అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో | Start for the 'sakshi' Mega Auto Show | Sakshi
Sakshi News home page

అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో

Published Sun, Nov 6 2016 4:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో

అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో

’సాక్షి’ మెగా ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ మురళీమోహన్ చెప్పారు.

లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ మురళీమోహన్, మేయర్ రజినీ శేషసారుు

 సాక్షి, రాజమహేంద్రవరం: అన్ని కంపెనీల వాహనాలను ఒకే చోటుకు చేర్చి కొనుగోలుదారులకు సౌలభ్యంగా ఉండేలా ’సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో  మెగా ఆటో షో శనివారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ మెగా ఆటో షోను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజినీ శేషసారుు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీమోహన్  మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఇలాంటి మెగా ఆటో షోలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ’సాక్షి’ మొదటిసారి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కేవలం 30 నిమిషాల్లో తమకు కావాల్సిన వాహనాన్ని సందర్శకులు కొనుగోలు చేసుకునేలా ఈ ఆటో షో ఉందని మేయర్ రజినీ శేషసారుు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ షోలో నగరంలో ఉన్న అన్ని ఫోర్ వీలర్, టూవీలర్ డీలర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు వాహనాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ’సాక్షి’ అడ్వర్టరుుజింగ్ ఏజీఎం బి.రంగనాథ్, ఆర్.ఎం.వై.ఎస్.కొండలరావు, రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ చార్జ్ వి.వి.శివుడు, అడ్వర్టరుుజింగ్ డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement