Mega Auto Show
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
తిరుపతిలో సాక్షి మెగా ఆటోషో ప్రారంభించిన మిధున్ రెడ్డి
-
ఆటోషో.. జోష్
నెల్లూరురూరల్/నెల్లూరు (వీఆర్సీసెంటర్): ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండో రోజూ ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ మెగా ఆటోషోకు అపూర్వ స్పందన లభిం చింది. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో ‘సాక్షి’ మెగా ఆటోషో సరికొత్త ఆలోచనతో వివిధ రకాల టూ, ఫోర్ వీలర్ వాహనాలను ఒకే వేదికకు తీసుకువచ్చింది. ఆటో షోలో సరికొత్త మోడల్స్‌తో పాటు, అధునాతన ఫీచర్లు ఉన్న వాహనాలను పలు సంస్థలు తీసుకొచ్చి నగర ప్రజలకు, వాహన ప్రియులకు పరిచయం చేశాయి. నగర ప్రజలతో పాటుగా, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులతో వీఆర్సీ క్రీడా మైదానం నిండిపోయింది. నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసుకునే వీలు కల్పించడంతో యువత పెద్ద సంఖ్యలో వచ్చి తమకు అనుకూల బడ్జెట్లో, అనుకున్న ఫీచర్లు కలిగి ఉన్న వాహనాల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించుకుని సంతృప్తి చెంది, వాహనాలను కొనుగోలు చేశారు. మరికొంత మంది వాహనాలకు బుక్ చేసుకున్నారు. చివరి రోజు ఆటో షోకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో వాహన ప్రియులు వచ్చి కొనుగోలు చేయటంతో ఆటోషోలో పాల్గొన్న కంపెనీలు సైతం ఆనందంలో మునిగిపోయాయి. ‘సాక్షి’ నిర్వహించిన ఆటోషోకు పలు కంపెనీలకు చెందిన 22 స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన కంపెనీలే కాక ఇతర జిల్లాలకు చెందిన కంపెనీలు ఆటోషోలో సరిత్త వాహనాలను నగర వాసులకు అందుబాటులో తీసుకు వచ్చారు. కొన్ని కంపెనీలు వారి వాహనాలకు స్పాట్ డెలివరీ, స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కల్పించటం గమనార్హం. ఇలాంటి ఆటోషోలను సక్సెస్ చేయటం ‘సాక్షి’కే సాధ్యమైందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండో రోజూ అనూహ్య స్పందన సాక్షి మెగా ఆటో షోకు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం ముగిసిన షోలో అన్ని ప్రముఖ కంపెనీల వాహనాలను ఉంచడంతో వాహన ప్రియులు సందడి చేశారు. కొందరు తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేశారు. షో సందర్భంగా షోరూం నిర్వాహకులు కొన్ని వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఇటు వంటి షోలు ఏర్పాటు చేయడం వల్ల తమకు ఎంతో సమయం ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రెండో రోజు ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగింది. మొత్తంగా వేలాదిగా నగర ప్రజలు ప్రదర్శనలో పాల్గొని వారికి నచ్చిన వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు, బుక్ చేసుకున్నారు. సిరికళ వెడ్డింగ్ మాల్ సౌజన్యంతో ఆటో షో సందర్శకులకు గంట గంటకు లక్కీడిప్ తీసి గిప్ట్ కూపన్స్ అందజేశారు. ఈ ఆటో షోలో భార్గవి మారుతి సుజికి, భారతి నెక్సా, భార్గవి ఆటోమొబైల్, స్కోడా, కున్ హోండాయ్, సాయి షిర్డిషా హోండా, సరయు హీరో, ఎంఎల్ విస్సా, లక్ష్మీప్రసన్న హోండా, లక్ష్మీప్రియ టీవీఎస్, సుజికీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంఎస్ మోటార్స్ వీసా అప్రిలిక, హెల్త్ గూడ్స్, ఎక్స్‌ప్రెస్ హోండా, టాటా మోటార్స్, కేటీఎం, యమహా గోల్డ్ ఫీల్డ్, ఏఎంరెడ్డి హీరో, ఎంజీవీ బజాజ్, తదితర కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో సాక్షి డీజీఎం బి.రంగనా«థ్, నెల్లూరు యూనిట్ యాడ్స్ మేనేజర్, బ్రాంచ్ ఇన్చార్జి పి.కృష్ణప్రసాద్, బ్యూరో ఇన్చార్జి కె. కిషోర్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ జయరాజ్, భార్గవి ఆటో మొబైల్స్ అధినేత కొండా నిరంజన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నెల్లూరులో సాక్షి మెగా ఆటో షో
-
సాక్షి మెగా ఆటో షో విజయవంతం
బంపర్ డ్రా విజేతను ఎంపిక చేసిన ఎమ్మెల్యే ఆకుల సాక్షి, రాజమహేంద్రవరం: కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉండేలా ‘సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఆటో షో విజయవంతమైంది. రాజమహేంద్రవరంలో తొలిసారి నిర్వహించిన ఈ షోకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 20 స్టాళ్లలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచారుు. అన్ని కంపెనీల వాహనాలు ఒకేచోట అందుబాటులో ఉండడంతో నచ్చిన వాహనాన్ని కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవడం సులభంగా మారింది. పలువురు వాహనాలను కొనుగోలు చేయగా మరికొంతమంది అడ్వాన్ ్సలు చెల్లించి తమకు నచ్చిన వాహనాలను సొంతం చేసుకున్నారు. ప్రదర్శన సందర్భంగా పలు కంపెనీల డీలర్లు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు. విశాల మైదానంలో ప్రదర్శన, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం పట్ల డీలర్లు, సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు కొనుగోలు చేసిన వాహనదారులకు బంపర్ డ్రాలో సిరి మోటార్స్, ‘సాక్షి’ సౌజన్యంతో అందించే యమహా ఫ్యాసినో టూ వీలర్ విజేతను ఆదివారం రాత్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎంపిక చేశారు. విజేతగా నిలిచిన బొంతల ధనలక్ష్మికి ఫ్యాసినో వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఆకుల మాట్లాడుతూ.. ఇలాంటి ఆటో షోలు ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ‘సాక్షి’ మెగా ఆటో షో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. -
షో..అదుర్స్
‘సాక్షి’ మెగా షోకు విశేష స్పందన భారీగా వాహనాల విక్రయం రెండు రోజులపాటు సందడిగా మారిన ఆర్ట్స్ కాలేజీ మైదానం సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన డీలర్లు, సందర్శకులు ‘సాక్షి’ మెగా ఆటోషో అదిరింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానం ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. స్పోర్ట్, స్కూటీల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ’సాక్షి’ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన ఈ మెగా ఆటో షో రాజమహేంద్రవరం వాసులకు కొత్త అనుభూతిని పంచింది. నచ్చిన వాహనం కొనుగోలు చేసేందుకు ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా అన్ని రకాల వాహనాలనూ ఒకే చోటకు తెచ్చిన ఈ మెగా ఆటో షో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసులను దోచుకుంది. పలువురు వాహనాలను కొనుగోలు చేయగా, మరికొంత మంది అడ్వా¯Œ్సలు ఇచ్చి తమకు నచ్చిన వాహనాలను బుక్ చేసుకున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం ‘సాక్షి’ ఆధ్వర్యంలో తొలిసారి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మెగా ఆటోషో విజయవంతమైంది. ఈ షోకు ఉభయగోదావరి జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రెండు రోజులపాటు ఆర్ట్స్ కాలేజీ మైదానం సందర్శకులతో కిటకిటలాడింది. ఈ రెండు రోజుల్లో మొత్తం 95 వాహనాలు ఆయా కంపెనీల డీలర్లు విక్రయించారు. ఇందులో 58 టూవీలర్లు, 30 కార్లు, 7 ఆటోలు ఉన్నాయి. విశాల మైదానంలో ప్రదర్శన ఏర్పాటు చేయడంతోపాటు సౌకర్యాలు కల్పించడంపై డీలర్లు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆటోషోలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంక్‌లు తక్కువ వడ్డీకే రుణసదుపాయం కల్పించాయి. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పార్కింగ్, ఇతర సౌకర్యాలను ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ ఏజీఎం బి.రంగనాథ్, ఆర్ఎం వైఎస్ కొండలరావు, అడ్వర్టయిజింగ్ డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, సీనియర్ యాడ్ ఆఫీసర్ కె.ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. తక్కువ డౌ¯ŒSపేమెంట్ ‘సాక్షి’ మెగా ఆటోషోలో వాహనం కొనుగోలు చేసిన వారికి అతి తక్కువ డౌ¯ŒSపేమెంట్ ఆఫర్ ఇచ్చాం. ఫైనా¯Œ్స కూడా అప్పటికప్పుడు పూర్తి చేశాం. – సీహెచ్.సన్యాసిరావు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, రెడ్డిబాబు మోటార్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఈ ప్రదర్శనలో వాహనం కొనుగోలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చాం. తక్కువ డౌ¯ŒSపేమెంట్, రెండేళ్ల పాటు ఉచిత ఇన్సూరె¯Œ్స ఇస్తున్నాం. – జి.వినయ్‌కుమార్, శ్రీగోకుల్ టీవీఎస్ సందర్శకులకు టేబుల్‌టాప్ కేలండర్ ‘సాక్షి’ మెగా ఆటోషో మా వ్యాపారానికి బాగా ఉపయోగపడింది. మా స్టాల్‌ను సందర్శించిన వారికి వారి ఫొటోతో కూడిన టేబుల్ క్యాలెండర్ ఇచ్చాం. – సుజిత్, టీమ్ లీడర్, సిరి మోటార్స్ ప్రచారానికి ఎంతో మేలు ఇలాంటి మెగా ఆటోషోలు నూతన వాహనాల ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ‘సాక్షి’ ఇలాంటివి మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాం. మేము నాలుగు వాహనాలు విక్రయించాం. – ప్రవీణ్, సేల్స్ మేనేజర్, కంటిపూడి సుజుకి డ్రైవింగ్ స్కూల్ గురించి వివరించాం ’సాక్షి’ మెగా ఆటోషో మా కంపెనీ ప్రచారానికి బాగా ఉపయోగపడింది. మా డ్రైవింగ్ స్కూల్ గురించి సందర్శకులకు వివరించాం. రాజమహేంద్రవరం, కాకినాడల్లో మా డ్రైవింగ్æ స్కూళ్లు ఉన్నాయి. – సూర్య, టీమ్ లీడర్, ఎస్బీ మోటార్స్. స్పాట్ ఎక్సే్ఛంజ్ ఇచ్చాం ఈ మెగా ఆటోషోలో కొనుగోలుదారులకు స్పాట్ ఎక్సే్ఛంజ్ ఇచ్చాం. పాత వాహనాలకు గరిష్ట మార్కెట్ ధర ఇస్తున్నాం. ’సాక్షి’ మెగా ఆటోషో కొనుగోలుదారులకు, మాకు ఎంతో ఉపయోగపడింది. – కిరణ్‌కుమార్, సేల్స్ మేనేజర్, శ్రీకోడూరి టాటా సందర్శకులకు ప్రత్యేక గిఫ్ట్ మా స్టాల్ సందర్శించిన వారికి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చాం. చవర్లెట్æ ఎ¯ŒSజాయ్ వాహనంపై ప్రత్యేక డిస్కౌంట్ రూ. రెండు లక్షలు ఇస్తున్నాం. ఇది నెలాఖరు వరకు ఉంటుంది. – దుర్గాప్రసాద్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆరెంజ్ చవర్లెట్ యాక్ససరీస్ ఆఫర్ కొనసాగిస్తున్నాం ‘సాక్షి’ మెగా ఆటోషోలో కొనుగోలుదారులకు రూ.పది వేలు విలువైన యాక్ససరీస్ ఇచ్చాం. ఈ ఆఫర్‌ను ఇక్కడికి వచ్చిన సందర్శకులకు షోరూంలో కూడా ఇవ్వాలని నిర్ణయించాం. – వంశీ శ్రీనివాస్, ఎస్.