Data processing
-
ఏఐకి నాలుగు సూత్రాలు
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం నాలుగు సూత్రాలను అనుసరించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. ఆ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సదస్సులో ఏఐ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలు దేశాల్లో భిన్నమైన నిబంధనలు, ఆంక్షలు ఉంటే.. ఏఐ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు 97 శాతం దిగివచ్చిందని, ఇది కృత్రిమ మేధ అభివృద్ధికి అద్భుతమైన ఊతమిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇది ఏఐ ఆవిష్కరణల స్వర్ణయుగమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండే ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సుందర్ పిచాయ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘‘కృత్రిమ మేధ, దాని అప్లికేషన్ల గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా టెక్నాలజీతో ప్రయోజనం పొందేందుకు, జీవితాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుంది. నేను భారత్‌లోని చెన్నైలో పెరిగాను. అప్పట్లో ప్రతి కొత్త టెక్నాలజీ ఇంటి వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. అందులో రోటరీ ఫోన్ కూడా ఒకటి. దానికోసం మేం ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ ఫోన్ మా జీవితాలను మార్చేసింది. అప్పట్లో మా అమ్మకు చేసిన రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి నేను నాలుగు గంటల పా టు ప్రయాణం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు అంతదూరం వెళ్లినా.. ‘రిపోర్ట్ సిద్ధంగా లేదు. రేపు రండి’అని ఆస్పత్రివాళ్లు చెప్పేవారు. అదే ఫోన్ వచ్చాక.. కేవలం ఒక్క కాల్‌తో పని అయిపోయింది.మన జీవితాల్లో గణనీయమైన మార్పు రాబోతోందిసాంకేతికత చూపిన సానుకూల ప్రభావాన్ని గమనించాను. అదే నన్ను యూఎస్ వరకు నడిపించింది. గూగుల్ అనే స్టార్టప్ కంపెనీ వద్దకు చేర్చింది. ముగ్గురు గూగుల్ సహోద్యోగులు నోబెల్ అందుకోవడాన్ని, డ్రైవర్ లెస్ కారులో నా తల్లిదండ్రులను తీసుకువెళ్లడాన్ని ఆనాడు నేను ఊహించలేదు. వీటిని సాకారం చేసినది ‘కృత్రిమ మేధ(ఏఐ)’సాంకేతికతే. దీనిలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అయినా ఏఐ మన జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తోంది. పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచి్చనప్పటి కంటే ఈ మార్పు మరింత పెద్దదిగా, ప్రభావవంతంగా ఉండబోతోంది.ఏడాదిన్నరలో 97 శాతం ఖర్చు తగ్గింది..డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు గత 18 నెలల్లో ఏకంగా 97 శాతం దిగి వచ్చింది. పది లక్షల టోకెన్ల (డేటా ప్రాసెసింగ్ యూనిట్) డేటాను ప్రాసెస్ చేయడానికి అయిన ఖర్చు నాలుగు డాలర్ల (సుమారు రూ.350) నుంచి 13 సెంట్ల (రూ.11)కు దిగి వచ్చింది. అంటే ఇంతకుముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను, అవకాశాలను, ఆర్థిక అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంటుంది. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకతను పెంచుతుంది. ఏఐలో గూగుల్ పెట్టుబడి..ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, మార్చడానికి గూగుల్ సంస్థ దశాబ్దకాలం నుంచి ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని సమాచారాన్ని నిర్వహించడంతోపాటు అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమని గుర్తించాం. ఇప్పుడు జనరేటివ్ ఏఐ విప్లవానికి మార్గం వేసిన ఆవిష్కరణలను రూపొందించాం. ఏఐ కోసం ప్రత్యేకమైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్’చిప్స్‌ను అభివృద్ధి చేశాం. టెక్స్టŠ, ఇమేజ్, వీడియో, ఆడియో, కోడ్ ఇలా అన్నిరకాల సమాచారాన్ని ప్రాసెస్ చేయగల ‘జెమిని’వంటి ఏఐ మోడళ్లను దీనితో వినియోగించుకోగలం. ఎన్నో అంశాల్లో ప్రజలకు పూర్తి సహాయకారిగా ఉండే అప్లికేషన్లను రూపొందిస్తున్నాం. 