
ఈ లేజర్లు చిప్‌లను పరిగెత్తిస్తాయి
వాషింగ్టన్: డేటా ప్రాసెసింగ్ సరికొత్త ఆవిష్కరణ! మైక్రోప్రాసెసర్ల పనితీరును వేగవంతం చేయడానికి శాస్త్రవేత్తలు వాటిలోని సిలికాన్ పొరపైకి చిన్న లేజర్ కిరణాలను పంపించి చేసిన ప్రయోగం విజయవంతమైంది. 30 ఏళ్లుగా ప్రాసెసర్లలోని సిలికాన్ ఉపరితలంపైకి లేజర్ కిరణాలు పంపడానికి చేసిన ప్రయోగాలు ఏవీ సఫలీకృతం కాలేదు.
అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న లేజర్ కిరణాలను పంపించి ఈ ప్రయోగం చేసిన కాలిఫోర్నియా వర్సిటీ, బార్బరా వర్సిటీ వారు విజయం సాధించారు. ఇది సమాచార వాహకాల పరిశ్రమకు గొప్ప ఊతమిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ప్రయోగించిన లేజర్ కిరణాలు మామూలు లేజర్ కిరణాల కంటే వెయ్యి రెట్లు చిన్నగా, పది లక్షల రెట్లు సన్నగా ఉంటాయి.