ఎం, లీలాకృష్ణ టయోటా. యాక్ససరీస్ ఉచితం ’సాక్షి’ మెగా ఆటోషోలో వాహనాలు కొనుగోలు చేసిన వారికి రూ.8 వేల విలువైన యాక్ససరీస్ ఉచితంగా ఇస్తున్నాం. అన్ని మోడళ్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. – బీహెచ్‌వీ ప్రసాద్, సేల్స్ ఆఫీసర్, ఎలైట్ హోండా అపే సిటీ లాంచ్ చేశాం ’సాక్షి’ మెగా ఆటో షోలో అపే సిటీ కొత్త ఆటోను లాంచ్ చేశాం. ఇప్పటి వరకూ రెండు వాహనాలు విక్రయించాం. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇక్కడ పార్కింగ్ బాగుంది. – రాయుడు, సేల్స్ మేనేజర్, కోడూరి పియోజియో స్నేహితుడితో వచ్చి టూ వీలర్ కొన్నా నా స్నేహితుడు కారు కొనుగోలు చేద్దామంటే వచ్చా. ఇక్కడ వాహనాలన్నీ పరిశీలించాక ఇంట్లో వారందరికీ ఉపయోగంగా ఉంటుందని స్కూటీ కొనుగోలు చేశా. ఫైనా¯Œ్స ప్రక్రియ 30 నిమిషాల్లో పూర్తయింది. ‘సాక్షి’ మెగా ఆటో షో చాలా ఉపయోగంగా ఉంది. – ఎల్.దామోదర్, రావులపాలెం -
అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో
లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ మురళీమోహన్, మేయర్ రజినీ శేషసారుు సాక్షి, రాజమహేంద్రవరం: అన్ని కంపెనీల వాహనాలను ఒకే చోటుకు చేర్చి కొనుగోలుదారులకు సౌలభ్యంగా ఉండేలా ’సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెగా ఆటో షో శనివారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ మెగా ఆటో షోను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజినీ శేషసారుు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఇలాంటి మెగా ఆటో షోలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ’సాక్షి’ మొదటిసారి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేవలం 30 నిమిషాల్లో తమకు కావాల్సిన వాహనాన్ని సందర్శకులు కొనుగోలు చేసుకునేలా ఈ ఆటో షో ఉందని మేయర్ రజినీ శేషసారుు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ షోలో నగరంలో ఉన్న అన్ని ఫోర్ వీలర్, టూవీలర్ డీలర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు వాహనాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ’సాక్షి’ అడ్వర్టరుుజింగ్ ఏజీఎం బి.రంగనాథ్, ఆర్.ఎం.వై.ఎస్.కొండలరావు, రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ చార్జ్ వి.వి.శివుడు, అడ్వర్టరుుజింగ్ డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మెగా ఆటో షో అదుర్స్
-
అమరావతిలో ‘సాక్షి’ మెగా ఆటో షో
-
నేడు, రేపు ‘సాక్షి’ మెగా ఆటో షో
ప్రవేశం ఉచితం.. ప్రతి గంటకు గిప్ట్ కూపన్ శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగే మెగా ఆటోషోను సందర్శించే వారికి ప్రవేశం ఉచితం. ఆటో షోలో వాహన ప్రియులు తమ కుటుంబ సమేతంగా పాల్గొని, ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. చందన రమేష్ గ్రూప్వారి సౌజన్యంతో సందర్శకులకు గంట గంటకు ఉచిత గిప్ట్ కూపన్ ఇవ్వనున్నారు. 93.5 రెడ్ ఎఫ్ఎం రెడియో పార్టనర్‌గా, సాక్షి, టీవీ న్యూస్ చానల్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి. రాజమహేంద్రవరం : మూడేళ్లుగా మెగా ఆటోషోలను ఏర్పాటు చేస్తూ వాహన ప్రియుల కలలను సాకారం చేసిన ’సాక్షి’ మెగా ఆటో షో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ మెగా ఆటో షోను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు. నచ్చిన వాహనం.. ఫైనా ఒకేచోట నచ్చిన వాహనం కోసం షోరూంలన్నీ తిరగాలంటే సాధ్యమైన పనికాదు ఆ శ్రమ అవసరం లేకుండా అన్నీ ఈ మెగా షోలో లభించనున్నాయి. పాల్గొననున్న కంపెనీ డీలర్స్ యమహా సిరి మోటార్స్, శ్రీ సిరి ఆటో మొబైల్స్, ఎస్బీ మోటార్స్, ట్రైస్టార్ ఫోర్డ్, కంటిపూడి నిస్సాన్, కంటిపూడి డాట్సన్, కంటిపూటి సుజుకి, రెడ్డి బాబు హీరో, సీపీ రెడ్డి హీరో, శ్రీఆర్కే హోండా, టర్బో ఫియట్, చవ్రలెట్ ఆరెంజ్ ఆటో మెబైల్స్, టాటా శ్రీ కోడూరి ఆటో మొబైల్స్, లీలాకృష్ణ టయోట, రేనాల్ట్ విశ్వరూప ఆటోమోటీవ్స్, ఎలైట్ హోండా, లక్ష్మి హూండాయ్, గోకుల్ టీవీఎస్ టూ వీలర్, కోడూరి పియోజియో త్రీవీలర్ ఆటో, మహీంద్ర ఎంఅండ్ఎం మోటార్స్, దాక్షాయిని టీవీఎస్ వంటి ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి ’సాక్షి’ తీసుకువస్తుంది. వందలాది సరికొత్త, ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలు ఈ మెగా ఆటో ఎక్స్‌పోలో కొలువుదీరనున్నాయి. రుణ సదుపాయం నచ్చిన వాహనాన్ని వెంటనే వినియోగదారుడు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకర్ల ద్వారా సులభతరమైన వాయిదా పద్ధతులు, తక్షణ రుణ సదుపాయాన్ని (స్పాట్ ఫైనాన్స్) పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయాలు అందిస్తోంది. యమహా ఫ్యాసినో సొంతం చేసుకోండి ’సాక్షి’ మెగా ఆటో షోలో వాహనం బుక్ చేసుకున్నవారికి బంపర్ ఆఫర్ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సిరి మోటార్స్ సౌజన్యంతో బంపర్ డ్రాలో యమహా ఫ్యాసినో బహుమతిగా గెలుసుకోవచ్చు. యమహా స్కూటర్ కొనుగోలు చేసిన మొదటి 10 మందికి ఉచితంగా యాక్ససరీస్ అందజేస్తారు. -
మెగా 'షో' డబుల్స్
-
సాక్షి మెగా ఆటో షో అదుర్స్
విశాఖపట్నం: బైక్‌లు, కారులు, ఆటోలు కొత్త మోడళ్ల గురించి ఆరా తీయడానికి, నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన సందర్శకులతో సాక్షి మెగా ఆటోషో కళకళలాడింది. కొనుగోలు చేయడానికే కాదు ...వాహనం ఏదైనా ఏ కంపెనీదైనా ఒకే వేదికపై పరిశీలించి బుక్ చేసుకొనే అవకాశం వచ్చింది. 'సాక్షి' ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని వుడా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రెండ్రోజుల ఆటోషో శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు. వినియోగదారులకు అనుకూలంగా ఒకే వేదికపై ఎన్నో వాహనాలతో మెగా ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డోంట్ మిస్ ..నేడు కూడా ఎక్కడ : ఎంవీపీ కాలనీలోని వుడా గ్రౌండ్స్ ప్రవేశం : ఉచితం వేళలు : ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు బంపర్ బహుమతి: ఈ ఆటోషోలో ఏ వాహనం బుక్ చేసుకున్న వారికైనా లక్కీ డ్రాలో బజాజ్ ప్లాటినా బైక్‌ను గెలుపొందే అవకాశం -
26,27 తేదీల్లో సాక్షి మెగా ఆటో షో
ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేదిక రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి ఉచిత పొల్యూషన్ చెకప్, సర్వీస్ క్యాంప్ విశాఖపట్నం : కారు...బైక్...ఆటో...స్కూటర్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే ‘సాక్షి’ మీ కు సువర్ణావకాశం కల్పించనుంది. కళ్లు చెది రేలా అన్ని కంపెనీల మోడల్స్‌ను ఒకే వేదిక పైకి తేనుంది. ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేది కగా ఈ నెల 26, 27 వ తేదీల్లో సాక్షి మెగా ఆటో షో నిర్వహించనుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శించవచ్చు. నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకొని లక్కీ డ్రా ద్వారా సుజికి లెట్స్ ద్విచక్రవాహనాన్ని బంపర్ బహుమతిగా పొందే అవకాశం ఈ ఆటో షో కల్పిస్తోంది. ఇక్కడ వాహనాలు కొనుక్కున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యముంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా తక్షణ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ్‌బజాజ్ సౌజన్యంతో అన్ని కంపెనీల టూ వీలర్, నాలుగు చక్రాల వాహనాలకు ఉచిత పొల్యూషన్ చెకప్ చేయనున్నారు. అలాగే అన్ని కంపెనీల టూ వీలర్స్‌కు ఉచిత సర్వీస్ క్వాంప్ నిర్వహించనున్నారు. ఈ మెగా షోకు రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి, టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు రోజులు జరిగే ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలా కృష్ణా టయోటా, శ్రీ శ్రీనివాస యమహా, బాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ మారుతి, జయభేరి మారుతి, వరుణ్‌బజాజ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, నియాన్ మహేంద్ర, సుందరం హోండా, విష్ణు హోండా, రెనాల్ట్- వైజాగ్, మేంగో హ్యుండాయ్, శివశంకర్ హీరో మోటార్స్, ఆరంజ్ చెవర్లెట్, లక్ష్మీ హ్యుండాయ్, వైజాగ్-సుజుకి, శివశంకర్ టాటా మోటార్స్, ఎస్.వి.పియాజియా మోటార్స్, వరుణ్ బజాజ్ ఆటో కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. ఈ షోలో పాల్గోదలచిన ఆటోమొబైల్ డీలర్లు 9912877822, 9912222796 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
26,27 తేదీల్లో సాక్షి మెగా ఆటో షో
ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేదిక రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి ఫ్రీగా పొల్యూషన్చెకప్, సర్వీస్ క్యాంప్ విశాఖపట్నం : కారు...బైక్...ఆటో...స్కూటర్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే ‘సాక్షి’ మీ కు సువర్ణావకాశం కల్పించనుంది. కళ్లు చెది రేలా అన్ని కంపెనీల మోడల్స్‌ను ఒకే వేదిక పైకి తేనుంది. ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేదికగా ఈ నెల 26, 27 వ తేదీల్లో సాక్షి మెగా ఆటో షో నిర్వహించనుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శించవచ్చు. నచ్చిన వాహనా న్ని బుక్ చేసుకొని లక్కీ డ్రా ద్వారా సుజికి లె ట్స్ ద్విచక్రవాహనాన్ని బంపర్ బహుమతిగా పొందే అవకాశం ఈ ఆటో షో కల్పిస్తోంది. ఇక్కడ వాహనాలు కొనుక్కున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యముంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా తక్షణ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ్‌బజాజ్ సౌజన్యంతో టూ వీలర్, నాలుగు చక్రాల వాహనాలకు ( అన్ని కంపెనీలవీ) ఫ్రీసర్వీస్ క్యాంప్ ఫ్రీ పొల్యూషన్ చెకప్ చేయనున్నారు. ఈ మెగా షోకు రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి, టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు రోజులు జరిగే ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలా కృష్ణా టయోటా, శ్రీ శ్రీనివాస యమహా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ మారుతి, జయభేరి మారుతి, వరుణ్‌బజాజ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, నియాన్ మహేంద్ర, సుందరం హోండా, విష్ణు హోండా, రెనాల్ట్- వైజాగ్, మేంగో హ్యుండాయ్, శివశంకర్ హీరో మోటార్స్, ఆరంజ్ చెవర్లెట్, లక్ష్మీ హ్యుండాయ్, వైజాగ్-సుజుకి, శివశంకర్ టాటా మోటార్స్, ఎస్.వి.పియాజియా మోటార్స్ తదితర కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి.