silicon
-
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
రోబో సిలికాన్ మరో 9 ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోబో బ్రాండ్‌తో ఇసుక తయారీ, విక్రయంలో ఉన్న రోబో సిలికాన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్, నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు, మంగళూరు, దాద్రిలో మొత్తం 11 ప్లాంటున్నాయి. రెండేళ్లలో మరో 9 తయారీ కేంద్రాలను స్థాపించనున్నట్టు రోబో సిలికాన్ సీఈవో సుమ్నేష్ ఖండెల్వాల్ తెలిపారు. ఫైనాన్స్ హెడ్ అమిత్ జైన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంట్ల రాకతో మరిన్ని నగరాలకు విస్తరించినట్టు అవుతుందని చెప్పారు. ‘ఒక్కో కేంద్రానికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి సెంటర్లో 35–40 మందికి ఉపాధి లభిస్తుంది. 2017–18లో రూ.125 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రెండింతలు ఆశిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సహజ ఇసుక విక్రయాలపై నియంత్రణ ఉంది. దీంతో రాతి ఇసుకకు మంచి డిమాండ్ ఉంటోంది. పైగా నది ఇసుకతో పోలిస్తే రాతి ఇసుక ధర ప్రాంతాన్నిబట్టి 40–50 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీ విక్రయాల్లో 50 శాతం ఒక్క హైదరాబాద్ మార్కెటే కైవసం చేసుకుంది’ అని వివరించారు. రోబో సిలికాన్‌లో ట్రూ నార్త్‌గా పేరు మార్చుకున్న ఇండియా వాల్యూ ఫండ్‌కు 77 శాతం వాటా ఉంది. 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
నానో కణాలతో సూపర్‌బగ్స్‌కు చెక్!
ప్రపంచంలో పెరిగిపోతున్న యాంటీ బయోటిక్ నిరోధకతను ఎదుర్కొనేం దుకు నానోటెక్నాలజీ ఉప యోగపడు తుందంటున్నారు శాస్త్రవేత్తలు. నిరోధ కత పెంచుకున్న వాటిని సూపర్ బగ్స్ అంటారని తెలిసిందే. సిలికాన్ నానో కణాల్లో బంధించిన యాంటీబ్యాక్టీరి యల్ పెప్టైడ్లు నిరోధకత పెంచుకున్న గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాను గణనీయంగా తగ్గించినట్లు వీరి అధ్య యనాల్లో తేలింది. సాధారణ బ్యాక్టీరియా కణాల్లో ఒక చర్మం మాత్రమే ఉంటే.. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో 2 ఉంటాయి. ఫలితంగా మందులు వీటిని చంపలేవు. ఎంఐటీతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల శాస్త్రవే త్తలు నానో కణాలతో ప్రయోగాలు చేశారు. ఊపిరితిత్తుల్లోకి చేరిన న్యు మోనియా కారక సూడోమోనాస్ ఎరుగినోసా బ్యాక్టీరియాపైకి నానో కణాలను ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు కనిపించాయని.. ఇదే విధానాన్ని క్షయ తదితర ప్రాణాం తక వ్యాధుల చికిత్సలోనూ వాడొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ సంగీతా భాటియా తెలిపారు. కొన్నేళ్ల కింద తాము కేన్సర్ మందులను కణితులున్న ప్రాంతాలకు చేర్చేం దుకు ఇదే విధానాన్ని అభివృద్ధి చేశామని.. నిరోధక తను ఎదుర్కొనేందుకు దీన్నే ఉపయోగించామన్నారు. -
ఈ లేజర్లు చిప్‌లను పరిగెత్తిస్తాయి
వాషింగ్టన్: డేటా ప్రాసెసింగ్ సరికొత్త ఆవిష్కరణ! మైక్రోప్రాసెసర్ల పనితీరును వేగవంతం చేయడానికి శాస్త్రవేత్తలు వాటిలోని సిలికాన్ పొరపైకి చిన్న లేజర్ కిరణాలను పంపించి చేసిన ప్రయోగం విజయవంతమైంది. 30 ఏళ్లుగా ప్రాసెసర్లలోని సిలికాన్ ఉపరితలంపైకి లేజర్ కిరణాలు పంపడానికి చేసిన ప్రయోగాలు ఏవీ సఫలీకృతం కాలేదు. అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న లేజర్ కిరణాలను పంపించి ఈ ప్రయోగం చేసిన కాలిఫోర్నియా వర్సిటీ, బార్బరా వర్సిటీ వారు విజయం సాధించారు. ఇది సమాచార వాహకాల పరిశ్రమకు గొప్ప ఊతమిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ప్రయోగించిన లేజర్ కిరణాలు మామూలు లేజర్ కిరణాల కంటే వెయ్యి రెట్లు చిన్నగా, పది లక్షల రెట్లు సన్నగా ఉంటాయి. -
‘సూపర్’ గ్రహాలపై జీవ సమ్మేళనాలు!
మాస్కో: సౌర కుటుంబం అవతల సూపర్ ఎర్త్‌గా పిలిచే గ్రహాల (భూమికన్నా ఐదు నుంచి పది రెట్లు పెద్దవి)పై జీవానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాస్కో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్ హెడ్ ఆర్టెమ్ ఒగనోవ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై పరిశోధన చేశారు. ‘సూపర్’ గ్రహాల్లో అత్యధిక పీడనం ఉంటుంది. దీంతో సిలికాన్, ఆక్సిజన్, మెగ్నీషియం మూలకాల మధ్య రసాయన చర్యలు జరిగి సమ్మేళనాలు ఏర్పాడతాయని, ఈ పరిస్థితులు జీవం మనుగడకు అనుకూల పరిస్థితిని కల్పిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. -
సిలికాన్ తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత
అధికారయంత్రాంగం పట్టించుకోకున్నా గ్రామస్తులే అప్రమత్తమయ్యారు. తీరప్రాంతం నుంచి అక్రమంగా సిలికాన్‌ను తరలించుకుపోతున్న లారీలను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిల్లకూరు మండలంలో సముద్ర తీరం ప్రాంతంలోని ఇసుక నుంచి సిలికాన్‌ను వేరు చేసి కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై సమీప చింతవరం గ్రామస్తులు సోమవారం ఉదయం ఖనిజంతో వెళ్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు లారీలను సీజ్ చేశారు. -
‘నైట్ లైఫ్’ పెంపు
సాక్షి, బెంగళూరు : పాశ్చాత్య పోకడలకు పోతున్న ఉద్యాన నగరిలో ’రాత్రి జీవనాన్ని’ (నైట్ లైఫ్) పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో నైట్ లైఫ్‌ను విస్తరించాలని ఐటీ తదితర రంగాల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని దీనికి ససేమిరా అంటూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నైట్ లైఫ్‌ను కోరుకునే టెక్కీలు, ప్రవాసుల మనసు గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. నైట్ లైఫ్ గడువును విస్తరిస్తామని గత శాసన సభ ఎన్నికల సందర్భంగా అనేక పార్టీలు మేనిఫెస్టోల్లో సైతం హామీలు గుప్పించాయి. ప్రస్తుతం రాత్రి 11 గంటల తర్వాత నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బులను మూసి వేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఒంటి గంట వరకు పొడిగించాలని డిమాండ్లు ఉన్నాయి. ఆదివారాల్లో మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాత్రి పూట కుటుంబాలతో హాయిగా రెస్టారెంట్లుకు వెళ్లే అవకాశమే లేనందున, సమయాన్ని పొడిగించాలనేది ప్రధాన డిమాండ్. నగరానికి చెందిన యువ మంత్రి దినేశ్ గుండూరావు సైతం నైట్ లైఫ్ విస్తరణ పట్లే మొగ్గు చూపుతున్నారు. ఇతర అంతర్జాతీయ నగరాల్లాగే బెంగళూరునూ పరిగణించాలని ఆయన సూచిస్తున్నారు. అయితే దీనిపై ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. నగరానికే చెందిన మరో మంత్రి కేజే. జార్జ్ కనీసం రెస్టారెంట్లకైనా సమయాన్ని పొడిగించాలని సూచిస్తున్నారు. ఆయన స్వయంగా హోం శాఖను నిర్వహిస్తున్నందున, బార్లు, పబ్బుల విషయంలో గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. ఎందుకంటే...పోలీసు శాఖ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పాలక బీజేపీ నైట్ లైఫ్ విస్తరణకు గట్టి హామీ ఇచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసుల ఓట్లను కొల్లగొట్టడమే ఈ హామీ ఉద్దేశమనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీజేపీ పంథాలోనే యోచిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయానికి రాకున్నప్పటికీ, చట్టాన్ని మార్చాలని ప్రభుత్వానికే చెందిన టూరిజం విజన్ గ్రూపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది. రాత్రి జీవనం 11 గంటలకే ముగియడంతో గత ఐదు నుంచి ఏడేళ్లలో ఫిలిప్ఫైన్స్ రాజధాని మనీలాకు మనం దాదాపు 50 వేల ఉద్యోగాలను పోగొట్టుకున్నామని విజన్ గ్రూపు అధిపతి టీవీ. మోహన్‌దాస్ పాయ్ ఓ సందర్భంలో చెప్పారు. ఆహార పదార్థాలు లభ్యమయ్యే రెస్టారెంట్లు, షాపింగ్ కోసం దుకాణాలను రాత్రి ఒంటి గంట వరకు తెరచి ఉంచాలని తాము ప్రభుత్వానికి సూచించామని ఆయన తెలిపారు. అయితే బార్లు, పబ్‌ల విషయంలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 22 శాతం సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తాము, రాత్రి జీవనాన్ని విస్తరించడం ద్వారా తలెత్తే శాంతి భద్రతల సమస్యను ఎలా పరిష్కరించాలని ప్రశ్నిస్తున్నారు. జనం రోడ్లపై తిరుగుతుంటే నేరాలకు అవకాశం ఉండదని కొందరు వాదిస్తున్నప్పటికీ, రాత్రి పూట ఈ వాదన పనికి రాదని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెబుతున్నారు.