IndusInd
-
ఇండస్‌ఇండ్‌పై ఆర్‌క్యాప్ రుణదాతల పిటిషన్ వాపస్
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కాపిటల్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఉపసంహరించుకుంది. పూర్తిగా చెల్లింపులు జరిపి ఇందుకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసినందున, ఐఐహెచ్ఎల్పై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అపీలేట్ ట్రిబ్యునల్‌కు ఆర్‌క్యాప్ సీఓసీ తెలిపింది. సీఓసీ పిటిషన్‌ను జస్టిస్ యోగేష్ ఖన్నా, జస్టిస్ అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య థర్మాసనం ఆమోదించింది. కేసు వివరాల్లోకి వెళితే, దివాలా కోడ్ చట్టం కింద ఐఐహెచ్ఎల్ ఆర్థిక సేవల సంస్థ– రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు 2023 ఏప్రిల్‌లో రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్‌ను నమోదుచేసింది. దీని ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికను ఐఐహెచ్ఎల్ 2924 మే 27 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు తర్వాత ఈ కాల పరిమితిని 2024 ఆగస్టు 10 వరకూ పొడిగించడం జరిగింది. -
‘ఇండస్ఇండ్’ ఆధీనంలోకి అంబానీ కంపెనీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు.అంతకుముందు రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) చైర్మన్ అశోక్ హిందుజా వెల్లడించారు. బిడ్ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్‌పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.ఆర్‌క్యాప్ వ్యాపారాన్ని సమీక్షించి, అవసరమైతే నిధులను సమకూర్చడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. చిన్నా చితకా అనుబంధ సంస్థలు 39–40 వరకు ఉన్నాయని, వాటిల్లో చాలా మటుకు సంస్థలను కొత్త మేనేజ్మెంట్ విక్రయించవచ్చని హిందుజా చెప్పారు. బ్రోకింగ్, అసెట్ రీకన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటుందని వివరించారు.నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాల ప్రకారం మూడేళ్ల పాటు అదే పేరుతో వ్యాపారాలను కొనసాగించవచ్చని, కానీ తమ సొంత ఇండస్ఇండ్ బ్రాండ్‌తో అనుసంధానించడంపై కసరత్తు చేస్తున్నామని హిందుజా చెప్పారు. అనుసంధానానికి 6–9 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ కావడం, గవర్నెన్స్‌లో లోపాలు తదితర అంశాల కారణంగా రిలయన్స్ క్యాపిటల్‌ను 2021లో రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద 2023 ఏప్రిల్‌లో రూ. 9,650 కోట్లు ఆఫర్ చేసి ఐఐహెచ్ఎల్ విజయవంతమైన బిడ్డరుగా నిల్చింది. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్‌కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్‌కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్‌క్యాప్ షేర్లను ఇండస్‌ఇండ్‌కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్‌లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్‌లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
భారత్ ఫైనాన్షియల్... ఇండస్ఇండ్ చేతికి!
విలీన చర్చలపై మీడియాలో వార్తలు... • రెండింటికీ ప్రయోజనమే అంటున్న విశ్లేషకులు • గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకి ఇండస్‌ఇండ్‌కు అవకాశం • భారత్ ఫైనాన్షియల్‌కు తగ్గనున్న నిధుల సమీకరణ వ్యయాలు ముంబై: మరో రెండు ఆర్థిక సంస్థల మధ్య విలీనం జరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి. ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనమయ్యేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విలీన వార్తల నేపథ్యంలో ఈ డీల్ సాకారమైతే రెండు సంస్థలకు ప్రయోజనకరమే కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు ఇండస్‌ఇండ్‌కు అవకాశం లభించగలదని వారు చెబుతున్నారు. అలాగే తక్కువ వడ్డీ భారంతో నిధులు సమీకరించుకోవడానికి భారత్ ఫైనాన్షియల్‌కు ఈ డీల్ తోడ్పడగలదని అంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్‌లో ఇండస్‌ఇండ్‌కు భారత్ ఫైనాన్షియల్ బిజినెస్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తోంది. ప్రాధాన్యతా రంగాలకిచ్చే రుణాల లక్ష్య సాధనలో ఇండస్‌ఇండ్‌కు ఈ భాగస్వామ్యం గణనీయంగా తోడ్పడుతోంది. ఇండస్ఇండ్తో భాగస్వామ్యం ద్వారా భారత్ ఫైనాన్షియల్ తమ ఖాతాదారులకు మైక్రో రికరింగ్ డిపాజిట్ల సదుపాయం కూడా కల్పిస్తోంది. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐ) చిన్న బ్యాంకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆర్బీఐ నుంచి అనుమతులు రాలేదు. ఇండస్ఇండ్ బ్యాంక్‌కు ప్రయోజనకారి.. సూక్ష్మ రుణాల సంస్థగా బీఎఫ్ఐకి గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా కార్యకలాపాలున్నాయి. దీంతో బీఎఫ్ఐ విలీనంతో ఇండస్‌ఇండ్‌కి గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకుపోయేందుకు వీలు కలగనుంది. డిపాజిట్ల సేకరణతో పాటు రుణాల వితరణ ద్వారా ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడానికి తోడ్పాటు లభిస్తుంది. పైగా సేల్స్ సిబ్బందిపరంగా బీఎఫ్ఐకి గల పటిష్టమైన నెట్‌వర్క్‌తో ఇండస్‌ఇండ్‌కు లాభించగలదు. అదే సమయంలో ప్రాధాన్యతా రంగాల రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియో కూడా పెరగగలదు. తాజా నిబంధనల ప్రకారం పీఎస్ఎల్ సర్టిఫికెట్స్ విక్రయం ద్వారా ఇండస్ఇండ్ కొంత ఫీజు ఆదాయాలని కూడా పెంచుకోవచ్చని జేపీ మోర్గాన్ అనలిస్టులు పేర్కొన్నారు. మొండి బకాయిల ప్రక్షాళన వంటి కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ.. మైక్రోఫైనాన్స్ రంగంలో అసెట్స్‌పై రాబడుల (ఆర్వోఏ) విషయంలో అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండటం ఇండస్‌ఇండ్‌కు కలసి రాగలదని వివరించారు. బ్యాంకింగ్ స్వరూపంలో ఇండస్ఇండ్ కన్నా బీఎఫ్ఐ.. ఆర్వోఏనే అధికంగా ఉండగలదన్నారు. మరోవైపు వచ్చే 3–4 ఏళ్లలో మైక్రోఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రస్తుతమున్న రూ. 3,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నందున ఇండస్‌ఇండ్‌కు ఈ డీల్ ఉపయోగపడగలదని నొమురాకి చెందిన అనలిస్టు ఆదర్శ్ పారస్రాంపూరియా పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం పూర్తయితే.. విలీనానంతరం ఏర్పడే సంస్థలో మైక్రోఫైనాన్స్ రుణాల వాటా మూడు రెట్లు ఎగిసి తొమ్మిది శాతానికి చేరగలదని అంచనా. బీఎఫ్ఐకి రాజకీయపరమైన రిస్కులు తగ్గుదల.. ఇక ఇండస్ఇండ్తో డీల్ సాకారమైతే భారత్ ఫైనాన్షియల్ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గగలవు. ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లపై పరిమితుల సమస్య ఉండదు. అయితే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటివి పాటించాల్సి రావడం కొంత ప్రతికూలాంశం. కానీ, బీఎఫ్ఐకి ప్రస్తుతం 20–25% మేర లిక్విడ్ అసెట్స్ ఉండటం కాస్త కలిసొచ్చే అంశమని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు అల్పేశ్ మెహతా అభిప్రాయపడ్డారు. అలాగే రాజకీయపరమైన రిస్కులు కూడా దానికి తొలిగిపోగలవని ఆయన వివరించారు.