ఆటోమొబైల్స్ రంగంలో సంచలనాలకు నెలవుగా మారిన టెస్లా.. మరో అరుదైన ప్రయత్నంతో వార్తల్లోకి ఎక్కింది. కార్ల అద్దాలను క్లీన్ చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగించబోతోంది. అంతేకాదు ఈ విధానంపై పేటెంట్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తుకు ఇప్పుడు అనుమతి లభించింది.
ఎలక్ట్రిట్రెక్ వెబ్‌పోర్టల్ కథనం ప్రకారం.. టెస్లా తన కార్ల విండ్‌షీల్డ్ కోసం లేజర్ లైట్ల సెటప్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా విండ్‌షీల్డ్ వైపర్స్ అవసరమైనప్పుడు నీళ్లు చిమ్మిచ్చి అద్దాల్ని శుభ్రం చేస్తాయి. అయితే ఆ స్థానంలో టెస్లా కార్లకు ‘లేజర్ విండ్‌షీల్డ్ వైపర్స్’ ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఈ వైపర్ సెటప్ కంటికి కనిపించదు. అవసరం అయినప్పుడు మాత్రం లేజర్ కిరణాల్ని వెదజల్లుతుంది. అయితే ఈ లేజర్ బీమ్స్ ప్రభావం డ్రైవర్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి ఏమాత్రం హానికలిగించవని, కేవలం కారు అద్దాలపై మరకలను తొలగించేదిగా మాత్రమే ఉంటుందని టెస్లా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఒక్క విండ్‌షీల్డ్ కోసమే కాదు.. గ్లాస్ ఆర్టికల్ ఉన్న చోటల్లా లేజర్ కిరణాల సాయంతో క్లీన్ చేసే సెటప్‌ను టెస్లా తీసుకురాబోతోంది. నిజానికి పేటెంట్ అప్లికేషన్‌ను 2019 మే నెలలోనే సమర్పించింది. కానీ, యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ మాత్రం ఏడాది ఇప్పుడు.. కేవలం కార్ల వరకే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఈ అనుమతులు లభించగా.. త్వరలో రిలీజ్ కాబోయే కార్ల విషయంలో ఈ సెటప్‌ను తీసుకురాబోతోంది టెస్లా.
Comments
Please login to add a commentAdd a comment