Laser beams
-
కర్నూలులో డీఆర్డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు
కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్ వ్యవస్థను డీఆర్డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్ చేరింది. ఇజ్రాయెల్ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్డీవో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco— DRDO (@DRDO_India) April 13, 2025అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025 -
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్ ఫుల్ వెపన్ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. ఇది భారత్ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్ ఫుల్ గా లేజర్ బీమ్ కూల్చివేయడంతో డీఆర్డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025 -
Indigo: పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు
కోల్‌కతా: బెంగళూరు నుంచి కోల్‌కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్‌పిట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టేక్ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం!
ఆటోమొబైల్స్ రంగంలో సంచలనాలకు నెలవుగా మారిన టెస్లా.. మరో అరుదైన ప్రయత్నంతో వార్తల్లోకి ఎక్కింది. కార్ల అద్దాలను క్లీన్ చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగించబోతోంది. అంతేకాదు ఈ విధానంపై పేటెంట్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తుకు ఇప్పుడు అనుమతి లభించింది. ఎలక్ట్రిట్రెక్ వెబ్‌పోర్టల్ కథనం ప్రకారం.. టెస్లా తన కార్ల విండ్‌షీల్డ్ కోసం లేజర్ లైట్ల సెటప్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా విండ్‌షీల్డ్ వైపర్స్ అవసరమైనప్పుడు నీళ్లు చిమ్మిచ్చి అద్దాల్ని శుభ్రం చేస్తాయి. అయితే ఆ స్థానంలో టెస్లా కార్లకు ‘లేజర్ విండ్‌షీల్డ్ వైపర్స్’ ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఈ వైపర్ సెటప్ కంటికి కనిపించదు. అవసరం అయినప్పుడు మాత్రం లేజర్ కిరణాల్ని వెదజల్లుతుంది. అయితే ఈ లేజర్ బీమ్స్ ప్రభావం డ్రైవర్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి ఏమాత్రం హానికలిగించవని, కేవలం కారు అద్దాలపై మరకలను తొలగించేదిగా మాత్రమే ఉంటుందని టెస్లా ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క విండ్‌షీల్డ్ కోసమే కాదు.. గ్లాస్ ఆర్టికల్ ఉన్న చోటల్లా లేజర్ కిరణాల సాయంతో క్లీన్ చేసే సెటప్‌ను టెస్లా తీసుకురాబోతోంది. నిజానికి పేటెంట్ అప్లికేషన్‌ను 2019 మే నెలలోనే సమర్పించింది. కానీ, యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ మాత్రం ఏడాది ఇప్పుడు.. కేవలం కార్ల వరకే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఈ అనుమతులు లభించగా.. త్వరలో రిలీజ్ కాబోయే కార్ల విషయంలో ఈ సెటప్‌ను తీసుకురాబోతోంది టెస్లా. చదవండి: టెస్లా.. ముందు మేక్ ఇన్ ఇండియా! -
‘స్నైపర్ గన్ కాదు.. మొబైల్ లైటింగ్’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఉల్లంఘనలు జరిగాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాహుల్ గాంధీ భద్రత విషయంలో ఇప్పటికే దాదాపు ఏడు సార్లు ఉల్లంఘనలు జరిగాయని లేఖలో ఆరోపించారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. బుధవారం(నిన్న) రాహుల్ గాంధీ అమేథీలో తన నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తలపై ఆకుపచ్చ రంగు లైట్ కనిపించింది. రెండు సార్లు ఈ లైట్ రాహుల్ గాంధీ తలపై కనిపించడం గమనార్హం. అయితే ఈ లేజర్ లైట్ స్నైపర్ గన్ నుంచి వెలువడిందని కాంగ్రెస్ నాయకులు లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు మాజీ భద్రతా అధికారులు పరిశీలించారని తెలిపారు. వారు కూడా ఈ లైటింగ్ అనేది స్నైపర్ గన్ లాంటి ప్రమాదకర ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ లేఖపై కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, రందీప్ సుర్జేవాలాతో పాటు జైరాం రమేష్ కూడా సంతకం చేశారు. దాంతోపాటు ఇందుకు సంబంధించిన వీడియో ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. అంతేకాక రాహుల్ గాంధీకి పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్నైపర్ నుంచి కాదు.. మొబైల్ నుంచి అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది. ఈ ఘటనపై ఎస్పీజీ డైరెక్టర్‌తో మాట్లాడమని తెలిపింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ లైట్ స్నిఫర గన్ నుంచి రాలేదని.. సెల్‌ఫోన్ నుంచి వచ్చిందని ఎస్పీజీ డైరెక్టర్ చెప్పినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. -
అంతరిక్ష వ్యర్థాలకు లేజర్ల పరిష్కారం!
