైల్వే లైన్లు, హైవేలు నగరాన్ని లోతట్టు ప్రాంతంగా మార్చివేశాయి. కొత్తగా ఏర్పాటయిన నాలుగులైన్ల హైవే ప్రాజెక్టు శ్రీనగర్ మురుగునీటిపారుదల వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇవన్నీ జలవిలయాన్ని సృష్టించాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు మేల్కో వాలని, కాశ్మీర్లో చిత్తడినేలల పరిరక్షణకూ అడవుల పరిరక్షణ చట్టం -1980 వంటి పటిష్టమైన చట్టం ఉండాలని పర్యావరణ వేత్తలంటున్నారు. అయితే చట్టాలు చేయడం తోనే సరిపోదు. ప్రకృతిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయం కూడా అవసరమే. అది లేనపుడు మనకు వైపరీత్యాల నుంచి రక్షణ లేనట్లే. అందుకు కాశ్మీర్ జలవిలయమే ప్రత్యక్ష ఉదాహరణ. పోతుకూరు శ్రీనివాసరావు