గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు.
న్యూఢిల్లీ: గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు. ఈ ప్రాజెక్టు తమకు ప్రత్యేకమైదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారని ఉమా భారతి తెలిపారు. అయితే ఆయన అభ్యంతరాలను నివృత్తి చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.