LG Electronics India
-
ఐపీవోకు సిద్ధంగా ఉన్న రెండు కంపెనీలు ఇవే..
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో వైట్‌గూడ్స్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియాతోపాటు మానవ వనరులు, టోల్‌ప్లాజా నిర్వాహక సర్వీసుల సంస్థ ఇన్నోవిజన్ లిమిటెడ్ చేరాయి. రెండు కంపెనీలు 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ అనుబంధ సంస్థ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు సన్నద్ధమవుతోంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు ప్రారంభించగా..తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను మాతృ సంస్థ విక్రయానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ.15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవో పూర్తయితే కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తదుపరి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా దిగ్గజంగా ఎల్జీ నిలవనుంది. హ్యుందాయ్ గతేడాది అక్టోబర్‌లో లిస్టయింది. ఎల్జీ ఇండియా ప్రధానంగా వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్ తదితర పలు కన్జూమర్ ప్రొడక్టులను విక్రయించే విషయం విదితమే. దేశీయంగా నోయిడా, పుణెల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?రుణ చెల్లింపులకు..టోల్‌ప్లాజా మేనేజ్మెంట్ సర్వీసుల కంపెనీ ఇన్నోవిజన్ లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ.255 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో 17.72 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా మానవ వనరులు, క్లయింట్లకు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, టోల్ ప్లాజా మేనేజ్మెంట్ తదితర సర్వీసులు సమకూర్చుతోంది. -
ఐపీఓకు ఎల్జీ ఎల్రక్టానిక్స్ రెడీ
న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ దేశీ అనుబంధ సంస్థ రూ. 15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా కంపెనీగా నిలవనుంది. గతేడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. గత నెలలో ఐపీవోపై కంపెనీ రోడ్‌షోలను సైతం ప్రారంభించింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దేశీయంగా ఎల్జీ టాప్ ర్యాంక్ సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. కంపెనీ ప్రొడక్టులలో వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాటర్ ఫిల్టర్లు తదితరాలున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. 2023–24లో రూ. 64,088 కోట్ల ఆదాయం అందుకుంది. -
భారత్‌లో ఎల్జీ ఛైర్మన్ పర్యటన
న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టింగ్‌పై ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ మాతృ సంస్థ ఎల్జీ కార్పొరేషన్ చైర్మన్ ‘క్వాంగ్ మో కూ’ భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఎండీతో పాటు పలు సీనియర్ అధికారులతో ఆయన భేటీ అవుతారని, ఐపీవో సన్నాహాల గురించి తెలుసుకుంటారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే పెట్టుబడుల ప్రణాళికలను చర్చించవచ్చని వివరించాయి.గ్రేటర్ నోయిడాలోని కంపెనీ ప్లాంటును ఆయన సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలతో కూడా భేటీ అవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐపీవో ద్వారా ఎల్జీ ఎల్రక్టానిక్స్ 1.5 బిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కంపెనీ రోడ్‌షోలు కూడా నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఆదాయం రూ. 64,088 కోట్లుగా నమోదైంది. -
దేశీయ మార్కెట్లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!
సౌత్ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్లెట్లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముంబై క్రోమా స్టోర్‌లో ఎల్జీ సంస్థ ఎల్ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హ్యాక్ హ్యయిన్ కిమ్ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. టీవీ స్పెసిఫికేషన్లు టీవీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫ్ లైట్నింగ్ ఫిక్సెల్ టెక్నాలజీ, ఎల్జీ ఏ9 జనరేషన్ ఏఐ ప్రాసెసర్, డొల్బే అట్మాస్ స్పాటల్ సౌండ్ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. -
ఎల్జీ నుంచి ఎల్ఈడీల కొత్త శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా 2022 ఓఎల్ఈడీ టీవీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిలో 106 సెం.మీ. (42 అంగుళాలు) నుంచి 246 సెం.మీ. (97 అంగుళాల) వరకూ విస్తృత స్థాయిలో మోడల్స్ ఉన్నాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద (223 సెం.మీ.) 8కే ఓఎల్ఈడీ టీవీ, మార్కెట్లోనే తొలి రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ వీటిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ధర శ్రేణి రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ రేటు రూ. 75,00,000 స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త ఓఎల్ఈడీ టీవీల్లో గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమ్ ఆప్టిమైజర్ మెనూ, నాణ్యమైన పిక్చర్, డాల్బీ విజన్, అప్‌గ్రేడ్ చేసిన యూఎక్స్, అల్ఫా9 జెన్ 5 ఇంటెలిజెంట్ ప్రాసెసర్ మొదలైన ఫీచర్లు ఉంటాయని కిమ్ వివరించారు. -
