umabharathi
-
బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉమా భారతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ఉమా భారతి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమా భారతి.. వచ్చే మే నెల నుంచి ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాననీ, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందించారు. దీంతో హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. -
పోలవరం ప్రాజెక్టు మాకు ప్రత్యేకం
న్యూఢిల్లీ: గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు. ఈ ప్రాజెక్టు తమకు ప్రత్యేకమైదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారని ఉమా భారతి తెలిపారు. అయితే ఆయన అభ్యంతరాలను నివృత్తి చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ జల దోపిడీని అడ్డుకోండి
-
ఏపీ జల దోపిడీని అడ్డుకోండి
- కేంద్ర మంత్రి ఉమాభారతికి హరీశ్ లేఖ - పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తరలించుకుంటోంది - 12 రోజుల్లో 5.05 టీఎంసీలు వినియోగించి లెక్కల్లో 1.83 టీఎంసీలే చూపారు - సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి, చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ దోపిడీకి పాల్పడుతోందంటూ కేంద్ర జల వనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. గత 12 రోజుల్లో 5.05 టీఎంసీల నీటిని తరలించుకుపోయి లెక్కల్లో 1.83 టీఎంసీలనే చూపుతోందని వివరించింది. జల దోపిడీపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. ఏపీ వైఖరిలో మార్పులేదని పేర్కొంది. నీటి వినియోగం లెక్కలపై సంయుక్త కమిటీ వేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినా.. కృష్ణా బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపిం ది. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ, కృష్ణా బోర్డు అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి వినియోగాన్ని లెక్కలతో సహా అందులో వివరించారు. ఈ వ్యవహారం లో బోర్డు ప్రేక్షక పాత్రను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఈ నెల 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్న విషయాన్ని మీ దృష్టికి తెచ్చాం. టెలీమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు సంయుక్త తనిఖీ బృందంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈ విషయంలో బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రోజుల్లో ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5.05 టీఎంసీల నీటిని తోడేసింది. కానీ తన ‘కాడా’ వెబ్సైట్లో మాత్రం కేవలం 1.83 టీఎంసీలను మాత్రమే చూపింది. ఈ జల దోపిడీ కారణంగా నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు పెరగడం లేదు. దాం తో తెలంగాణ రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఇరు రాష్ట్రాలు, బోర్డు అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి.. నీటి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకునేలా బోర్డును ఆదేశించండి..’’ అని లేఖలో హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షక పాత్ర వదలండి: ఏపీ నీటి తరలింపు అంశంపై కృష్ణా బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీలతో మంగళవారం హైదరాబాద్‌లోని జల సౌధలో హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఏపీ తన వాటాకు మించి నీటిని తోడేస్తోందని, శ్రీశైలం నుంచి సరైన లెక్కలు చూపకుండానే రాయలసీమకు నీటిని తరలిస్తోందని... ఈ దోపిడీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెలీమెట్రీ పరికరాలు అమర్చే వరకు జల దోపిడీ కొనసాగాల్సిందే నా? అని ప్రశ్నించారు. బోర్డు ప్రేక్షక పాత్రను విడిచిపెట్టి ఇప్పటికైనా కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో పెరగాల్సిన స్థాయికి నీటి నిల్వలు చేరలేదని.. శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో తక్కువగా ఉండడమే దీనికి కారణమని వివరించారు. ‘‘కర్నూలు జిల్లాలోని పెన్నా బేసిన్లో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని ఏపీ బహిరంగంగా, నిస్సిగ్గుగా తరలించుకుపోతోంది. దీనిపై ఇది వరకే బోర్డుకు ఫిర్యాదు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల తరలింపుపై మేం ఇటీవల శాస్త్రీయంగా అధ్యయనం చేసినప్పుడు చేదు నిజాలు బయటపడ్డాయి. కృష్ణా జలాల తరలింపును రికార్డుల్లో వందల క్యూసెక్కులుగా చూపిస్తుండగా... వాస్తవానికి వేలాది క్యూసెక్కులు తరలిస్తున్నారు. ఈ సీజన్లో రికార్డుల్లో రాసిన లెక్కలు గమనిస్తే.. తొలిరోజు 700 క్యూసెక్కులు అంటూ మొదలుపెట్టి, తర్వాత వెయ్యి, పదిహేను వందలు, రెండు వేలంటూ కాకిలెక్కలు చూపుతున్నారు. వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా, ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నా.. మంగళవారం సైతం పోతిరెడ్డిపాడు ద్వారా తరలించిన నీటి లెక్కలు 500 క్యూసెక్కులుగానే చూపుతున్నారు..’’ అని బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శికి హరీశ్‌రావు వివరించారు. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ రామ్‌శరణ్... పోతిరెడ్డిపాడు నీటి తరలింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒకటి రెండు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. -
ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలి
హన్మకొండ : గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. సోమవారం వారు న్యూ ఢిల్లీలో మంత్రి ఉమా భారతినికి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇచ్చంపల్లి వద్ద అనకట్ట నిర్మిస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందుతుందని మంత్రికి వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు వెన్నంపల్లి పాపయ్య, మధు పాల్గొన్నారు. -
'కేంద్రమంత్రి ప్రకటనలు అవాస్తవం'
కాకినాడ: నదుల అనుసంధానం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ప్రథముడంటూ కేంద్రమంత్రి ఉమాభారతి అవాస్తవిక ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. ఈ మేరకు ఉమాభారతికి లేఖ రాశారు. నదుల అనుసంధానంలో చంద్రబాబును పొగుడుతూ ఆమె చేసిన ప్రకటనను తప్పుపట్టారు. కృష్ణ-పెన్నా నదుల అనుసంధానికి 1978లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత చిత్రావతి-కుందు-పెన్నా నదుల నీరు కృష్ణ నీటిలో సోమశిల-కాండ్లేరు-పోతిరెడ్డిపాడు ద్వారా చేరుతున్న విషయాన్ని ఉమాభారతి దృష్టికి తీసుకెళ్ళారు. పోతిరెడ్డిపాడును అప్పటి ముఖ్యమంత్రి జలగం ప్రారంభించగా, తరువాత ఎన్.టి.రామారావు హయాంలో కొనసాగించారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి చేశారని వివరించారు. పోలవరం కుడికాలువ పనులను దాదాపు 130 కిలోమీటర్ల పొడవు, 86 మీటర్ల లోతుతో వైఎస్సార్ ప్రారంభించిన విషయాన్ని కూడా వివరించారు. కృష్ణ-గోదావరి అనుసంధానం బ్రిటిష్ హయాంలోనే పూర్తయిందని పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెట్టి ఇటువంటి ప్రకటనలు చేయడం కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా మానుకోవాలని సూచించారు. -
మంత్రిగా నాకే పిచ్చెక్కిపోతోంది...
