national political news
-
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్‌లోని అరా, కరాకట్ లోక్‌సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్‌లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్‌లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్‌కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్‌కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం
లక్నో : భారత్‌లో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్న మీరట్ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తిరిగి ప్రశ్నించారు. ఆ మాటలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని కోరారు. మౌర్య ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ ఎస్పీ వ్యాఖ్యలు నిజమైతే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి : వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ -
రాహుల్‌కు అంత ప్రేముంటే ఇటలీ తీసుకెళ్లొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ చొరబాటుదారులపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటే వారందరినీ తన అమ్మమ్మ దేశమైన ఇటలీకి తీసుకెళ్లవచ్చని కేంద్ర పశు, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం రాంచీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, అస్సాంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే మతం ఆధారంగా విభజించిందని విమర్శించారు. ఇప్పడు సీఏఏపై ద్వంద్వ విధానాలు పాటిస్తూ మరోసారి విభజించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఏఏపై ఆ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయని, కానీ ఆ పార్టీ ఇప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విభజనకు గురైనప్పుడు పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలు భవిష్యత్తులో పీడనకు గురైతే భారత్ వారిని సహృదయంతో ఆహ్వానించాలని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ వైఖరిని మంత్రి ఎండగట్టారు. అసద్ 2013లో చేసిన హిందూ ముక్త్ హిందూస్తాన్ వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. చదవండి : సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
ఇటలీ సోనియాకు ఇవ్వచ్చు కానీ..
చండీగఢ్ : హర్యానా హోం మినిస్టర్ అనిల్ విజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంత్రి గురువారం మాట్లాడుతూ.. పాకిస్తాన్లో హింసకు గురవుతున్న మా హిందూ, సిక్కు సోదరులకు పౌరసత్వం ఇస్తానంటే, ఇటలీలో పుట్టి భారత పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు గ్రూపుగా ఏర్పడి దేశాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి : ‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’ -
ఇది గాంధీ, నెహ్రూ జమానా కాదు..
చండీగఢ్ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కైతాల్ ఎమ్మెల్యే లీలా రామ్ గుర్జార్ తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఏఏపై కొంతమంది ఆందోళన చేస్తూ మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇది గాంధీ, నెహ్రూ, మన్మోహన్సింగ్ల జమానా కాదు. ఇప్పుడు నడుస్తున్నది మోదీ, అమిత్‌షాల రాజ్యం. మాకు ఒక్క సిగ్నల్ వస్తే ఒక్క గంటలోనే వాళ్ల పనిపడతామని వ్యాఖ్యానించారు. సీఏఏపై మాట్లాడుతూ.. ఈ చట్టంతో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారనేది వాస్తవం కాదు. భారతీయ ముస్లింలకు ఈ చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్రమంగా వచ్చిన విదేశీ చొరబాటుదారులు మాత్రం ఖచ్చితంగా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనన్నారు. చదవండి : వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్.. -
‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’
సాక్షి, చండీగఢ్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు పెట్రోల్ బాంబు వంటి వారని హర్యానా హోం మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాహుల్, ప్రియాంకలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా 144 సెక్షన్ విధించి ఉండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా బీజేపీ హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్ చేశారు. చదవండి : రాహుల్‌కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు Beware of @priyankagandhi and @RahulGandhi as they are live Petrol Bombs where ever they go they ignite fire and cause loss to Public Property. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 24, 2019 -
ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ
-
ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణుల అంచనా. ఉగ్రవాదుల నుంచి ప్రధానికి ముప్పు ఉన్న నేపథ్యంలో ఎన్ఎస్జీతో పాటు దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ శనివారం భద్రత ఏర్పాట్ల గురించి పలు భేటీలు నిర్వహించారు. ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లతో పాటు సమీప భవనాల మీద స్నిప్పర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ఈ సారి పక్కా? ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పాగా వేయడానికి గట్టి కృషి చేస్తున్నామంటూ ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయోల్ శనివారం వెల్లడించారు. ఇదికాక, ఢిల్లీలోని అనధికార కాలనీలలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులను కల్పిస్తూ ఈ నెల 4వ తేదీన పార్లమెంటులో బిల్లు పాసైంది. దీంతో 1731 కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 40 లక్షల మంది ఓటర్లు మోదీ పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. మోదీకి కృతజ్ఞతగా 11 లక్షల మంది సంతకాలతో కూడిన ప్రతిని ఈ సభలో ఆయనకు బహుకరిస్తున్నారు. అంతేకాక, మోదీ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో నిర్వహిస్తున్న మొదటి ఎన్నికల సభ ఇది. సభ నేపథ్యంలో ఢిల్లీ - గుర్గావ్ రహదారిపై ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరకంగా పలు నిరసన ప్రదర్శనలు జరుగుతుండడంతో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకొంది. చదవండి : అభివృద్ధిపై దృష్టి పెట్టండి -
హిందూస్తాన్ ఏ ఒక్కరి సొత్తు కాదు :రౌత్
సాక్షి, ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివారం ట్టిటర్‌లో ఓ ప్రముఖ కవి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘హిందూస్తాన్ ఏ ఒక్కరి సొత్తుకాదు. ఈ దేశ మట్టిలో అందరి రక్తం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని హిందూ - ముస్లింల మధ్య విభేదాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు. గతంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఏ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తారు? దీనికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా కేంద్రం వద్ద ఉందా? ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సీఏఏ బిల్లుపై లోక్‌సభలో కేంద్రానికి మద్దతిచ్చిన శివసేన, రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరై సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకు ముందు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 35 ఏళ్లుగా బీజేపీతో ఉన్న పొత్తును వదులుకున్న సంగతి తెలిసిందే. చదవండి : రాహుల్ వ్యాఖ్యలపై శివసేన కౌంటర్ -
పొలిటికల్ కారిడర్ 28th Oct 2019
-
పొలిటికల్ కారిడర్ 18th Oct 2019
-
పొలిటికల్ కారిడర్ 15th Oct 2019
-
పొలిటికల్ కారిడర్ 16th september 2019
-
పొలిటికల్ కారిడర్ 13th Sep 2019
-
పొలిటికల్ కారిడార్ 31st Aug 2019
-
పొలిటికల్ కారిడర్ 30th Aug 2019
-
పొలిటికల్ కారిడర్ 27th Aug 2019
-
కురుక్షేత్రం 7th May 2019
-
కురుక్షేత్రం 6th May 2019
-
కురుక్షేత్రం జయహో - 2019
-
పొలిటికల్ కారిడర్ 22nd 2019
-
పొలిటికల్ కారిడర్ 19th March 2019
-
పొలిటికల్ కారిడర్ 18th March 2019
-
పొలిటికల్ కారిడర్ 14th March 2019
-
పొలిటికల్ కారిడర్ 7th March 2019
-
పొలిటికల్ కారిడర్ 12th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 9th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 8th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 7th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 4th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 2nd Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 31st Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 26th jan 2019
-
పొలిటికల్ కారిడర్ 25th Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 24th Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 3rd Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 29th Dec 2018
-
పొలిటికల్ కారిడార్ 22nd dec 2018
-
పొలిటికల్ కారిడర్ 17th Dec 2018
-
పోలిటికల్ కారిడార్ 14th Dec 2018
-
పొలిటికల్ కారిడర్ 8th Oct 2018
-
పొలిటికల్ కారిడర్ 6th Oct 2018
-
పొలిటికల్ కారిడర్ 17th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 15th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 8th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 30th August 2018
-
పొలిటికల్ కారిడర్ 25th August 2018
-
పొలిటికల్ కారిడర్ 24th August 2018
-
పొలిటికల్ కారిడర్ 18th August 2018
-
పొలిటికల్ కారిడర్ 14th August 2018
-
పొలిటికల్ కారిడర్ 11th August 2018
-
పొలిటికల్ కారిడర్ 9th August 2018
-
పొలిటికల్ కారిడర్ 2nd August 2018
-
పొలిటికల్ కారిడర్ 13th July 2018
-
పొలిటికల్ కారిడర్ 30th June 2018
-
పొలిటికల్ కారిడర్ 28th June 2018
-
పొలిటికల్ కారిడర్ 23rd June 2018
-
పొలిటికల్ కారిడర్ 16th june 2018
-
పొలిటికల్ కారిడర్ 8th June 2018
-
పొలిటికల్ కారిడర్ 2nd June 2018
-
పొలిటికల్ కారిడర్ 1st June 2018
-
పొలిటికల్ కారిడర్ 28th May 2018
-
పొలిటికల్ కారిడర్ 25th May 2018
-
పొలిటికల్ కారిడర్ 24th May 2018
-
పొలిటికల్ కారిడర్ 22nd May 2018
-
పొలిటికల్ కారిడర్ 21st May 2018
-
పొలిటికల్ కారిడర్ 19th May 2018
-
పొలిటికల్ కారిడర్ 17th May 2018
-
పొలిటికల్ కారిడర్ 14th May 2018
-
పొలిటికల్ కారిడర్ 11th May 2018
-
పొలిటికల్ కారిడర్ 8th May 2018
-
పొలిటికల్ కారిడర్ 4th May 2018
-
పొలిటికల్ కారిడర్ 1st May 2018
-
పొలిటికల్ కారిడర్ 30th April 2018
-
పొలిటికల్ కారిడర్ 28th April 2018
-
పొలిటికల్ కారిడర్ 27th April 2018
-
పొలిటికల్ కారిడర్ 24th April 2018
-
పొలిటికల్ కారిడర్ 21st April 2108
-
పొలిటికల్ కారిడర్ 19th April 2108
-
పొలిటికల్ కారిడర్ 18th April 2108