Makhana
-
ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..
ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్‌లోని భాగల్పూర్లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో సత్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్ ఫుడ్ ప్రీతికరమైన ఆహారమని హైలెట్ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.భారతదేశంలో మఖాన్ ఉత్పత్తిలో బిహార్ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్‌ఫుడ్ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిహార్‌లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్‌కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.మఖానా అంటే..?మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ. సూపర్ ఫుడ్‌గా ఎందుకు పరిగణిస్తారంటే..ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాబరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఐటెంశాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిశరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ ఇదిజీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందిఅలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ఖోబార్ కళ: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..) -
మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్‌తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్‌గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్‌తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్‌గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు!
కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక విషయాన్ని ప్రకటించారు. బిహార్ (Bihar)పై వరాల జల్లు కురిపించిన ఆర్థికమంత్రి అక్కడ మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫూల్ మఖానా (lotus seeds) పై ఆసక్తి ఏర్పడింది. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. అసలేంటి మఖానా ప్రత్యేకత, వీటివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటి తెలుసుకుందామా!బిహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డుతో అక్కడి రైతులకు మేలు చేయనుంది. దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మఖానా ప్రయోజనాలుఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన డైట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరుచక్కని పౌష్ఠికాహారం మఖానా. మఖానా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల, బరువు తగ్గడంతోపాటు, షుగర్ గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్, మఖానా పోషక విలువలు చాలా ఎక్కువ.కార్బోహైడ్రేట్లు, ఐరన్ లభించే సూపర్ ఫుడ్. అందుకే మఖానా తినడం వల్ల ఏనుగు లాంటి శక్తి వస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయనిచెబుతున్నారు నిపుణులు.మఖానాల్లో మెగ్నీషియం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.మఖానా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి.కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ల మూలం కాబట్టి మఖానాతో ఎముకళు, కీళ్లను బలపోతం చేస్తాయి. దంతాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా మాఖానా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. ఇందులోని థయామిన్ నరాల, అభిజ్ఞా పనితీరుకు మంచిది. న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. సంతానోత్పత్తికి మంచిది: మఖానా వంధ్యత్వ సమస్యలతో వ్యవహరించడంలో పురుషులు,మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇవీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర -
నిఖిల్ కామత్ సూపర్ ఫుడ్ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(Nikhil Kamath)) అవిసే గింజలు, మఖానాలను ఇష్టంగా తింటానని ఒక ఇంటర్యూలో అన్నారు. భారతదేశంలో తదుపరి సూపర్ ఫుడ్(superfood) మఖానాలేనని కూడా చెప్పారు. ఆరోగ్య స్ప్రుహ ఉన్న ఈ ఆధునిక కాలంలో కచ్చితంగా గొప్ప ఆరోగ్య ఆహార బ్రాండ్‌గా అవతరిస్తుందని అన్నారు. ఇది డయాబెటిస్, కొలస్ట్రాల్, రక్తపోటు సమస్యలను అద్భుతంగా అదుపులో ఉంచుతుందని చెప్పారు. ఇది నిజంగానే దీర్ఘకాలిక వ్యాధుల(chronic illnesses)ను నివారించడంలో సహాయపడుతుందా అంటే..పోషకాల ప్రొఫైల్..మఖానా(Makhana)లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో 9 శాతం ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. సహజంగా లభించే సోడియం చాలా తక్కువ సాంద్రతలను కలిగి ఉంటుంది. దీనిలో కొద్దిపాటి కొవ్వు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్(MufA) రూపంలో ఉంటుంది. పైగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి, శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందట. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కేన్సర్ నిరోధక లక్షణాలను పెంచుతుందట. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ఎంజైమ్‌లు మూత్రపిండాలు శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. పెద్దలకు 25-30 గ్రాములు, పిల్లలకు 10-20 గ్రాములు చొప్పున తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని స్మూతీలు, కూరలు, స్నాక్‌ల రూపంలో తీసుకోవచ్చు. అయితే పాలతో మరింత పోషక విలువలను అందిస్తుందట. అలాగే ఇక్కడ తినమగానే.. ప్యాకింగ్ చేసిన రోస్ట్ మఖానాలు మాత్రం తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రయోజనాల కంటే అనారోగ్యకరమైన ప్రమాదాలనే ఎక్కువగా అందిస్తుందని సూచిస్తున్నారు. (చదవండి: తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..) -
కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్
జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఏది మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవుతుంది. గతంలో అద్దె ఇల్లు గురించి, పిల్లలు కనడానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ఈయన, ఇప్పుడు 'మఖానా' (Makhana) గురించి, దాని సాగు నుంచి ఎలా కోట్లు సంపాదించవచ్చు అని చెబుతూ ఓ ట్వీట్ చేశారు.ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రపంచానికి విక్రయించే భారతీయ బ్రాండ్(మఖానా)ను నిర్మించడానికి ఇక్కడ స్థలం ఉంది. ఇది నిజంగా పెద్ద బ్రాండ్. నేను వ్యక్తిగతంగా కూడా మఖానాను ఆకర్షితుడయ్యాను అని నిఖిల్ కామత్ ట్వీట్ (Tweet) చేశారు.ఫాక్స్ నట్ అని పిలువబడే మఖానా ప్రపంచంలోని అత్యంత సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మఖానా సరఫరా చేసే దేశాల్లో భారత్ (బీహార్) అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో ఎక్కువ మఖానా ఉత్పత్తి బీహార్‌లో జరుగుతోంది. ఇది అక్కడి ప్రజలకు లాభదాయక పరిశ్రమ కూడా.బీహార్‌లోని వరద పీడిత ప్రాంతాలు మఖానా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ వరి సాగుకంటే కూడా మఖానా సాగు మూడు రెట్ల ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పంట నీటి వనరులలో సహజంగా వృద్ధి చెందుతుంది. అంతే కాకుండా 'సబోర్ మఖానా-1' రకం వంటి ఇటీవలి ఆవిష్కరణలు దిగుబడిని రెట్టింపు చేశాయి. దీనివల్ల దిగుబడి 40 శాతం నుంచి 60 శాతానికి చేరింది. ఇది మఖానా పండించే రైతులకు ఓ వరంగా మారింది.కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన మఖానాలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యం మీద ద్రుష్టి సారించేవారిని ఆకర్షిస్తుంది. గుండె ఆరోగ్యం, షుగర్ మెయింటెనెన్స్ వంటి వాటితో పాటు.. బరువును తగ్గించడానికి కావాల్సిన సామర్థ్యం ఇందులో ఉండటం వల్ల దీనికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.13,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంమఖానా పరిశ్రమ గడచిన పదేళ్లలో మూడు రెట్లు అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇందులో సాగుకు సంబంధించిన, ఎగుమతుల విషయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. కేవలం 2 శాతం విత్తనాలు మాత్రమే ప్రపంచ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రభుత్వ రాయితీలు కల్పించడం.. సాంకేతిక పురోగతులు ఈ నష్టాలను కొంత వరకు తగ్గించాయి. ఈ కారణంగానే వీటి వృద్ధి క్రమంగా పెరిగింది. నిఖిల్ కామత్ మఖానాకు సంబంధించి ఒక డేటాను కూడా ట్వీట్ చేశారు.Maybe room here to build a really large brand, an Indian brand that sells to the world.Personally, I'm hooked on Makhana. pic.twitter.com/eu5yK804Ny— Nikhil Kamath (@nikhilkamathcio) January 17, 2025