ఎల్జీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ బడ్జెట్ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎల్జీ క్యాండీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ .6,999 గా నిర్ణయించింది. బ్లూ, సిల్వర్, గోల్డ్ రంగుల్లో మూడు అదనపు వెనక కవర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఎల్జీ క్యాండీ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని కంపనీ వెల్లడించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందమైన కవర్లు, కెమెరా టెక్నాలజీ, ఇతర ప్రధాన ఫీచర్లతో తమ ఎల్జీ కాండీ వినియోగదారుల మనసు దోచుకుంటుదని ఎల్జీ ఇండియా బిజినెస్హెడ్( మొబైల్స్) అద్వైత్ వైద్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్జీ క్యాండీ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1280x720 రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 32 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
సైనికుల కోసం ఎల్జీ ‘కర్‌సలామ్’ కార్యక్రమం
న్యూఢిల్లీ: ప్రముఖ కన్సూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ రానున్న 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించనుంది. దేశ సైనికుల గొప్పతనానికి, వారి త్యాగశీలతకి సెల్యూట్ చేయడం కోసం ‘కర్‌సలామ్’ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని సైనికులకు అంకితమిస్తున్నామని, దీని ద్వారా దేశ ప్రజలందరూ ఒక వేదికపైకి వచ్చి దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని సైనికులకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరింది. రేడియో, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి పలు మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపింది. ప్రజలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కర్‌సలామ్.ఇన్ వెబ్సైట్ ద్వారా సైనికులకు అభినందనలు తెలియజేయవ్చని పేర్కొంది. 26 జనవరి వరకు విక్రయమయ్యే ప్రతి ఎల్జీ ప్రొడక్ట్‌పై కొంత మొత్తాన్ని ఇండియా నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి పంపుతాం’ అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. -
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సూన్ వాన్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేష న్ (సీఈఏఎంఏ) ఆయనను ‘మ్యాన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’గా సత్కరించింది. న్యూ ఢిల్లీలో జరిగిన సీఈఏఎంఏ 35వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణాళిక , రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈ అవార్డును సూన్వాన్కు ప్రదానం చేశారు. వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగం పురోగతికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. -
ఎల్జీ అల్ట్రా హెచ్డీ టీవీలు ఇక భారత్‌లో తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్జీ నూతన శ్రేణి అల్ట్రా హెచ్డీ టీవీలను భారత్‌లోనే తయారు చేయనుంది. ఖరీదైన ఈ మోడళ్లను ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న ప్లాంట్ల నుంచి కంపెనీ తెప్పిస్తోంది. ఇక్కడి వ్యాపారావకాశాలను దృష్టిలో పెట్టుకుని పునే సమీపంలోని ప్లాంటులో వీటి తయారీని చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం ఎంటర్టైన్మెంట్ మార్కెటింగ్ హెడ్ రిషి టాండన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన గ్యాడ్జెట్ ఎక్స్‌పోలో అల్ట్రా హెచ్డీ విభాగంలో కొత్త మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. 49 అంగుళాల ఈ మోడల్ ధర రూ.1.55 లక్షలు. దీనితోపాటు వెబ్ ఓఎస్ ఆధారిత మోడళ్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 2014లో 50 వేల యూనిట్లు.. ఈ ఏడాది భారత్‌లో అల్ట్రా హెచ్డీ టీవీలు 50,000 యూనిట్లు విక్రయమవుతాయని అంచనా. 40 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు రిషి టాండన్ తెలిపారు. 55 అంగుళాలుపైగా సైజున్న టీవీలను కొనేవారు వీటిపట్ల మొగ్గు చూపుతున్నారని చెప్పారు. 40 అంగుళాల సైజులో అల్ట్రా హెచ్డీ మోడల్‌ను పరిచయం చేస్తామన్నారు. మొత్తంగా ఈ ఏడాది అన్ని విభాగాల్లో కలిపి 50 దాకా మోడళ్లు రానున్నాయని చెప్పారు. ఫ్లాట్ ప్యానెల్ టీవీల మార్కెట్ పరిమాణం దేశంలో 85 లక్షలుంది. ఇందులో ఎల్సీడీల వాటా 5 లక్షలు. క్రమంగా ఎల్సీడీల విభాగం తన ప్రస్థానాన్ని కోల్పోతోందని చెప్పారు. సాధారణ టీవీలతో పోలిస్తే అల్ట్రా హెచ్డీ టీవీల పిక్చర్ నాణ్యత నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎల్జీతోపాటు సోని, శాంసంగ్ కూడా వీటిని తయారు చేస్తోంది.