నానో కణాలతో సూపర్‌బగ్స్‌కు చెక్!
ప్రపంచంలో పెరిగిపోతున్న యాంటీ బయోటిక్ నిరోధకతను ఎదుర్కొనేం దుకు నానోటెక్నాలజీ ఉప యోగపడు తుందంటున్నారు శాస్త్రవేత్తలు. నిరోధ కత పెంచుకున్న వాటిని సూపర్ బగ్స్ అంటారని తెలిసిందే. సిలికాన్ నానో కణాల్లో బంధించిన యాంటీబ్యాక్టీరి యల్ పెప్టైడ్‌లు నిరోధకత పెంచుకున్న గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాను గణనీయంగా తగ్గించినట్లు వీరి అధ్య యనాల్లో తేలింది. సాధారణ బ్యాక్టీరియా కణాల్లో ఒక చర్మం మాత్రమే ఉంటే.. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో 2 ఉంటాయి. ఫలితంగా మందులు వీటిని చంపలేవు.
ఎంఐటీతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల శాస్త్రవే త్తలు నానో కణాలతో ప్రయోగాలు చేశారు. ఊపిరితిత్తుల్లోకి చేరిన న్యు మోనియా కారక సూడోమోనాస్ ఎరుగినోసా బ్యాక్టీరియాపైకి నానో కణాలను ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు కనిపించాయని.. ఇదే విధానాన్ని క్షయ తదితర ప్రాణాం తక వ్యాధుల చికిత్సలోనూ వాడొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ సంగీతా భాటియా తెలిపారు. కొన్నేళ్ల కింద తాము కేన్సర్ మందులను కణితులున్న ప్రాంతాలకు చేర్చేం దుకు ఇదే విధానాన్ని అభివృద్ధి చేశామని.. నిరోధక తను ఎదుర్కొనేందుకు దీన్నే ఉపయోగించామన్నారు.