
పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధ
పాడేరు : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ అన్నారు. మండలంలోని డి.గొందూరులో సర్పంచ్ సీదరి రాంబాబు అధ్యక్షతన గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. డి.గొందూరు వికసిత్ పంచాయతీ కింద ఎంపిక కావడం పంచాయతీ ప్రజల అదృష్టమన్నారు. వికసిత్ పంచాయతీలకు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతాయని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాలమానుశంక గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని, మర్రిపాలెం, వాకపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ సీదరి రాంబాబు కలెక్టర్‌ను కోరారు. అనంతరం జన్‌మన్ హౌసింగ్ లబ్ధిదారులకు నిర్మాణ మంజూరు పత్రాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ బాబు, డీఎల్‌పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్