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్న గూగుల్ మ్యాప్స్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి ఏడు ఉత్పత్తులను మా కృత్రిమ మేధ ఆవిష్కరణల సాయంతో అభివృద్ధి చేశాం.సైన్స్, ఆవిష్కరణలకు ఏఐ సాయం.. వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫాఫోల్డ్ను రూపొందించాం. 2021లో దానిని సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది పరిశోధకులు మలేరియా కొత్త వ్యాక్సిన్లు, కేన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్‌ను అరగదీసే ఎంజైమ్‌లను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఆల్ఫాఫోల్డ్ ఆధారంగా ఏర్పాటైన ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్.. ఔషధాల రూపకల్పన, చికిత్సలు విజయవంతం చేయడం కోసం మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు కొత్త ఔషధాలను కనుగొనడానికి, ఎలక్ట్రిక్ కార్ల కోసం మరింత సమర్థవంతమైన బ్యాటరీలను రూపొందించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సాయపడుతోంది. ఏఐ తర్వాత రాబోతున్న అతిపెద్ద మార్పు క్వాంటమ్ కంప్యూటింగ్.ఇది ఆవిష్కరణల స్వర్ణయుగం..ఇదొక చరిత్రాత్మక క్షణం. ఇది ఆవిష్కరణల స్వర్ణయుగానికి నాంది. కానీ దీని ఫలితాలు కచ్చితమని చెప్పలేను. అయితే ప్రతి తరం కూడా కొత్త సాంకేతికత వల్ల తర్వాతి తరం పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతుంది. కానీ ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తోంది. ఏఐతో జీవితాలను మెరుగుపరచుకోవడానికి మనకు ఒక తరంలో ఒకసారే అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.సమాజానికి ఏఐతో సమకూరుతున్న ప్రయోజనాలెన్నో..కృత్రిమ మేధతో సమాజానికి ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ప్రవేశపెట్టిన కొత్తలో కొన్ని భాషలే ఉన్నాయి. ఏఐ వచ్చాక ఈ ప్రయోజనం మరింత పెరిగింది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి గత ఏడాది 50కోట్ల మందికి పైగా మాట్లాడే 110కి పైగా కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్‌లేట్‌కు జోడించాం. 60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. ఏఐతో ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు ఎన్నో. ప్రమాదకరమైన కేన్సర్లకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించే అంశంలో ఏఐ సాయం తీసుకుంటున్నాం. భారత్, థాయ్‌లాండ్‌లో స్థానిక సంస్థలతో కలసి 60లక్షల మందికి ఉచితంగా డయాబెటిక్ రెటినోపతికి ఏఐ స్క్రీనింగ్ చేశాం. ఏఐ ఆధారిత ఫ్లడ్హబ్తో 100 కంటే ఎక్కువ దేశాల్లో 70 కోట్ల మందికి వరదల సమాచారాన్ని ముందే అందించగలుగుతున్నాం. ఇలా ఏఐతో ప్రయోజనకరమైన సాంకేతికతలు ఎన్నో వచ్చాయి.ఏఐ శక్తిని వెలికితీయడానికి ఏం చేయాలి?కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వెలికితీసి, సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టాలి.» మొదటిది... ఆవిష్కరణకర్తలు, వాటిని అనుసరించేవారితో ఎకోసిస్టమ్ రూపొందించాలి. » రెండోది.. ఏఐ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 300 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 26,025 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. » మూడోది.. వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం... యూరప్‌లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. »నాలుగోది.. సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. అదే సమయంలో సమాచార కచ్చితత్వం, వాస్తవాలు, టెక్నాలజీ దురి్వనియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ... ఈ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా.. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ఆటంకం కలుగకుండా చూసుకుంటూ, ఏఐతో సమస్యలను గుర్తించాలి. కొత్త చట్టాలు తేవడం కంటే.. ఇప్పుడున్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకమన్నది గుర్తుంచుకోవాలి. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. -
పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! పరమశివుని పేరుతో పరమ్ రుద్ర పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి. నవ్యావిష్కరణకు రాచబాటలు యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. అర్క, అరుణిక పనేంటి? వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. ఏఏ పనుల్లో వాడతారు? → వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు. → పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు. → వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. → సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. → ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు. → మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్రుద్రను ఏర్పాటుచేశారు. → దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇన్ఫీ నుంచి ప్రైవేట్ ‘5జీ సర్వీసులు’
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్ 5జీ–యాజ్–ఎ–సర్వీస్‌ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీ, విశ్వసనీయ వైర్లెస్ కనెక్టివిటీ లభించగలదని సంస్థ తెలిపింది. డేటా ప్రాసెసింగ్‌కు పట్టే వ్యవధిని కుదించడం ద్వారా నెట్‌వర్క్‌లో జాప్యాన్ని తగ్గించగలిగే మల్టీ–యాక్సెస్ ఎడ్జ్ కంప్యూటింగ్ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నట్లు ఇన్ఫీ తెలిపింది. -
పదో తరగతి విద్యార్థుల డేటా తయారీ పదిలం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి విద్యార్థుల డేటా తయారీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుల పర్వం దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాలో 589 ఉన్నత పాఠశాలల్లో 30214 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందు లో ప్రభుత్వ బడుల నుంచి 22979 మంది, ప్రైవేటు స్కూల్స్ నుంచి 7,235 మంది విద్యార్థులు ఉన్నారు. పక్కాగా, పారదర్శకంగా ఉండేందుకు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మొదలుకానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాతోపాటు వారి వ్యక్తిగత సమాచారం పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే భవిష్యత్‌లో విద్యార్థుల మార్క్స్ మెమోలో తలెత్తే తప్పులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యులని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాఠశాల విద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. నామినల్స్ సవరణకు అవకాశం పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు ప్రభ్వుతం సన్నద్ధమైంది. దీంతో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, మీడియం, వారి ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, పుట్టుమచ్చలు, మొ దటి, ద్వితీయ భాష, తదితర సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. దీంతో ఒకవేళ పొరపాటున కంప్యూటర్లో డేటానమోదు సమయంలో తలెత్తిన దోషాలు, తప్పుల సవరణకు ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందుకు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ‘ఎడిట్’ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే పీహెచ్సీ విద్యార్థుల సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంబంధిత సెక్షన్లో ఒరిజినల్, జిరాక్స్ కాపీలను ఈ నెల 25వ తేదీలోగా తీసుకువచ్చి ధ్రువీకరించుకుని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు, దోషాలు ఉంటే వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. హెచ్ఎంల లాగిన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో విద్యార్థుల డేటాలో ఉండే తప్పులకు హెచ్ఎంలే బాధ్యులవుతారు. ఒకటికి రెండు సార్లు విద్యార్థుల డేటాను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – గార పగడాలమ్మ, డీఈఓ శ్రీకాకుళం -
మొదటికొచ్చిన ‘డేటా’ బిల్లు
పార్లమెంటు కారిడార్‌లో దాదాపు దశాబ్దకాలంగా వినబడుతున్న డేటా పరిరక్షణ బిల్లు వ్యవహారం మొదటికొచ్చింది. పాతికేళ్లుగా భౌగోళిక సరిహద్దులకు అతీతంగా సమాచార ప్రవాహం నిరంతరం దేశంలోకి వస్తూ పోతూ ఉంది. పౌరుల భద్రతకూ, వారి వ్యక్తిగత గోప్యతకూ కలిగే ముప్పు గురిం చిన భయాందోళనలు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అవి కేవలం భయాందోళనలు కాదు, చేదు నిజాలని రుజువవుతూనే ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఎందుకో, ఏమిటో చెప్పకుండా కోట్లాదిమంది ఖాతాదార్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని రాబడు తున్నాయి. అలా సేకరించిన సమాచారాన్ని ఫేస్బుక్ సంస్థ 2015లో కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) సంస్థకు చడీచప్పుడూ లేకుండా అమ్ముకున్న సంగతి తెలియంది కాదు. కానీ మనకు డేటా పరిరక్షణ కోసం ఇంతవరకూ చట్టం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లు తెస్తామని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే ఆధార్ పేరుతో దేశ పౌరుల డేటా సేకరణ మొదలు పెట్టారు. గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి, అందుకోసం చట్టం అవసరమని సూచించి ఈ నెల 24కు అయిదేళ్లవుతోంది. అయినా చట్టం సాధ్యపడలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏడాదిపాటు అనేకమంది నిపుణులనూ, సంస్థలనూ సంప్రదించి, విదేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్య యనం చేసి ముసాయిదా బిల్లు సమర్పించి నాలుగేళ్లు కావస్తోంది. అనంతరం 2019 డిసెంబర్లో కేంద్రం పార్లమెంటులో బిల్లుకూడా ప్రవేశపెట్టింది. తీరా మూడేళ్లు గడిచాక ఇప్పుడు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. చెప్పాలంటే డేటా పరిరక్షణ బిల్లుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం తన సహజ ధోరణికి భిన్నంగా ఈ బిల్లు గురించి ఉభయ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ)కి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ కమిటీ గత రెండేళ్లుగా క్షుణ్ణంగా చర్చించి బిల్లుకు 81 సవరణలు సూచించింది. అరడజను సిఫార్సులు చేసింది. ఫలితంగా బిల్లు పరిధి పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కాస్తా విస్తృత డేటా పరిరక్షణగా మారింది. సైబర్ ప్రపంచంలో ప్రవహించే డేటాను వ్యక్తిగత, వ్యక్తిగతేతర సమా చారంగా వర్గీకరించారు. స్మార్ట్ ఫోన్లలో ‘విశ్వసనీయమైన’ హార్డ్‌వేర్‌ను మాత్రమే వాడాలన్న నిబంధన, సామాజిక మాధ్యమ సంస్థల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు, మధ్యవర్తులుగా వ్యవహరించని సామాజిక మీడియా సంస్థల్లో వచ్చే వార్తలకూ, వ్యాఖ్యలకూ ఆ సంస్థలను బాధ్యత వహించేలా చేయడం వంటివి సిఫార్సుల్లో ఉన్నాయి. వీటిలో కొన్నిటికి కొత్తగా తీసుకురాబోయే బిల్లులో చోటిచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చిపడే డేటాను నిక్షిప్తం చేయడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సివుంది. ఈ దేశంలో రూపొందే సమస్త డేటానూ ఇక్కడి సర్వర్లలోనే సామాజిక మాధ్యమ సంస్థలు భద్రపరచాలని ప్రభుత్వం మొదట్లో చెప్పినా వ్యక్తుల సున్నిత సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడ సర్వర్లలోనే ఉంచాలని పాత బిల్లు నిర్దేశించింది. ఇప్పుడు దాన్ని సవరించి భారత ప్రభుత్వం విశ్వసించే మరేదైనా ప్రాంతంలో కూడా ఈ సర్వర్లు ఉండొచ్చని, నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని నిబంధన విధించవచ్చంటున్నారు. ఎవరికైనా క్షణంలో అందుబాటులోకొచ్చే సైబర్ ప్రపంచంలో వ్యక్తిగత డేటా పరిరక్షణ కత్తి మీద సాము వంటిదే. పౌరుల గోప్యతకు సామాజిక మాధ్యమాల వల్ల మాత్రమే కాదు... ప్రభుత్వాల నుంచి సైతం ముప్పువాటిల్లితే పౌరులకుండే ఉపశమనం ఏమిటన్నది కూడా బిల్లు చెప్పగలగాలి. పౌరుల ప్రాథమిక హక్కుతో ముడిపడి ఉండే డేటా పరిరక్షణ వంటి అంశాల్లో పాలకులు ఉదారంగా ఉంటారనుకోవడం అత్యాశ. వ్యక్తుల డేటాపై ఏదోమేర ఆధిపత్యం, నియంత్రణ సాధించేందుకు వారు ప్రయత్నిస్తారు. 2019 నాటి బిల్లు వాలకాన్ని గమనించిన జస్టిస్ శ్రీకృష్ణ ‘నా ముసాయిదాకూ, బిల్లుకూ పోలికే లేద’ని వ్యాఖ్యానించిన సంగతీ, ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం డేటాపై సమస్త అధికారాలనూ దఖలు పరుచుకుందని చెప్పడమూ ఎవరూ మరిచిపోరు. డేటా పరిరక్షణ అథారిటీ(డీపీఏ) చైర్పర్సన్ ఎంపిక కోసం ఏర్పాటయ్యే కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసే న్యాయమూర్తి ఆధ్వర్యం వహించాలన్న నిబంధనకు కూడా మంగళం పాడారు. వీటన్నిటికీ మించి అసలు గత మూడేళ్లలో సైబర్ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ–కామర్స్, డిజిటల్ మార్కెట్, డిజిటల్ సర్వీసులు వగైరావెన్నో వచ్చాయి. పాత బిల్లు వీటిలో చాలా అంశాలను స్పృశించలేదు. వీటన్నిటికీ ఒక్క చట్టంలో చోటీయడం అసాధ్యమేకాక, అనవసరం కూడా. అందుకోసం యూరప్ దేశాల మాదిరిగా విడివిడి చట్టాలు అవసరం. లేనట్టయితే అయోమయం నెలకొంటుంది. ఎటూ కొత్తగా బిల్లు తెస్తున్నారు గనుక పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా దాన్ని రూపొందించాలని కేంద్రం గుర్తించడం అవసరం. చట్టం దుర్వినియోగం కాకుండా, అస్పష్టతకు చోటీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ ప్రపంచం పౌరులకు సురక్షిత ప్రదేశంగా మారుతుంది. -
భారతీయులకు గుడ్‌న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ మంచి నివేదిక ఇచ్చినట్టు అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘‘బిల్లులోని 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించింది. అలాగే, కొత్తగా మరో 12 ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లు తీసుకురావడం మినహా మారో మార్గం లేదు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడకుండా కొత్త చట్టాన్ని తయారు చేశాం. పార్లమెంటు ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలోనే కొత్త చట్టాన్ని అనుమతి కోసం తీసుకొస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త బిల్లు ఆమోదం పొందొచ్చు’’ అని మంత్రి వివరించారు. ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమగ్రమైన కార్యాచరణతో వస్తామని ప్రకటించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన డేటా గోప్యత, అత్యాధునిక సాంకేతికతలు, డేటా గవర్నెన్స్ కార్యాచరణ ఇందులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి: నాస్కామ్ వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందు, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న డేటా గోప్యత చట్టాలను అధ్యయనం చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ సూచించింది. అలాగే, కిందటి బిల్లుపై వచ్చినన అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం డేటా రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో నాస్కామ్ కీలక సూచనలు చేయడం గమనార్హం. గత బిల్లులో దేశాల మధ్య డేటా బదిలీకి సంబంధించి కఠినమైన నిబంధనల పట్ల దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు గగ్గోలు పెట్టడం తెలిసిందే. డేటా ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయ మార్గంలో వృద్ధి చెందేలా అవకాశం కల్పించాలని నాస్కామ్ కోరింది. సంప్రదింపుల్లో భాగం కల్పించండి.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును భారత్ వెనక్కి తీసుకోవడాన్ని అంతర్జాటీయ టెక్నాలజీ దిగ్గజాలు అభినందించాయి. కొత్త బిల్లుకు సంబంధించి చర్చల్లో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెరికాకు చెందిన ఐటీఐ కోరింది. ఇందులో గూగుల్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ‘డిజిటల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి సమగ్రమైన న్యాయ కార్యాచరణను (కొత్త చట్టం) తిరిగి పరిశీలించే విషయంలో బలమైన భాగస్వామ్యుల సంప్రదింపులకు అవకాశం కలి్పంచాలనే ప్రణాళికను ఐటీఐ స్వాగతిస్తోంది’అని ఐటీఐ కంట్రీ మేనేజర్ (భారత్) కుమార్‌దీప్ తెలిపారు. ఇది కూడా చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్... -
‘డేటా రక్షణ’ ముసాయిదా సిద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు నివేదికను అందజేసింది. డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు. -
‘పబ్లిక్ సర్వీస్’కు పరీక్ష!
ఇందులోనూ నోటిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది 25 మందే.. సొంత డేటా సెంటర్ లేదు.. ఏర్పాటు చేసుకుందామనుకున్నా స్థలం లేదు.. ఇదీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దుస్థితి. లక్షలాది మంది ఉద్యోగ అభ్యర్థులతో ముడిపడిన ఈ సంస్థ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్నే ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించే ఐటీ సెంటర్ లేక తంటాలు పడుతోంది. ఏర్పాటై మూడేళ్లవుతున్నా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది. 240 మంది ఉద్యోగులు కావాలంటూ టీఎస్పీఎస్సీ ఏడాది కిందే ప్రభుత్వానికి రాసినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ఐటీ సెంటరైనా ఏర్పాటు చేసుకుందామంటే ఏపీపీఎస్సీ కొర్రీలు పెడుతోంది. తమ భవనంలోనే మూడు అంతస్తులు ఖాళీగా ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. సొంత డేటా ప్రాసెసింగ్ సెంటర్ లేక.. ఆన్లైన్ ప్రాసెస్ ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించి.. అక్కడి సిబ్బంది చేసే పొరపాట్లతో టీఎస్పీఎస్సీ అభాసు పాలవుతోంది. విభజన నాటి నుంచే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తయిన కొద్ది నెలల తరువాత తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసింది. అప్పటి ఏపీపీఎస్సీలోని 400 మంది అధికారులు, సిబ్బందిలో 110 మందిని టీఎస్పీఎస్సీకి కేటాయించారు. ఇందులోనూ అధికారి స్థాయి పోస్టుల కంటే నాలుగో తరగతి సిబ్బంది పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలుత నియామకాలేవీ పెద్దగా చేపట్టకపోవడంతో ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ 2015 డిసెంబర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, పరీక్షల ప్రక్రియలు వేగం పుంజుకోవడంతో సిబ్బంది కోసం ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టింది. చివరకు ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పరిశీలన జరిపి.. టీఎస్పీఎస్సీలో కనీసం 350 మంది ఉద్యోగులు ఉండాలని, మరో 240 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. వాస్తవానికి టీఎస్పీఎస్సీకి 240 పోస్టులు ఇవ్వలేమని.. 95 పోస్టులను మాత్రమే ఇస్తామని జీఏడీ, ఆర్థిక శాఖ అధికారులు మౌఖికంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఈ మేరకు పోస్టులైనా మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో కేవలం 25 మంది వరకున్న అధికారులు, సిబ్బందే మొత్తం నోటిఫికేషన్ల ప్రక్రియలను చూసుకోవాల్సి వస్తోంది. సీజీజీ పొరపాట్లతో తలనొప్పులు సిబ్బంది కొరత ఓ వైపు వేధిస్తుంటే.. అభ్యర్థుల డేటా ప్రాసెసింగ్ చేస్తున్న సీజీజీలోని కొందరు సిబ్బంది తప్పులు టీఎస్పీఎస్సీ తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా 2011 గ్రూప్–1 పోస్టింగ్‌ల విషయంలో సీజీజీ సిబ్బంది చేసిన తప్పుల కారణంగా టీఎస్పీఎస్సీ అభాసుపాలైంది. అందులో మెరిట్ అభ్యర్థులకు పోస్టులు రాకపోవడం, అనర్హులు ఎంపిక కావడం, తక్కువ మెరిట్ ఉన్న వారికి ప్రాధాన్య పోస్టులు రావడం వంటివి జరిగాయి. చివరికి ఆ డేటా మొత్తాన్ని టీఎస్పీఎస్సీ పరిశీలించి, తప్పిదాన్ని సవరించింది. ఇక గురుకుల లెక్చరర్ల పోస్టుల మెయిన్ పరీక్షకు 1ః15 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లడం, ఉపాధ్యాయ నియామక పరీక్ష కేంద్రాల కేటాయింపులో పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలూ తలెత్తాయి. ఐటీ సెంటర్‌కు స్థల సమస్య డేటా ప్రాసెసింగ్ సమస్యల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సొంతంగా ఆన్లైన్ డేటా ప్రాసెస్ చేసే ఐటీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంటామని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఐటీ సెంటర్ కోసం రాష్ట్ర స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు రూ.4 కోట్లు కేటాయించింది. టీఎస్టీఎస్ ఇందుకు అవసరమైన పరికరాలను కూడా కొనుగోలు చేసింది. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న సమస్య వచ్చింది. టీఎస్పీఎస్సీలో స్థలం లేకపోవడంతో మరోచోట కేటాయించేందుకు మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు. కానీ టీఎస్పీఎస్సీ ఒకచోట, డేటా సెంటర్ మరోచోట ఉంటే సెక్యూరిటీ సమస్యలు వస్తాయన్న సందేహం తలెత్తింది. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. దీంతో ఖాళీ చేసిన మూడు అంతస్తులను తమకు అప్పగించాలని ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తాత్కాలికంగా ఐటీ సెంటర్ ఏర్పాటు చేసుకుంటామనీ కోరింది. అయినా ఏపీ సానుకూలంగా స్పందించకపోవడంతో ఐటీ సెంటర్ ఏర్పాటు ఆగిపోయింది. -
ఈ లేజర్లు చిప్‌లను పరిగెత్తిస్తాయి
వాషింగ్టన్: డేటా ప్రాసెసింగ్ సరికొత్త ఆవిష్కరణ! మైక్రోప్రాసెసర్ల పనితీరును వేగవంతం చేయడానికి శాస్త్రవేత్తలు వాటిలోని సిలికాన్ పొరపైకి చిన్న లేజర్ కిరణాలను పంపించి చేసిన ప్రయోగం విజయవంతమైంది. 30 ఏళ్లుగా ప్రాసెసర్లలోని సిలికాన్ ఉపరితలంపైకి లేజర్ కిరణాలు పంపడానికి చేసిన ప్రయోగాలు ఏవీ సఫలీకృతం కాలేదు. అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న లేజర్ కిరణాలను పంపించి ఈ ప్రయోగం చేసిన కాలిఫోర్నియా వర్సిటీ, బార్బరా వర్సిటీ వారు విజయం సాధించారు. ఇది సమాచార వాహకాల పరిశ్రమకు గొప్ప ఊతమిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ప్రయోగించిన లేజర్ కిరణాలు మామూలు లేజర్ కిరణాల కంటే వెయ్యి రెట్లు చిన్నగా, పది లక్షల రెట్లు సన్నగా ఉంటాయి.