భూమి చుట్టూ అంతరిక్షంలో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ చెత్తను నాశనం చేసేందుకు చైనా ఓ వినూత్న పద్ధతికి పదును పెడుతోంది. వివిధ దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్ల భాగాలు కొన్ని అక్కడ తిరుగుతూ చికాకు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారుగానీ.. చైనా మాత్రం నేరుగా వాటిని శక్తిమంతమైన లేజర్ కిరణాలతో కాల్చేస్తే పోలా? అంటోంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ పద్ధతిని ఉపయోగించాలంటే ఓ ఉపగ్రహంపై లేజర్ కిరణాలను ఉత్పత్తి చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఉపగ్రమం అంతరిక్షంలోకి చేరిన తరువాత తొలగించాలనుకున్న చెత్తపై ఉపగ్రహాన్ని ఫోకస్ చేస్తారు. కొన్ని నిమిషాలపాటు పరారుణ కాంతి కిరణాలను ఇరవైసార్లు ప్రయోగిస్తారు. దీంతో ఆ చెత్త కాస్తా ప్రమాదం లేని చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. అయితే ఇలా లేజర్ యంత్రాలను అంతరిక్షంలోకి చేరిస్తే భవిష్యత్తులో వీటిని ఆయా దేశాలు భూమ్మీద ఉండే తమ శత్రు దేశాలపైకి ప్రయోగించే అవకాశాలు ఉంటాయని, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహ వ్యర్థాలపైకి లేజర్లను ప్రయోగించడం చాలా కాలంగా ఉన్న ఆలోచనే అయినప్పటికీ ఇటీవలి కాలంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. -
ఈ లేజర్లు చిప్‌లను పరిగెత్తిస్తాయి
వాషింగ్టన్: డేటా ప్రాసెసింగ్ సరికొత్త ఆవిష్కరణ! మైక్రోప్రాసెసర్ల పనితీరును వేగవంతం చేయడానికి శాస్త్రవేత్తలు వాటిలోని సిలికాన్ పొరపైకి చిన్న లేజర్ కిరణాలను పంపించి చేసిన ప్రయోగం విజయవంతమైంది. 30 ఏళ్లుగా ప్రాసెసర్లలోని సిలికాన్ ఉపరితలంపైకి లేజర్ కిరణాలు పంపడానికి చేసిన ప్రయోగాలు ఏవీ సఫలీకృతం కాలేదు. అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న లేజర్ కిరణాలను పంపించి ఈ ప్రయోగం చేసిన కాలిఫోర్నియా వర్సిటీ, బార్బరా వర్సిటీ వారు విజయం సాధించారు. ఇది సమాచార వాహకాల పరిశ్రమకు గొప్ప ఊతమిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ప్రయోగించిన లేజర్ కిరణాలు మామూలు లేజర్ కిరణాల కంటే వెయ్యి రెట్లు చిన్నగా, పది లక్షల రెట్లు సన్నగా ఉంటాయి. -
మైక్రో ఓవెన్లలో ఉండే తరంగాలు?
Civils Prelims Paper - I (Physics) కాంతి (అదృశ్య వికిరణాలు) అతి నీలలోహిత కిరణాలు అతి నీలలోహిత కిరణాలను రిట్టర్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్యం 4000అని నుంచి 100అని వరకు ఉంటుంది.క్వాంటం సిద్ధాంతం ప్రకారం. ఈ కిరణాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అతి నీలలోహిత కిరణాలను దాదాపు అన్ని రకాలైన గాజు పదార్థాలు శోషణం చేసుకుంటాయి. క్వార్ట్జ గాజు ద్వారా ఈ కిరణాలు చొచ్చుకు వెళతాయి. అందువల్ల క్వార్ట్జ గాజుతో తయారైన కటకాలను, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని గుర్తించవచ్చు. అతి నీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి. అనువర్తనాలు: 1. పాలలో, నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేయడానికి 2. ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలంపాటు నిల్వ చేయడానికి ఉదా: బ్రెడ్, పచ్చళ్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాటికి సోడియం బెంజోయేట్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు. 3. వైద్యరంగంలో హానికరమైన బ్యాక్టీరియాను నశింపచేసేందుకు వాడతారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. 4. సహజ, కృత్రిమ దంతాలను వేర్వేరుగా గుర్తించడానికి వాడతారు. 5. కుళ్లిన కోడిగుడ్లను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. 6. తొలిదశలో ఉన్న క్యాన్సర్ గడ్డలను గుర్తించడానికి 7. టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో 8. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడంలో 9. అతినీలలోహిత కిరణాలు మన శరీరంపైన పతనమైనప్పుడు 1ఝఝ లోతుకు చొచ్చుకొని వెళ్లి విటమిన్ ఈ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. 10. వేలిముద్రలను విశ్లేషించడానికి 11. {ధువ పత్రాలు, కరెన్సీ నోట్లు అసలువా, నకిలీవా తేల్చడానికి ఉపయోగిస్తారు. నష్టాలు: సూర్యుని నుంచి వచ్చే మొత్తం కాంతిలో అతి నీలలోహిత కిరణాలు 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కిరణాల శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మానవులపై పతనమైనప్పుడు చర్మ క్యాన్సర్ కలుగుతుంది. ఈ హానికరమైన కిరణాలను భూమి వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కాబట్టి ఈ కిరణాలు భూమిని చేరవు. కానీ క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడి వాటి ద్వారా ఈ కిరణాలు భూమిని చేరుతున్నాయి. కాబట్టి ఈ నష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో జపాన్‌లోని క్యోటోనగరంలో 1996 డిసెంబరులో ప్రపంచ దేశాల సదస్సు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 16న ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని క్యోటో ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 2005 ఫిబ్రవరి 16న అమల్లోకి వచ్చింది. లేజర్ కిరణాలు LASER - Light Amplification by Stimulated Emmision of Radiation. లేజర్ కిరణాలకు సంబంధించిన సూత్రాన్ని 1954లో చార్లెస్ హెచ్టౌన్స ప్రతిపాదించాడు. ఈ సూత్రం ఆధారంగా 1958లో థైడర్మెమన్ అనే శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. లేజర్ కిరణాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. ఘన పదార్థాల్లో రూబిస్ స్ఫటికాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. వాయు పదార్థాల్లో జడవాయువులను (హీలి యం, నియాన్) ఉపయోగించి హెవిజావాన్ అనే అమెరికా శాస్త్రవేత్త లేజర్ కిరణాలను ఉత్పత్తి చేశాడు. ఈ వాయువుల నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: సంబద్ధత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం లాంటివి సమానంగా ఉంటాయి. ఈ లక్షణాన్ని సంబద్ధత అంటారు. ఏకవర్ణీయత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాల తరంగదైర్ఘ్యం ఎల్లప్పుడూ కూడా ఒకేవిధంగా ఉండటం వల్ల ఈ కిరణాల రంగు కూడా ఒకే విధంగా ఉంటుంది. దీన్ని ఏకవర్ణీయత అంటారు. దిశనీయత: లేజర్ కిరణాలు అత్యధిక దూరం రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఈ లక్షణాన్ని దిశనీయత అంటారు. తీవ్రత: ఒక పదార్థం నుంచి ఉత్పత్తి చేసిన లేజర్ కిరణాలు అధిక తీవ్రతను కలిగి ఉంటాయి. ఉపయోగాలు: మానవ అవసరాల మేరకు తగిన శక్తిని కలిగి ఉన్న లేజర్ కిరణాలను ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి. - భూమి నుంచి ఇతర గ్రహాలు, ఉపగ్రహాలకు మధ్య దూరాలను కచ్చితంగా లెక్కించడానికి - భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యను, ఎత్తును తెలుసుకోవడానికి - భూమి ఆత్మభ్రమణ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి - ఒక ఘన పదార్థంలో అణువుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడానికి - భిన్న ఐసోటోపులను గుర్తించి, వాటిని వేరుచేయడానికి - పుప్పొడి రేణువుల కదలికలను అధ్యయనం చేయడానికి - అత్యంత దృఢ పదార్థాలైన వజ్రం, లోహాలు, లోహమిశ్రమాలు, రాళ్లు మొదలైన వాటికి రంధ్రాలను చేయడానికి, కోయడానికి - అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విస్ఫోటనం చెందించడానికి - యుద్ధంలో లక్ష్యాన్ని గురిపెట్టడానికి - పురాతన కట్టడాలు, విగ్రహాలను శుభ్రపరిచేందుకు - సాంస్కృతిక కార్యక్రమాల్లో (లేజర్ షో) బార్‌కోడ్‌లను చదవడానికి స్పష్టమైన ప్రింటింగ్, జిరాక్స్‌ల కోసం ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఉపయోగించే లేజర్ కిరణాలను అర్ధవాహక పదార్థాలైన సిలికాన్, జెర్మేనియం నుంచి ఉత్పత్తి చేస్తారు. - వాహనాల వేగాన్ని లెక్కించడానికి, స్పీడ్‌గన్ అనే కెమెరా, సిడీలు, డీవీడీలు మొదలైన వాటిలో సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి - ఆప్టికల్ ఫైబర్‌లో సమాచార ప్రసారం కోసం - ఎండోస్కోపిక్ విధానంలో - హోలోగ్రఫీ విధానంలో ఒక వస్తువును 3డీ పద్ధతిలో ఫొటో తీయడానికి వాడతారు. - వాతావరణ కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి అంటారు. - రెటీనాపై ఏర్పడే పొరను తొలగించడానికి - గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి - మెదడులో ఏర్పడిన కణతులను తొలగిం చడానికి - సుదూరం ప్రయాణించే రాకెట్లు, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగిస్తారు. లేజర్ కిరణాల ధర్మాలను అధ్యయనం చేసి, వాటిని ఉత్పత్తి చేయడానికి భారత అణుశక్తి సంఘం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డాక్టర్ రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. రేడియో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 1ఝ నుంచి 100ఝ వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. వీటి వేగం శూన్యంలో, గాలిలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఈ తరంగాలను టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారంలో, వాతావరణాన్ని విశ్లేషించ డంలో ఉపయోగిస్తారు. మైక్రో తరంగాలు వీటి తరంగదైర్ఘ్య అవధి 10-6ఝ పరిధిలో ఉంటుంది. మైక్రో తరంగాలు కూడా ఒకరకమైన విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అందువల్ల ఈ కిరణాలు గాలిలో, శూన్యంలో కాంతివేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. మైక్రో తరంగాలను సమాచార రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఒక ప్రదేశాన్ని భౌతికంగా తాకకుండా, దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పద్ధతిని సెన్సింగ్ విధానం అంటారు. మైక్రో ఓవెన్లలో ఆహార పదార్థాలను వేడిచేయడానికి ఈ తరంగాలను వాడతారు. ఆహార పదార్థాలను అలోహ పదార్థాలతో తయారు చేసిన పాత్రల్లో నింపి మైక్రో ఓవెన్లో అమర్చాలి. ఈ మైక్రో తరంగాలు ఆహారపు అణువుల్లోకి చొచ్చుకుపోయి వాటి కంపన పరిమితిని అనేకరెట్లు పెంచుతాయి. అందువల్ల ఈ కంపన శక్తి ఉష్ణశక్తిగా మారడం వల్ల ఆహారపు పదార్థాలు వేడెక్కుతాయి. ఈ మైక్రో ఓవెన్‌ను స్పెన్సర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కిరణాలు కిరణాలను క్రీ.శ. 1895లో రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇతనికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి 1901లో లభించింది. ధర్మాలు - ఉపయోగాలు: ఈ కిరణాల తరంగధైర్ఘ్య అవధి 100అని నుంచి 0.010అని వరకు ఉంటుంది. తరంగధైర్ఘ్యం తక్కువగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. అందువల్ల ఇవి ఒక రకమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు మాత్రమే. ్ఠ-కిరణాల వేగం గాలిలో, శూన్యంలో కాంతివేగానికి (ఇ= 3 ప 108ఝ/ట) సమానంగా ఉంటుంది. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం లేకపోవడం వల్ల విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో వంగి ప్రయాణించకుండా, రుజుమార్గంలో వెళతాయి. ఈ కిరణాలకు ఆవేశం లేకపోవడం వల్ల వీటి అయనీకరణ సామర్థ్యం దాదాపు శూన్యం. ఈ కిరణాలు ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను ప్రభావితం చెందిస్తాయి. కిరణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కఠిన ్ఠ-కిరణాలు: వీటి తరంగ ధైర్ఘ్య అవధి 0.010అని నుంచి 4అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాల శక్తి ఎక్కువగా ఉంటాయి. మెత్తని పదార్థాలు, కఠిన పదార్థాల ద్వారా చొచ్చుకు వెళతాయి. ఈ కిరణాలను కిందివాటిలో ఉపయోగిస్తారు. పెద్ద పైపులు, బాయిలర్స, డ్యాములలో పగుళ్లు, రంధ్రాలను గుర్తించడానికి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దులు, దర్శనీయ స్థలాల వద్ద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయడానికి. మృదు ్ఠ- కిరణాలు: వీటి తరంగదైర్ఘ్య అవధి 4అని100అని వరకు ఉంటుంది. కఠిన ్ఠ-కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాల శక్తి తక్కువగా ఉండి కేవలం మెత్తగా ఉన్న రక్తం, మాంసం ద్వారా మాత్రమే చొచ్చుకొని వెళతాయి. కఠినమైన ఎముకల ద్వారా చొచ్చుకు వెళ్లవు. వైద్యరంగంలో ఈ మృదు ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. జీర్ణాశయానికి సంబంధించి ్ఠ-కిరణాల ఫొటోను తీయడానికి ముందుగా రోగికి Barium Sulphate - Baై4 అనే రసాయన పదార్థాన్ని తాగిస్తారు. ఈ పదార్థం ్ఠ-కిరణాలను జీర్ణాశయంలో కావాల్సిన అవయవాలపై కేంద్రీకృతం చేస్తుంది. కంప్యూటెడ్ టోమాగ్రఫీ స్కానింగ్ (సీటీ స్కానింగ్)లో ్ఠ-కిరణాలను ఉపయోగిస్తారు. వైద్యరంగంలో ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని రేడియో గ్రఫీ, రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అని అంటారు. ్ఠ కిరణాలను ఉపయోగించి పనిచేసే వైద్యుడిని రేడియాలజిస్ట్ అని పిలుస్తారు. కిరణాలను ఉత్పత్తి చేయడానికి కూలిడ్జ నాళాన్ని వాడతారు. దీన్ని సీసంతో నిర్మించిన పెట్టెలో అమర్చుతారు. ఎందుకంటే, సీసం ద్వారా ్ఠ-కిరణాలు చొచ్చుకు వెళ్లవు. విశ్వ కిరణాలు (కాస్మిక్ రేస్) విశ్వంలో ఏదో ఒకచోట జనించిన అత్యంత శక్తివంతమైన కిరణాలు నిరంతరంగా భూమిని చేరుతున్నాయి. వీటిని విశ్వకిరణాలు అంటారు. ఈ కిరణాల ఉనికిని సీటీఆర్ విల్సన్ అనే శాస్త్రవేత్త గుర్తించగా, ప్రయోగాత్మకంగా మిల్లికాన్ కనుగొన్నాడు. ధర్మాలు: విశ్వ కిరణాల్లోని కణాల్లో ముఖ్యమైనవి ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, ప్రోటాన్లు, న్యూ ట్రాన్ల్లు మొదలైనవి. వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు ఉంటాయి. ఒక ప్రదేశంలోని విశ్వకిరణాల ఉనికిని, దిశను తెలుసుకోవడానికి కాస్మిక్ రే టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. భూమి ధ్రువాల వద్ద ఈ కిరణాల తీవ్రత ఎక్కువగా, భూ మధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. విశ్వకిరణాల శక్తి 109్ఛఠి నుంచి 1020్ఛఠి వరకు ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం వీటి తరంగదైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర కిరణాలతో పోల్చినప్పుడు ఈ కిరణాలు అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. విశ్వ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కఠిన కాస్మిక్ కిరణాలు: ఇవి 10 సెం.మీ. మందం కలిగి ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్తాయి. మృదు కాస్మిక్ కిరణాలు: ఈ కిరణాల శక్తి తక్కువగా ఉంటుంది. 10 సెం.మీ. మందం ఉన్న సీసపు దిమ్మ ద్వారా చొచ్చుకు వెళ్లలేవు.