Telangana Budget 2025
-
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్‌కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్‌రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్‌కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్..
Telangana Assembly Session Updates..తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. శాసనసభ నుంచి నిరసనలు తెలుపుతూ బయటకు వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు.వద్దురా నాయన కాంగ్రెస్ పాలన.. 30% పాలన అంటూ నినాదాలు.అసెంబ్లీ గేటు ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎంట్రీ-4 వద్ద మెట్లపై కూర్చుని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలుఅక్కడ నిరసనలు తెలుపవద్దని చీఫ్ మార్షల్ సూచనలుమార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదం మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..దళితుడు అనే భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్నారు.గతంలో సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండొద్దు అని ప్రతిపక్షం అనుకుంటుందా?గతంలో సీఎల్పీ లీడర్‌గా దళిత లీడర్ భట్టి విక్రమార్క ఉన్నప్పుడు విమర్శలు చేశారు.తెలంగాణ శాసనసభలో కమీషన్లపై రచ్చ..అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం.40, 30, 20 శాతం ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటుందన్న బీఆర్ఎస్, కేటీఆర్బీఆర్ఎస్ వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకమీషన్లపై స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.గత ప్రభుత్వం పెట్టిన 40,000 కోట్ల బకాయిలను కట్టడానికి నాన్న తంటాలు పడుతున్నాం.ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.గత ప్రభుత్వం లాగా వ్యవహరించడం లేదు.దోచుకోవడానికి మేము అధికారంలోకి రాలేదు.ప్రతిపక్షం వెంటనే క్షమాపణ చెప్పాలి.ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు.కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి.సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి.కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి.కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి.కేటీఆర్ ను నేను ఎక్కడ విమర్శించలేదుసభలో మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నాను.కేటీఆర్‌పై నేనెక్కడా అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదు శాసనసభలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలు.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసన.కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన. ఇరుపక్షాలకు సర్ది చెబుతున్న ప్యానెల్ స్పీకర్కేటీఆర్ వ్యాఖ్యలతో గొడవ మొదలైంది.అన్ పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాం.సీనియర్ సభ్యులుగా ఉండి నిరసన చేయడం కరెక్ట్ కాదు.కేటీఆర్ అన్ పార్లమెంటరీ పదాన్ని వాడారుకేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..నేను పని మీదే దృష్టి పెట్టా.. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను.మంత్రి వర్గ విస్తరణ కూడా పట్టించుకోలేదు..మొదటి కేబినెట్ సమయంలో కూడా నేను మంత్రి పదవి అడగలేదు.గద్దర్ అవార్డులను భట్టి చూసుకుంటుంన్నారు. మంత్రి భట్టి విక్రమార్క కామెంట్స్..భూములపై రైతులకు హాక్కు కల్పించింది కాంగ్రెస్..భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే.కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం.ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది.భూస్వాముల చట్టం ధరణి.ధరణి మారుస్తాం అని చెప్పాం.. చేసి చూపిస్తున్నాం.లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాసారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు.ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు.భూ భారతి కాన్సెప్ట్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోతాం..ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.భూ భారతిని రెఫరెండంగా తీసుకుంటాం..ఎవరిని ఆదరిస్తారో చూద్దాం.పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..భూ భారతి అయితదో.. భూ హారతి అయితదో చూద్దాం..భూ భారతి రెఫరెండం కాదు.. ఆరు గ్యారెంటీల రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లండి.అనుభవదారుడి కాలంతో మళ్ళీ వివాదాలు వస్తాయి.మంత్రి పొంగులేటి కామెంట్స్.. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు.2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు.వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.. భట్టి విక్రమార్క కామెంట్స్..జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు.ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.. సభలో పదే పదే మంత్రులకు మైక్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం..తాము మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు అడ్డు వస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యులు..ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..మంత్రులు అడిగితే మైక్ ఇవ్వాలి.. ఇది అసెంబ్లీ రూల్స్‌లో ఉంది.పదేళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ సభ్యులకు ఇది తెలియంది కాదు..రూల్స్ ప్రకారమే సభ్యులకు అవకాశం ఇస్తున్నా.. బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారం జరిగితే.. పోలీసులు పట్టించుకోలేదు.అడ్వకేట్‌ను హత్య చేసినా పట్టించుకోవడం లేదు..క్రైం రేటు పెరుగుతోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఎంఎంటీఎస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది .కేసు దర్యాప్తుపై పోలీసులు దృష్టి సారించారు.పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడొద్దు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..గతం గురించి మాట్లాడేది కాంగ్రెస్ సభ్యులే..మేము చేసిన మంచి పనులు చెబుతున్నాం..ఇంకా బాగా పని చేయాలని సూచిస్తున్నాం..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన.. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనతక్షణమే తులం బంగారం ఇవ్వాలని నినాదాలుబంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..శాసనసభ ఐదో సెషన్ పదో రోజు బిజినెస్ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం.ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దుతెలంగాణ శాసనమండలిలో ఏడవ రోజు బిజినెస్మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023-24 నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు.ప్రభుత్వ తీర్మానం..శాసన సభ ఆమోదం పొందిన రెండు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారురాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్లు-2025 శాసనమండలిలో చర్చించి సభ ఆమోదం కోసం కోరనున్నారు.శాసనమండలిలో తెలంగాణలో విద్య అనే అంశంపై స్వల్పకాలిక చర్చశాసనసభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ -
తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్‌తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం
Telangana Assembly Session Updates..అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.అరగంట పాటు వివేక్, సుమన్ మధ్య చర్చలు.వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..ఇప్పటి వరకు సస్పెండ్‌పై బులెటిన్ ఇవ్వలేదు.రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహంబులెటిన్ ఇస్తే నేను రానుఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుందిపద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదురాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందిసస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్‌ను కలుస్తాను.స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదుసస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులుగంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు.నిన్న జాన్ పాడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.మార్షల్స్‌తో బీజేపీ సభ్యుల వాగ్వాదం.. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్కి మధ్య వాగ్వాదం.అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల డిమాండ్రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీటన్నెల్ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులుకార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలుఅసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి.. -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్‌పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్‌పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్‌పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్‌పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్‌లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్‌రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్‌ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా క్యాలెండర్‌గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్‌పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
ఆరు గ్యారంటీలు గోవిందా.. బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు రావాలి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.తులం బంగారం ఎక్కడ?.ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు. పెండింగ్ నగరంగా హైదరాబాద్..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. -
తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం.