
ఆలస్య రుసుంతో నవంబర్ 30 వరకు గడువు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును bse.ap.gov.inలో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శిక్షణ, ఉపాధిపై వర్క్‌షాప్
సాక్షి, అమరావతి: యువతకు శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉపాధి అందించేలా ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడాప్) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో సీడాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధిపై వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వారికి స్కిల్డ్ యువతను అందిస్తామని ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి తెలిపారు.