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కిల్లింగ్ స్కాం 'వ్యాపమ్' మృత్యుహేల సొంతపార్టీ మంత్రులనే గజగజ వణికిస్తోందా? వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉమాభారతి మీడియాతో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే అలానే అనిపిస్తుంది. 'మంత్రిగా ఉన్ననాకే పిచ్చెక్కిపోతోంది. చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా పేరు కూడా వ్యాపమ్ కేసు ఎఫ్ఐఆర్లో ఉంది. ఇక అమాయకుల పరిస్థితి ఏంటని' ఉమాభారతి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో స్పందించి ఏదైనా చేయాలని ఆమె సూచించారు. వ్యాపమ్ స్కాంలో జర్నలిస్టు, నిందితులు, సాక్షులు, విచారణాధికారుల వరుస అనుమానాస్పద మరణాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో ఆయన ఏదో ఒక పరిష్కారాన్ని చూడాలి. ఈ సంక్షోభం నుంచి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బయటపడేయాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రిగా ఉన్ననాకే ఇంత భయంగా ఉంటే , ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోగలనన్నారు. తమ ఆందోళనను, ఆవేదనను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళతానన్నారు. మరోవైపు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న అరుణ్ జైట్లీ డిమాండ్‌కు మద్దతు తెలియజేసిన మంత్రి సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాలను నిగ్గుదేల్చాలని డిమాండ్ చేశారు. కాగా 2002 నాటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాల వ్యాపమ్ కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి కూడా ఒకరు. -
'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి'
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు 7 సంవత్సరాల్లో పూర్తవుతుందని ఆమె చెప్పారు. గురువారం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి సరిపడా నిధులు ఇస్తామని హామీఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రాణహిత- చేవెళ్ల, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించే అంశంపై పరిశీలిస్తున్నామని ఉమాభారతి అన్నారు. -
ఉమాభారతిని కలసిన హరీష్ రావు
-
ఏపీకి ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వండి: బాబు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది. ఈ సమావేశం సుమారు గంటపాటు సాగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను బాబు ఈ సందర్భంగా జైట్లీకి వివరించారు. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కొత్త రాజధాని, వనరుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రైతుల రుణమాఫీ విషయాన్ని కూడా జైట్లీతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తరహా ఆర్థిక, పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్లు బాబు చెప్పారు. లోటు బడ్జెట్ నేపథ్యంలో జీతభత్యాలకు ఆర్థిక సాయం అందించాలని బాబు...కేంద్రమంత్రిని కోరారు. అనంతరం అరుణ్ జైట్లీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ప్రణాళికా సంఘం పరిధిలో ఉందని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణాని తాము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ అథార్టీని ప్రకటించాలని కోరారు. జనవనరులపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. -
హస్తినకు బాబు, గవర్నర్ నరసింహన్
న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈరోజు బిజీబిజీగా గడపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. *ఉదయం 10.30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ *11 గంటలకు జలవనరుల మంత్రి ఉమాభారతి *మధ్యాహ్నం 12.30కు ప్రణాళిక మంత్రి జితేంద్రసింగ్ *మధ్యాహ్నం 2 గంటలకు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ *మధ్యాహ్నం 3 గంటలకు ప్రణాళికాసంఘం సభ్యుడు వేణుగోపాల్‌రెడ్డి *సాయంత్రం 4.30కు ప్రధాని నరేంద్ర మోడీ *సాయంత్రం 6 గంటలకు విద్యుత్ మంత్రితో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనవల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో పాటు, *నిధులపై ఆయన కేంద్రంతో పాటు, మోడీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా హస్తిన వెళ్లారు. ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, హస్తినకు బాబు, chandrababu naidu, narendra modi, narasimhan, umabharathi