
అమరావతి: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి(బుధవారం) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు. బుధవారం ఉదయం గం. 10ల.కు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీనే పలితాలను విడుదల చేసే అవకాశం ఉందని భావించారు.
కానీ దాన్ని ఒకరోజు వెనక్కి పొడిగించారు. రంజాన్ సందర్భంగా టెన్త్ క్లాస్ చివరి పరీక్షను ఒక రోజు వెనక్కి జరపిన కారణంగా ఫలితాల విడుదలను కూడా రోజు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరిగాయి. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.