
గంజాయి కేసులో పాత నేరస్తుడు అరెస్ట్
గొలుగొండ: ఏటిగైరంపేట గ్రామంలో 2021లో గంజాయి తరలిస్తున్న సమయంలో బైక్ వదిలేసి పారిపోయిన నిందితుడిని గొలుగొండ ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2021లో ఏటిగైరంపేట గ్రామంలో 36 కేజీల గంజాయి బైక్‌పై తరలిస్తుండగా.. అల్లూరి జిల్లా వాడలపాలెం గ్రామానికి చెందిన వంతల సుందర్రావు అప్పట్లో తప్పించుకుని పారిపోయాడు. వదిలేసిన బైక్ ఆధారంగా ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐ, సిబ్బందిని సీఐ రేవతమ్మ, డీఎస్‌పీ శ్రీనివాసరావు అభినందించారు.
గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అరెస్ట్