
1వ తేదీనే పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీకి చర్యలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: సామాజిక పింఛన్లను ప్రతినెలా 1వ తేదీనే పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆడారిమెట్ట గ్రామంలో పింఛన్ పొందుతున్న ఓ వితంతువు బీఈడీ చదివి కూడా ఉపాధి లేక ఖాళీగా ఉండడం, ఆమె తోబుట్టువులు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉండడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు.వారికి నైపుణ్య శిక్షణ అందించి ఉపాఽధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళీ,ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి,సర్పంచ్ వంతాల సీతమ్మ,ఉప సర్పంచ్ సూరిబాబు,మాజీ ఎమ్మెల్యే గిడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో మంగళవారం సాయంత్రం 6గంటల సమయానికి 93.93శాతం పింఛన్ల పంపిణీని పూర్తిచేసినట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు.1,22,654మందికి గాను 1,15,203మందికి పింఛన్ పంపిణీ పూర్తయిందని చెప్పారు.