అధికారయంత్రాంగం పట్టించుకోకున్నా గ్రామస్తులే అప్రమత్తమయ్యారు. తీరప్రాంతం నుంచి అక్రమంగా సిలికాన్‌ను తరలించుకుపోతున్న లారీలను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిల్లకూరు మండలంలో సముద్ర తీరం ప్రాంతంలోని ఇసుక నుంచి సిలికాన్‌ను వేరు చేసి కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై సమీప చింతవరం గ్రామస్తులు సోమవారం ఉదయం ఖనిజంతో వెళ్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు లారీలను సీజ్ చేశారు.
సిలికాన్ తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత
Published Mon, Sep 21 2015 10:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement